వైస్ ఛాన్సలర్ ముందున్న మైక్ ని అందుకుంది.
"సారీ ఫర్ లిటిల్ ఇంటరప్షన్ మిస్టర్ త్యాగీ ...... అసాధారణమైన మీ విశ్లేషణకి యూనివర్సిటీ క్యాంపస్ తరపున నాఅభినందనలు.......
పత్రికలు వుండని ప్రభుత్వంకావాలా లేక ప్రభుత్వం లేకపోయినా పత్రికలు వుంటే చాలా అనే ప్రశ్న వస్తే నేను రెండో దాన్ని కోరుకుంటాను అన్నాడు థామస్ జఫర్...... అలాంటి ఓ ప్రముఖ పత్రికకి ప్రతినిధిఅయిన మిస్టర్ త్యాగి ఈ రోజు మా కోరిక మన్నించి ఈ ఫంక్షనుకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం....."
కరతాళధ్వనులు......
త్యాగివేపు చూసింది ప్రసన్నంగా "ఇప్పటికే ఓ డైనమిక్ జర్నలిస్టుగా, తిరుగులేని మేథావిగా చాలా కీర్తిని సంపాదించిన మీ మేథస్సుని ముఖ్యంగా మీ రాజకీయ పరిజ్ఞానాన్ని మా విధ్యార్ధులు యింకా తెలుసుకుని తరించాలనుకుంటున్నారు...... అదీ సభాముఖంగా....... ఇది పరీక్ష కాదు...... మాకు తెలీనివి కొన్ని తెలుసుకోవాలన్న తపన మాత్రమే...... ALLI KNOW IS JUST WHAT I READIN PAPERS అంటాడు ప్రముఖ డైనవిల్ రోజర్స్ ...... అంటే మనిషి ఎదుగుదలకి, పరిపక్వతకి జ్ఞానాన్ని పంచుకునే అవకాశం మాకిస్తారని ఆశిస్తున్నాం ......."
ఆడిటోరియం నిశ్శబ్దంగా అతడి జవాబుకోసం ఎదురు చూస్తుంది.
పదిసెకండ్లు గడిచింది......
"వెల్ కమ్ మిస్ సౌందర్యా" తమ సుముఖతని వ్యక్తం చేశాడు త్యాగి.
సగంగెలిచినంత సంతృప్తి సౌందర్య కళ్ళలో.
టెన్షన్గామరో పదిహేను సెకెండ్లు గడిచాయి ......
* * *
"ఏమిటంత పరధ్యానంగా వున్నావ్" గుండెల పై వాలి ఏదో ఆలోచిస్తున్న శ్రీమతిని రెజెలర్ లా బంధిస్తూ అడిగాడు బ్రహ్మాజీ.....
శ్రీమతి అంటే అచ్చంగా బ్రహ్మజీకి భార్య కాదు...... తన తనువు ప్రజాసేవకే అంకితం అని భావించేరూలింగ్ పార్టీ ఎమ్మెల్యే....... ముఫ్ఫై రెండేళ్ళ శ్రీమతి అసలు పేరు పదహారేళ్ళ క్రితం దాకా కాంతమైతే ఏకాంత సేవలకి అలవాటుపడ్డాక వట్టి శ్రీమతిగాపేరు మార్చేసుకుంది.
అప్పుడెప్పుడో చేపలమ్ముకుని బ్రతికిన మాట నిజమే అయినా రాజకీయాల్లో అడుగు పెట్టి సొరచేపలా దూసుకుపోవడం అలవాటయ్యేకతన గతాన్ని అందరితోపాటు ఆమె కూడా మరిచిపోయింది.
రాజకీయాల్లో అడుగు పెట్టడానికి అసలు స్ఫూర్తి ఆమె చేపల్నుంచేనేర్చుకుంది. ఊరిలో చిల్లర మల్లర నాయకులకిముందు చేపల్ని సరఫరా చేసి ఆనక తనశరీర సౌష్టవం వారి చూపులకే కారణమౌతుందని తెలుసుకుంది .....ఆ తర్వాత చేప పులుసువండడం నేర్చుకుని అందులో అసాధారణమైన నేర్పుని సంపాదించి ఆనకపడక గదిలో మత్స్యాసనాలు వేసి అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించింది.
అలా అని అందరికీ చేప పులుసు ప్రత్యేకతని రుచిచూపించడం ఆమెకు అలవాటు కాదు .......
ఈ స్థాయికి ఎలా ఎదిగారూ అనే ఏ పత్రికా విలేఖరికైనా 'చేపకి ఈత ఎవరు నేర్పారూ' అని జవాబు చెప్పడంతోపాటు .....
కెరీయర్ బిల్డప్ చేసుకోడానికి చేప పులుసు కేరియర్లు పట్టుకెళ్ళడమూ తప్పదని అర్ధంచేసుకుంది .....
ఎమ్మెల్యేగా తనువు చాలించడం తనకు సరిపడని విషయమని తెలుసుకున్నదై మనసు మాట దేవుడెరుగ్గాని తన తనువుని మంత్రి ఛాన్సుయిప్పించగల మగాళ్ళకిపరిమితం చేసుకోవడం అలవాటు చేసుకుని ముసలితనంలో మగతనం చెక్ చేసుకునే ముఖ్యమంత్రి రాజారాంకి చాలా చేరువైపోయింది.
విస్తరిలా తనను తాను చాలావడ్డించుకున్నా మంత్రివర్గ విస్తరణలో ఈసారీ తన పేరు లేకపోవడంతో దారుణంగా కలవరపడికుమిలిపోతుంది కూడా.
"మాట్లాడు శ్రీమతీ"
"నాబ్రతుకు ఒడ్డున పడ్డ చేపలా వుంది."
"నువ్వు ముఖ్యమంత్రివయ్యేదెప్పుడో గదా."
"ఎప్పుడోఏమిటి.....ఉద్యమం ఎంత వూపందుకుందో నీకు తెలుసు గదా .....ఇప్పటికే కేంద్రంలో అధిష్టాన వర్గం రాజారాంని నిలదీయడం మొదలు పెట్టింది. ఆనక వాడ్ని బర్తరఫ్ చేసి..... ఇప్పటికే మెజారిటీ మొదలుపెట్టింది. ఆనకవాడ్ని బర్తరఫ్ చేసి..... ఇప్పటికే మెజారిటీసభ్యుల్ని కూడగట్టుకున్న నన్ను ముఖ్యమంత్రిని చేస్తుంది ....."
ఆ విషయం రాజారాంతో ప్రతి రాత్రీ గడుపుతూ అతడి మాటలద్వారా శ్రీమతి కూడా గమనిస్తుంది...... అసలు చాలాకాలం చూపులతోనే అసెంబ్లీలో బ్రహ్మాజీని పరామర్శించే శ్రీమతి ఈ మధ్య చేపపులుసుతో విందు చేయడం ఆ నమ్మకంతోనే మొదలుపెట్టింది కూడా .....
"ఆ తర్వాతైనా నా బతుకుఅడవిలో వెన్నెల్లా అవదని గ్యారంటీయేటీ."
అప్పుడప్పుడూ అణువంత మాండలికంలో యీ టైపు సంభాషణలు మాట్లాడే శ్రీమతిని అమాంతం కిందికి లాక్కున్నాడు "అలాంటి అన్యాయంనీకు జరగనివ్వను....."
"నేనుకోరుకునేది అన్యాయంకాదు...... మంత్రినైపోడం ....."
"నీకెందుకు నిన్ను చేపలమంత్రిని చేస్తాను."
"పక్కమీద ప్రతి రాత్రీయిప్పటి ముఖ్యమంత్రికూడా యిలాటి మాటలే చెబుతుంటాడు. చివరికేటి దక్కింది. మట్టగిడసల ఖర్చు తప్ప మంత్రినికాగలిగానా......"
"ఈమధ్య పట్టపగలే ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి వెళ్తున్నావని తెలిసింది."
"అవును....... చేపల కూర కేరేజు పట్టుకెళ్తున్నాను."
"అంటే ఆ ఛాంబర్ లోనే ......" అనుమానంగా చూశాడు.
"అంతోటి సంబంధం కూడాను....." మూతి తిప్పుకుంది.
"పక్కమీద చేరినా పుట్టుమచ్చల్ని వెదుకుతాడు తప్ప ఆ ముసలాడితో ఆ సౌఖ్యంకూడానా."
"ఎంతఘోరం....." చేటలావిశాలంగా కనిపిస్తున్న శ్రీమతిని బుజ్జగిస్తున్నట్టు పెనవేసుకుపోయాడు" ఇంత సెక్సప్పీలుని యింతకాలమూ వృధా చేసుకుంటున్నాడన్నమాట...... లాభం లేదు...... నేను వెంటనే ముఖ్యమంత్రి నైపోవాల ..... నీ చేపపులుసుని నా ఛాంబర్ లోని ప్రతి క్షణం రుచి చూస్తూ బ్రతుకుని మూడు ఒంజరాలు ఆరుసొర చేపలుగా మార్చుకుంటాను."
శ్రీమతి యిక మాట్లాడ లేకపోయింది కాదు బ్రహ్మాజీ మాట్లాడనివ్వలేదు. అయిదు నిమిషాలపాటు ఆ గదిలో నిశ్శబ్దం.
"అయినా ఆ తర్వాతైనా" చాలా రోజుల నుంచివున్న అనుమానాన్ని నివృత్తిచేసుకుంటున్నట్టుగా అడిగింది-
"నువ్వే ముఖ్యమంత్రివవుతావన్న గ్యారంటీ యేటి?"
"ఏ పార్టీకైనా కావాల్సింది ప్రజలయోగ క్షేమాలు కావు శ్రీమతీ ..... పరిపాలకుడి దక్షత...... కొనడంతోనే ప్రజల్ని వెంగళాయిలుగా తెలుసుకునే అధిష్టాన వర్గం ఆ తర్వాత ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేల్ని కూడగట్టుకున్న నాలాంటి వాడికి తలవంచుతుంది...... ఒక ప్రక్క ఉద్యమంతో శిథిలమైపోతున్న పార్టీ ప్రతిష్ట మరోప్రక్క పార్టీలో పెరుగుతున్న అసమ్మతి....... ఇది చాలు నేను ముఖ్యమంత్రినికావడానికి....."
"అయితేనీ పక్క ....." సాలోచనగా చూసింది.
"దాదాపుగా వంద పూర్తయినట్టే" అన్నాడు శ్రీమతిని దగ్గరకులాక్కుంటూ.
"సరిగా నీకు లెక్క తెలీదు....." బిడియంగా చూస్తూ "వందేం ఖర్మ ......ఈ రోజు రెండుసార్లతో కలిపి రెండువందల పధ్నాలుగు....." అంది మొత్తం ఫిగర్ని గుర్తుచేస్తూ ......
"నీ తలకాయ ......నేనంటున్నది యిప్పటికే నేనుకూడగట్టుకున్న ఎమ్మెల్యేల సంఖ్య....."
ఓ గంటక్రితమే, తనకు యిష్టమైన కొందరు పత్రికావిలేఖర్ల ఫోన్ ద్వారా ఆ విషయం తెలియచెప్పాడు కూడా.....
ముఖ్యమంత్రి లో ఓపెన్ అవార్డ్ కి అంకురార్పణ జరిగిపోయింది.
బ్రహ్మాజీని చూస్తూ మెర్ మెయిడ్ లా మరోసారి చుట్టేసింది శ్రీమతి.
* * *


