Home » Vasundhara » Vasundhara Kadhalu - 10

 

    'అరుణా నాకు అడ్డం చెప్పవద్దు. మనం త్వరగా పెళ్ళి చేసుకొందాం. కానీ ఇప్పుడు...."
    అరుణ ముఖం గంభీరంగా అయిపొయింది. "నీకంత తొందరగా వుంటే ఇంటికి వెడదాం పద. అమ్మా నాన్న మనకు వెంటనే పెళ్ళి చేస్తారు."
    "నామీద నీకు నమ్మకం లేదా?" అన్నాను బాధగా.
    "ఉంది. కానీ నామీద నీకు నమ్మకం పోవడం ఇష్టం లేదు" అంది అరుణ.
    "నీతో నేనింక మాట్లాడను. నువ్వు నాకు మరదలివి . వరసయిన దానివి. కాబోయే భార్యవి. నీవద్ద అనుమతి కోసం ప్రాధేయపడవలసిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నిన్ను బలవంతంగా అనుభవించే హక్కు నాకుంది--" అన్నాను. నా మనసునందుకు సిద్దం చేస్తున్నాను.
    "దానర్ధం అరుణను హత్య చేస్తున్నానని!" అంది అరుణ.
    'అంటే?"
    "నువ్వన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ రాత్రికే నేను ఆత్మహత్య చేసుకుంటాను."
    నేను కంగారు పడ్డాను. ఆమె ముఖం చూస్తె అన్నంత పని చేయగలదనిపించింది. అప్పటికప్పుడు ఆ ఆలోచన కట్టిపెట్టి 'అరుణా! నన్ను నమ్మి నాతొ హోటల్ గదికి వచ్చావు. నీకు భయం వేయలేదూ?" అనడిగాను.
    "నామీద నాకు నమ్మకముంది. నాబావ నేను చెప్పినట్లు వింటాడన్న నమ్మకం వుంది. ఈరెండు నమ్మకాల వల్ల నాకేవిధమయిన అనుమానమూ, భయమూ కలగలేదు" అంది అరుణ.
    అరుణ తెలివయినదని గ్రహించాను. అయితే నా మోసాన్ని తెలుసుకునేటంత తెలివితేటలున్నాయా ఆమెకు.
    నా పధకం కొంతవరకూ దెబ్బతింది. శీలాన్ని హరిస్తే సులువుగా ఆమె నా వశమవుతుందనుకున్నాను. అదంత సులభంగా లేదు. అందులోనూ ఆమె ముఖం చూస్తుంటే ప్రేమతో లాలించ బుద్ది వేస్తుంది కానీ పశు బలంతో హింసించ బుద్ది కాదు.
    "పోనీ మనం వెంటనే పెళ్ళి చేసేసుకుందాం. అత్తయ్యకూ, మామయ్యకూ తెలియకుండా" అన్నాను.
    "అమ్మా, నాన్నలకు తెలీయకుండా పెళ్ళి జరగడానికి వీల్లేదు" అంది అరుణ.
    'సరే , అందుకూ అంగీకారమే? ఎటొచ్చీ మీ అమ్మా, నాన్నలకు నేను ఎవరో తెలియకూడదు . ఇంకో పేరుతొ వస్తాను. సరా?" అన్నాను. ఇదే నా ఆఖరు ఆశ.
    "బావ సంగతి తేలేవరకూ నాన్న గారు వేరే పెళ్ళి సంబంధాలు ఒప్పుకోరు" అంది అరుణ.
    హతోస్మీ! ఏం చేయాలి?"
    అరుణని నా స్వంతం చేసుకోవాలంటే నేను విశ్వాన్ని నని ఒప్పుకోవాలి. అదంత సులభమా? అరుణ కోసం అందుకయినా సరే తెగించమని మనసు చెబుతోంది.

                                    5
    నేను అరుణ యింటికి వెళ్ళకుండానే నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను. అందుగురించి ఆమె వద్ద నుంచి కాబోయే నా మామగారు, పనిచేసే ఆఫీసు అడ్రసు తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి నన్ను నేను విశ్వంగా పరిచయం చేసుకోవాలనిపించింది.
    నమ్మకం లేకపోయినా మంచి రోజు చూసుకుని మరీ అయన దగ్గరకు వెళ్ళాను.
    అ సమయానికి ఆఫీసులో అయన చాలా హడావుడిగా వున్నాడు. ముఖం చూస్తె హెడ్ గుమస్తా లా వుంది కానీ అయన అఫీసరయినా అయుండొచ్చు. ఇద్దరు ఉద్యోగస్తుల్ని చెడామడా తిట్టేసి అక్కణ్ణించి పంపించి అదే ఊపులో నావైపు చూసాడు.
    "ఎవరు మీరు, ఏం కావాలి?"
    నాకు నోరు పెగలలేదు. ఆయన్ని చూస్తె నాకప్పుడు కాస్త భయం వేసింది. అయన ముఖం చూస్తుంటే నాకు అనుమానం కూడా వచ్చింది. బట్టతల దుమదుమలాడే ముఖం , అరుణ వంటి అందాల రాశికి తండ్రి స్థానంలో వున్నడంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు.
    "మీరు అరుణ తండ్రి కదూ?" అన్నాను.
    "అలాగంటే నాకు నచ్చదు. అరుణ నా కూతురు" అన్నాడాయన.
    "నీ వ్యక్తిత్వం మండిపోనూ" అనుకున్నాను మనసులో.
    "ఊ" అరుణ నా కూతురు. ఇంతకీ మీకు నాతొ ఏం పని?' అన్నాడాయన.
    హటాత్తుగా నాలోని చిలిపి మనిషి మేల్కొన్నాడు. ఆఫీసరు స్థానంలో ఇద్దరు ఉద్యోగుల్ని నానా మాటలు అనేసి తనను చూడ్డానికి వచ్చిన అతిధి వంక అదే చూపు చూస్తున్న ఆయన్ను కాస్త ఎడిపించాలని పించింది. అయన దురుసుతనాన్నిరికట్టి నాతొ మాట్లాడేలా చేయాలనిపించింది. అందుకోసం మొదట్లో నేననుకున్న పధకాన్ని మార్చుకున్నాను.
    "మీ అమ్మాయి నాకు ప్రేమలేఖ రాసిందండి --" అన్నాను నెమ్మదిగా.
    "ఎమన్నారూ?" అన్నాడాయన కోపంగా.
    "మీకు వినిపించిందనే అనుకొంటాను --" అన్నానమాయకంగా.
    "నా కూతురు నిప్పు ...."
    "అందుకే అరుణ అని పేరు పెట్టారనుకుంటాను. మనిషి కూడా నిప్పులా ఎర్రగా వుంటుంది. నిప్పు కూ మీ అమ్మాయికీ తేడా వుంది. నిప్పును ముట్టుకోవాలని పించదు"
    'అధిక ప్రసంగం చేస్తున్నారు" అన్నాడాయన విసుగ్గా. అది విసుగుకాదని కోపాన్ని అణచుకొందుకు ప్రయత్నిస్తే అలా బయట పడిందని నేను గ్రహించాను.
    "మీ అమ్మాయి నాకు ప్రేమలేఖ రాసిందని చెప్పానండి."
    "ఐతే ఏం చెయ్యమంటారు?"
    "సమస్య ఏమీలేదండి . నేనూ ఆమెను ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఆమెను నేను పెళ్ళి చేసుకుంటాను."
    "చూడబ్బాయ్" అన్నాడాయన సంభోధన ఏక వరస ప్రయోగంలోకి మారుస్తూ. "నువ్వు యేవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలియదనుకొంటాను. మా అమ్మాయి తన బావ కోసం యెదురు చూస్తోంది. అతన్ని ప్రేమించింది. అతన్ని తప్ప యింకేవర్ని పెళ్ళి చేసుకోనంది. మాక్కూడా ఆమ్మాయి నింకొకళ్ళ కిచ్చి పెళ్లి చేసే వుద్దేశ్యం లేదు. ప్రేమలేఖ రాసిందని, నీతో కలిసి తిరుగుతోందని నువ్వు చెప్పే అబద్దాలు నేను నమ్మను."
    "అన్నట్లు చెప్పడం మరిచానండి. ఆమె రోజూ సాయంత్రం నన్ను కలుసుకొందుకు పార్కుకి వస్తుందండీ."
    ఆయన ముఖం ఎర్రబడింది. "మాటలు మితి మీరుతున్నాయి."
    "మీకేదైనా అనుమాన ముంటే ఈరోజు సాయంత్రం పార్కుకు రావచ్చును."
    "మిస్టర్ రఘునాద్! అన్నాడాయన తీవ్రంగా . "నీ గురించి నాకు బాగా తెలుసు. నేను చాలా చాలా నీ గురించి విన్నాను. నాకు కోపం తెప్పించావంటే నీకు చాలా ప్రమాదం. నా క్లాస్ మేట్స్ ఇద్దరున్నారు పోలీస్ డిపార్ట్ మెంట్లో!"
    తెల్లబోయాను , ఈయన నన్నెరుగునన్న మాట ఐతే అదెలా సాధ్యం?
    ఈయన్ని నేనెప్పుడూ చూడలేదు. ఈయనకు నేను యెలా తెలుసు? ఈ కారణంగా నా పధకం దెబ్బతీసేసింది. ఈయన్ని బాగా వుద్రేకపరిచి వెళ్ళిపోదామనుకున్నాను. ఇంటికి వెళ్ళి పార్కు వ్యవహారం గురించి కూతుర్ని గదమాయిస్తే ఆమె తను కలుసుకొంటున్నది బావనే అని చెబుతుంది. అప్పుడు ఓ మంచి రోజు చూసికొని నేనే వాళ్ళ యింటికి వెళదామనుకోన్నాను. ఐతే ఈయనకు నేనెవరో తెలుసు. అరుణతో నాకింక పెళ్ళి కాదు.
    అరుణ లేకుండా నేను జీవిచాలేననిపించింది.

                                       6
    "ఈరోజు ఒక చిన్న తమాషా జరిగింది" అంది అరుణ.
    "ఏమిటది?"
    "ఎవరో రఘునాద్ ట -- నాన్న దగ్గరకు వెళ్ళి నేను తనకు ప్రేమలేఖ వ్రాశాననీ వాడిని ప్రేమిస్తున్నాననీ , వాడితో పార్కులో తిరుగుతున్నాననీ ఆయనకు చెప్పాడుట. అయన ఇంటికి వచ్చి నామీద ఎగురి పడ్డారు...."
    నేను ఆశ్చర్యపడ్డాను. "అయన వాడి మాటలు నమ్మారా?"
    "లేదు"
    "మరి ఎగిరిపడడ మెందుకు?"
    "అయన ఆ రఘునాద్ గురించి చాలా విన్నారుట. వాడు బంధు వర్గంలో తప్పు పుట్టాడుట. అటువంటి వాడి దృష్టి నామీద పడ్డానికి కారణమేమిటి? ఏ ధైర్యంతో వాడు నాన్నకు నా గురించి అబద్దాలు చెప్పాడు?- అంటే నా ప్రవర్తనలో ఎక్కడో సవరించుకోవలసిన లోపముందన్నమాట! ఆ విషయం హెచ్చరించే ముందు నాటకంగా నాన్న నామీద యెగిరి పడ్డారు. నిజంగా నాలో తప్పు వుంటే అయన కోపానికి భయపడతాను కదా -- ఆ విధంగా దొరికి పోతానన్న మాట !" అంది అరుణ.
    "ముసలాడు అసాధ్యుడే" అని మనసులో అనుకున్నాను. పైకి మాత్రం "సరే - నువ్వు దొరికిపోయావా?" అన్నాను.
    "లేదు నా బావను కలుసుకుంటున్నాను తప్పితే, ఆ రఘునాద్ ను కలుసుకోవడం లేదు గదా - అందువల్ల నేను తప్పు చేయడం లేదు, దొరికిపోయే ప్రసక్తి లేదు."
    "మన విషయం మీ నాన్నకు చెప్పావా?"
    "లేదు, కన్న తల్లిదండ్రుల కంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నాను. నీ మాట వినడం నా విద్యుత్తుధర్మం గా భావిస్తున్నాను" అంది అరుణ.
    నా మనసుకు ఎక్కడో ఏదోలా తగిలింది. ఈమె నన్ను మరీ ఎక్కువగా నమ్ముతోంది. ఏదో ఉపాయాన్ని నేను ఈమె బావ స్థానంలో ప్రవేశించాలి. అయితే అరుణ తండ్రికి నా గురించి బాగా తెలుసు. అయన నా మాటలు నమ్మడు- పొతే మారువేషం వెయ్యాలి. అప్పుడు అరుణ నన్ను నమ్మదు. వీళ్ళిద్దరిని నమ్మించేలా చేయడానికి నేనింకేమైనా చేయాలి.
    "ఏమిటీ ఆలోచనలో పడ్డావ్!' అంది అరుణ.
    "నీ ప్రేమ నా ఆలోచనల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది" అన్నాను.

                                   7
    "బాగా మారిపోయావు మామయ్యా!" అన్నాడు విశ్వం.
    చక్రపాణి గారు అతడి వంక ఆశ్చర్యంగా చూసి 'ఈ అవతారం ఏమిట్రా?" అన్నాడు. విశ్వం గురించి అయన చాలా గొప్పగా ఊహించినట్లున్నాడు. ఇతగాడు చూస్తె చాలా అందవికారంగా వున్నాడు.
    "డబ్బయితే సంపాదిస్తున్నాను గానీ పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి పొందలేక పోతున్నాను మావయ్యా.... రోగాలు, ప్రమాదాలు తరుముకు వచ్చి నన్నిలా తయారు చేసాయి. నాకున్న కోరికల్లా ఒక్కసారి నిన్నూ, అత్తయ్యనూ అరుణ నూ చూసి పోదామని ...." అన్నాడు విశ్వం.
    'అంటే?" అన్నాడు చక్రపాణి.
    "అరుణను పెళ్ళి చేసుకోవాలని మొదట్లో అనుకున్నాను మావయ్యా- కానీ దాని ఫోటో చూశాక నా మనసు మారిపోయింది. ఆ అందాల బొమ్మకు నేను తగనని గ్రహించాను. అయితే నా కురూపితనం మీ ముందు ప్రదర్శించడానికి భయం వేసింది. అందుకే నేను మీ దగ్గరకు రావడం వాయిదా వేస్తూ వచ్చాను. ఈ కారణంగా దాని పెళ్ళి కి ఆలస్య మైపోతోందన్న విషయాన్నీ చాలా ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు వచ్చాను" అన్నాడు విశ్వం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra