Home » Vasundhara » Vasundhara Kadhalu - 10

 

    "నీ బావ విశ్వాన్ని నేనిది వరకే హైదరాబాదు లో చూశాను..."
    అరుణ ఆశ్చర్యపడినా -- "నేను నమ్మను" అంది.
    "నేను ఒక్కసారి నీతో అబద్ద మాడాను. కానీ అది నా వృత్తి కాదు."
    "బావను ఏ సందర్భంలో చూశావు? చూస్తె ఎలా గుర్తుపట్టావు?' అంది అరుణ.
    'అదంతా పెద్ద కధ. అంతావిని నువ్వు నమ్మననే ప్రమాదముంది కాబట్టి చెప్పాలని నాకు కోరిక లేదు" అన్నాను.
    అయితే అరుణలో కుతూహలం పెరిగింది. ఆమె మరీ నొక్కించడంలో నేను పక్కనున్న పార్కులో కి నడిచాను. ఆమె నన్ను అనుసరించింది.
    నేను అరుణను ప్రేమిస్తున్న కారణంగా నకిలీ విశ్వం బారి నుండి ఆమెను రక్షించగోరి హైదరాబాదు వెళ్ళి అతని ఉనికిని తెలుసుకుందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు అరుణకు వివరించాను.
    అంతా విని "చాలా ఆశ్చర్యంగా వుంది" అంది అరుణ. నమ్మలేవని చెప్పడానికి మొహమాటపడి వుంటుందనుకున్నాను.
    "ఎందుకని?"
    "నా బావపై నాకు అనుమానాలు రేకెత్తించడం కోసం నువ్వు కల్పించిన కట్టుకధలా గుంది ఇది" అంది అరుణ అట్టే సంకోచించకుండా.
    "నేను చెప్పింది నిజమని ఋజువు చేసుకోవడానికి నా దగ్గరే అధారముంది. అది విశ్వం రాసిన మొదటి ఉత్తరం" అన్నాను. విశ్వం విషయంలో దస్తూరీ కి చాలా ప్రాముఖ్యత వుండడం వల్ల నేనది దాచి వుంచాను ఎందుకైనా మంచిదని.
    అరుణకు ఆ వుత్తరం చూడాలని వుంది. కానయితే దాని కోసం ఇంటికి రావడానికి భయపడింది. నేను తన బావనని తెలిసినప్పుడు ధైర్యంగా హోటల్ గదికి రాగలిగింది. కానీ ఇప్పుడు నామీద ఆమెకు నమ్మకం లేదు . నా మనసులో కించిత్తు బాధ కలుగకపోలేదు.
    "నువ్వు బయట నిలబడు. లోపలకు రావద్దు. నేను లోపలకు వెళ్ళి ఉత్తరం కూడా తీసుకువస్తాను...." అన్నాను.
    ఏమనుకుందో అరుణ ఒప్పుకుంది. ఇద్దరం మా ఇంటికి వెళ్ళాం. ఆమె బయట నిలబడలేదు. తనూ నాతొ పాటు లోపాలకు వచ్చింది . ఆమె నాకిచ్చిన గౌరవానికి నా మనసు చాలా సంతోషించింది. ఆ గౌరవాన్ని నేను నిలుపుకోగలిగాను.
    అరుణ ఉత్తరం చూసి "సందేహం లేదు . ఇది బావ దస్తూరీయే" అంది.
    "నా దురదృష్టం . నేను నిన్ను ప్రేమించిన తప్పుకి నన్ను మరీ దారుణంగా అనుమానిస్తున్నావు...." అన్నాను.
    "ప్రేమ కోసం ఏమైనా చేస్తారు గదా ప్రేమికులు? అలా చేసినందుకు నిన్ను తప్పుపట్టను. నా అనుమానానికి నువ్వు నన్ను తప్పు పట్టకూడదు. ఎందుకంటె నేను నిన్ను ప్రేమించలేక పోవడం నా తప్పు కాదు" అంది అరుణ.
    నేనేమీ మాట్లాడలేదు.
    "బావను పరిచయం చేస్తాను నాతొ వస్తే!' అంది అరుణ.
    "చెప్పానుగా చూశానని!"
    "మరోసారి చూడకూడదు కాబోలు!" అంది అరుణ.
    "నీకు కాబోయే భర్త కాబట్టి ఎన్నిసార్లు చూసిన నీకు తనివి తీరకపోవచ్చు. కాని నా సంగతి వేరు అతను నీక్కాబోయే భర్త కాబట్టి అతన్ని చూడాలన్న ఊహకు కూడా నాకు బాగుండదు" అన్నాను.
    "మమ్మల్నిద్దర్నీ పక్కపక్కన చూసి జంట ఎలాగుందో చెప్పుదువు గానీ ఒక్కసారి ఇంటికి వచ్చి చూసి వెళ్ళు" అంది అరుణ.
    అరుణకు నన్నేడిపించాలని వున్నట్లు గ్రహించాను. ఒకప్పుడు నేను ఆమెతో నాటకమాడి బావని చెప్పాను. ఆ కసి ఆమెలో ఇంకా బాగా వున్నది.
    "ప్లీజ్!" అంది అరుణ.
    కాదనలేకపోయాను . తొలిసారిగా ఆమె ఆహ్వానం పై ఆమె ఇంటికి వెళ్ళాను.
    ఇంటికి వెళ్ళిన రెండు నిమిషాల్లో అరుణ ఒక మనిషిని వెంటపెట్టుకుని వచ్చింది.
    "ఇతనే మా బావ విశ్వం !" అంది.
    నే నతన్ను చూసి ఉలిక్కిపడ్డాను. మైగాడ్! అతను నేను చూసిన విశ్వం కాదు.

                                     12
    "ఇదీసంగతి!" అంటూ వివరించాను చక్రపాణికి. నేను చెప్పినదంతా విని అయన చాలా కంగారు పడ్డట్లు కనపడ్డారు. నా మాటల్లో ఆయనకు నమ్మకం కలిగినట్లే వుంది. అందుకు కారణాలున్నాయి.
    విశ్వం అత్తయ్య కోసం, మావయ్య కోసం పట్టుబట్టలు తెచ్చాడు. మరదలికి గాజీ సిల్కు చీర తెచ్చాడు. పదివేల రూపాయల క్యాష్ తెచ్చి మామయ్యను దాచమన్నాడు. అతని దస్తూరీ సరిపోయింది. చిన్ననాటి పుట్టుమచ్చలు కూడా సరిపోయాయి. అంతవరకూ బాగానే వుంది.
    విశ్వం తన ఉనికిని రహస్యంగా వుంచగోరుతున్నాడు. అతను వచ్చినట్లు ఎవరికీ చెప్పవద్దన్నాడు. బయట తిరగడానికి ఇష్టపడడం లేదు. వివాహం కూడా రిజిస్టరు మ్యారేజి అంటున్నాడు. పెళ్ళి కాగానే భార్యను తీసుకు పోతానంటున్నాడు.
    అతను చిన్ననాడు ఇల్లు వదిలిన మేనల్లుడే ననడంలో సందేహం లేదు. కానీ అతడి ప్రవర్తన అనుమానాస్పదంగానే వుంది. హైదరాబాద్ లో అతనేం చేస్తున్నాడు?
    నేను చెప్పిన వివరాలు విన్నాక చక్రపాణి కంగారు అధికం కావడంలో ఆశ్చర్యం లేదు. "మేనల్లుడుగదా అని చూస్తూ చూస్తూ నా కూతురికి అన్యాయం చేయలేను. వాడి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి. నువ్వు చెప్పినవన్నీ వింటుంటే నాకు భయంగా వుంది" అన్నాడాయన.
    "అరుణ తెలివిగా వ్యవహరించాలి -- " అన్నాను నేను.
    "వాణ్ణి చూడగానే దానికి మతి పోయింది. దస్తూరీ, పుట్టు మచ్చలలో వాడు విశ్వం అని రూడి అయింది. వాడేమో మనిషి ఎర్రగా బుర్రగా బాగున్నాడు. దీని కింక వళ్ళు తెలియడం లేదు. బావ అంత అందగాడై నందుకు అది మురిసి పోతోంది " అన్నాడు చక్రపాణి.
    నాకు బాధ కలిగినప్పటికీ నిజం ఒప్పుకోక తప్పదు. నేను హైదరాబాదు లో చూసిన మనిషి కంటే చాలా బాగున్నాడు విశ్వం. హిందీ సినిమా హీరో అంత బాగున్నాడు. అరుణ పక్కన నుంచుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగున్నారు వాళ్ళిద్దరూ. కానీ అతగాడిలో ఏదో పెద్ద మోసముందని నాకు అనుమానంగా వుంది.
    'అల్లుడికి చెప్పకుండా మీరు నాతొ బయల్దేరి వస్తే ఇద్దరం హైదరాబాద్ వెడదాం" అన్నాను. "వచ్చేటప్పుడు విశ్వం ఫోటోలు కూడా ఒకటి రెండు తీసుకు రండి."
    చక్రపాణి అంగీకరించాడు.
    ఇద్దరం హైదరాబాద్ వెళ్ళి ఆ ఫోటోలను కొన్ని పోలీస్ స్టేషన్ లో చూపించాం. విశ్వం నేరాలు చేస్తుండి వుంటాడని , అతడు పోలీసుల జాబితాలో మనిషి అని నాకు అనిపించింది. నా ఊహ అబద్దం కాలేదు. ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ విశ్వం ఫోటో గుర్తించి "ఇతను రెండు వారాల క్రితం వరకూ జైల్లో వున్నాడు" అన్నాడు.
    "నేరం?" అనడిగాను.
    "మైనారిటీ తీరని పిల్లను లేవదీసుకుపోవడానికి ప్రయత్నించాడు..."
    చక్రపాణి ముఖం మాడిపోయింది. ఒకప్పుడు నన్ను దుర్మార్గుడిగా భావించి నానామాటలూ అన్న అయన మేనల్లుడు నేరస్తుడైనట్లు నా కారణంగా రుజువు కావడం ఆయనకు చాలా బాధగా వుంది.
    "ఇప్పుడేమిటి  చెయ్యడం?" అన్నాడాయన.
    "విషయం అర్ధమవుతోంది నాకు. విశ్వం మీ దగ్గరకు చాలా క్రితమే వద్దామానుకుని జైలు పాలైన కారణంగా రాలేకపోయాడు. నేను అతని గురించి వాకబు చేయడానికి వస్తే చాలాకాలంగా అతణ్ణి సాకుతూ వస్తున్నామె అతను జైల్లో వున్న విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. నేనెప్పుడూ విశ్వాన్నీ చూడలేదు కాబట్టి ఇంకో మనిషి ని విశ్వంగా నాకు పరిచయం చేసి తన మనిషిని జైలుకు పంపించి ఉత్తరం రాయించి తెప్పించింది. అయితే విశ్వం చేసిన నేరం ఇది ఒక్కటేనా? అతనిక్కడ ఎలాంటి జీవితం గడుపుతున్నాడు? అన్న విషయాలు మీరింకా తెలుసుకోవలసి వుంది. అది అతని నోటమ్మట చెప్పిస్తేనే బాగుంటుంది" అన్నాను చక్రపాణితో.
    "నువ్వెలా చెబితే అలా వింటాను" అన్నాడు చక్రపాణి.
    "ఆ మాటలు నాలో కొత్త ఆశలు చిగిర్చాయి. అరుణ విషయంలో నా అదృష్టం మళ్ళీ తిరగాబడుతోందని గ్రహించాను.
    హైదరాబాదు లో మేము విశ్వం ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. పోలీస్ స్టేషన్లో పని జరక్కపోతే అప్పుడతని ఇంటికి వెళ్ళవచ్చునని అనుకున్నాము. కానీ అనుకున్న కంటే లాభసాటి సమాచారమే మాకు లభించింది.

                                    13

    "నువ్వు నేరస్థుడివి' అన్నాను.
    "కాదు" అన్నాడు విశ్వం తడబడుతూ.
    "ఎందుకురా దబాయిస్తావు" అంటూ అవసరమయిన కధంతా చక్రపాణి మేనల్లుడి కి వివరించాడు.
    విశ్వం ముఖంలో జీవం లేదు. "నన్ను క్షమించు మామయ్యా!" అన్నాడతను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra