Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

   

    మదన్ వినటంలేదు. ప్రియ గురించి యోగి ఎందుకు ప్రస్తావించాడా అని ఆలోచిస్తున్నాడు. అతడి ఆలోచన గమనించిన వదిలా యోగి ఆ విషయాన్ని కొచ్చాడు- "అప్పుడప్పుడే ఊహలు విస్తరిస్తున్న చిన్నపిల్లల్లో లైంగికాసక్తి ప్రవేశపెట్టి, వారి ఉత్సుకతని క్యాష్ చేసుకోవడం అన్న నా ఆలోచనని నువ్వు మరో  విధంగా క్యాష్ చేసుకున్నావ్ మదన్ నేను నిన్ను తప్పుపట్టను. నాలోవున్న రాక్షసుడే నీలోనూ వున్నాడు. అయితే-నేను చాలా లౌక్యమ్గా, మంచి మాటల్తో నా కార్యం నెరవేర్చుకుంటూ వచ్చాను. నువ్వు మొరటుగా ప్రవర్తించావు. అధీ తేడా...."
   
    యోగి ఏం చెప్తున్నాడో మదన్ కి కొద్ది కొద్దిగా అర్ధం అవసాగింది.
   
    "ప్రియ పదమూడేళ్ళ పిల్ల. అయినా వయసుకిమించి ఎదిగినట్టు కనపడుతుంది. అయితే మానసికంగా మాత్రం చిన్నపిల్లే. ఈ విషయం తెలియకుండా నువ్వు తొందరపడ్డావు. మిగతా వారి విషయంలో అలాకాదు. మనం వాళ్ళ గుండెల్లో పాతిన విషబీజం మొలకెత్తగానే, వాళ్ళు మనకి లొంగిపోయేవారు. వాళ్ళ చర్యల్ని మనం గమనించామన్న భయంతో కొందరూ, ఇంకా 'ముందుకెళ్ళి' తెలుసుకుందామన్న ఆసక్తితో కొందరూ మనకి దగ్గిరయ్యారు. ఎవరికీ దొరకని సర్వసౌఖ్యాలు మనం అనుభవిస్తూ వచ్చాం. అప్పుడప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న ఇంతమంది ఆడపిల్లల కంపెనీ దొరకటం అంత సాధారణ విషయంకాదు. బంగారు గుడ్డునిచ్చే బాతుని చంపేప్రయత్నం చేసావు. జీవితంలో ఏమీ కష్టపడకుండా ఇలాటి సౌఖ్యాలు అనుభవించే స్థితిరావటం వలన ప్రతీదాన్నీ తేలిగ్గా పొందవచ్చుననే అభిప్రాయం నీకు కలిగినట్టుంది. దాన్ని పోగొట్టటం నా బాధ్యత. అందుకు నీకు రెండు పనులు అప్పజెపుతున్నాను. అందులో మొదటిది - మన వాచ్ మన్ ని చంపటం...."
   
    మదన్ ఉలిక్కిపడ్డాడు.
   
    "అవును వాడూ నీలాగే, తనున్న పొజిషన్ కన్నా ఎక్కువ ఊహించుకుంటున్నాడు. వాడిని చంపటం ద్వారా నీవూ ఒక క్రిమినల్ వి అయి, ఇందులో వుండే రిస్క్ తెలుసుకుంటావు. రెండోది-ఇంకాస్త కష్టమైన పని. ధరణీ, ఆమె భర్త మన టర్మ్స్ కి వచ్చేవరకూ వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయటం...."
   
    మదన్ స్థబ్దుడై వింటున్నాడు.
   
    "వాళ్ళని ఎక్కడ రహస్యంగా వుంచుతావో నీ ఇష్టం. ఈ రెండు పనులూ ఇంకో అరగంటలో జరగాలి. మొదటిది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. రెండోది తెలివితేటల్ని నేర్పుతుంది. నేర్చుకోవాలని వుంటే చెయ్యి లేదా ఇక్కణ్నుంచి వెళ్ళిపో ప్రియ అనే అమ్మాయి విషయంలో చేసిన అనాలోచితమైన పనికి నిన్ను శిక్షించను. ఇన్నాళ్ళూ నువ్వు మాకు చేసిన సర్వీస్ కు అదే నీకు మేము ఇచ్చే రాయితీ..."
   
    మదన్ మాట్లాడకుండా అక్కణ్నుంచి బయటకు నడిచాడు. యోగి గదిలోంచి బయటకు నడిచి - కెమెరా రూమ్ వైపు వెళ్ళాడు. ఎవరికీ ఏ ఆధారమూ దొరక్కుండా చేయటానికి.
   
    .......

    సరిగ్గా అయిదు నిమిషాల తరువాత వాచ్ మెన్ రూమ్ దగ్గిర పిస్టల్ శబ్దం వినపడింది.
   
                                           7
   
    ధరణీ, శ్రీధర్ కూతురికోసం ఎదురు చూస్తుండగా, ఇన్ స్పెక్టర్ దగ్గిర్నుండి ఫోన్ వచ్చింది.
   
    "ఏమంటోంది మీ అమ్మాయి? శ్మశానం దగ్గరికి ఎందుకు వెళ్ళిందిట?"
   
    "పూజా.. ఇంకా ఇంటికి రాలేదు. కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్నాం...." శ్రీధర్ చెప్పాడు.
   
    "రాలేదా?" ఇన్ స్పెక్టర్ కంఠంలో విస్మయం తొంగిచూసింది. "ఒక్కక్షణం లైన్లో వుండండి."
   
    ధరణి భర్త మొహంవైపే చూస్తోంది. ఆమెకేమీ అర్ధం కాలేదు. కొంచెం సేపటి తరువాత విక్రమ్ గొంతు క్లుప్తంగా చెప్పింది. "...అయిదు నిముషాల్లో అక్కడికి వస్తున్నాను."

    .....
   
    ఇన్ స్పెక్టరూ, కానిస్టేబులూ ఎదురుగా వున్నారు.
   
    ధరణీ, శ్రీధర్ లు డీప్ షాక్ లో వున్నారు.
   
    ఇన్ స్పెక్టర్ అతికష్టంమీద తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు.
   
    డిపార్ట్ మెంట్ కి తలవంపులు తెచ్చే పనిని బాధ్యతారహితంగా చేసిన కానిస్టేబుల్ పై అధికారిగా, ఈ చర్యకి తనే జవాబుదారి అని తెలుసు.
   
    కానీ ఇక్కడ చర్య కాదు ముఖ్యం. పరిణామం!
   
    పూజని తీసుకొస్తున్న కానిస్టేబుల్ కి దార్లో ఒక వ్యక్తి కనపడి, తను ఆ పాప కోసమే వచ్చానని చెప్పి తీసుకుపోయాడు.
   
    అంతే!
   
    సో సింపుల్.

    ఇదే ఎవరైనా ఒక వార్తగా వ్రాస్తే ఆ దంపతులు నమ్మకపోదురేమో, కానీ యదార్ధంగా జరిగిందది!
   
    పోలీసులు కూడా ఇంత సులభంగా మోసపోతారని ఋజువుపర్చే సంఘటన.
   
    ముఖాముఖి ఒంటరిగా మాట్లాడడానికి మొహం చెల్లక, విక్రం తనతోపాటు కానిస్టేబుల్ ని కూడా తీసుకొచ్చాడు.
   
    పూజని తీసుకెళ్ళిన వ్యక్తి వివరాలు చెప్పలేకపోయాడు ఆ పోలీసు.
   
    అతడిని బయటికి పంపించిన తరువాత ఆ దంపతుల్తో అన్నాడు విక్రమ్. "....నేను మా కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయించలేను. ఇదంతా అనధికారికంగా జరిగింది కాబట్టి...." క్షమాపణ పూర్వకంగా చెప్పాడు. "....మీరేమీ దిగులుపడకండి. రేప్రొద్దున్నకల్లా మీ పాపని తెచ్చియిచ్చే పూచీ నాది."
   
    కేవలం తమకి ధైర్యం చెప్పటానికే అతనలా మాట్లాడుతున్నాడని శ్రీధర్ కి తెలుసు. అయినా అతడెంత డీప్ షాక్ లో వున్నాడంటే- కనీసం నోరువిప్పి మాట్లాడలేకపోయాడు. తమ చిన్నారి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసారన్న విషయమే అతడికీ జీర్ణం కావటం లేదు. ఇలాటి సంఘటనలు ఎక్కడో కథల్లో చదివేడంతే! గొంతులో దుఃఖం స్థబ్ధమై- అతడిని శిల్పం చేసింది.
   
    ఈ లోపులో ఫోన్ మ్రోగింది. శ్రీధర్ ఆతృతగా లేచాడు.
   
    ముందు ధరణి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. అట్నుంచి డాక్టర్ పరిమళ.
   
    అంత రాత్రి ఆమె తనకి ఎందుకు ఫోన్ చేసిందో ధరణికి అర్ధంకాలేదు. "చెప్పండి డాక్టర్" అంది. మాట్లాడేది పరిచయస్తురాలని తెలిసి, శ్రీధర్ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు.
   
    అట్నుంచి కొంచెం తటపటాయింపు ఫోన్ లో.

    "ఏవైంది డాక్టర్" సందిగ్ధం తరువాత అడిగింది ధరణి.
   
    "నీలూ కూతురు ప్రియ గురించి నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను."   
    మరణించిన ఆ చిన్నపాప గురించి ఏం చెప్తుందా అని ఉద్విగ్నతతో వినసాగింది ధరణి.
   
    "ప్రియ మీద రేప్ అటెంప్ట్ జరిగింది."
   
    ధరణి చేతిలో రిసీవర్ బిగుసుకుంది.
   
    "డా....క్ట్....ర్"
   
    "అవును ఆ అమ్మాయి
తొడలమీదా, ఛాతీమీదా కమిలిన గుర్తులు ఆ విషయాన్ని స్పష్టంగా నిర్దారించాయి. అయితే పెనిట్రేషన్ గానీ, హైమర్ రప్చర్ గానీ కాలేదు. అంటే పూర్తి రతి జరగలేదు. కేవలం బాహ్య పరమైన వత్తిడి జరిగిందంతే. అయితే ఆ పాప బాగా బెదిరిపోయింది. ఆ కారణంగానే ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. బ్లీడింగ్ లేదు. టెన్షన్, భయం, బెదురు అన్నీ కలిసి ఆమెని కోమాలోకి దింపాయి. టెంపరేచర్ నార్మల్ కి రాకపోవటంతో ఆ అమ్మా యి తల్లి ఆ కోణంలోనే ఆలోచించింది. సాధారణ నర్సుగా కూతురికి ట్రీట్ మెంట్ ఇచ్చింది. నా దగ్గరికి తీసుకొచ్చేసరికే పరిస్థితి చేయి దాటి పోయింది."
   
    ధరణి ఆవేశంగా "మరిదంతా ఆ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేదు. డాక్టర్! ఇంత తెలిసీ ఆ ఘాతుకం చేసిన వారిమీద చర్య తీసుకోకపోవటం అన్యాయం కాదా?"
   
    "పోయిన పాప ఎలాగూ పోయింది. మిగిలిన వాళ్ళ బ్రతుకులు కూడా ఎందుకు నాశనం చేయాలా అని ఆలోచించాను! వాళ్ళు సామాన్యులు కాదు."
   
    "ఎవరు?"
   
    "ప్రియకి నేను ట్రీట్ మెంట్ ప్రారంభించగానే నా భర్తకి ఆక్సిడెంట్ చేసి, నేను ఈ వివరాలు బయట పెడితే ఫలితం ఇంతకన్నా ఘోరంగా వుంటుందని, బెదిరించిన వాళ్ళు."
   
    "మరి నా దగ్గిర ఎందుకు బయటపెట్టారు?" కామ్ గా అడిగింది ధరణి. ఆమె మెదడులో అస్పష్టమైన రూపానికి క్రమ క్రమంగా ఒక షేపు వచ్చి జరుగుతున్నదంతా అర్ధం కాసాగింది.
   
    "నేనిది నీకు చెప్పటానికి కారణం వుంది ధరణీ. 'మీ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు జాగ్రత్త....' అని చెప్తున్నాను-"
   
    "నా ఒక్కదాని పిల్లల సంగతి సరే. మిగతా వారి సంగతి?"
   
    "నేనేం చెయ్యగలను?"
   
    "చేసిన తప్పు సరిదిద్దుకుని, జరిగినదంతా వెల్లడించండి."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra