Home » Gullapalli sundaramma » Athani Lakshyam

 

                                  16
    ఆ తరవాత వారం లో బంధు మిత్రుల సమక్షం లో శాస్త్ర పద్దతిని నిరాబడంరంగా రఘూ, సుధల వివాహం జరిగిపోయింది. పాపం ప్రయత్నంగా రాధ కూడా ఈ పెళ్ళికి వచ్చింది గాని అందరి లాగా పరిపూర్ణనందాన్ని మాత్రం అనుభవించ లేకపోతుండేది.
    రఘు విదేశ ప్రయాణాన్ని గురించిన ఇబ్బందయిన పనులన్నీ ఆ దొరే చూసుకున్నా ప్రయాణానికి ఒక్క వారం మాత్రమే వ్యవధానం వున్నందున , మైసూరు, బృందావనం మొదలైనవి మాత్రమే తిరిగి వచ్చేశారు . అదీ పార్వతమ్మ గారు ప్రార్ధన ప్రకారం లలితాంబగుళ్ళో , కుంకుమ పూజలూ వగైరాలన్నీ అయి ఆవిణ్ణి తృప్తి పరిచేకనే రఘు తన ప్రయాణం పెట్టుకున్నాడు.
    మైసూరు నుండి తిరిగొచ్చిన మూడో నాడే రఘు ప్రయాణం! వీలున్నంత వరకూ ఏవేవో తయారిస్తుంది జానకి. సుధ వాట్లని పొందిగ్గా, పట్టుకెళ్ళే అందుకు సరిపోయే తూకానికి మించకుండా కట్టి పెడుతుంటే తల్లితో మాట్లాడుతూ ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు రఘు.
    శ్రమకి వెనకాడకుండా జానకి చూపుతున్న ఆ శ్రద్ధ కి తనలో తనే ఆశ్చర్య పడుతూ గౌరవంగా ఆవిడ వేపే చూస్తున్నాడు రఘు. మొదట్నుంచీ కూడా జానకి యందోక గొప్ప గౌరవ భావమే రఘుకి. అంతేకాదు కలకల్లాడుతుండే ఆవిడ మొహం చూస్తున్నప్పుడల్లా 'ఈవిడ నుదుటి తిలకం దైవం చెరపలేదు. పొరపాట్న జరిగిందేమో,' అన్నట్లుగా ఒక భ్రమ కల్గుతుండేది అతనికి. ఎన్నిమార్లో ఇలా తోచినప్పుడల్లా ఆవిడకీ దుర్గతి పట్టినప్పటి సంభవాన్ని గురించి తల్లినీ, అత్తనీ ఏవేవో ప్రశ్నలు వేస్తుండేవాడు కూడా.
    ఒకసారి ఇక వుండబట్టక పార్వతమ్మ గారితో, 'అత్త కిటువంటి రాత పట్టుండదమ్మా, ఆ మొహం చూస్తె తెలియడం లేదూ' అని అనేశాడు కూడా రఘు.
    'అయ్యో అదే కళ్ళారా చూస్తె అంతకంటే ఇంకా ఏం రుజువు కావాలి బాబూ. కలకల్లాడే దాని మొహం చూస్తుంటే నాకూ అలాగే అనిపిస్తూ వుంటుంది. మనకి మాత్రం ఏమిటి బాబూ, దాన్ని చూసిన వాళ్ళంతా అలాగే బాధపడుతుంటారు. ఆ దైవానికి మరి ఇంత ఉత్తమురాలైన దీని మీది ఇంత నిర్దయ ఎందు కల్గిందో గాని . అందుకే ఒక్కొక్కసారి , దీని కింత బాధ తెచ్చి పెట్టాడంటే , ఇక దేవుళ్ళ లో ఏం సత్యం వుంది పోనిద్దూ , అనుకుంటాను. మళ్లీ అంతలో ఇదంతా పూర్వ జన్మ ప్రారబ్ధం , ఇప్పటిది కాదు, అని మళ్లీ నాలో నేనే సర్దుకుంటూ వుంటాను. ఇలాగే దాన్ని చూళ్ళేకా, మానలేకా, ఆనాట్నుంచీ ఇలాగే కాలం గడుపు కోస్తున్నాను బాబూ' అన్నారు చెంగు తో కళ్ళు వొత్తుకుంటూ ఆవిడ. రఘు కూడా కొంత సేపాలోచన్లో పడి తరవాత తన ముఖ్య స్నేహితుల్ని కల్సుకుందుకు బయటి కెళ్ళి పోయాడు.
    రాత్రి దీపాలు పెట్టాక ఇంటి కొచ్చిన రఘు 'ఇవిగో సుధా, మన ఫోటోలు' అంటూ గదిలో బట్టలు సర్దుతున్న సుధ వద్ద కొచ్చి ' ఎలా వచ్చాయి , నవదంపతులు ఉల్లాస ప్రయాణం లో తీసుకున్న ఫోటోలేలా వుండాలో అలాగే వున్నాయా?' అన్నాడు. తనూ రాధా కలిసి తీసుకున్న ఫోటోల్ని చూసి సుధ అనాడన్న అదే ధోరణి లో తనూను.
    'వో? అంతకన్నా గొప్పగానే వున్నాయి' అంది. కొంటేతనంగా అతన్తో పాటు తనూ ఆ ఫోటోల్ని చూస్తూ.
    'అన్నట్టు బావా?' అంటూ ఏదో చెప్పబోయిన సుధని --
    'ఆ, ఆ, అగు , ఇంకా బావా ఏమిటి ఇటుపైన నా పేరుతొ --'
    'వీల్లేదు నువ్వు నిర్ణయించిన పద్దతి ప్రకారం ఇంకో మూడేళ్ళ దాకా మునపటి బావగానే' అంది సిగ్గుతో కూడిన కొంత నవ్వుతో సుధ.
    'అబ్బో పిట్ట బాగానే కూత పట్టిందన్న మాట, ఆ సిగ్గంతా ఏమయిందో అమ్మాయి గారికి...' అంటూ సుధని దగ్గరికి తీసుకోబోయాడు రఘు.   
    'ఆ, ఆ పెద్ద ఉత్తరం లో లిఖించిన షరతులన్నీ గుర్తున్నాయా?' అని రఘు ఆరోజు తన నడిగిన ధోరణి తోనే అడుగుతూ తుర్రున పారిపోయింది సుధ. సుధలో వచ్చిన చలాకీ తనానికి మురిసిపోతూ తన ప్రయోజకత్వాన్ని తల్చుకుని మనసారా తృప్తి పడ్డాడు రఘు.
    అ మర్నాడు బంధు మిత్రులందరి సాగనంపుల్తో అమెరికా కి ప్రయాణం అయ్యాడు రఘు. శర్మా, పార్వతమ్మ గార్లూ, సుధా, సహాయార్ధం వేణూ , బొంబాయి వరకూ వెళ్లి రఘుని 'ప్లేన్' ఎక్కించి మ్రొక్కదల్చిన దేవుళ్ళ కి మ్రొక్కు కుంటూ వెనక్కోచ్చారు.
    బావ కిచ్చిన బాస కాపాడుకుందుగ్గాను ఎంతో శ్రద్దగా చదువు సాగిస్తుంది సుధ.
సుధ మాట నేర్పుకీ, బుద్ది కుశలతకీ చురుకు తనానికి కాలేజీ లో పరిచయం వున్న వారంతా ఆశ్చర్య పోతుండేవారు. మనుషులనీ, జంతు వులనీ శరీరాలు కోసి పాఠాన్ని జరిపిస్తున్నప్పుడు చలించ కుండా ధైర్యంగా నిలబడి అవన్నీ శ్రద్దగా అవగాహన జేసుకుంటుండే సుధ ధైర్యాన్ని నిబ్బరాన్ని చూసి, మొదట్నుంచీ ఇంత ఆసక్తి చూపే వార్ని మేమింతవరకూ చూడనేలేదన్నంతగా ఆశ్చర్య పోయే వారక్కడి ప్రొఫెసర్లు.

                
    అంతకంతకూ అతి శ్రద్దను చూపుతూ అందర్నీ మించి పోతున్న సుధని చూసి.
    'నీ గొప్పతనాన్నంతా ఎగదన్నేటంత గొప్ప డాక్టరు గా తయారవు తుందయ్యోయి నీ భార్య సుధ. ఎందుకన్నా మంచిది కాస్త ముందు జాగ్రత్తగా వుంటావని రాస్తున్నాం' అంటూ రఘుకు అతి ప్రాణ స్నేహితులైన కొందరు రఘు రాసే ఉత్తరాల్లో రాస్తుంటే,
    'మీ భార్య సుధాదేవి ఇంత అపార తెలివైనది, కార్య దీక్ష గలదీ అంటే ఆ ఘనమంతా నిజానికి నీకే చెందుతుంది రఘూ. ఏదో ఒక అవిటి పిల్లని గురించి మన భవిష్యత్తు నెందుకు లోకువ చేసుకోవాలీ, అని గానీ ఒకరికి ఉన్నతస్థానం లభించ జేసేందుకు గౌరవం పొందించెందుకు మన మధ్య మన మెందుకు శ్రమ పడేది, అని నువ్వు గనక అనుకునుంటే, సుధా దేవిలోని ఆ శక్తి తెలివి తేటలూ చురుకుతనం మొదలైన ఈ ఇప్పటి ఆవిడ కీర్తికి కారణంగా వున్న ఈ లక్షణాలన్నీ వృధా గా ఆవిడలోనే జీర్ణమై పోయుండేవి కదా! అలా కాకుండా నీ శ్రమని లక్ష్యం చెయ్యకుండా నువ్వు చూపిన ఈ శ్రద్దే ఆవిడ మహోన్నతస్థితికి కారణ మయింది. భేష్ రఘూ. నీ లక్ష్య సాధనకు మేమంతా మెచ్చుకోవడం తో పాటు గర్విస్తున్నాం' అంటూ అతన్ని అతని ఆదర్శాల్నీ వేనోళ్ళ పొగడుతూ రాసేవారు అతని ఆత్మ మిత్రులు మరి కొందరు.
    ఇక అక్కడ రఘు సంగతా? అసాధారణ మైన ఆ విచిత్రపు కేసు గురించి ఆ డాక్టరు తో పని చేస్తున్న ఆ వుత్సహానికి తోడు ఇటు సుధ ప్రయోజకత్వాన్ని గురించి ప్రసంగిస్తూ తన స్నేహితులు వ్రాస్తున్న ఉత్తరాలు చేరి అతన్ని బ్రహ్మానందం లో ముంచేస్తున్నాయి.
    ఆ ఆనందాన్ని సుదకి విపులంగా రాయాలని అనుకుంటూనే, ఎప్పటి కప్పుడు అందు కవకాశం చిక్కడం లేదతనికి. అందుకని ప్రారంభించిన ఉత్తరం లో తన మనసులోని ఉత్సాహం కొద్దీ తను వైద్యం పరిశోధనలు చేస్తున్న ఆ వ్యక్తీ గురించీ అతని చరిత్ర ని గురించీ తమ పరిశోధన్లతని ముందు ఎంతవరకూ పని చేస్తున్నాయో , మొదలైన విషయాల్తో నే ఉత్తరమంతా నింపేసి, ఆ సంగతి తరవాత గుర్తించుకుని బాధపడుతూ మళ్లీ ఉత్తరం లోనైనా రాయాలని అనుకునేవాడు. ఇలాగే వరసగా జరిగి పోతుంది అతని ప్రయత్నం.
    ఏదెలా వున్నా , మొత్తానికి అందరి మనసులకీ స్థిమితం ఒక విధమైన ప్రశాంతీ కుదరడం వల్ల కాలం అతి త్వరగా దొర్లుకు పోతూ సుధ చదువు పూర్తీ కావచ్చింది.
    రఘు కి మళ్లీ ఒకసారి ఇంటికి వెళ్లాలన్న ధ్యాస ఏడాది నుంచీ కల్గుతూన్నా తను వైద్యం చేస్తున్న ఆ వ్యక్తీ కి ప్రజ్ఞ కల్గే అవకాశాలు ఎప్పటి కప్పుడు కనుపిస్తున్నట్టని పిస్తున్నందున ఆ చివరి ఫలితాన్ని కూడా తను దగ్గరుండి చూసి వెళితే ఇక త్వరలో మళ్ళీ రావాల్సున్న పనుండదనుకుంటూన్నందున అలాగే వారాలూ, నెలలూ గడిచి మరో సంవత్సరం కూడా పూర్తయి పోయింది.
    ఇక్కడ సుధకీ చదువుతో చాలావరకూ కాలక్షేపం అయిపోతున్నా మధ్య మధ్య లో బావ జ్ఞాపకం కూడా తరుచూ వస్తూనే వుండేది. అదీగాక ఎప్పుడూ వదిలి పెట్టుండడం అలవాట్లేనందున రఘు నొదిలి ఇన్నాళ్ళు ఇలా వుండడం సుధ కెంతో కష్టంగా వుంటుంది. అప్పుడప్పుడూ విడిగా ఒక్కర్తే కూర్చుని బావతో తను గడిపిన ఆ రోజుల్నీ గుర్తుకు తెచ్చుకుని అల్పానందంతో తృప్తి పడుతూ వుండేది. ఒక్కొక్కసారి మరీ బెంగ నిపించినప్పుడు ఏవిటో ఈ బావ లక్ష్యాలూ ప్రయత్నాలూనూ, దేనికైనా వో పరిమితంటూ ఉండొద్దూ?' అని చిరాకు పడేది. మళ్లీ అంతలోనే ఇదేం తెలివి తక్కువ తనం మరి బావ కంత దీక్ష తలపెట్టిన పనిలో వుండబట్టేగా తన జీవితం ఈ విధంగా రాణించగల్గుత. అయినా  బావ ముందే పెట్టేసి వెళ్ళిన గడువూ ఈ సంవత్సరమంతా ఇంకా వుందిగా అదీ గాక. తన స్వప్రయత్నాల్ని గురించి ఏ విధమైన అడ్డంకు లు, ఎప్పుడూ కల్గించకూడదన్నది బావ రాసిన నిబంధనల్లో అదీ ఒకటిగా. గడుసు బావ ఇందుకే గావల్ను అన్నింట్ల కీ ముందే ఒప్పందాలు చేయించాడు.
    రెండో నిబంధన గురించి గుర్తుకు రాగానే సుధ మొహం ఎర్రబడి పోయి, ఆ కొత్తల్లో జరిగిన ఒక సంఘటన గుర్తు కొచ్చింది.
    'హనీమూన్' కి వెళ్ళొచ్చినప్పట్నుంచీ ఒంట్లో కొంచెం నిస్త్రాణగా వుంటున్న తనకి ఒకరోజు వికారంగా ఉండి కొద్దిగా వాంతు లారంభించేయి.
    'అబ్బబ్బ ఆరోజు మొదలుకుని శాంతక్కయ్య చేసిన అల్లరి, హడావిడి ఇంతా అంతానా?
    ఇక ఆ అక్కయ్య మాటల్ని నమ్మి, 'ఏం తినాలనుంది! అంటే-- ఏం కావాలనుందీ' అంటూ అత్తయ్య అమ్మా, ఆనందంతో ఒకటే గెంతులు. 'హు వోసి పిచ్చి అమ్మల్లారా! బావా నేనూ చేసుకున్న వప్పందం మీకేం తెల్సున'ని నవ్వుకుంది తను. దైవవశాత్తూ మొగవాళ్ళ వరకూ ఈ విషయం పాకకుండా అంతా భ్రమన్నది వీళ్ళకే అర్ధమై పోయింది గనక సరిపోయింది' ఇలా అప్పుడప్పుడూ గతాన్ని నెమరు కి తెచ్చుకుని నవ్వుకుంటూ వుండేది సుధ.'
    'అబ్బ ఎంత సేపని అలా ధ్యానిస్తావే చెల్లెమ్మా, నాకు కవిత్వమన్నా ఒచ్చేడవదు కదా? నీ మీద నాలుగు పద్యాలన్నా అల్లుదామంటే' అంది వీణ ముందర కూర్చుని పరాగ్గా ఏదో ఆలోచిస్తున్న సుధ భుజాలు పట్టి ఊగిస్తూ , శాంత    'అబ్బ హడలి పోయానక్కా' అంది ఉలిక్కి పడ్డ సుధ.
    'అయితే నిన్నని ఏం ప్రయోజనం లే. మా మరిదికి కొంచెం కూడా మంచి చెడ్డలు తెలియక పోయాక' దొంగ కోపం నటిస్తూ సుధ పక్కని కూర్చుంది శాంత.
    'తనకి తెలియన్దీ నువ్వు తెల్సుకున్నదీ అంటూ ఏం వుందక్కయ్యా నువ్వు మరీనీ' అంది సుధ.
    'ఆ చాల్లెద్దూ, నీ వెనకేసుకు రావడం నువ్వునూ. ఇటువంటి వాడు ముందే పెళ్ళి చేసు కెళ్ళడం మాత్రం ఎందుకూ? అని'
    'ఎందుకా తన జోలికి మరెవ్వరూ రాకుండా ఈతీ గెల బురఖా అడ్డుపడ్డానికి...'
    'ఆ ఈ కబుర్ల కేం లే కానీ, ఇలా ఏళ్ళ తరబడి అతనక్కడా, నువ్విక్కడా వుండడం అన్నది నీకు కష్టంగా లేదూ?'
    'అబ్బే, అందుకేగా ముందు జాగ్రత్తగా బావ నన్నీ చదువులో ఇరికిస్తా' అంది నవ్వుతూ సుధ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra