Home » Avasarala ramakrishna rao » Sampengalu Sannajaajulu

 

                                    17

    మీరు చాలా తొందర పడుతున్నారని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను తొందరపడి ఉంటె క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏ ఆడదీ కూడా పుట్టింటి వారిని దూషించడం సహించలేదు. అందులో అన్నివిధాలా యోగ్యుడై ఆపదలో అనారోగ్యంతో తీసుకుంటున్న అన్నయ్యనంటే భరించలేదు. అనవసరమైన, అనుచితమైన సంభాషణలు కొన్ని చేసి ఉంటె మరోసారి వేడుకుంటున్నాను, నన్ను మన్నించండి. నాకు వాడేదైనా చేసి ఉంటె అది మహోపకారమే గాని మరోటి కాదు. డబ్బు గాని, చాకిరీ గాని నా నుంచి వాడు ఎప్పుడు ఆశించి యాచించీ ఎరగడు. ఎవరి చేత ఎటువంటి ఉపకారం పొందవలసి వస్తుందో అన్న తపనతో శరీరారోగ్యాన్ని కూడా దాచి పెడుతున్న త్యాగమూర్తి వాడు. అహంకార మన్నది నాకు ఉంటె వాడు దాన్ని మొదట్లోకి తుంచేస్తాడు గాని నిలువెత్తున విజ్రుంభించనీయడు. ఇక నా చదువు నాకు ఇచ్చినదేమో చెప్పగలిగే స్థితిలో లేను. మీ దగ్గర తలదాచుకోవాలని, మీ సేవలో మైమరచి పోవాలనీ, నాలో ఉండే నిత్య నూతనమైన అభిలాషకూ, నా చదువుకూ ఏమాత్రమూ సంబంధం లేదు. నేనింతగా మారిపోయాననీ మీరు వూహించడానికి మీకే పరిస్థితులు దోహదం చేశాయో తెలుసుకోవలసిన ఆవసరం నాకు మరీ మరీ ఉంది. ఇంతగా దుష్పాలితాలూ, దురభిప్రాయాలు కలుగుతాయని తెలిస్తే నా సర్వస్వమైన మీ కంటే నా చదువు ముఖ్యమని పరిగెత్తే దాన్ని కాను. ఒకవేళ వెళ్ళినా కామేశ్వరి వదినని ఇక్కడుంచి వెళ్ళేడమంత తెలివి తక్కువ పని చేసి ఉండేదాన్ని కాను. భార్య భర్తల మధ్య ఇంతగా అభిప్రాయ భేదాలు తెస్తే అవతలి వాళ్ళ కేం కలసి వస్తుందో నాకు తెలీదు.'
    'మధ్య దాన్ని అనుకోడం దేనికి? నా వాళ్ళు అన్నది ఎవరైనా ఉంటె అదోకర్తే ఉందనా?'
    అయన ఇంకా అలా మాటాడుతున్నప్పుడు ఇంక ఆ కామేశ్వరి విషయం అక్కడికి అపుజేయ్యడమే ఔచిత్యమని నా కనిపించింది.
    పది నిముషాలు నిశ్శబ్దంగా భయంగా గడిచాయి. ఇకనైనా రాజీకి దిగడం నాకు మంచిదనిపించింది.
    'ఇన్నాళ్ళు నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినా మీ బుద్ది చలించలేదు. ఇంతసేపు మనం తీవ్రంగా వాదించుకున్నా మీరు చెయ్యి చేసుకోలేదు!
    'అవును, అవే నా బలహీనతలు. అవి ఆసరాగా తీసుకునేగా నువ్వు నా మీద ఆధిపత్యం వహిస్తున్నదీ!'
    మళ్ళీ దెప్పు. మళ్ళీ నాదే తప్పు. మళ్ళీ ఎత్తి పొడుపు. చెప్పినవన్నీ ఒక్కమాటతో దిగదిడుపు! అయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను.
    సూటిగా కళ్ళల్లోకి చూశాను. స్పష్టంగా చెప్పెను.
    'చూడండి , ఎందుకు మీరీ రోజు ఇలా మాట్లాడుతున్నారు? నేనే విపత్కర పరిస్థితుల్లో నగను అమ్మవలసి వచ్చిందో వినరా? అలా అమ్మమని మా అన్నయ్య నన్నడగలేదనీ , ఒకవేళ ఎరుగి ఉంటె దానికి ఎంతమాత్రమూ అంగీకరించి ఉండేవాడు కాదనీ మీరు ఎంత చెప్పినా గ్రహించరా? మీతో చెప్పకుండా అమ్మినందుకు నేనెంతో విచారించాననీ, విచారిస్తున్నానని పదేపదే చెప్పినా వినరా?' అయన మాట్లాడలేదు. ఒక్కొక్కప్పుడు మౌనమే చెప్పలేని ధైర్యమూ, ప్రోత్సాహమూ ఇస్తుంది. నేనిక ఆగలేదు.
    'ముందు జరిగింది వినండి. స్టేషనుకు వచ్చి నన్నింటికి తీసు కెళ్ళింది , అన్నయ్య ఇష్టానికి వ్యతిరేకంగా వాడి రోగాన్ని గురించి నాకు పూస గుచ్చినట్టు చెప్పినదీ వదినే. వాడితో దెబ్బలాడి నేను చేయించగలిగింది ఏమైనా ఉంటె అది డాక్టరు కి చూపించడం. వాడి దేహస్థితి గురించి డాక్టరు సంతృప్తి కనపర్చక పోగా ఆ రోగం తగ్గుదల ముఖ్యంగా మానసికారోగ్యం మీద ఆధారపడి ఉంటుందన్నాడు. ఆ పక్కింటి నిర్మల వల్ల వాళ్ళు బాధపడ్డానికి మఖ్య కారణమైన ఆర్ధిక ఇబ్బంది గురించి ముఖ్యంగా వెయ్యి రూపాయల అప్పు గురించి తెలిసింది. ఆఖరికి వదిన అయినా నాకీ విషయం తెలియజేయలేదు. ఆ పరిస్థితుల ఒత్తిడిలో నేను కొంచెం తొందర పడిన మాట వాస్తవమే. కాని ఆ పరిస్థితుల నుంచి మరొక రకం విముక్తి లేదు. చెబితే వద్దని దెబ్బలాడుతాడని మధురిమకు గౌన్లు కొంటానని వంక పెట్టి ఆ అమ్మాయి సహాయంతో అప్పటికప్పుడు నగ అమ్మి రుణం తీర్చాను. నేనే కాదు, ఆ పరిస్థితుల్లో మీరున్నా అలాగే చేద్దురని నా నమ్మకం. ఏం, మాటాడరు?'
    అయన అయిష్టంగా అటు తిరిగిపోయారు. నేనెంత ప్రయత్నించినా వారిని ఈ విషయంలో సమాధాన పరచలేనని మొదటిసారి తెలిసినప్పుడు నా మనసు చివుక్కు మంది. ఒక మంచి పని చేసి వోటమి అంగీకరించడానికి నా మనస్సు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. పైగా ఆయన్ని అయన సమర్ధించుకొడం నాకు చెప్పలేని చిరాకు కలిగించింది.
    'నువ్వు చేసిన పని సరైనదికాదని నువ్వే ఒప్పుకుంటున్నానని నేను నిరూపించగలను కూడా. లేకపోతె రాగానే ఆ విషయం చెప్పక ఇన్నాళ్ళు తప్పు చేసిన దానిలాగా దాపరికం దేనికి? నేనేదో విషయం చెప్పపోతే దీన్ని జోడించడం దేనికి? తొందరపడ్డాననీ , పొరపాటు చేశాననీ మన్నించమనీ, క్షమించమనీ అనేక విధాలుగా వేడుకోడం దేనికీ?'
    నా నోట మాట రాలేదు. నా మౌనాన్ని అయన చాతకానితనంగా తీసుకున్నారు.
    'అంతులేని నమ్మకమూ అనంతమైన విశ్వాసమూ నీమీద ఉంచడమే తప్పు. నీది నాదనుకుని నెక్లేసు ఉపయోగించుకోడమే తప్పు. సంవత్సరాల తరబడి భర్త సంపాదన పై ఆధారపడి బ్రతికి, అవసరం వచ్చినప్పుడు ఖర్మం చాలక నగమ్ముకుంటే తన డబ్బుని భర్త వాడుకున్నాడని బతుకున్నన్నాళ్ళూ జ్ఞాపకం చేసే భార్యల జాబితాలో నిన్ను వెయ్యకపోవడమే తప్పు. నీ చంద్రహారాలు నువ్వు అమ్ముకున్నప్పుడు అదేమని అడగడం అంత కంటే తప్పు. అధ మాధమని శాస్త్రాలు హాషించిన స్త్రీ విత్తాన్ని ఆశించడం అంతకంటే పెద్ద తప్పు.'
    అయన అక్కడ్నుంచి లేచి నేనుండమంటున్నా వినకుండా పెద్ద పెద్ద అంగ లేసుకుంటూ వీధి గదిలోకి వెళ్ళిపోయి తలుపెసుకున్నారు. ఎన్నిసార్లు   కొట్టినా తలుపు తియ్యలేదు. నేనక్కడ మ్రాన్పడి  కూలబడి పోయాను. దాసీది పిలిచి పిలిచి వెళ్ళిపోవడం గాని, పాలవాడు విసుగెత్తి సరళ గారింట్లో ఇచ్చి వెళ్ళిపోవడం గాని నే నెరగను. 'ఇదేమి టమ్మ ఇక్కడున్నావ్?' అని మధురిమ రాగాలేట్టే దాకా నేను లేచి ఇవతలకు రాలేదు. జరిగినది కలో నిజమో దాని సారాంశ మేమిటో నాకు బోధపడలేదు. నాకు బోధ పడిందల్లా ఒక్కటే. నేను ఆశించింది అయన నుంచి నాకు లభించలేదు. నేను ఆయన్ని అన్నా వారు నన్ను అన్నా అన్నయ్య ఎలా ఉన్నాడో అని అనుక్షణం కొట్టుకుంటున్న నా హృదయం మరింత బరువయింది గాని తేలికపడదు.

                                                 *    *    *    *
    'అమ్మా అమ్మా ఇవాళ మనింటికి మరొకరు భోజనానికి వస్తారుట' అని మధురిమ నాతొ చెప్పి తుర్రున పారిపోయింది. అప్పుడప్పుడు అయన ఫ్రండ్స్ భోజనానికి రావడం నాకేం కొత్త కాదు. ఇలా మధురిమ చేత చెప్పించడమే కొత్త. ఒళ్ళు తెలియని జ్వరంతో బాధపడుతున్నవారికి తల నొప్పి ఎంతటిది! కానియ్యి , ఇదేంతవరకో చూద్దాం అన్న మొండితనమే నాకిక మిగిలింది.
    భోజనానికి వచ్చేవాడు అయన ఆఫీసులో కొత్తగా ట్రాన్స్ఫరై వచ్చిన గుమస్తా అని తెలిసింది. అతన్ని చూడగానే మటుకు నా మతిపోయింది. అతడు హరి గోపాల్!
    ముందుటేడు దసరాలకు అన్నయ్య దగ్గిరకు వెళ్ళి మధురిమను తీసుకుని నేనోక్కర్తినీ రైల్లో తిరిగి వస్తున్నప్పటి మాట. దారిలో ఒక స్టేషను లో ఒకాయన ముగ్గురు పిల్లలతో ఎక్కేరు. ఎక్కిందగ్గిరనుంచీ ఆయన్నేక్కడో చూసినట్లనిపించింది. ఎంత ఆలోచించినా ఎవరో మాత్రం గుర్తుకు రాలేదు. బాగా చూసినట్టుంది మొహం. అతను మాత్రం వెంటనే నన్ను చూడలేదు. చిక్కుల్లోనూ, చికాకుల్లోనూ ఉన్నట్లు చిటపటలాడుతూ ఉన్నాడు. దానికి తోడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. విపరీతమైన అల్లరి. సముదాయించలేక సతమత మవుతున్నాడు. అ పాపను చూసి బుద్ది తెచ్చుకోండి వెధవల్లారా ఎంత  ముద్దుగా ముచ్చటగా కూచుందో! అంటుంటే ఆ కంఠస్వరం విని అతడెవరో పోల్చుకుని కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది నా మనస్సు.

 

                        
    నా కప్పుడు పదిహేడేళ్ళు ఉండేదేమో. హరి గోపాల్ అని మా ఇంటి కెదురుగా మేడమీద ఉండి చదువుకునేవాడు. అతడికప్పుడు ఏ ఇరవై యో ఉండేవనుకుంటాను. బియ్యే చదువుతూ దండయాత్ర చేస్తూ ఉండేవాడు.
    వాళ్ళింటి డాబా మీదకి మా పెరడు కనిపించేది. మా పెరట్లో పెద్ద మల్లె పందిరి ఉండేది. చిన్న నిచ్చెన వేసుకుని, గంటల తరబడి , ఒక్క మొగ్గ అయినా వదలకుండా అన్ని మొగ్గల్నీ కొయ్యడం నా కెంతో సరదాగా ఉండేది. ఒక్కొక్క మొగ్గ అందక బాగా వంగవలసి వచ్చేది. అయినా మొగ్గ వదలడానికి నా ప్రాణం మొగ్గేది కాదు. 'పూల మొగ్గ కోయ్యబాయి వాలు మొగ్గ వెయ్యకోయి' అని వదిన పాడుతూ ఏడిపిస్తూ ఉండేది. ఖర్మం జాలక పందిరేక్కుతే ఆ నిచ్చెన తీసి దాచేసేది. నాకేం భయం అని చెంగున గంతేసేదాన్ని ' వోసి , ఎంతకైనా తగుదువుగదే' అనేవాడు అన్నయ్య.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra