Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

  

      ఈ వార్త దావానలంలా పాకిపోతుంది.
   
    దాదాపు లక్ష చీరలు పంపిస్తే అందులో కేవలం పది చీరలే ఈ విధంగా మిస్సయ్యాయని ఎవరూ అనుకోరు. తమ చీరకే ప్రమాదం వాటిల్లబోతుందని భావిస్తారు. జనం ఆలోచన్లు గుంపులో ఇలాగే వుంటాయి. "ఎందుకొచ్చిన బాధ ఇదంతా, షాపుకి వెళ్ళి కొనుక్కుంటే సరిపోదా" అనుకుంటారు.
   
    ఈ విధంగా దెబ్బ కొట్టటమే చెంచురామయ్యకి కావల్సింది.
   
    తను ఇంత కష్టపడి ఆలోచించిన పథకమూ మట్టి కరవబోతూంది. చాలా గొప్ప తెలివితేటల్తో చెంచురామయ్య తమ పునాదులు కదల్చబోతున్నాడు.
   
    తిరిగి దీన్ని తిప్పి కొట్టాలంటే-పై ఎత్తు వేయాలి. ఇంత కింతా దెబ్బతీయాలి.
   
    ......రవితేజ ఆలోచనలో పడ్డాడు.
   
    కొంచెంసేపటికి తలెత్తి "నాకా పదిమంది అడ్రసులూ కావాలి" అన్నాడు. అతడు అర్ధంకానట్టు "ఎవరివి" అని అడిగాడు.
   
    "చెంచురామయ్య మనుష్యులవి. కస్టమర్లుగా నాటకం ఆడుతున్న వాళ్ళవి."
   
    "కష్టం అసాధ్యం."
   
    "నా ఆఫీసు కొచ్చి పదిహేను వేలిమ్మని నన్ను బెదిరించేటంత ధైర్యం వున్నవాడివి నీకు అసాధ్యం ఏమిటి?ఏం చేస్తావో నాకు తెలీదు నాకు ఆ అడ్రసులు మాత్రం కావాలి."
   
    "లేకపోతే".
   
    రవితేజ నవ్వాడు. "ఇప్పటి మన సంభాషణంతా రికార్దయింది, వింటావా?" అంటూ అల్మ్రైరా వేపు చూశాడు.
   
    ఆ వ్యక్తి మొహం వాడిపోయింది. "ఇది అన్యాయం" అని అరిచాడు.
   
    "బ్లాక్ మెయిల్ నేరానికి నీకు ఆరు సంవత్సరాలు శిక్షపడకుండా వుండాలంటే ఈ పని చేసి పెట్టక తప్పదు."
   
    "ఆ లిస్టు నా దగ్గిర లేదు. మా పై ఆఫీసర్ దగ్గిర వుంటుంది" అన్నాడు రాఘవరావు.
   
    "దాన్ని తీసుకురమ్మనే చెపుతున్నాను."
   
    "నాకంత ధైర్యం లేదు."
   
    "పదిహేను వేలు అడగటానికి ధైర్యం వచ్చిందా?" మళ్ళీ అన్నాడు. దాంతో రాఘవరావు మొహం కందగడ్డలా ఎర్రగా మారింది. అదొక రకమైన కళ అతడి మొహంమీద నడయాడింది. "అవును వచ్చింది" అని అరిచాడు హిస్టీరిక్ గా. "......మా అమ్మాయి పెళ్ళి చెయ్యాలి. పదివేలు కట్నం అడిగారు. ముహూర్తం నాల్గురోజులు కూడా లేదు. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి...."
   
    అతడు అరవటం ఆపుచేయగానే ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది. రవితేజలో మాత్రం పెద్ద మార్పులేదు. అతడి వేపు సూటిగా చూస్తూ "బీదరికం నీతో సాహసం చేయించింది. నిండు ఆఫీసులోనే నాతో మాట్లాడి బేరమాడించింది!......ఇప్పుడు నీ ఉద్యోగం పోతుంది. నీ కూతురికిక నాల్రోజుల్లో కాదు కదా, జన్మలో పెళ్ళికాదు. ఆలోచించుకో నాకు ఆ పేర్లు కావాలి. అతడిచ్చే డబ్బుకోసం అతడు చెయ్యమన్న పనికి వప్పుకున్నావు. ఆ రహస్యం నాకు బేరంపెట్టి మరింత డబ్బు సంపాదించాలనుకున్నావు. ఇప్పుడు ఆ బాణం నీ మీదకే తిరిగింది. నిన్ను సర్వనాశనం చేయబోతోంది. మా ఇద్దరిమధ్యా నువ్వు నలిగిపోక తప్పదు" అన్నాడు.
   
    "మీరు మనుష్యులు కాదు రాక్షసులు" నిస్సహాయంగా అరిచాడు రాఘవరావు.
   
    "కాదు, వ్యాపారస్తులం."
   
    ...................
   
    రెండు రోజులు గడిచాయి. రవితేజ ఇంకా స్టాకు బట్వాడా చేయలేదు. గోడౌన్సులో పేరుస్తున్నాడు. అది కొంతకాలంపాటు పనిచేస్తుందని తెలుసు.
   
    అతడికెందుకో రాఘవరావు ఆ పేర్లు పట్టుకు వస్తాడని బలంగా అనిపిస్తూంది. సరీగ్గా అదే సమయానికి అతడు ఒక సైన్సు మాగ్జయిన్ లో ఒక వార్త చదివాడు.
   
    ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటానికి, తద్వారా జీవితంలో ఒక పెద్ద మార్పు సంభవించటానికి చిన్న చిన్న సంఘటనలే చాలు. పత్రికలో చిన్న వార్త అది.
   
    మ్యాజిక్ మిర్రర్   
   
    అన్న హెడ్డింగ్ క్రిందపడింది. పేటెంట్ నెం. 0296139. ఫాషన్స్ సిస్టమ్స్ కార్పోరేషన్, న్యూయార్క్ వారు పరిచయం చేస్తున్నారు దీన్ని.
   
    అతడు ఆ వివరాలు చదివి నిటారుగా అయ్యాడు. పది నిముషాలపాటు ఏకాగ్రతతో దాని గురించే ఆలోచించాడు. భారతదేశంలో అదంటూ పరిచయం అవుతే, తమద్వారానే అవ్వాలి. ఈ విషయం మూడోకంటికి తెలియటానికి వీల్లేదు.
   
    ఆ మరుసటిరోజు శర్మ కొక్కడికే చెప్పాడు ఈ విషయాన్ని ఆయన కూడా ఇటువంటి సిస్టమ్ వస్త్ర ప్రపంచంలోకి వస్తూందని తెలిసి ఆశ్చర్యపోయాడు.
   
    "దీని తాలూకు మరిన్ని వివరాలు కనుక్కోలేకపోయావా?"
   
    "నిన్న రాత్రే న్యూయార్క్ ఫోన్లో మాట్లాడాను. సంవత్సరం పాటు భారతదేశంలో కేవలం మనం ఒక్కరిమే ఉపయోగించుకునేటట్టు కాంట్రాక్టు ఇస్తామన్నారు. రేటుకూడా తక్కువగానే వుంది. మిగతా వివరాలు మాట్లాడటం కోసం స్వయంగా రమ్మన్నారు."
   
    "ఎప్పుడు వెళుతున్నావు?"
   
    "ఇదిగో ఈ చెంచురామయ్య గొడవ అయ్యాక."
   
    "మన డైరెక్టర్లకి చెప్పాలేమో-మళ్ళీ ఇంకో యాభై-అరవై లక్షల పెట్టుబడి కదా."
   
    "నేను వెళ్ళి వచ్చాక చెపుదాం. ఇప్పుడే చెప్పేస్తే 'లీక్' అయిపోతుంది."
   
    "సరే-"
   
    రవితేజ వీసా, పాస్ పోర్ట్ సిద్దం చేయించుకున్నాడు. ప్రియంవదకు కూడా ఈ విషయం చెప్పలేదు. అతడికి ఒక విషయం ఆశ్చర్యంగా వుంది. ఆ రోజు ప్రియంవద ఇంట్లో ఆమెను ముద్దు పెట్టుకున్నాక- తిరిగి మళ్ళీ ఆ కోర్కె కలగకపోవటం!

    ఎన్నో నిశ్శబ్దపు అర్ధరాత్రులు, నిద్ర దూరమైనప్పుడు ఈ విషయాన్ని ఎనలైజ్ చేసి చూసుకున్నాడు. అతడికి ఒక విషయం అర్ధమైంది!
   
    తను ప్రియంవదని ప్రేమించటం లేదు. తను ప్రేమింపబడటాన్ని ప్రేమిస్తున్నాడు!!! ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తూంది. తనకీ మాధవికీ యిక సంబంధం పూర్తిగా తెగిపోయినట్లే. జీవితాంతం ఒకే యింట్లో వున్నా తామిద్దరూ భార్యాభర్తల్లా మెలుగుతారన్నది సందేహమే! కేవలం సమాజం కోసం కలిసి వుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆప్యాయత కోసం తనలో వున్న దాహాన్ని మిస్ విజయవాడ మేల్కొలిపింది. ప్రియంవధ పానీయపు పాత్రతో దగ్గిరకొచ్చింది. 'ప్రేమ' అన్న పేరు అనవసరం. 'తోడ' అన్నది సరైన పదం. ఈ లోపులో ఈ చెంచురామయ్య గొడవ రావటంతో తాత్కాలికంగా ఆ "తోడు" అవసరం తొలగిపోయింది. ప్రేమ-పని రెండూ వేర్వేరు ధృవాలు. ఒక పని చేసేవాడు రెండోది చేయలేడు. ప్రేమలో నిండా మునిగి వున్నవాడు ఏ పనీ చేయలేడు. అలా చేసుకోగలిగేవాడిది నిజమైన ప్రేమ కాదు. అతడికి తన ఆలోచన్లకి తనకే నవ్వొచ్చింది. ఎంత కాదనుకున్నా ఆమె తన పుట్టినరోజు రాత్రి ఫోను చేయటం, లిఫ్ట్ లో రాత్రి గడపటం మధురమైన అనుభవాలులా మిగుల్తాయి.
   
    అతడిలో వ్యాపారస్తుడు ప్రస్తుతం వున్న సమస్య గురించి కూడా మర్చిపోలేదు. ఒకవేళ రాఘవరావు ఆ లిస్ట్ తీసుకొచ్చి ఇవ్వకపోతే ఈ సమస్య నెలా ఎదుర్కోవటమా అన్నది అతడు ఆలోచిస్తూనే వున్నాడు. తను చీరల డిస్పాచ్ మొదలు పెట్టగానే పేపర్లలో చీరల అదృశ్యం సంగతి, కోర్టుకేసులు సిద్దంగా వుంటాయని అతడికి తెలుసు.
   
    అతడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూన్న సమయానికి రాఘవరావు అతడి దగ్గరికి వచ్చాడు. అతడి ఆకారం పూర్తిగా మారిపోయి వుంది. గెడ్డం పెరిగింది బుగ్గలు పీక్కుపోయాయి.
   
    "ఇదిగోండి మీరడిగిన లిస్టు" అందించాడు. "రెండు రోజులు కష్టపడితే గాని దొరకలేదు."
   
    ఆ కష్టం అతడి మొహంలో తెలుస్తూంది. రవితేజ ఆ కాగితాన్ని అందుకుంటూ 'థాంక్స్' అన్నాడు.
   
    "దయచేసి నా మాటలు రికార్డు చేసిన క్యాసెట్టు ఇచ్చేస్తారా?"
   
    "ఇంకా విషయం మర్చిపోండి. మీ ఉద్యోగానికి ఏ ప్రమాదమూ లేదు. పోతే నాదొక సలహా! దొంగతనం, బ్లాక్ మెయిలింగ్ కూడా ఒక కళ! అది అందరికీ చేతకాదు. బై ది బై మీ కూతురి పెళ్ళి ఏమైంది?"
   
    అతడు తల వంచుకుని "ఆగిపోయింది" అన్నాడు. "....రేపే ముహూర్తం నిన్న సాయంత్రం వరకూ వాళ్ళడిగిన డబ్బు ఇవ్వలేకపోవటంతో సంబంధం వదిలేసుకున్నాను."
   
    "ఇప్పుడా డబ్బు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా?"
   
    యధాలాపంగా ఆ ప్రశ్న విన్న రాఘవరావు అది అర్ధమవగానే చప్పున తలెత్తాడు. "ఏ....ఏమిటీ?" అన్నాడు తటబడుతూ.
   
    రవితేజ బీరువాలోంచి పదిహేనువేలు తీసి అతడి ముందుంచాడు. "తీసుకోండి. మీరు మా కంపెనీకి చేసిన సహాయానికి ఇది బహుమతి. రాఘవరావుకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. అతడింకా ఇదంతా వాస్తవమని నమ్మలేక పోతున్నాడు. వణికే చేతుల్తో ఆ డబ్బు తీసుకున్నాడు. రవితేజ అన్నాడు- "మొన్న మీరొక మాట అన్నారు గుర్తుందా, మేము రాక్షసులమని! అవును రాక్షసులమే. వ్యాపారంలో నైతిక విలువలకు చోటు లేదు. మీ బలహీనతని ఎక్స్ ప్లాయిట్ చేయటానికి మా ప్రత్యర్ధి ప్రయత్నించాడు. మీరున్న పరిస్థితిని వాడుకోవటానికి నేను ప్రయత్నించాను. ఈ చదరంగంలో మీరొక పావు. ఆఫీసర్లు, గుమాస్తాలు, ఓటర్లు అందరూ పావులే. మా అంత తెలివితేటలు మీకు లేవు. అందుకని దొరికిపోయారు. ఆ లెవల్లో ఆలోచిస్తే మీ తప్పు ఏదీ నాకు కనపడలేదు. బీదవాళ్ళకి చౌకధరలకి చీరలు ఇవ్వాలనే నా ఆశయాన్ని దారుణంగా పడగొట్టాలనే ప్రయత్నం చేసిన చెంచురామయ్యని ఏమీ చెయ్యలేని ప్రభుత్వానికి మీమీద లంచగొండితనం నేరాన్ని మోపే అధికారం కూడా ఏమీలేదు. మీ స్థాయిలో మీరు డబ్బు సంపాదించటానికి ప్రయత్నించారంతే. మాకన్నా మీకే డబ్బు అవసరం ఎక్కువుంది. అది తీసుకెళ్ళి మీ కూతురి పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించండి."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra