Home » Veeraji » Premaku Paggalu


    అత్యవసరమైనట్లు గబగబ ధనమ్మగారి గదిలోకి వెళ్ళింది.
    ధనమ్మగారు ఇనప్పెట్టె దీసి ఏదో దస్తావేజు కాగితాలు తీస్తున్నది. ఆమె వేళ్ళు కాగితాలను తిరగేస్తున్న తీరూ, తొందరా, ధోరణి చూస్తే ఆవిడ ఎంత మండి పడుతునందో ఇట్టే తెల్సుకో వచ్చును!
    "దొడ్డమ్మా!" మెల్లిగా పిలిచింది సురేఖ, ఐదారు గజాలు ఎడంగా నిలబడి.
    "ఏం?" ఆమె హుంకరించింది.
    "నేను.......నేనేమో......"
    "నువ్వు భాస్కరాన్ని పెళ్ళి చేసుకోలేవు అంతేగా"
    సురేఖ మాటాడలేదు.    
    "కాని నేను నీకు ఆ భాస్కరాన్ని ఇచ్చి పెళ్ళి చేస్తాను అన్న వాగ్ధానంమీదనే ఈ వసంత పెళ్ళి జరిపించాను తెలిసిందా?" ధనమ్మ్గగారు గర్జించింది.
    "నేను నేను......ఇంటికి వెళ్ళి అమ్మనీ, నాన్న ఒకసారి చూసి వస్తాను......" సురేఖ ఇక అక్కడ నిలబడలేదు. వెనుదిరిగి వెళ్ళిపోయింది.
    ధనమ్మగారికి కోపంతోనూ, ఆవేశంతోనూ రెండు క్షణాలు నోరు పెగల్లేదు. బుసలు కొట్టింది.
    "హు......ఇంటికి వెళ్తుందిట! ఇల్లు......ఇవాళ దీనికి అమ్మా, నాన్న......అవసరం వచ్చారేం" అనుకున్నది. "అదీ చూస్తాను-" అన్నది తిరిగి కాగితాలు కట్టగట్టి సొరుగులో విసిరేసి, తలుపు "భడా" లున వేసేసింది!
    సురేఖ వెళ్ళి మంచంమీద అలిగినట్లు పడుకుంది. దొడ్డమ్మకు కరుణ కలగకపోతుందాని ఆ పిల్ల నమ్మకం........
    కాని ధనమ్మ్గగారికి భాస్కరం మరొక అమ్మాయిని ప్రేమించడం-అది సురేఖ తెలిసి-స్వయంగా తనకు చెప్పడం-చాలా అవమానంగా తోచింది.
    "పిచ్చిపిల్ల! భాస్కరంమీద కోపంతో అలా అన్నదేమో" ననుకున్నది. కాని సురేఖ ధోరణి ముఖ్యంగా "ఇంటికి వెళ్ళి అమ్మనూ, నాన్ననూ చూస్తా ననడం" ఆమెకు పుండుమీద కారం జల్లినంత బాధగా ఉంది!
    "ఉహ్ఁ.......ఇవాళ ఈ భడవకి తల్లీ దండ్రీ కావల్సి వచ్చారన్నమాట!" అనుకున్నది పదే పదే.
    "ఇంతకీ ఆ కుర్రవాడు బుద్ధిగా ఒప్పుకున్నాడు కదా? దీని కెందుకూ అతగా డెవర్తెనొ ప్రేమించాడట! ప్రేమ" అని సురేఖకు వినిపించేలా విసుక్కుంది. కాని సురేఖ ఉలకలేదు. పలకలేదు. ఆమెకు ఇది మరీ కష్టమనిపించింది.
    "ఏమే? నీ కెవరు చెప్పారీ మాట!" అన్నది సురేఖ గది గుమ్మంలో కెళ్ళి.
    "నాకు తెలుసు" నన్నది సురేఖ.
    "మరి......నిన్ను చూసి వెళ్ళిన్నాడు అతగాడి నోరు పెగల్లేదేం?"
    బయటకు ఆమెకు వినిపించేలా ఏమీ అనలేదు. సురేఖ మనసులోమాత్రం "ఏమో.....అతన్నే అడుగు.....నాకేం తెల్సు?" అనుకుంది.
    ధనమ్మగారు దగ్గరిగా వచ్చింది. "చూడు సురేఖా! భాస్కరంలాంటి కుర్రవాన్ని నువ్వు అనుమానించి త్రుణీకరించడం భావ్యం కాదమ్మాయ్. హాయిగా చిలక గోరింకా అని ఈడూ జోడూగా ఉంటారనేకదా? నేను తాపత్రయం పడుతున్నది" అన్నది బుజ్జగింపుగా.
    సురేఖకు ఒంటిమీద చీమలు జెర్రులూ ప్రాకుతున్నట్లుంది. "కాదు దొడ్డమ్మా! ఆ అమ్మాయి పద్మావతిని నువ్వు చూశావు కూడా" నంది.
    ధనమ్మగారు ఎవర్ని అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసి-"ఎక్కడ చెప్మా!" అన్నది సురేఖ మాట లను నమ్మి.
    "ముకుందరావు పెళ్ళిలో......." సురేఖ మాటలను అక్షరాలను లెక్కిస్తున్నట్లు విని ఆమె ఆలోచించింది. "ఎవరూ? ఆఁఆఁ......పద్మ కుమారీ అంటూ నీతో వచ్చింది నంగనాచి ఆ వయ్యారేనా?" కోపంగా అడిగింది.
    సురేఖ ప్రక్కమీదనే లేచి కూచొని తల ఊపింది.
    "వాళ్ళవూరు?"
    సురేఖకు చెప్పాలో మానాలో తెలియలేదు. వూరుకుంది.
    "ఏమే! నీకు పిచ్చెత్తిందా? నువ్వా పింజారీని నిలా వెనుక వేసుకురాకు. నాకు చెప్పు.....నేను అదెవతైనాసరే ఇట్టే ఆ ప్రేమా గీమా వల్లకాట్లోకి పంపేస్తాను" ధనమ్మగారు సురేఖ తల పట్టుకుని ఎత్తి కళ్ళల్లోకి సూటిగా చూసింది.
    "అదికాదు దొడ్డమ్మా...."
    "ఏది కాదు.......దానికి డబ్బు అక్కరలేదు......ప్రేమ కావాలీ అంటావు అవునా?" ఆమె సురేఖ తలను విదిలించి మరీ వదిలింది. "డబ్బు విలువ నీ కెలా తెలుసే? గాబులో పుచ్చకాయలా పెరిగావూ" అంది.
    "పద్మావతీ నా లాంటిదే. నా స్నేహితురాలు..." సురేఖ తల మోకాళ్ళల్లో పెట్టేసుకుంది.
    "ఒహో! అయితే ఇదంతా తమరి నిర్వాకమే నన్నమాట!" ధనమ్మగారు ఉగ్ర రూపం ధరించింది. "పెళ్ళిళ్ళ పేరక్కవయ్యావా? ఛీ!" చీదరించింది.
    సురేఖను జుట్టు పట్టుకుని మెడ వెనక్కి వాల్చి నిలదీసింది.
    "చెప్పు! ఎందుకు చేశావిదంతా? నీ కోసం గాకపోతే నేను ఆ వసంత పెళ్ళిని ఈ కంఠంలో ప్రాణం ఉండగా అవనిచ్చేదాన్ని కాదు.......కాని నువ్వు......నువ్వు ఇదంతా ఎందుకు చేశావ్? ఆ భాస్కరం ఈ పద్మావతీ అందరు కూడబలుక్కున్నారా? హైం! ఎందుకు?" బాధతోను, దెబ్బతిన్న అహంకారంతోనూ సురేఖ ధనమ్మను విడిపించుకుంది.
    "ఔను! నాకు తెల్సు........నువ్వు ముకుందరావు కిచ్చి నా మెడను ఉరి బోస్తావేమోననే భయంతో నోరుమూసుకుని వూరుకున్నాను" అన్నది దుఃఖావేశాలతో గాద్గదికమైన కంఠస్వరంతో సురేఖ.
    ధనమ్మగారికి చెళ్ళు చెళ్ళున ఎవరో కొట్టినట్లైంది. "నేను నీకు ఉరిపోస్తానుటే?" అన్నది. గ్రుడ్ల వెంట నిప్పులు కక్కుతూ......అంతలోనే టు తిరిగి గోడనున్న పటంకేసి తిరిగి భర్త నుద్దేశించి, "చూశారా! కనుక్క్జున్న బిడ్డ కాకపోతే చివరికి ఎలాంటి మాటలంటుందో?" నన్నది. అంతలోనే ఆమెకూ కన్నీళ్ళు నిండుకొచ్చాయి. అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
    సురేఖకు "ఆ మాట నిజమ్కాహ్డు. దొడ్డమ్మా అంత మాట అనకు దొడ్డమ్మా" అని ఆక్రోశించింది హృదయం.
    ధనమ్మగారు కన్నీరొత్తుకుంది. ఎంతకాదనుకున్నా "ఆమెకు తాను గొడ్రాలైనందువల్లనే కదా?" ఈ రంపపు కొత్త అన్నబాద పోలేదు.
    "సరే! నా మాట కాదని నా పరువు తీసిన దీనికి, నా ఆస్తి పాస్తులు మాత్రం ఎందుకు? ఒక్క చిల్లిగవ్వ ఇవ్వను" అనుకుంది. కసిగా కాని ఆమెను అవమానాగ్ని దహిస్తూనే ఉంది.
    సురేఖకు ధనమ్మగారన్న మాటలు గుండె గాయం చేసినప్పటికీ, ఒకప్రక్క ఇన్నాళ్ళుగా పడుతున్న వేదన తీరిందన్న మానసికోపశమనం కలిగింది.
    "కాస్సేపు పోయి బ్రతిమాలితే సరి తానే ఒప్పుకుంటుంది" అనుకుంది. అమయాకంగా లేచి చడీ చప్పుడు కాకుండా, చన్నీళ్ళతో మొహం కడుక్కుని వచ్చింది.
    
                                                *    *    *

    ధనమ్మగారినా రాత్రి వంటవాడు పలకరించలేకపోయాడు. సురేఖ భజనం చేయనే లేదని ఆమెకు చెబుదామనుకుని వెళ్ళినవాడు తిరిగి వెనక్కి వచ్చేశాడు.
    ఆమెకు స్థిమితం ఎంతకూ చిక్కలేదు సురేఖను తన సర్వస్వమూ అనుకుని పెంచింది. ఆపిల్ల తన మాట వింటుందనుకుంది. తనకు నచ్చిన సమ్మంధం చేసుకుని, తను కనక పోయినా, కన్నకూతురివ్వగల సంతృప్తిని ఈ పిల్ల ద్వారా పొందుదామనుకుంది. కాని ఆ సురేఖ ఇవాళ ఏం చేసింది? ఎదురు తిరిగింది.
    "తన పరువు ప్రతిష్టలను నాశనం చెయ్యాలని కుట్ర పన్నింది"-
    భాస్కరాన్ని అవకాశమైతే పీకే నలిపేద్ధామని పించింది. నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలూ అనుకుందే తప్ప అవే ఇంత కుచ్సితంగా భాస్కరం ఉంటాడనుకోలేదు. అతగాడు వసంతకు ముకుందారావులాంటి మంచి సమ్మంధం చూసుకున్నాడు-తను ఒక ఇష్టమైన పడుచుదాన్ని ప్రేమించానన్నాడు. తననూ, సురేఖనూ, వెర్రి వెంగళమ్మలను చేశాడు అనుకుంది. భాస్కరం అతని మెరిసేకళ్ళు, చిరుహాసం వెలిసే పెదాలు, నొక్కులు జుత్తూ అన్నీ పెటుకుని ఎదురుగావచ్చి తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది.
    "సరే! ఈ ధనమ్మ సంగతి ఇంకా తెలీదు కాబోలు.....చూస్తాను ఆ పద్మకుమారిని ఇతగాడెట్లా కట్టుకుంటాడో?" ఆమె పట్టుదలతోను, కసిగాను పిడికిళ్ళు బిగించింది.

                                  47

    పద్మావతికి విశ్వ విద్యాలయ ఆవరణమంతా విచిత్రంగా తోచింది. సురేఖ క్లాసులకి రాలేదు. భాస్కరం అగుపించలేదు. సైన్సు కళాశాల వైపు చూస్తూ చూస్తూ కళ్ళు పీకిపోయాయి. రక రకాలుగా వెలితి, శంక, భయం పీడించసాగాయి. ఇంటికి పోదామనిపించింది. చదువుకోసం వస్తున్న వారందరి మధ్య తా నొక్కతే దాని విషయం పట్టించుకోకుండా కూచున్నానే అన్న బాధ కలిగింది.
    "అమ్మకి నే నిలా చదువు నీళ్ళు గార పెడుతున్నాన్ని తెలిస్తే ఎలా?" అనుకోగానే పద్మావతి గుండెలు దడదడ లాడాయి. పాఠాలే చెప్పారో...నోట్సులే చెప్పారో తెలియదు. క్లాసులన్నీ, రైల్లో కూచుని కిటికీలోనించి బయటికి చూడని వాడికి కుధువు తప్ప మరేం తెలియనట్లుగా అయిపోయాయి పద్మావతికి.
    తిన్నగా ఇంటికి వెళ్ళింది. జయమ్మ ఈమెకు కాఫీ ఇచ్చి "అమ్మాయీ! రాజు నీ విషయం చాలా శ్రద్ధ వహిస్తున్నాడు సుమా" అన్నది.
    "ఈ రాజు అన్నయ్యేకదూ వెనకటికి నిన్నూ, నన్నూ దిక్కుమాలిన వాళ్ళనిగా చేసి తీరుతానని శపథం చేశాడూ" పద్మావతి వెటకారం చేసింది.
    "వెనకటివి తవ్వుకుని వెక్కి వెక్కి ఏడవ కూడదు! కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందనీ, ఇలాంటివి మనం మరిచిపోవాలి!" అన్న దామె.
    "అదీగాక మనకి మగ దిక్కెవరున్నా రమ్మాయ్! నీకు ఒక చక్కని సమ్మంధం తేవాలీ అంటే సవితి అన్న దమ్ములే అయినా, ఆప్తులే అయినా వాళ్ళే కదా?"
    పద్మావతికి కోపం, దుఃఖమూ రెండూ వచ్చాయి. "అసలు ఇప్పుడు నీకు నేను అంత బరువైపోయానా? ఎందుకూ సమ్మంధాలు?"
    "ఇష్షు! ఏమిటా కేకలు! ఎవరేనా వింటే ఈడొచ్చిన పిల్లవు నవ్విపోగల్రు....." జమయ్య గారు గద్ధించింది. మళ్ళీ బాధగా అన్నది.
    "నాకు నువ్వుబరువా తల్లీ? ఏ చెట్టుకాయ ఆ చెట్టుకి బరువా? కాని ఆడపిల్లకి ఈడొచ్చాకా వివాహమూ, మగవాడికి వయస్సు రాంగానే ఉద్యోగమూ శోభ నిస్తాయమ్మా!" కూతురు తల నిమిరిందామె.
    "కాను నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని లేదమ్మా!" అటు మొహం తిప్పుకుంది పద్మావతి.
    "నేను బాగా ఆలోచించాను పద్మావతీ!" జయమ్మగారు కూతురి ఈ పెడసరమైన జవాబుకు కాస్త నొచ్చుకున్నట్లు చెప్పింది. "నీవు నన్ను పోషించి తీరాలీ అనే మాట అర్ధం లేనిది!.......నీ ఇల్లు వేరు.....నీ బ్రతుకువేరు....."అది" నేను మా అమ్మను, నాన్నగారిని ఏ మాత్రం పోషించాను......? ఆఖరికి ఆ ఇద్దరూ ఇవాళ స్వర్గాన ఉండి కూడా నన్ను కనికరించలేనంత నేరం చేశాను....అంచేత నువ్వైనా పెళ్ళి చేసుకుని ముచ్చటగా ఒక నాలుగు కాలాలపటు ఉంటే చూసి కనుమూస్తాను....." ఆమె నిట్టూర్చింది.
    "ఐతే ఈ ఎమ్మే చదువుకు స్వస్తి చెప్పాలనేగా మీ ఉద్దేశం?"
    జయమ్మగారు చాలాసేపు ఏమీ సమాధానం చెప్పలేదు. "సలక్షణమైన సమ్మంధాలు మనం కావాలనుకున్నప్పుడు వస్తాయా? అమ్మాయీ!" అన్నది.
    "వస్తాయి" అప్రయత్నంగా అన్నది పద్మావతి.
    "అసలు నువ్వు మీ అన్నయ్య చూపించిన ఆ సమ్మంధం చూడకుండానే ఎందుకు ఇలా విముఖత చూపుతున్నావో నాకే తెలీదు?....." ఆమె నిలదీసింది.
    "అది కాదమ్మా! నాకు 'ఎమ్మే' అవ్వాలనుంది."
    "చదివి?"
    "ఉద్యోగం చెయ్యాలనుంది"
    "చేసి?"
    పద్మావతి కొరకొరా చూసింది. మాటాడలేదు.
    "చేసి ఈ ముసిలి ప్రాణాన్ని పోషిస్తావు అంతేగా" జయమ్మగా రడిగింది.
    "ఉహూ.......మగవాళ్ళ అహమంతా వాళ్ళ పోషణకు, రక్షణకు ఆడవాళ్ళు ఉవ్వీళ్ళూరుతారు" అన్నదేగదా! దాన్ని అణగ కొట్టేస్తాను" ఆవేశంగా అని మళ్ళీ సిగ్గుతో తలదించుకుంది పద్మావతి.
    నవ్వింది జయమ్మగారు. "బాగానే ఉంది చదువు" అన్నది! అని మళ్ళీ "మగవాడి అహాన్ని ఎవరూ అణచలేరే పిచ్సితల్లీ-మగవాడు నవ మాసాలు మోసి బిడ్డలను కనడు........ఆడదాన్ని ప్రకృతి ఈ విధంగా అణగ ద్రొక్కేసింది. ప్రకృతికి లొంగిపోడం మనసు ఈ దేశంలో అలవాటై పోయింది!-"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra