Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

      కొద్దిసేపు తటపటాయించి తనూ వెళ్ళింది లోపలకు. సుభాష్ సీరియస్ గా నిలబడ్డాడు. అతడి మనసులోని బాధ కళ్ళలో ప్రతిఫలిస్తోంది. ఎదురుగా స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి.
   
    "నా దురదృష్టానికి నువ్వు బాధపడుతున్నావా సుభాష్!"
   
    "అబ్బే! లేదు.... పెద్ద హీరోలా ఒక్క క్షణంలో కాఫీ తెస్తానన్నాడు. అసలు డికాషనే వెయ్యలేదు. టైమ్ పడుతుందని దిగులు అంతే" మరుగుతున్న నీళ్ళను ఫిల్టర్ లో వేస్తూ నవ్వాడు. హాట్సాఫ్ టు హిజ్ సెన్సాఫ్ హ్యూమర్.
   
    "నేను సెలవుపెట్టి వచ్చాను. సాయంత్రం వరకు యిక్కడే వుంటాను. కాఫీకి తొందరేం లేదు. నీ చదువుకి భంగం అనుకో కాని ఒక్కరోజు నా గురించి స్పేర్ చెయ్యగలవని నమ్మకం".
   
    "నువ్వు సెలవు పెడతాననడమే అపురూపం. ఇక్కడే వుండి నా చేతివంట భోంచేస్తాననడం మరో గొప్ప విషయం. రా కూర్చుని మాట్లాడుకుందాం".
   
    అతడు సోఫాలో కూర్చోగానే అతడి కాళ్ళదగ్గర కూర్చుని అతడి వొళ్ళో తలపెట్టుకుంది రాధ. అతడామె చేతిని మృదువుగా అందుకున్నాడు. ఆకాశం నేలకు దిగివచ్చి సముద్రపుటంచుల్ని ముద్దు పెట్టుకుంది. కలువభామ నింగి పై కెగసి చందమామను స్పృశించింది. ఆ నిశ్శబ్దంలో అనూరాధ స్వరం మంద్రంగా సాగిపోతోంది.
   
    "జీవితం ఎంత చిత్రమైంది సుభాష్. ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటన్నాడు మహాకవి. ఎక్కిన రైలు చేరవలసిన గమ్యం చేరదని తెలుసుకునేటప్పటికే జీవితకాలం గడిచిపోయింది. జరిగినడానికి విచారించే శక్తి కూడా లేక నిర్లిప్తత అనే సమాధిలోకి వెళ్ళిపోయాను. ఆ జడత్వంలోంచి బయటకు లాగి నేనేమిటో తెలుసుకునేలా చేశావు. భగీరధుడు అన్నేళ్ళు తపస్సు చేస్తేగాని గంగను భూమిమీదకు తేలేకపోయాడు. పాలసముద్రాన్ని మధిస్తేగాని దేవతలకు అమృతం దొరకలేదు. ఏ తపస్సూ చేయకుండానే నేను కలలో కూడా వూహించలేని వరం ఇచ్చావు. కాని చేతికందని అమృత కలశాన్ని అందుకోలేని దౌర్భాగ్యురాలిని మన యిద్దరిదీ దాదాపు ఒకటే వయసు. అనుభవాలతో పండిపోయాన్నేను. నీకింకా జేవితం మొదలే కాలేదు. నా చేదు అనుభవాలతో ఇకముందు సుఖపడలేను. నిన్ను సుఖపెట్టలేను. చిలిపిపనులు చేసే వయసు దాటిపోయింది. కొంటె పనులకు పులకరించే మనస్సు చచ్చిపోయింది. అతి చిన్నవైనా ఆ అనుభవాలు లేని జీవితం చప్పగా వుంటుంది".
   
    "నాకు కావలసింది ఆ చిన్న అనుభవాలు కాదు రాధా! నువ్వు నాతో వుండడమే గొప్ప అనుభవం".
   
    "అది శాశ్వతంగా కావాలని ఎందుకనుకుంటున్నావు?"

    "మనసుకి నచ్చింది శాశ్వతం కావాలనుకోవటం పొరపాటా?"
   
    "కాదు కాని సాధ్యపడని దానికోసం ఆశించి భంగపడడం వివేకవంతుల లక్షణం కాదు".
   
    "ఇంక నన్ను దేనితో తృప్తిపడమంటావ్?"
   
    రాధ తలదించుకుని, "ఇంతవరకు ఎంతమంది స్త్రీలతో సంబంధం వుంది నీకు?" అని నెమ్మదిగా అడిగింది.
   
    అతడు విద్యుద్ఘాతం తగిలినవాడిలా చూశాడు. తమాయించుకుని "ఏ స్త్రీ కూడా నాకింత దగ్గరగా రాలేదు. మానసికంగానైనా, శారీరకంగానైనా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీవే ప్రధమురాలివి" అన్నాడు.
   
    "మానసికంగా నేనే మొదటిదాన్ని ఆ రెండోదానిని కూడా నేనే ఎందుకు కాకూడదు? సుభాష్! నాలో ఇంకా పిరికితనం పోలేదు. అందుకే నువ్వు పబ్లిగ్గా యిస్తానన్న దాన్ని నేను రహస్యంగా కోరుకొంటున్నాను. మనసు లేనిచోట సెక్స్ బలవంతం అయినప్పుడు అది వ్యభిచారమే అవుతుంది. దాంతో పోలిస్తే మన కలయిక తప్పుకాదు. ఈ కొద్దిరోజులు నీతో గడపనీ, ఆ మధుర క్షణాలను మూటగట్టుకుని అపురూపంగా దాచుకుంటాను. ఆ స్మృతులతోటే జీవితమంతా సంతోషంగా గడిపేస్తాను" అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె కెందుకో విపరీతమైన దుఃఖం వచ్చింది. కారణం తెలీదు. ఆ చీకటి గదిలో ఆమె మనసు ఆక్రోశించింది. "ఓ మహాపురుషుల్లారా! స్త్రీ జీవితాన్ని నిర్దేసించే మహానుభావులారా! నన్ను క్షమించండి. నేను తప్పుచేస్తున్నాను. మీరు వ్రాసిన నీతిశాస్త్రాలన్నింటినీ కాలరాస్తున్నాను. నైతిక విలువల గోడల్నిదాటి నా స్వార్దాన్ని వెతుక్కుంటున్నాను. నా జీవితం ఎవరికీ పాఠ్యపుస్తకం కాదు. మీ భార్య లెవరూ దీన్ని చదవకూడదు. హేమంతంలో చేమంతుల్నీ, వసంతంలో కోయిలల్నీ చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోయిన పదహారేళ్ళ అమ్మాయి, జీవిత సోపానాల మీద నడిచి నడిచి అలిసి సేదదీర్చుకుంటూంది. నన్ను డిస్టర్బ్ చేయకండి, పారిపోండి దయచేసి నన్ను చూడకండి- నన్ను గమనించకండి".
   
    ఆమెని అతడు చేతుల్లోకి తీసుకున్నాడు.
   
                                    6
   
    ఇంటర్వ్యూకి నాల్రోజులుందనగా సుభాష్ వెళ్ళిపోయాడు. బరువైన హృదయంతో అతడికి వీడ్కోలు చెప్పింది. జీవితంలో మళ్ళీ తాము కలుసుకుంటామా అన్న అనుమానం వచ్చింది. ఐ.పి.సి. 497 గుర్తొచ్చి నవ్వుకుంది. ఒక వివాహిత స్త్రీ ఆమె కిష్టమయినా సరే- ఆమె భర్తకు ఇష్టంలేకుండా వేరే పురుషుడితో లైంగిక సంబంధం కలిగివుంటే అది నేరం. అంటే వివాహమైన స్త్రీ భర్త ఆస్తి అన్నమాట. అవివాహిత స్త్రీకి ఈ పట్టింపులేదు. అదే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం వుందని భార్య నిరూపించినా అది విడాకులు పొందటానికి సాయపడుతుందే తప్ప, అతడిని శిక్షించడానికి సాయపడదు. భారత శిక్షాస్మృతిలో తప్ప మరే దేశంలోనూ ఈ 497 సెక్షన్ లేదు. ఈ పని గురించి తన భర్తకు తెలిస్తే తనకి ఎంత శిక్ష వేయమని కోర్టుని కోరతాడు? పెళ్ళయిన మొదటిరాత్రే తన చెల్లెలితో 'కులికిన' ఇతడు, తను చేసిన దోషం గురించి ఏ విధంగా వాదిస్తాడు. ఇండియన్ పీనల్ కోడ్ మొగవాడికి ఆ సౌలభ్యం కలుగజేసిందని వాదిస్తాడా?
   
    ఆమె బలవంతంగా ఆలోచన్లని పారద్రోలింది. కొన్ని రోజులు గడిచాయి. ఆమెకి సుభాష్ ని చూడాలని, కనీసం ఒకసారైనా మాట్లాడాలనీ బలంగా అనిపించేది. నిద్రలో హఠాత్తుగా మెలకువ వచ్చి మరి నిద్రపట్టేదికాదు.
   
    ఇంటర్వ్యూలో అతడు సెలక్టయినట్లు, ట్రైనింగ్ మొదలయినట్లు ఉత్తరం అందుకుంది. మరికొన్ని నెలలు గడిచాయి. తొలివర్షపు జల్లు తాకిడి నుంచి ఆమె కొద్దిగా తేరుకుంటూ వుండగా అతన్నించి ఉత్తరం వచ్చింది.
   
    "రాధా!
   
    'ప్రేమించిన మనసుకి కావల్సింది మరో ప్రేమించే మనసు. ప్రేమ తప్ప జీవితంలో యింకేమీలేదు' అని చిన్నప్పుడు నేను చదివిన పుస్తకాల్లోంచి నేర్చుకున్నాను. నీ పరిచయంతో అది నిజం అని గాఢంగా నమ్మేను. కానీ తరువాత తరువాత ప్రేమ అన్నది జీవితంలో ఒక భాగం అని అనుభవం నేర్పింది. ఒకప్పుడు నేనెంత మామూలుగా ఆలోచించానో అర్ధమవుతూంది. దీన్నే మెచ్యూరిటీ అంటారేమో! ఏడాదికేడాది మారే భావాల్నే మెచ్యూరిటీ అంటారని, ప్రతిసారీ ఒక కొత్త భావం మనసులో మెదిలినప్పుడు - అరే, ఇంతకుముందు నేనెంత ఇమ్మెచ్యూర్ గా ఆలోచించేవాడిని - ఇప్పుడు కదా సరిగ్గా ఆలోచించగల్గుతున్నాను - అని జీవితపు ప్రతి స్టేజీలో పధ్నాలుగో ఏటినుంచీ చచ్చేవరకూ మనిషి అనుకుంటూనే వుంటాడనుకుంటాను. ఇలా నిరంతరం మెచ్యూర్ అవటాన్నే తన చర్యలకు సమర్ధనీయమైన వాదనని కల్పించుకోవటంగా అభివర్ణించాడో రచయిత. అయిన సరే ఈ విషయం నీకు చెప్పాలనిపిస్తోంది. నీకు చెప్తే అదో సంతృప్తి. (మళ్ళీ ఆత్మవంచన అని నవ్వుకోకు ప్లీజ్)
   
    మనం గడిపిన కొద్దిరోజుల్నీ మధుర స్మృతులుగా మిగుల్చుకొని జీవితం అంతా సంతోషంగా గడిపేయగలనన్నాను. నా ప్రేమ కూడా నీ ప్రేమకు తీసిపోయిందేమీకాదు అన్నాను. నీతో కలిసింతర్వాత మరో స్త్రీని అంత తపనగా దగ్గరకు తీసుకోగలనా అని అనిపించింది. ఇదంతా మనస్ఫూర్తిగా నిజమే అనూరాధా! నన్ను నమ్ము! కానీ కలం అన్నది పాములాంటిది. నిర్ణయాన్ని కొండచిలువలా చుట్టుకుని బిగిసడిలేవరకూ వదలదు. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నేను పెళ్ళిచేసుకోబోతున్నాను. అంతా సెటిలయిపోయింది. ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ? ఆమె ఒక అభాగ్యురాలు. పెళ్ళయి ఆరునెలలయినా కాకుండానే భర్తను పోగొట్టుకుంది. భర్తపోయేనాటికే గర్భవతయిన ఆమెకు ఇప్పుడో బాబు. ప్రస్తుతం నాతోబాటు ట్రైనింగులో వుంది. నువ్వెవరో చెప్పకుండానే మన ప్రేమ గురించిమాత్రం చెప్పాను. మేము ఇద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకుని తోడుగా వుండగలమనే నమ్మకం ఇద్దరికీ కలిగింది. పదిహేను రోజులలో మా పెళ్ళి చాలా నిరాడంబరంగా జరుగుతుంది. నీ శుభాకాంక్షలు ఉంటాయని తెలుసు. ఉంటాను మరి.
   
                                                                                                                                                                   -సుభాష్"
   
    పి.యస్:- ఆమెని నేను పెళ్ళిచేసుకోవటానికి కారణం కేవలం ఆమె అభాగ్యురాలు కావటం మాత్రమే కాదు...
   
    అనూరాధ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అవి ఆనందబాష్పాల్లో, విషాదాశృవులో ఆమెకే అర్ధంకాలేదు. ఒక చాప్టర్ మాత్రం క్లోజ్ అయింది.
   
                            *    *    *
   
    అనుకున్న సమయానికి యిల్లు పూర్తయింది. అప్పుడే రాధకు మరో ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ సంతోషాన్ని పంచుకునేవాళ్ళే కరువయ్యారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra