Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

   

    కొంచెంసేపు అదే ధోరణిలో సంభాషణ జరిగింది.    
    తర్వాత, "ఇక నే వెళ్ళొస్తా!" అంటూ లేచి నిలబడ్డాడు ఆంజనేయులు. గుమ్మందాక వెళ్ళి, వెనక్కి తిరిగి, తర్జనితో బెదిరిస్తున్నట్లు చూపిస్తూ అన్నాడు.    
    "ఇదిగో! ఇంకో నెలరోజుల దాకా ఎవరూ ఊరొదిలి వెళ్ళడానికి వీల్లేదు. రేపే మీరు జై పరమేశ్వరా అని లేచి పోయారంటే చూసేవాళ్ళకి అనుమానం వస్తుంది. అర్ధమైందా!"    
    అందరూ తలూపారు. ఆంజనేయులు ఆసెయ్యవైపు తిరిగి "రేపు సౌదామిని ఛస్తేబాలూని ఉరికంబం ఎక్కించే సాక్ష్యం నువ్వే చెప్పాలి. గుర్తుంచుకో" అన్నాడు.    
    "అందుకే కదా విషాహారం తిని కడుపునొప్పి వచ్చినట్టు నటించాను. తరువాత తెలిసింది ఆ కుక్కగొడుగులు మంచివని-"   
    "అద్సర్లే భార్యాభర్తలకి పడటంలేదు అన్న విషయం చుట్టుప్రక్కల అందరికీ తెలిసేలా చేశావా?"    
    "చేశాను".    
    "కత్తితో గ్యాస్ స్టౌ ట్యూబ్ కోసేస్తున్నప్పుడు తీసిన ఫోటో".    
    "ఉంది"    
    "అందరూ సాక్ష్యం చెపుతారు కదా"    
    "చెపుతారు".    
    తన దగ్గిర ఎంతో నమ్రతగా అమాయకంగా, అణకువగా మాట్లాడే ఆసెయ్య, క్లుప్తంగా, తెలివిగా సమాధానాలు చెపుతున్నాడు. మరికొంతసేపు ప్రశ్నలడిగి వెళ్ళిపోయాడు ఆంజనేయులు.    
    తన చుట్టూ ఎంత పకడ్బందీగా వల బిగించారో తెలుసుకుంటే కాళ్ళు వశంతప్పి క్రిందపడిపోతానేమో అనిపించింది బాలూకి. తన హత్యా ప్రయత్నాలు కూడా వీళ్ళకు తెలిసాయి. తన ఇంట్లో ... తన ఇంటి ఎదురుగా- అంతా వీళ్ళే.    
    తనో ఫూల్ లా అందర్నీ నమ్మేసేడు.    
    బాలూ సిగ్గుతో అలాగే నిలబడ్డాడు.    
    జానకి ఉన్నట్లుండి కిటికీ దగ్గరికి వచ్చింది.    
    గబుక్కున పక్కకి జరిగాడు బాలూ.    
    జర్దాపాన్ ని తుఫుక్కున కిటికీలోనుంచి ఉమ్మింది ఆమె ఆమె అతన్ని గమనించలేదు.    
    లోకమంతా కలిసి తన మొహంమీద ఉమ్మేసినట్లు ఫీలయ్యాడు బాలూ.    
    జానకి.....జర్దాపాన్!    
    అన్నమాచార్య కీర్తనలు అతి మధురంగా ఆలపించే ఈ పెదవులా జర్దాపాన్ నములుతూ లేకి మాటలు మాట్లాడుతున్నది! ఈమె ఒక చౌకబారు నటీమణా?    
    వీళ్ళందరూ కుట్రపన్ని తనని నాశనం చెయ్యడానికి ఏదో నాటకం ఆడారని తెలిసింది గానీ, అదేమిటో పూర్తిగా అర్ధం కావడంలేదు.    
    ఊతపదాల్లాగా బూతు పదాలు ఉపయోగిస్తూ ఏదో చెబుతున్నాడు గవర్రాజు- విసుగ్గా వింటోంది జానకి.    
    కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. డాక్టర్ మృదుల ఒక్కతే మిగిలింది. చీర విప్పేసి, నైట్ గౌన్ తొడుక్కుంది. లావుగా వున్న మృదుల నైట్ గౌన్ వేసుకుంటే డన్ లప్ పరుపుకి గలేబు తొడిగినట్లు వుంది. తర్వాత బాత్ రూంలోకి వెళ్ళింది ఆమె.    
    తన శత్రువులు ఎవరో అర్ధమైంది బాలూకి. కానీ ఒక్క విషయం మాత్రం అర్ధంకాలేదు.    
    ఆంజనేయుల్ని సౌదామిని ఎందుకు ఆహ్వానించింది? అతడు తరచు ఎందుకు వచ్చేవాడు ఇంటికి? అతడికి డబ్బు, బంగారం ఎందుకిచ్చేది?    
    అన్నిటికన్నా ముఖ్యంగా-    
    ఈ ఏడోనెల డెలివరీ సంగతేమిటి?    
    ...అతడు అప్పుడే తేల్చుకోవాలనుకున్నాడు.    
    చెక్క తలుపు పట్టుకుని- శబ్దం కాకుండా కిటికీలోంచి లోపలికి దూకాడు బాలూ అప్పుడే బాత్ రూంలోంచి వచ్చి అద్దంముందు నిలబడి టాల్కం పౌడర్ అరచేతిలోకి జల్లుకుంటున్న మృదుల అద్దంలో బాలూ ప్రతిబింబం చూసి ఉలిక్కిపడింది.    
    ఒక్క అంగలో ఆమెని చేరుకొని చేతిలో ఆమె నోటిని గట్టిగా నొక్కేశాడు బాలూ.    
    భయంతో మృదుల కళ్ళు పెద్దవయ్యాయి. విదిలించుకోబోయింది.    
    అతని పట్టు సడలలేదు. ఆమెను తోసుకుంటూ టేబుల్ దగ్గరికి నెట్టుకెళ్ళాడు. బల్లమీద పడుకున్నట్లు ఒరిగిపోయింది ఆమె. బల్ల అంచు మీదనుంచి మెడ వెనక్కి వాలిపోయింది. గొంతు దగ్గర చర్మం టైట్ గా అయిపోయి రక్తనాళం ఉబ్బెత్తుగా కనబడుతోంది.    
    బల్లమీద పెట్టివున్న ఒక పదునైన స్కాల్పెల్ ని చేతిలోకి తీసుకుని, ఆమె గొంతుకి ఆనించాడు.    
    "చెప్పు! ఏమిటీ నాటకం?"    
    "నాకేం తెలియదు" అంది మృదుల విహ్వలంగా. భయంతో ఆమె గొంతు, బోదురు కప్ప అరుస్తున్నట్లు వికారంగా వినబడింది.    
    గొంతుమీద కత్తి ప్రెజరు ఎక్కువ చేశాడు బాలు.    
    "ఇప్పటికే ఒక ఆడదాన్ని చంపే నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకో ఇద్దరి ఆడవాళ్ళని చంపి దొరికిపోయినా అంతే శిక్షపడుతుంది నాకు. నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపడానికి సంకోచించను, చెప్పు".    
    "ఊపిరాడ్డంలేదు" అంది మృదుల అతికష్టంమీద.    
    కత్తిని తీసేశాడు బాలూ.    
    లేచి కూర్చుంది మృదుల. ఆయాసంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.    
    "ఇదంతా ఆంజనేయులు పని" అంది అతనివైపు బెదురుగా చూస్తూ.    
    "అది తెలుస్తూనే వుంది. మిగతాది చెప్పు".    
    "విన్న తర్వాత నన్నేం చెయ్యకూడదు".    
    "చెప్పు".    
    గట్టిగా ఊపిరి తీసుకుని చెప్పడం మొదలెట్టింది మృదుల.    
    "బ్రహ్మానంద వేసిన ప్లాను ఇది".    
    బాలూ చేతి కండరం బిగుసుకుంది.    
    "ఆ రోజు సౌదామినికి కడుపునెప్పి అని హాస్పిటల్ కి తీసుకొచ్చావు చూడు, ఆ రోజే సౌదామినికి డెలివరీ అయింది కానీ..."   
    "కానీ..."    
    "జన్మించింది మృతశిశువు".    
    నిశ్చేష్టుడై వింటున్నాడు బాలు.    
    "బ్రహ్మానంద ఆర్దర్సు ప్రకారం, ఈ నర్సింగ్ హోమ్ లోనే డెలివరీ అయిన ఒక అమ్మాయి కొడుకుని మార్చేసి సౌదామిని ప్రక్కన పడుకోబెట్టాం- సౌదామినికి పుట్టిన మృతశిశువుని..." భయంగా అతని చేతిలోని కత్తివైపు ఒకసారి చూసి, మళ్ళీ మొదలెట్టింది మృదుల. "అందుకే ఏడో నెల్లో డెలివరీ అయిన బాబు అంత ఆరోగ్యంగా వున్నాడు. నిజానికి వాడు తొమ్మిది నెలలూ నిండిన తరువాత పుట్టినవాడే. అందువల్లే మీ ఇద్దరి బ్లడ్ గ్రూపూ కాకుండా "బీ" బ్లడ్ గ్రూపు వచ్చింది వాడికి".    
    ఎత్తయిన కెరటం విసురుగా వచ్చి మొహాన కొట్టినట్టయింది. ఆపుకోలేని కోపంతో సాచి ఆమె చెంపమీద బలంగా కొట్టాడు బాలూ.    
    తగిలిన దెబ్బకన్నా, షాక్ కి స్పృహ తప్పింది మృదులకి.    
    టైం చూసుకున్నాడు.    
    ఏడవుతోంది.    
    ఈపాటికి సౌదామిని ప్రోగ్రాం మొదలెట్టి వీణని తాకి ఉంటుందా?    
    అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు అతను.    
    వణుకుతున్న కాళ్ళతో పరిగెడుతూ మెట్లు దిగి కార్లో కూలబడ్డాడు. కారు ఒక్కసారిగా ముందుకి దూకి పరిగెత్తడం మొదలెట్టింది. యాక్సిలేటర్ ని పూర్తిగా తొక్కి ఉంచేశాడు బాలూ. టాప్ గేర్ లో వెళుతోంది కారు. నొసట మీదనుంచి ధారగా చెమట చేతులమీద పడుతూ స్టీరింగ్ గ్రిప్ జారిపోయేటట్లు చేస్తోంది.    
    డాష్ బోర్డుమీద ఉన్న డిజిటల్ క్లాక్ లో ఆకుపచ్చ అంకెలు మారుస్తూ టైమ్ ని చూపిస్తున్నాయి.    
    ఆరు గంటల యాభై నిమిషాలు!    
    ఆరు గంటల యాభై ఒక్క నిమిషం!!    
    ఆరు గంటల యాభై రెండు నిముషాలు!!!    
    ఎవరన్నా ఈ కాలగమనాన్ని కొద్ది నిమిషాలసేపు ఆపగలిగితే బాగుండు.    
    రోడ్డుమీద ఫుట్ పాత్ కి దగ్గరగా పడుకుని నిద్రపోతున్న ఒక కుక్క కారు వేగానికి బెదిరి, కుయ్యోమని అరుస్తూ లేచి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది.    
    స్టీరింగ్ గిరగిర తిప్పిదానికి గుద్దకుండా చేయగలిగాడు కాఉర్ని. ఆరుగంటల యాభై మూడు నిముషాలు!    
    సడెన్ బ్రేక్ తో ఆపేశాడు బాలు.    
    అక్కడ రోడ్డు అడ్డంగా తవ్వేసి ఉంది. సమయానికతను చూడబట్టి సరిపోయింది గానే ఎలేకపోతే ఆ వేగానికి కారు గుంటలో పడి, కంట్రోలు తప్పి దేన్నో గుద్దేసి ఉండేది.    
    ఆడిటోరియం ఇంకా రెండొందల గజాల దూరంలో వుంది.    
    కారు రివర్సు చేసుకుని, వెనక సందులోకి వెళ్ళి అటునుంచి తిరిగి రావచ్చు.    
    అది తొందరగా అవుతుందా? లేకపోతే తను పరిగెట్టుకుంటూ వెళితే త్వరగా చేరకోగలనా? కాసేపు ఆలోచించి, నాలుగడుగులు పరిగెత్తి మళ్ళీ మనసు మార్చుకుని కారు దగ్గరికి తిరిగి వచ్చాడు. కారు తలుపు తెరవబోతుంటే డిజిటల్ క్లాక్ ఆరుగంటల యాభై ఎనిమిది నిమిషాలు చూపించింది.    
    ఆలోచనలోనే నాలుగు నిమిషాలు అనవసరంగా వృధా అయిపోయాయి. ఇంకా కాఉర్ని రివర్సు చేసి అటునుంచీ తిరిగి వచ్చేంత వ్యవధి లేదు. పరుగెత్తడమే ఉత్తమం.    
    పరిగెత్తడం మొదలెట్టాడు బాలూ.    
    పరుగు కష్టంగా వుంది. ఒళ్ళంతా ఒణుకుతోంది. గుండె దడదడ కొట్టుకుంటోంది. కాళ్ళు గజగజ లాడుతున్నాయి. మోకాళ్ళు బలహీనంగా వున్నాయి. నుదుటి మీదనుంచీ స్వేదం కళ్ళలోకి జారుతూ చూపు కనబడ్డంలేదు.    
    తను ఆడిటోరియం చేరేదాకా సౌదామిని క్షేమంగా వుంటుంది.    
    ఉండాలి. ఉండి తీరాలి. సౌదామిని క్షేమంగా ఉంటే, తను గుర్తువచ్చిన ప్రతి దేవుడికీ పేరు పేరునా వంద కొబ్బరికాయలు కొడతాను. కాశీ వెళ్ళి తనకి చాలా ఇష్టమైన గిటారు వదిలేసి వస్తాడు. భిక్షాటన చేసిన డబ్బుతో తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని, పొర్లు దణ్ణాలు పెడతాడు. అతడు పరుగెడుతున్నాడు.    
    అతని పాదం విసురుగా ఒక పెద్ద రాయికి తగిలింది. బొటనవ్రేలు చిట్లింది. గోరు ఊడిపోయి వచ్చింది. పాదం రక్తంతో తడిసిపోయింది.    
    అయినా బాధ తెలియడంలేదు. కుంటుతూ కుంటుతూ ఆడిటోరియం చేరుకున్నాడు.    
    బాలూ చివరి మెట్టు ఎక్కేసరికి కరెంటు పోయింది. గాడాంధకారం అలుముకుంది. గజగజ వణుకుతున్న కాళ్ళతో తడుముకుంటూ, తడుముకుంటూ డయాస్ వైపు వెళుతున్నాడు బాలూ.    
    పెదాలు ఎండిపోతున్నట్లూ కళ్ళు మండిపోతున్నట్లూ అన్పిస్తోంది అతనికి. సౌదామినికి ఏమీ అయివుండకుండా వుంటే బాగుండు. ఏమీ అనకూడదు.    
    ఆమెకి ఏమన్నా అయితే తను బతకడు! బతకలేడు! నిజం!    
    అతని మనసు మౌనంగా రోదిస్తోంది. సౌదామినీ! సౌదామినీ! సౌదామినీ!    
    ఉన్నట్లుండి అతని రెండు చేతులూ ఎవరో పట్టుకున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra