"ఇన్ని రోజుల తర్వాత యాదృచ్చికంగా ఇలాకలవడం నాకూ ఆశ్చర్యంగానే వుంది మిస్ లిజీ...... మీ తమ్ముడు కృష్ణకి చాలా మంచి స్నేహితుడని తెలిసింది......"
    
    "ఇట్సెన్యూస్ ఫర్ మీ..... ఒకే కాలేజీ అని తెలుసు కాని ఇద్దరూ అంత స్నేహితులని తెలీదు నాక్కూడా."    

 

    "నా నమ్మకం తప్పు కాకపోతే కృష్ణ ఆత్మాహుతి వెనుక వున్న అసలు కథ మీ తమ్ముడికి తెలిసి వుండాలి."
    
    అర్ధంకానట్టు చూసింది.
    
    "నేను అతిగా ఆలోచించడంలేదు లిజీ...... మీరైనా బుజ్జగించితెలుసుకోవాలని ప్రయత్నించండి."
    
    "అంటే కృష్ణ వాలంటరీగా ఈ పనిచేయలేదంటారా"
    
    "ఇట్సే డెలిబరేట్ మర్డర్......"
    
    "ఐడోంట్ థింక్ సో....."
    
    త్యాగి ఉబికిన ఆవేశాన్ని అదిమిపెట్టాడు "అదే మీకూ నాకూ వున్న తేడా అని మీరు అంగీకరిస్తే నేను చెప్పినట్టు మీ పరంగా పరిశోధన ప్రారంభించండి."
    
    "కాని......" ఆమె మరేదో చెప్పబోయింది.
    
    "ప్లీజ్"
    
    "విల్సన్ కి ఏదో తెలుసని ఎందుకు అనుమానిస్తున్నారు?"
        
    "తప్పుచేసినట్టు జవాబుల్లో తడబడుతున్నాడనికాదు."
    
    "మరి?"
    
    "అటుప్రక్క కృష్ణ శవం వూరేగింపు జరుగుతుంటే అంతస్నేహితుడైనవాడు నేరస్థుడిలా ఇంటిలో సెటిలవడు కాబట్టి."
    
    ఆమె ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు.
    
    కాని అప్పటికే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
    
    ఆ మరుసటిరోజే అబ్జర్వర్ లో కృష్ణ ఫోటో ప్రచురించిన త్యాగి ప్రత్యర్ధుల గుండెల్లో పేల్చిన శతఘ్నిలా ఓ వార్తని రాశాడు.
    
    "ఓయువతిని చెరిస్తే అది మానభంగం-
    
    ఒకవ్యవస్థనే చెరవగలిగిననాడది రాజకీయం"
    
    "కృష్ణది ఆత్మాహుతికాదు...... ఓ విద్యార్ధి నిస్సహాయతపై అవకాశం తీసుకుని అధికారదాహంతో ఓ వర్గం అవసరార్ధం చేసిన హత్య."
    
    ఇంతకుమించి వివరాలు రాయలేదు.
    
    కాని ఇటు ప్రభుత్వాన్ని, అటు ఉద్యమ సారథియైన పరమహంసనీ కదిలించింది.
    
    ఊపందుకుంటున్న ఉద్యమానికి మరోసారి విఘాతం కల్పించబోతున్నాడు త్యాగి.
    
    ఆ మరుసటిరోజు రాత్రి .....
    
                                                                  * * *
    
    "నువ్వు చెప్పేవన్నీ ఉత్తత్తి అబద్దాలు"
    
    ద్వారం తెరిచి ఇంటిలో అడుగు పెట్టగానే వెనకే గదిలో కొచ్చిన మున్నీ ఉక్రోషాన్ని ప్రకటించేసింది త్యాగిని చూస్తూ.
    
    తిరిగి తిరిగి అలసిపోయిన త్యాగి అమాంతం మున్నీని పైకెత్తు కున్నాడు.
    
    "కోపమొచ్చిందా?"
    
    "మరేం"
    
    "నేనేం అబద్దం చెప్పాను."
    
    "ఒకటి కాదు..... రెండు ...... "వేళ్ళను చూపిస్తూ అకౌంట్ చెబుతున్నట్టుగా అంది "పాపం చచ్చిపోయినపిల్లాడ్ని కాపాడతానన్నావు..... ఇంకోటి ఈ రోజు నన్ను ఇందిరా పార్కుకి తీసుకెళతానన్నావు"
    
    "సారీ...... మున్నీ" అప్పుడు గుర్తుకొచ్చింది మొన్నెపుడో పాపతో యథాలాపంగా అన్న విషయం "అయితే నా రెండు అబద్దాలకీ జరిమానాగా నీ కిప్పుడు రెండు చాక్లెట్లు యిస్తున్నానన్నమాట" మున్నీ తీసుకోలేదు. ఇంకా కోపాన్ని అభినయిస్తూంది.
    
    "సారీ చెప్పానుగా"
    
    చాక్ లెట్లు అందుకుంటూ అంది "పాపం కదా"
    
    "సారీ చెప్పడమా"
    
    "అహ! ఆ పిల్లాడు కాలి చచ్చిపోవడం......వాళ్ళమ్మా నాన్నాబోలెడంత ఏడవరూ"
    
    పార్వతి రూపం గుర్తుకొచ్చి మనసు ద్రవించినా కాని అదేచర్చని కొనసాగించలేకపోయాడు...... అసలు మున్నీ కనిపించిన ప్రతిసారీ ఆ విషయమే మాట్లాడుతూంది...... ఎందుకో ఆ పసిమనసులో అలాంటి భయం చోటు చేసుకోవడం త్యాగికి ఇష్టమనిపించలేదు.
    
    "ఈవేళ స్కూలుకి వెళ్ళావా"
    
    తలూపింది చాక్ లెట్ కొరుకుతూ.
    
    "ఏంచెప్పారమ్మా"
    
    "చచ్చిపోయిన అబ్బాయి సంగతి."
    
    షాక్ తిన్నట్టుగా చూసేడు. ప్రసక్తి మళ్ళించినా చర్చ అక్కడికే వెళ్ళింది మళ్ళీ......
    
    అదికాదు...... అసలు ఓ విద్యార్ధి ఆత్మాహుతి ఎందరికి చర్చనీయాంశమైంది కూడా బోధపడిపోయింది.
    
    పరిశోధన కొనసాగించి సాధ్యమైనంత త్వరగా ప్రజలకి తెలియచెప్పాలనుకున్న సత్యాన్ని సాధించలేకపోతున్నాడు....... లిజి పరంగా సైతం అనుకున్న రెస్పాన్స్ కనిపించడం లేదు......
    
    "అయితే అంకుల్....... మరి ఆ చచ్చిపోయినబాబు లాగే....."
    
    "మున్నీ ....... ఇందిరా పార్కుకి ఈసారి తప్పకుండా వెళదాం"
    
    "ఎప్పుడు"
    
    "నీ పుట్టినరోజుకి"
    
    విప్పారిన నేత్రాలతో చూసింది "నీకు తెలుసా అంకుల్"
    
    "ఏమిటి"
    
    "నాపుట్టిన రోజు......"
    
    "ఓ...... తెలుసు"
    
    "ఇంకోపది హేను రోజుల తర్వాతన్న మాట"
    
    "అవును! మీ మమ్మీ చెప్పిందిగా"
    
    "అసలు అమ్మకే తెలీదుగా"
    
    "అదేమిటి"
    
    "నాన్నకొక్కడికే తెలుసు"
    
    వస్తున్ననవ్వుని ఆపుకుంటూ "అదేమిటి పాపం" అన్నాడు.
    
    "నేనుపుట్టినప్పుడు అమ్మ స్పృహలో లేదట....." పాప సిజేరియస్ బేబీగా సూర్యం ఎప్పుడో చెప్పటం గుర్తుకొచ్చింది త్యాగికి.
    
    "అందుకే డేట్ సరిగ్గా తెలియదు అమ్మకి"
    
    ఫకాల్న నవ్వేశాడు ఎప్పుడొచ్చిందో గదిలోకి మున్నీ తల్లిసుశీల కూడా నవ్వేసింది. "మీకూ చెబుతూందన్నమాట దాని పుట్టుపూర్వోత్తరాలు. మరేంలేదు త్యాగీ! మొన్నెప్పుడోవాళ్ళ నాన్న అడిగేసరికి వెంటనే డేట్ చెప్పలేకపోయాను...... ఆ రోజు నుంచి తండ్రీ కూతుళ్ళు కలసి నన్ను వెంటాడి మరీ విసిగిస్తారనుకో ......"
    
    "అయితే నాన్న చెప్పింది నిజంగాదా?"
    
    "ఒప్పుకుంటున్నాలే! అంకుల్ని విసిగించక ఇంట్లోకిరా" మున్నీని తీసుకు వెళ్ళింది సుశీల. భోంచేయాలనిపించలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra