Home » Mainanpati bhaskar » Yama Dootha

 

    "అయితే ఓ పన్జెయ్! వెళ్ళి కాసిని నీళ్ళు తెచ్చి రెడీగా వుంచు. దీన్ని కాల్చేసి తర్వాత కడుక్కుంటా" అన్నాడు దినకర్. అంటూనే రివాల్వర్ బారెల్ ఆ రౌడీగాడి నోట్లో పెట్టాడు.
    
    తేలకళ్ళు వేసి ఇదంతా వింటున్న ఆ రౌడీగాడికి తక్షణం స్పృహ తప్పింది.
    
    వాడిని వదిలేశాడు దినకర్. వాడు బియ్యం బస్తాలా కిందపడ్డాడు.
    
    వాడిని మళ్ళీ కాలర్ పట్టుకుని పైకి లేవదీశాడు దినకర్.
    
    "ఇప్పుడు చెప్పు! ఎవరు నువ్వు? ఎవరు పంపారు నిన్ను?" అన్నాడు.
    
    గొరిల్లాగాడు ఏదో చెప్పబోయేంతలో వెనకనుంచి నవ్వు వినబడింది.
    
    గిరుక్కున వెనక్కు తిరిగాడు దినకర్.
    
    అక్కడ వైశాలి నిలబడి వుంది.
    
    అంత చీకట్లో కూడా ఆమె మొహంలో అతనిపట్ల ఆరాధన కనబడుతోంది.
    
    "హీరోలంటే సిన్మాల్లో తప్ప రియల్ లైఫ్ లో ఉండరనుకునేవాళ్ళు నిన్ను చూస్తే అభిప్రాయం మార్చుకోవలసిందే!" అంది మెచ్చుకోలుగా.
    
    ఆమె కాంప్లిమెంట్సుకి థాంక్స్ చెబుతున్నట్లు తల పంకించాడు దినకర్.
    
    తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఏదో బయటికి తీసింది వైశాలి. కళ్ళు చిట్లించి చూశాడు దినకర్.
    
    అవి సంకెళ్ళు.
    
    "ఇవి వాడికెయ్! ఎక్కడికీ పారిపోడు" అంది.
    
    గొరిల్లాగాడికి సంకెళ్ళు వేశాడు దినకర్.
    
    తర్వాత అంది వైశాలి "వీడిని కొట్టడం కుక్కని కొట్టడం ఒకేరకం అనుకో కానీ నీకు అంతకంటే పెద్ద ప్రమాదం వుంది కదా?"
    
    "ఏమిటది?"
    
    "కోర్టు కేసు ఆ విషయంలోనే పోలీసులు వెదుకుతున్నారు నీ కోసం."
    
    ఔనన్నట్లు తలూపాడు దినకర్.
    
    చిరునవ్వుతో అంది వైశాలి. "ఆ హత్యకేసులో నీ గురించిన నిజాలు నాకు తెలుసు. నిన్ను ఆ కేసులోంచి బయట పడెయ్యగలిగేది ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరనుకుంటాను."
    
    నెమ్మదిగా అన్నాడు దినకర్.
    
    "నేనంటే నీకెందుకింత శ్రద్ద?"
    
    "ఆ రోజు ట్రెయిన్ లో నకిలీ పోలీసుల బారినుంచి నన్ను, నా వజ్రాలనీ నువ్వు రక్షించలేదూ! అందుకే.....ఉపకారికి ఉపకారం చెయ్యడం, అపకారికి అపకారం చేయడం....నా పాలసీ అదీ కాక....నువ్వు చాలా సమర్దుడివి కదా! ఇవాళ నేను నీకు సాయం చేస్తే రేపు మళ్ళీ నువ్వు నాకు ఇంకో పెద్ద విషయంలో సాయం చేయవచ్చు అన్న స్వార్ధం లేకపోలేదేమో!" అంది వైశాలి.
    
    "థాంక్స్!"
    
    తర్వాత ఓ సారి వామనరావు వైపు అనుమానంగా చూసి దినకర్ ని పక్కకి తీసుకెళ్ళింది వైశాలి.
    
    హత్య కేసు గురించి ఆమె చెబుతున్న విషయాలు వింటుంటే అద్భుత కథ ఏదో వింటున్న భ్రాంతి కలిగింది దినకర్ కి.
    
                                                                * * *
    
    శివరాం మీద కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకుని, శివరాం శవాన్ని హాస్పిటల్ కి తరలించిన తర్వాత, అటునుంచి అటే తన పై అధికారి ఇంటికి వెళ్ళాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    ఆ అధికారి ఇల్లు బంజారా హిల్స్ లో వుంది. ఇంట్లోకి అడుగుపెట్టీ పెట్టగానే ఒక విషయం అబ్జర్వ్ చేశాడు జలీల్.
    
    ఆ ఇంట్లో మెట్ల దగ్గర మొదలుకుని ఫ్లోరింగ్ అంతా పాలరాయే!
    
    అది కూడా, చదరపు అడుగు ఇరవై ముఫ్ఫయి రూపాయల లోపల దొరికే పాలరాయి కాదు. పాలు గడ్డకట్టినట్లు అతి తెల్లగా, అతి చల్లగా ఉన్న అతి ఖరీదయిన పాలరాయి అది!
    
    మనసులోనే అంచనా వేసుకున్నాడు జలీల్. మామూలు ఇల్లు కట్టాలంటే అన్ని రకాల ఖర్చులు కలుపుకుని చదరపు అడుగుకి రెండొందల రూపాయల చొప్పున ఖర్చు కావచ్చు. మంచి కన్ స్ట్రక్షన్ అయితే చదరపు అడుగుకి మూడొందల రూపాయలదాకా ఖర్చు కావచ్చు.
    
    కానీ, ఈ ఇంటి ఫ్లోరింగ్ చెయ్యడానికే చదరపు అడుగుకి మూడొందలు దాటి వుంటుంది. ఈ లెక్కన ఇల్లు మొత్తం కట్టాలంటే ఎంత ఖర్చయి వుండాలి?
    
    బంజారా హిల్స్ లో ఇల్లు! పాలరాతి ఫ్లోరింగు! బర్మా టేకుతో చేసిన తలుపులూ, ద్వారబంధాలు! అత్యంత ఆధునాతనమయిన ఎలక్ట్రికల్ ఫిట్టింగ్సూ, ఇంట్లో అడుగడుక్కీ ఫోన్ లు...
    
    ఎలా వస్తుంది అంత డబ్బు? ఒక ప్రభుత్వోద్యోగికి? విపరీతంగా లంచాలు పట్టక పోతే?
    
    ప్రాణం ఉసూరుమనిపించింది జలీల్ కి. "దేశంలో దొంగలు పడ్డారు" అన్న సినిమా టైటిలు అప్రయత్నంగా గుర్తు వచ్చింది.
    
    పది నిముషాల తర్వాత బయటికి వచ్చాడు జలీల్ వాళ్ళ బాస్.
    
    "ఏమిటి?" అన్నాడు ఆయన. ఇన్ స్పెక్టర్ జలీల్ వైపు అప్రసన్నంగా చూస్తూ. జలీల్ ఎప్పుడొచ్చినా ఏదో ఒక కొరకరాని కొయ్యలాంటి సమస్యని తెచ్చి నెత్తిమీద పడేస్తాడని ఆయనకి తెలుసు.
    
    గొంతు సవరించుకుని చెప్పడం మొదలు పెట్టాడు ఇన్ స్పెక్టరు జలీల్. "సర్! మెకానిక్ అని ఒకతను వున్నాడు."
    
    "అయితే"
    
    "అతను ఇవాళ నా పోలీస్ స్టేషన్ లిమిట్సులో ఒక రౌడీ షీటర్ ని కారు యాక్సిడెంట్ చేసి చంపేశాడు. అది యాక్సిడెంట్ కాదు. హత్య అని నానమ్మకం! తనకి బదులుగా లొంగిపొమ్మని శివరాం అనే ఒకతన్ని పంపాడు మెకానిక్. నయానో భయానో శివరాం చేత నిజం కక్కించాలని ప్రయత్నించాను నేను. అప్పుడు మన పోలీస్ స్టేషన్ లో మన కానిస్టేబులే శివరాంని కాల్చిపారేసి, యాక్సిడెంటల్ గా బులెట్ రిలీజయిందని స్టేట్ మెంట్ ఇచ్చాడు."
    
    "దటీజ్ ఓల్డ్ హాట్! ఇదంతా ఇంతకుముందే ఫోన్లో చెప్పావుగా!" అన్నాడా బాస్ విసుగ్గా.
    
    "కానీ మళ్ళీ ఓసారి మీతో పర్సనల్ గా మాట్లాడి పరిస్థితి అంతా వివరిద్దామని వచ్చాను."
    
    "ఎందుకు?"
    
    "నేను మెకానిక్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిటినీ రెయిడ్ చెయ్యదలచుకున్నాను సర్!" అన్నాడు జలీల్ స్థిరంగా.
    
    ఆ పోలీస్ అధికారి జలీల్ వైపు ఎగాదిగా చూసి, తర్వాత నిదానంగా అడిగాడు.
    
    "ఎందుకు?"
    
    "మెకానిక్ అంటే ఒకప్పుడు హైర్ డ్ కిల్లర్. హిట్ మాన్. తర్వాత తర్వాత అతను గ్యాంగ్ లాండ్ బాస్ అయ్యాడు. ఇప్పుడతను రోజురోజుకీ బలం పుంజుకుంటున్న సంఘ వ్యతిరేక శక్తి.
    
    సర్! సరైన టైంలో అదుపులో పెట్టకపోవడంవల్ల హాజీమస్తాన్ ఎంత పవర్ ఫుల్ అయ్యాడో మనకి తెలుసు. వరదరాజు మొదలియార్ బాంబేని తన సొంత రాజ్యంలా ఎలా ఏలాడో మనకి తెలుసు. ప్రస్తుతం గల్ఫ్ కంట్రీస్ లో తల దాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంకి బాంబే పోలీసుల మీదా, రాజకీయనాయకుల మీదా కూడా ఎంత గ్రిప్ ఉందో మనకి తెలుసు.
    
    మనం చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చుంటే, అతి త్వరలోనే మెకానిక్ కూడా మస్తాన్, మొదలియార్, ఇబ్రహీంల లెవెల్ కి చేరుకునే సూచనలు చాలా వున్నాయి.
    
    "సో?"
    
    "మెకానిక్ తో ముఖాముఖి తలపడే అవకాశం ఇన్నాళ్ళ నుంచి నాకు దొరకలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది. వదలదలుచుకోలేదు నేను."
    
    "ఆర్ యూ మాడ్?" అన్నాడు పోలీసు అధికారి, జలీల్ వైపు అపనమ్మకంగా చూస్తూ.
    
    "నో సర్! ఐయామ్ పర్ ఫెక్ట్ లీ సేన్!"
    
    తల అడ్డంగా ఊపాడు పోలీసు అధికారి.
    
    "నీ ఫూలిష్ అడ్వెంచర్స్ కి నేను పర్మిషన్ ఇవ్వను."
    
    ఆయన మాటలు విని కాసేపు మౌనంగా వుండిపోయాడు ఇన్ స్పెక్టర్ జలీల్. తర్వాత నెమ్మదిగా అన్నాడు.
    
    "నా చేతుల్లో ఇంకో కేసు కూడా ఉంది సర్!"
    
    "ఏమిటది?"
    
    దినకర్ గురించి వివరంగా చెప్పి అన్నాడు జలీల్, "కోర్టుకి వచ్చిన దినకర్ ని ఒక కుర్రాడు చూసి, అతనే తన తల్లిని చంపిన హంతకుడని చెప్పాడు. క్వశ్చనింగ్ కి తీసుకొచ్చాం దినకర్ ని. ఆ తర్వాత అతను పారిపోయాడు. ఎప్పటికప్పుడు ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతున్నాడు."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra