Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

         ఈ రకమైన సంభాషణలు ప్రతిరోజూ చోటుచేసుకునేవి. తన మనసులో భావాలన్నీ అతడినుంచి వింటుంటే తృప్తిగా అనిపించేది అనూరాధకు.
   
    కొద్ది నెలలు గడిచాయి. మనసులో మాట దాచుకోలేక బయటపెట్టేశాడు విశ్వం.
   
    ఆమె ఆశ్చర్యపోలేదు.
   
    అతనన్నాడు-"ప్రేమ అంటే ఎవరిమీదో ఎందుకో తెలియకుండా జరిగిపోయే ఒక అబ్ స్ట్రాక్టు ఫీలింగ్ కాదు. ఈమె గుణవంతురాలు నా మనసుకి నచ్చిన అందమైనది కాబట్టి ఈమెను ప్రేమించవచ్చు అని ఆలోచించుకుని ప్రేమించడం నిజమైన ప్రేమ. భార్యాభర్తల ప్రేమయినా అది ఆ బంధంవల్ల వచ్చిందే. ఇతడు నా భర్త, ఇతడికి నేను సేవ చేయాలి అన్న నియమంతో భార్య అన్నీ చేసిపెడుతుంది. 'నా కోసం ఆమె ఇంత కష్టపడుతోందే' అన్న కృతజ్ఞతా భావంతో భర్త ఆమెను ప్రేమిస్తాడు. నా కనిపిస్తుంటుంది. 'మా మధ్య చుట్టరికమే లేకుండా మేమిద్దరం అపరిచయస్తులుగా వుంటే నన్ను నా భార్య ప్రేమించగలిగేదా' అని బహుశా ఇద్దరం ఒకరినొకరు అసలు యిష్టపడక పోయేవాళ్ళం. జీవితంలో మొదటిసారిగా ప్రేమను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ నిజం తెలిసిందిప్పుడు. 'నువ్వు నన్ను ప్రేమించాలి' అనుకోవడం లేదు. కారణం అది స్వతహాగా రావలసింది కాని చేర్పి తెప్పించుకునేది కాదు. నన్నో స్నేహితుడుగా భావించు చాలు. నీకే అవసరం వచ్చినా అడగడానికి సందేహించకు నీ కోసం కాదు. నా తృప్తికోసం చేస్తాను. కానీ నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట మాత్రం నిజం".

    అనూరాధ మాట్లాడలేదు. అతడిమీద గౌరవం వుంది. కాని అది ప్రేమగా ఆమె మనసు అంగీకరించలేదు. అతడి విశాల స్వభావం తెలిసినందువల్లనా అని తనను తానే ప్రశ్నించుకుంది. విశాల స్వభావం తెలిసినది కాబట్టి అతడికి ఇంట్లో సుఖంలేదంటే అనుమానించలేదు. కాని జాలి తప్ప అంతకుమించిన భావం ఏదీ కలగడం లేదామెకు. ఈ విషయం ఫ్రాంక్ గా చెప్పేసింది కూడా. అయినా అతడది సీరియస్ గా తీసుకోలేదు. ఆ జవాబుని ముందుగానే వూహించినట్లుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత  వాళ్ళ స్నేహం బలపడింది.
   
                                            *    *    *
   
    ఎప్పటిలాగే సాయంత్రం ఆ ఇంటికి వచ్చాడు విశ్వం. సునీత గదికి బయట తాళం కనిపించింది. రాధ ఇంటిగుమ్మం ఎక్కబోతూ ఆగిపోయాడు. లోపలనుంచి ఏదో ఘర్షణ వినబడుతోంది.
   
    "నువ్వు నా భార్యవు. నీ దగ్గరకు రాక ఏం చెయ్యమంటావు? అయినా నీకు 'ఆ' అవసరం లేదా, లేక ఎవడయినా తీరుస్తున్నాడా?" వెకిలిగా వుందా స్వరం.
   
    "నేను నీకు అందుబాటులో లేను వెళ్ళిపో. సునీత, పిల్లలు వచ్చేవేళయింది".
   
    "రానీ వాళ్ళముందు సిగ్గుపడటానికి నేనేం నీ దొంగ ప్రియున్నా లీగల్ గా నీ మీద నాకు హక్కుంది" బలంగా లాగిన చప్పుడు.
   
    విశ్వం ఏం చేయాలో తోచక నిలబడిపోయాడు. తను జోక్యం చేసుకోవలసిన విషయం కాదది. కానీ అలా వదిలేసి వెళ్ళబుద్దికావడంలేదు. గుండెల్ని ఎవరో పట్టుకుని పిండుతున్నట్లుగా బాధ. ఆగలేక, బెల్ కొట్టాడు గట్టిగా.
   
    కాస్సేపు లోపల నిశ్శబ్దం.
   
    "వెళ్ళిపో వాళ్ళు వచ్చినట్టున్నారు. నీలో పశువుని ఆ పిల్లల ముందు బయటపెట్టకు. ఇదిగో డబ్బు".

    "సరే, పోతున్నా మళ్ళీ రానని సంతోషపడకు. నీకు బుద్ది చెప్పడం ఎలాగో నాకు బాగా తెలుసు" అంటూ తలుపు తీసి ఎదురుగా కనిపించిన విశ్వాన్ని చూసి చప్పున ఆగిపోయాడు.
   
    "నేను సునీత అన్నయ్యని మా సునీత లోపలగాని వుందా?" అడిగాడు విశ్వం ఏమీ తెలియనట్లుగా.
   
    అతడివైపు తేరిపార చూసి ఏదో అర్ధమైనట్లు తల పంకించి అక్కడినుంచి విసురుగా వెళ్ళిపోయాడు. విశ్వం లోపలకు అడుగుపెట్టాడు. దైన్యానికి ప్రతీకలా కూర్చుని ఏడుస్తోంది అనూరాధ.

    "రాధా!" అతడి స్వరంలోని ఆప్యాయత, ఆవేదనకు చలించినట్టుగా తలెత్తి చూసింది. మరుక్షణం అతడి చేతుల్లో వాలిపోయింది.
   
    జీవితంలో కామాలే గాని. ఫుల్ స్టాప్ లుండవు.
   
                                7
   
    తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్ గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు దాదాపు పదిహేనేళ్ళ క్రితంనాటి స్నేహితురాలు 'విశాల' భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా వూహించలేదు. అదలా జరిగిపోయిందంతే. అయితే సుభాష్ విషయంలో ఆలోచించినంత సీరియస్ గా విశ్వం గురించి ఆలోచించలేదామె భయపడనూలేదు. నా సంతోషం-సుఖం గురించి లేశమైనా ఆలోచించని ఈ సంఘానికి నేనెందుకు జవాబు చెప్పాలి? ఎందుకు భయపడాలి? అన్న ఈ విప్లవ ధోరణిలో పడిపోయింది. నిశ్చయంగా విశ్వంపట్ల ఆమెకున్నది ప్రేమకాదు, సమాజంపట్ల కసి అంతే.
   
    భర్త విదేశాల్నుంచి అనుకోకుండా తిరిగి రావడంతో సునీత వెళ్ళిపోయింది. విశ్వం వీలున్నప్పుడల్లా ఆమెను కలుస్తూనే వున్నాడు. ఏ అవసరం వచ్చినా అడగకుండానే అండగా నిలబడుతున్నాడు. భవిష్యత్తు గురించి భయంకరమైన ఆలోచనలు రాకుండా నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు.
   
    అనూరాధ కోరుకునేదల్లా ఒక్కటే. కనీసం తన పిల్లలయినా తనను అర్ధం చేసుకోగలిగితే చాలని. పిల్లలు విశ్వం వస్తే సంతోషంగా ఫీలవుతున్నారు. ఇదంతా ఎవరికీ ఇబ్బందిలేదు తెలియనంతవరకూ విశాల....క్కూ..డా.
   
    రోజులు గడచిపోతున్నాయి.
   
    ఏప్రిల్ నెల దగ్గర పడుతోంది.
   
                              భార్గవి   


    "ఏమిటి పాతిక రూపాయలు తక్కువగా వున్నాయి?" తండ్రి కంఠం గద్దిస్తోంది.
   
    "ప్రిన్సిపాల్ గారు రిటైర్ అయ్యారు. ఆయన ఫేర్ వెల్ పార్టీకని అందరి దగ్గరా కలెక్ట్ చేశారు" తల్లి చెబుతోంది తడబడుతూ.
   
    "ఫేర్ వెల్ పార్టీకి పాతిక రూపాయలా, నన్నడక్కుండా ఎందుకిచ్చావ్?"
   
    "అందరూ యిస్తున్నారు. నేను ఒక్కదాన్ని యివ్వకపోతే బావుండదు. అందులో వాళ్ళు ముందుగానే కట్ చేసుకుని మరీ యిచ్చారు జీతం".
   
    "ఏడవలేకపోయావ్ మొన్నటి నెలలో కొన్న చీరకి యాభైరూపాయలు ఇన్ స్టాల్ మెంట్ కట్టాలి. ఇలాంటి ఖర్చుల్ని ఏదో రకంగా వదిలించుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? నీ మాట నీదేకాని నా మాటకు విలువెక్కడలే".
   
    "అదికాదండీ, ఇప్పటికే స్కూల్లో అందరూ నన్నో పిసినారి అని గేలి చేస్తుంటారు. ఇప్పుడు మనకేం తక్కువయిందని అందరిలోనూ నవ్వుల పాలవడం?"
   
    "బాగానే వుంది. నలుగురి కోసం ఆలోచిస్తూంటే మన విషయం పట్టించుకునే వాడెవడు? మన పిల్లల్ని పైకి తీసుకురావాలి. వాళ్ళకేలోటూ లేకుండా చెయ్యాలి అది మన ధ్యేయం మరోసారి ఇలాంటి పని చెయ్యక వెళ్ళు. వెళ్ళి, కాఫీ తీసుకురా".
   
    "అలాగే ఇప్పుడే పట్టుకొస్తాను. కాని చీరకి యాభై రూపాయలు".
   
    "ఈసారికి పాతిక కట్టు, వచ్చే నెలలో మిగతాది యిస్తానను. నీకు బుద్దివచ్చేది యిలాగే" ఆయన గద్దించాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.
   
    పన్నెండేళ్ళ భార్గవికి ఇలాంటి సంభాషణలు కొత్తకాదు. అలా కొనసాగిన సంభాషణ చివరకు తండ్రి తల్లిపై చెయ్యి చేసుకోవడంతో ముగుస్తూంటుంది. అలా జరగని రోజున ఆ అమ్మాయికి చాలా సంతోషంగా వుంటుంది. అందరి యిళ్ళలోనూ తల్లి ఇంటిలోనే వుండి వంట చేసి పెడుతుండటం, తండ్రి బయటకు వెళ్ళి డబ్బు సంపాదించుకు రావడం ఆమె గమనించింది. కాని అందరిలోనూ వ్యతిరేకంగా, గొప్పగా తన తల్లి ఉద్యోగం చెయ్యడం ఆమెకు గర్వంగా అనిపించేది. కాని ఉద్యోగం చేసే ఆ స్త్రీ కష్టాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయామెకు. తండ్రి ఆఫీసునుంచి ఇంటికొస్తున్నాడంటేనే దిగులుగా వుంటుంది.
   
    తల్లి ఇందుమతి జీతం అణాపైసల్తో లెక్క చెప్పి తండ్రికిస్తుంది. ఆ డబ్బులోంచి యాభైరూపాయలు ఆమె ఖర్చుల కిస్తాడు ఆయన. ఆ తర్వాత ప్రతి పైసాకు లెక్కలు అడుగుతూనే వుంటాడు. అతడో చీరకొంటె ఆమె మురిసిపోతుంది. కొనడు.
   
    ఇక ఇంటి పనుల విషయానికొస్తే పనిమనిషిని కూడా పెట్టుకోకూడదు. ఉదయమే అన్ని పనులూ చేసుకోవాలి. ఆయన ఏడింటికి నిద్రలేచి 'కాఫీ' అని పొలికేక పెడతాడు. అది ఇచ్చే లోపల పదిసార్లు అరుస్తాడు. కాఫీ తాగాక పేపరు పట్టుకుని ఓ గంటసేపు కూర్చుంటాడు. ఆ తర్వాత స్నానానికి నీళ్ళు త్వరగా పెట్టలేదు, బట్టలు ఇస్త్రీ సరిగా లేదని సణుగుతూనే వుంటాడు. అతడికి టిఫిన్ పెట్టి, మధ్యాహ్నానికి బాక్స్ లో పెట్టి యిచ్చి తర్వాతే తన పని చూసుకోవాలావిడ. ఇంతచేసి ఆమె స్కూల్ తొమ్మిదిన్నరకి! (అతడి ఆఫీసు పదింటికి)
   
    సాయంత్రం కాస్త త్వరగా వస్తుంది కాబట్టి అతడు వచ్చేలోపల నీట్ గా తయారయి కాఫీ, టిఫిన్లతో సిద్దంగా వుండాలి. ఏ కారణంచేత నైనా కాస్త ఆలస్యంగా వచ్చి సిద్దంగా ఉండకపోతే అతడికి వొళ్ళు మండిపోతుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra