"ఓ.కె..... కానీ పోలీస్ జీప్ లో వెళ్లొద్దు..... కారులో తీసికెళ్ళు."

 

    సిటీ పోలీస్ కమీషనర్ సలహా నచ్చింది ఎ.సి.పి. రమేష్ బాబుకు.

 

    "మరి ఎస్కార్టు?"

 

    "నో..... ఎస్కార్ట్...... నో ఫార్మాలిటీస్. కార్ ని మీరే స్వయంగా డ్రైవ్ చెయ్యండి. మీరే కోర్టుకు తీసుకెళ్లండి కోర్టుపని అయ్యాక మీరే  వెనక్కి తీసుకురండి....." చెప్పాడాయన.

 

    "కనీసం ఇంకో కారులో సీక్రెట్ గా పోలీస్  ప్రొటెక్షన్ ఫోర్స్ వుంటే బావుంటుంది."

 

    "వద్దని నేను చెప్తున్నాను...... దానివల్ల రిస్క్ తప్ప మనకేం ఒరగదు" ఖరా ఖండీగా చెప్పేశాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    మరో ఇరవై నిమిషాల తర్వాత....

 

    వెనక్కి వచ్చేశాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 


                                          *    *    *

 

    కొల్లెగాళ్ నుంచి వచ్చిన బస్సు మైసూరు బస్ స్టేషన్ లో ఆగింది.

 

    బస్సు దిగి, మైత్రేయ అటూ యిటూ చూస్తూ ముందుకు నడిచి, బుక్ స్టాల్లో ఆ రోజు డైలీ పేపర్ తీసుకున్నాడు. గబగబా పేజీన్నీ తిరగేశాడు. ఎక్కడా మొహితకు సంబంధించిన న్యూస్ ఐటమ్ లేకపోవడంతో, ఒకింత నిరాశకి గురయ్యాడు.

 

    మోహిత ఎ పోలీస్ స్టేషన్లో వుందో మొదట ట్రేస్ చేయాలి. తరువాత ఆమెను ఎలా తప్పించాలో ఆలోచించాలి.

 

    సిటీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు వున్నాయో తెలుసుకున్నాడతను.

 

    ఏ పోలీస్ స్టేషన్లో మోహిత వుందో తెలియాలంటే, ఏం చేయాలో ఆలోచిస్తున్నాడతను.

 

    మొదట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కెళ్ళి, అక్కడున్న కానిస్టేబుల్ చేతిలో వంద రూపాయలు పెట్టి "నిన్న హోగీనకల్ ఫాల్స్ దగ్గర ఒక ఆడమషిని అరెస్ట్ చేశారు. ఆవిడ్ని ఒకసారి కలవాలి" అడిగాడు.

 

    "ఈ ఏరియాలో వారం రోజుల్నుంచి అరెస్ట్ లే లేవు . నువ్వు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు. ఎక్కువ అరెస్ట్ లు, రిమాండ్ లో వుంచడాలు అక్కడే జరుగుతాయి. మరీ ఇంపార్టెంట్ కేసులు అయితే పోలీస్ కంట్రోల్ రూమ్ లోనే  రిమాండ్ లో వుంచుతారు" కీలకమయిన సమాచారం చెప్పాడు ఆ కానిస్టేబుల్.

 

    వెంటనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికొచ్చాడు మైత్రేయ.

 

    ఎదురుగా వున్న బస్టాండ్ లో నుంచుని స్టేషన్  లోకి వెళ్లే వ్యక్తుల్ని, వచ్చే వ్యక్తుల్నీ చాలాసేపు పరిశీలించాడు మైత్రేయ.

 

    ఎక్కడా  అతనికి ఆసక్తికరమైన విషయం కనిపించలేదు.

 

    కంట్రోల్ రూమ్  దగ్గరకొచ్చాడు.

 

    కంట్రోల్ రూమ్ దగ్గర  చాలా కార్లు  పార్క్ చేసున్నాయి.

 

    పోలీసులు తక్కువగానూ, మారుతీకార్లు ఎక్కువగానూ వున్నాయి.

 

    'ఎవరికీ అనుమానం కలగకుండా మోహితను మారుతీకార్లో కోర్టుకి తీసికెళ్తున్నారేమో?' ఆ ఆలోచన రాగానే అతను మరింత నిశితంగా మారుతీ కార్లవైపు చూడడం ప్రారంభించాడు.

 

    సరిగ్గా పదకొండు గంటలు.

 

    మాప్టీలో వున్న ఎ.సి.పి. రమేష్ బాబు కంట్రోల్ రూమ్ లోంచి బయటికి వచ్చాడు.

 

    అతని వెనక మోహిత.

 

    మోహిత మారుతీ కారు బ్యాక్ సీట్లో కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో ఎ.సి.పి. రమేష్ బాబు కూర్చున్నాడు. కారు స్టార్టయింది. కారుఇ కార్నర్ వరకూ వెళ్ళి కుడివేపు మలుపు తిరిగింది.

 

    ఆ సమయంలో మైత్రేయ ఆటోలో ఆ కారుకి కొద్దిదూరంలో మాత్రమే వున్నాడు.

 

            
                                        *    *    *

 

    మారుతీ కారు జగన్  మోహన్ ప్యాలెస్ దగ్గరకొచ్చింది. జంక్షన్లో ట్రాఫిక్ ఐలాండ్ లో రెడ్ లైట్  వెలగడం తో కార్లన్నీ  వరుసగా ఆగిపోయాయి.

 

    ఎ.సి.పి. రమేష్ బాబు  కారువెనక ఎవరిదో ఒక అంబాసిడర్ కారు, ఆ వెనక మైత్రేయ కూర్చున్న ఆటో....... ఆ వెనక రెండు ఆటోల తర్వాత ఒక మారుతీ కారు. ఆ కారులో రాజేంద్రకుమార్.

 

    అదే సమయానికి-

 

    ఆ జంక్షన్ కి వచ్చే మిగతా మూడు దార్లలో, ట్రాఫిక్ ఐలాండ్ కి సమీపంలో రాజేంద్రకుమార్ అనుచరులు మారుతీ, అంబాసిడర్ కార్లలో రోడ్డు పక్కన ఎదురు చూస్తున్నారని ఎవరికీ తెలీదు.

 

    ట్రాపిక్ ఐలాండ్ లో గ్రీన్ లైట్ వెలిగింది.

 

    వరుసగా కార్లు ముందుకు నడిచాయి. రెండే రెండు నిముషాల తరవాత మళ్ళీ రెడ్ లైట్ వెలగడంతో, ట్రాఫిక్ , ఐలాండ్ కి అతి సమీపంలో ఎ.సి.పి. రమేష్ బాబు  మారుతీకారు ఆగింది.

 

    ఆ కారుకి కుడివేపు, ఎడంవేపు కార్లలో వున్న రాజేంద్రకుమార్ అనుచరులు మారుతీకార్లో వున్న మోహితను గుర్తుపట్టారు.

 

    వెంటనే కార్ల డోర్లు తెరుచుకున్నాయి. దాదాపు పదిమంది మనుషులు ట్రాఫిక్ ఐలాండ్ వైపు పరుగెత్తారు. పిస్టల్స్ ని తీసి ఎ.సి.పి. రమేష్ కు  గురిపెట్టారు.

 

    "ఆవిడ్ని మాకొదిలెయ్. నువ్వెళ్ళిపో..... లేకపోతే ఈ క్షణంలోనే నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి" ఆ హెచ్చరికతో ఒకే ఒక్కక్షణం ఆలోచనట్లో పడ్డాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    ఆలోచించడానికి టైం లేదు.

 

    రెడ్ లైట్ గ్రీన్ లైట్ గా  మారుతోంది.

 

    "మిసెస్ మోహితా..... ప్లీజ్ గెట్..... డౌన్..... నిన్న ఇంటరాగేషన్ లోనే మిమ్మల్ని నేను అనుమానించాను.... యూ ఆర్  ప్లాన్డ్ ఎస్కేపర్..... అయ్ నో దట్..... బట్.... ఎట్ ప్రెజెంట్ అయామ్..... హెల్ప్ లెస్... అయ్ కాంట్ లీవ్  యూ...... గెట్ డవున్..... గెట్ డవున్....." అసహనంగా అరిచాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    అనూహ్యమైన ఈ సంఘటన వెనక ఎవరున్నారో అర్థంకావడంలేదు మొహితకు  కూడా.

 

    మోహిత ఎ.సి.పి రమేష్ కారులోంచి కిందకు దిగింది. ఆమెను నలుగురు రాజేంద్రకుమార్  మనుషులు చుట్టుముట్టేశారు. ఒక వ్యక్తి ఆమెచేతిని పట్టుకుని అంబాసిడర్ కారులో కూర్చోబెట్టాడు.

 

    ట్రాఫిక్  ఐలాండ్ దగ్గర గ్రీన్ లైటు వెలిగింది.

 

    సర్- సర్ మంటూ అంబాసిడర్ కార్లన్నీ ముందుకు వెళ్ళిపోయాయి.

 

    మోహితను ఎక్కించుకున్న కారు నెంబర్ ను  గుర్తించిన ఎ.సి.పి. రమేష్ బాబు ఏమాత్రం  ఆలస్యం చెయ్యకుండా-

 

    కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇచ్చాడు. సిటీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలోని ఇన్ స్పెక్టర్ల కు మెసేజ్ ఇచ్చాడు.

 

    బెంగుళూరు, ఊటీ, కె.ఆర్.ఎస్. అన్ని ఏరియాల్లోని నేషనల్ హైవేల్ని క్లోజ్ చేసెయ్యమని, వచ్చిన ప్రతి అంబాసిడర్ కారునీ సెర్చ్ చెయ్యమనీ ఆదేశాలిచ్చాడు. ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    మరో పదినిముషాల తర్వాత ఎ.సి.పి. రమేష్ బాబు , సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసులో ఆయన ఎదురుగా  వున్నాడు. జరిగినదంతా ఆయనకు చెప్పాడు.

 

    "ఆ మోహిత వెనక ఏదైనా గ్రూపుందా?" ప్రశ్నించాడాయన.

 

    "ఆ తరహాలో మనం దర్యాప్తు చెయ్యలేదు సార్" చెప్పాడు  ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "మరి అంబాసిడర్ కార్లలో వచ్చిన వ్యక్తులెవరై వుంటారు.....?" సాలోచనగా ప్రశ్నించాడాయన.

 

    "అదే నాకూ అర్థం కావడంలేదు."

 

    "మర్డర్స్ లో ఆమెకు సహకరించిన మైత్రేయ ప్లాన్ అయివుంటుందా ఇది?"

 

    "మోహితను మనం పోలీస్  కంట్రోల్ రూమ్ లో వుంచినట్టు మైత్రేయ తెలుసుకోగలడా...... అతనికి అంత నెట్ వర్క్  వుంటుందంటే నేను నమ్మను. మోహిత కోర్టుకు రాకుండా వుంటే ఎవరికి లాభం?" మళ్ళీ ప్రశ్నించాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    "నా అనుమానం రాజేంద్రకుమార్ మీదే సార్" చెప్పాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "ఆర్టీఓ ఆఫీసుకు ఫోన్ చేసి, ఆ అంబాసిడర్ కారు ఎవరిదో ఇమ్మీడియెట్ గా ట్రేస్ చెయ్యండి..... ఆ కారు నెంబర్ ఎంత?" ఫోన్ రిసీవర్ని అందుకుంటూ అడిగాడు సిటీ పోలీస్ కమిషనర్.

 

    చెప్పాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    సిటీ పోలీస్ కమీషనర్ స్వయంగా ఆర్.టి.ఓ.... ఆఫీసుకు ఫోన్  చేశాడు.

 

    వెంటనే అట్నించి ఇన్ఫర్మేషన్ వచ్చింది.

 

    "ఆ కారు రిజిస్ట్రేషన్, రాజేంద్రకుమార్ మీద  వుంది."

 

    అయిదు నిముషాల సేపు ఆలోచనలో పడ్డాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    ఆ తర్వాత-

 

    "రాజేంద్రకుమార్ ని మనం అరెస్ట్ చెయ్యక తప్పదు..... మిష్టర్ రమేష్! సిటీలోగానీ, బయటగానీ వున్న రాజేంద్రకుమార్ బిల్డింగ్స్ మీద ఫ్యాక్టరీస్ మీద  దాడి చేయండి. అతను మనకు దొరికిపొతే, మోహిత దొరికిపోతుంది..... గో ఎ హెడ్."

 

    మరో అయిదు నిమిషాల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్ లెస్  మెసేజ్ లు వెళ్ళిపోయాయి. ఆయా ఏరియాల్లో వున్న  రాజేంద్రకుమార్ బిల్డింగ్స్ మీద, ఫ్యాక్టరీస్ మీద పోలీసుల దాడులు జరిగాయి.

 

    ఎక్కడా రాజేంద్రకుమార్ ఆచూకీగాని, ఆ అంబాసిడర్ కారుగానీ లభ్యం కాలేదు.

 

    ఆ విషయం తెల్సిన సిటీపోలీస్ కమీషనర్ ఆలోచనలో పడ్డాడు.

 

    "రాజేంద్రకుమార్  తన అనుచరులతోపాటు, అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి నట్లున్నాడు. సిటీలోంచి బయటకు వెళ్ళే నేషనల్ హైవేస్ లోని చెక్  పోస్టుల్లో నిఘా పెట్టండి..... ఎయిర్  ఫోర్స్ లో నిఘా పెట్టండి...... ఎందుకయినా మంచిది సిటీలోని హోటల్స్ అన్నింటిన్నీ సెర్చ్ చెయ్యండి..... అలాగే గెస్ట్ హౌస్ ల మీద  నిఘా వెయ్యండి...... ట్వంటీఫోర్ అవర్స్ లో అవర్స్ లో మనం రాజేంద్రకుమార్ ని పట్టుకోవాలి. మోహితను కోర్టులో హాజరు పరచాలి...... మనపై పొలిటికల్ ప్రెజర్ లేకుండా ఇప్పుడే నేను హోం మినిష్టర్ తో మాట్లాడతాను" సీరియస్ గా చెప్పాడాయన.

 

    "రాజేంద్రకుమార్ మనమీద కాల్పులు జరిపితే....." ముందు జాగ్రత్త చర్యగా అడిగాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

        కాల్చి పారెయ్యండి. ఫుల్ పవర్స్ మీకిస్తున్నను. యూ లీడ్ ద థింగ్..... సెర్చ్ హిమ్ అండ్ క్యాచ్ హిమ్...." అసహనంగా అన్నాడాయన.

 

    కమీషనర్ ఛాంబర్లోంచి బయటికొచ్చి తన ఛాంబర్ వేపు నడుస్తూ టెలీఫోన్  అందుకున్నాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    
                                           *    *    *

 

    ఊరికి దూరంగా వున్న కూర్గ్ నగర్ లో త్రిబుల్ బెడ్ రూమ్ అపార్టుమెంట్లో విశాలమయిన డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు రాజేంద్రకుమార్.

 

    "పోలీసులు మన బిల్డింగ్ ల మీద, ఫ్యాక్టరీస్ మీద దాడులు చేశారట సార్...... మిమ్మల్ని పట్టుకోడానికి ఎ.సి.పి. రమేష్ బాబు, సిటీ పోలీస్ కమీషనర్ బాధ్యతలు అప్పగించాడట సార్...... సిటీలోని హోటల్స్ లోనూ, అనుమానం వున్న ప్రాంతాల్లోనూ, పోలీసులు వెతుకుతున్నారు. సిటీలో ప్రతి వీధి చివరా  పోలీసుల గస్తీ ఏర్పటయింది" బయటనుంచి వచ్చిన వ్యక్తి చెప్పాడు.

 

    తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

    పోలీసుల దృష్టి తనమీద ఎందుకు పడిందన్నది అతనికి అంతుపట్టకుండా వుంది.

 

    "మోహితను ఎక్కడ వుంచారు?' అడిగాడతను.

 

    "మార్కెట్ దగ్గర  చిన్న  హొటల్లో..... ఆ మార్కెట్ వేపు పోలీసులెవరూ రారు. స్లమ్ ఏరియాలో వుంది ఆ హొటల్" చెప్పాడు ఎదురుగా నుంచున్న అనుచరుడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra