Home » Sharvani » Apaswaram


    డాక్టరవాలన్న కోర్కె మరోసారి విజ్రుంభించింది. ఎంతోకష్టంతో అణుచుకున్న కోర్కె కట్టుతెగిన ప్రవాహంలా బయటికి వచ్చింది. తనతో బాటే పెరుగుతూ వస్తూన్న కోర్కెను అణచడం అసాధ్యమయింది.
    కాని తానున్న వాతావరణంనుండి బయట పడలేని మీర బంధిత పక్షిలా విలవిలాడిపోయింది. వెన్నెలలాంటి నవ్వుతోనూ, ముద్దుమాటలతోనూ ఇంటిల్లపాదినీ ఆనందపరిచే వీణ మంచంపట్టటంతో ఇల్లంతా బోసిపోయి శూన్యంగా ఉన్నట్టనిపిస్తోంది. రెండు రోజులయినా డాక్టర్ రాకపోవడంతో శాము వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయనకో గది ఖాళీచేసి ఇచ్చారు.
    పధిహేనురోజుల జ్వరంతో వాడిపోయింది వీణ. గులాబిరంగు బుగ్గలు తెల్లగా పాలిపోయాయి. కళ్ళు గాజుకళ్ళలా ఉన్నాయి.
    అలాంటి స్థితిలోకూడా వీణ మెడలోని గొలుసు తియ్యనివ్వలేదు. శాము, మీరా కదలకుండా వీణ పక్కనే కూర్చున్నారు. రోజులు ఎలా గడిచిపోతున్నాయన్న జ్ఞానమే లేదు వారికి.
    జ్వరం తగిలిన పదిహేనవరోజు వీణ మాట్లాడటం ఆపేసింది. దీనంగా తల్లిదండ్రుల వైపు చూసేది. ఆ చూపు వారి హృదయాలకు శూలంతో పొడిచినట్టుగా తగిలేది. బ్రతకాలన్న ఆశ వీణ కళ్ళలో మెరిసేది.
    "రోగి ఎదుట ఎవరూ ఏడవకూడదు" అని డాక్టర్ హెచ్చరించారు. మీర, శాము ఒకరి తరువాత ఒకరు బయటికివెళ్ళి మనసారా ఏడ్చి బరువుదించుకుని లోపలికొచ్చేవారు.
    డాక్టర్ వీణను బ్రతికించాలన్న పట్టుదలతో మృత్యువుతో పోరాడాడు. కాని మీరకు డాక్టర్ ఇంకా శ్రద్ధ చూపించి ఉండాల్సింది అనిపించింది. ఇంకొకరికి అప్ప చెప్పకుండా తనే చికిత్స చేసి ఉంటే తప్పక నయమయ్యేదేమోననిపించింది,
    పందొమ్మిదో రోజు వీణకు ఒంటిమీద తెలివి లేదు. శ్వాసలాగటానికి ప్రారంభమయింది. ఉన్న కొంచెం ఆశకూడా పోయింది. మీర అయిదేళ్ళ పిల్లగా ఉన్నపుడు తన తండ్రి మరణశయ్యమీద ఆఖరి శ్వాసవదలిన దృశ్యం మసకమసగ్గా కళ్ళ ముందు నిలిచింది. వీణస్థితి చూసి డాక్టర్ నిట్టూర్చువిడిచి.
    "దేవుడే కాపాడాలి" అన్నారు.
    వీణ ఈస్థితిలో ఉండగా శాము అక్కడలేడు. మీర పిచ్చెత్తి నదానిలా బయటకువచ్చి
    "రండి, వీణ వెళ్ళిపోతోంది" అంది.
    శాము "క్షమించు మీరా. జానిని ఈస్థితిలో చూడలేను" అన్నాడు.
    ఆ సాయంత్రమే తల్లిదండ్రుల జీవితాలను అనందాబ్దిలో ఓలలాడించిన వీణ, వారిని దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయింది. మీర భవిష్యత్తు గాలిలేని బెలూనులా అయిపోయింది.
    సాయంత్రం బోరడు దీపాలు వెలిగించటానికి ఇంటికొచ్చేసరికి ఇల్లు రుద్రమౌనంలో మునిగిఉంది. దూరంనుండే ఇంటిప్రేత కళను చూసిన బోరడి గుండె దడదడలాడసాగింది. ఒకమూల కూర్చుని ఏడుస్తున్న వెంకమ్మగారు కళ్ళు తుడుచుకుంటూ.
    "ఇంకెందుకు దీపం వెలిగిస్తావురా శామన్న? ఇంటిదీపం ఆరిపోయిందికదరా"! అన్నారు వెక్కుతూ.
    "అయ్యగారి అమ్మగారి గతేటవ్వా? ఆరినెవరు ఓదారుత్తారు?".
    "దేవుడే ఓదార్చాలి."    
    "బిడ్డంటే ఎలాపెంచారవ్వా. జానమ్మకు ఏటి తక్కువయింది? తిండానికి లేదా? కట్టడానికి లేదా? అయ్యగారికి రాజ్యమేలేటంత నేల ఉంది! జానమ్మకు బతకటానికి నేలలేకపోయిందా? రాజాలాగా పెంచారే! ఆదేవుడికి కళ్ళులేవు. నా మూడేళ్ళ బిడ్డకు కడుపులో బల్ల. దాని ఏడుపు సూడలేకున్నాను. దేవుడు దాన్నెలా తీసుకుపోయాడు గాదు. దేముడి క్కూడా తామరపూలే కావాలేమో." అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
    శాము మీర తమ ఇళ్ళల్లోలాగానే గుండె బాదుకుని ఏడుస్తూంటారేమోనని గదిలోకి తొంగి చూశాడు బోరడు.
    గదిలోని మసకవెల్తురులో అవధాన్ల ఇంటి వారూ, పండితుల ఇంటివారూ నిండిపోయారు. వారి మధ్యన ప్రాణంలేని వీణచేతిని తన వెచ్చని చేతిలో పట్టుకుని కూర్చున్నాడు శాము. అతడి కళ్ళలో చుక్కనీరు లేదు. "ఏడవను, ఏడవను" అని మాటి మాటికీ అనుకుంటూ గుండెరాయి చేసుకుంటున్నాడు శాము. మీర అక్క్దడెక్కడా కనిపించలేదు.
    "అమ్మగోరేరి వెంకమ్మగోరూ? గదిలోలేరే!"
    వెంకమ్మగారు బరువుగా నిట్టూర్చి "బిడ్డ పోగానే పిచ్చిదానిలా లేచి తనగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఇంతవరకూ బయటికి రానేలేదు. దుఃఖంలో ఏం చేసుకుంటుందోనని తలుపు తట్టి పిల్చాను. కాని తియ్యలేదు....." అన్నారు.
    బోరడికి కూడా అదే ఆలోచనలతో భయం వేసింది. బిడ్డ పోయిందన్న బాధతో ఆమెకూడా ఆత్మహత్య చేసుకుంటే........!" భయంతో తలుపుదగ్గర నిల్చుని "అమ్మగోరూ, అయ్యగోరు పిలుత్తుండారు." అన్నాడు. మీర బదులు పలకలేదు. లోపల నడుస్తున్న చప్పుడు వినపడింది. మీర తలుపు తెరచి
    "బోరా, దీపం వెలిగించు." అంది.
    ఆమె కంఠం ఇంకా బ్రద్దలవని అగ్నిపర్వతంలా ఉంది.
    చీకటి మెల్లిమెల్లిగా అలుముకుంటోంది. బోరడు లాంతరు వెలిగించగానే తనో లాంతరు తీసుకుని, వీణ కట్టెలాపడివున్న గదిలోకి ప్రవేశించింది. మీర గదిలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వారందరి దృష్టి ఆమెమీద పడింది. వీణ దగ్గరకూర్చుని ఏడుస్తున్న వెంకూ తలెత్తి మీరవైపు చూసింది. మీరా కళ్ళలో చుక్క నీరు లేదు. కన్నీటి రూపంలో ప్రవహించని కోపం హృదయంలో గడ్డకట్టి ఆమెను దహించివేస్తోంది. బయటికి రాణి కన్నీటి వేడిమితో ఆమెకళ్ళు అగ్నిలా ప్రజ్వలిస్తున్నాయి. లాంతరు మసక వెల్తురు విచిత్రంగా ఉన్న ఆమె మొహం మీదపడి పిచ్చెక్కినట్టుగా కనిపింపచేస్తోంది. మీర వీణ నెత్తుకుని పల్లెలో అడుగుపెట్టి పాపకు పాలుపడుతున్న దృశ్యాన్ని, నేడు అదే వీణ మంచులా పడివున్న గదిలోకి లాంతరుతో ప్రవేశించిన మీరను పోల్చి చూసుకుంది వెంకూ. కాని కన్నీరు విడవని మీర దుఃఖం ఆమెకు అర్ధంకాలేదు. 'రాతి హృదయం' అనుకుంది మనసులో.
    మీర నెమ్మదిగా నడిచివచ్చి బల్లమీద లాంతరు పెట్టి మొదటిలాగానే శాంతంగా బయటికి పోబోతూండడాన్ని చూసి అందరితోబాటు శాము కూడా చకితుడయ్యాడు. గడచిన అందమయిన రోజులకూ, ఇప్పటి దుర్భరపరిస్థితికీ ఏవిధమయిన తేడా లేకుండా ప్రవర్తిస్తుమన్న మీరను చూసి దిగ్భ్రాంతుడయ్యాడు.
    "తల్లీ ఒక్కనిమిషం నిల్చుంటారా?" అవధాన్ల వారన్నారు.    
    మీర కాళ్ళు తడపడ్డాయి. "ఏం?" అంది. ఆమె కంఠం సీసంలా బరువుగా ఉంది.
    "అంతా సిద్ధంగా ఉంది. ఆఖరుమారు పాపను చూసేయమ్మా తీసుకెడతాం." అన్నారు.
    అవధానిగారు వీణ మొహం మీది గుడ్డ తొలగించారు. తల్లివడిలో శాంతంగా నిద్రిస్తున్నట్టున్న వీణ దగ్గర నిల్చుంది మీర. ఒక్క నిమిషం తదేకంగా వీణ మొహంవైపే చూసింది. వెంటనే మంచులా చల్లగా ఉన్న వీణ బుగ్గమీద ముధ్దుపెట్టుకుని వెనుదిరిగింది. వీణ మెడలోని కెంపుల నెక్లెసు వడగళ్ళలా చల్లగా చేతికి తగిలింది.
    "శామన్నా, పాప మెడలో గొలుసు తియ్యి నాయినా."
    ఆమాట విన్న మీరకు తలగిర్రున తిరిగి నట్టయింది. గోడను ఆసరాగా చేసుకుని నిల్చుంది. శాము మొహం అటుతిప్పి.
    "మీరే తీసెయ్యండి" అన్నాడు.
    అవధానిగారు గొలుసు తీసి మీర చేతికిచ్చారు. కూతురికి ప్రాణప్రదమయిన ఆభరణాన్ని మీర శూన్యంగా ఉన్న తన హృదయానికి హత్తుకుంది.
    కూతుర్ని ఓదార్చటానికి బయలుదేరి వచ్చిన కృష్ణయ్యగారిని, కమలమ్మగారిని మీరా తలుపు దగ్గరే 'రండి పెదనాన్నా' ఇంట్లో అందరూ కులాసాయేనా? అంటూ ఆహ్వానించింది. తమను చూడగానే ఏడ్చి రాగాలెట్టే మీరని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తూ వచ్చినవారు ఆశ్చర్యపోయారు. మీర తమనుండి ఏవిధమయిన సానుభూతిని ఆశించినట్టు కనిపించలా వాళ్ళకి.తమంతట తామే మానుతున్న గాయాన్ని రేపటానికి ఇష్టంలేక అక్కడున్నన్ని రోజులూ వీణ పేరెత్తకుండా జాగ్రత్తపడ్డారు. ఒకప్పుడు వీణ ఆ ఇంట్లో ఉండేదన్న మాటే మరచినట్టుంది మీర తీరు.
    రెండురోజులుండి, కృష్ణయ్యగారూ, కమలమ్మ గారూ ఊరికి బయలుదేరారు. మీరా వారిని నవ్వుతూ సాగనంపింది. అర్ధంలేని ఆనవ్వు వెనక, ఆమె హృదయాన్ని దహిస్తున్న అపారవేదనను, వారు గ్రహించ లేకపోయారు. స్నేహితులనుండి, బంధువుల నుండి వచ్చిన సంతానసూచన ఉత్తరాలన్నిటిని చింపనుకూడా చింపకుండా కాల్చిపారేసింది.
    వీణ నిష్క్రమించిన రోజునుండి ఆ ఇంట్లో స్మశాన మౌనం రాజ్యమేలుతోంది. శాము- మీర ఇద్దరూ మాట్లాడితే హృదయం పగులుతుందే మోనన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ కావాలనే ఒకర్నొకరు తప్పించుకు తిరుగుతున్నారు. శాము వీణగురించి మాట్లాడతాడేమోనన్న కలవరం మీరకు, మీరను పలకరిస్తే వీణ పేరు వస్తుందేమోనన్న భయం శాముకు.
    శాము రోజంతా చెరువు గట్టుమీదనో, ఎద్ధుల దగ్గరో, గానుగచెట్టు నీడలో, గడిపేవాడు. ఆకలనిపించినపుడు ఇంటికి వచ్చి కాస్త ఎంగిలిపడి మళ్ళా వెళ్ళిపోయేవాడు.
    మీర గదిలో తలుపులు వేసుకుని కూర్చుందంటే బయటికి వచ్చేదేకాదు. వెంకమ్మగారు బలవంతంచెయ్యగా చెయ్యగా కాస్త ఎంగిలి పడేది. ఓమారు రెండురోజులయినా మీర అన్నం తినకుండా ఉండటం చూసి ఆమె కంగారు పడ్డారు. బయటికివెళ్ళబోతున్న శామును ఆపి,
    "శామన్నా మీరా అన్నం తిని రెండు రోజులయింది. నువ్వయినా కాస్త చెపుదూ?" అన్నారు.
    "అలాగా? నాకు తెలియదే!" అంటూ శాము మీర గది తలుపు తడుతూ "మీరా, మీరా" అని పిలిచాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra