Home » Sharvani » Apaswaram


                                     14

    ఉదయం ఆరింటికే ఇల్లు కలకలలాడ సాగింది. కమలమ్మగారు ఉదయమే తల్లీ పిల్లలకు తలంటి పోసి, మడి కట్టుకున్నారు. మీర బాదామిరంగు చీర కట్టుకుని, వదులుగా ముడివేసుకుని పూలు పెట్టుకుంది. పసుపు రాసిన చెంపలు మెరిసిపోతున్నాయ్. తన కళ్ళకు కాటుక పెట్టుకొని చెయ్యి బాగా తుడుచుకుంది. చేతిలో కాటుక తీసుకుని పడకమీద చేతులూ కాళ్ళూ ఆడిస్తూ పడుకున్న పాపవేపు చూసింది. దగ్గరగా వెళ్ళి బలవంతంగా కళ్ళు తెరిపించి, రెండు కళ్ళకూ కాటుక పెట్టింది. బిడ్డ కెవ్వుమంది. చేతులు, కాళ్ళూ విదిలిస్తూ, గుక్కపట్టి ఏడ్వసాగింది. మీర కంగారుపడింది. ఏం చేయాలో తోచలేదు. శాము దగ్గరికి పరుగెత్తి,
    "బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోందండీ. ఏం చేయాలో అని చేతులు పిసుక్కుంది.
    "ఆకలేమో చూడు."
    "లేదండీ, ఇపుడే పాలుపట్టి పడుకోబెట్టాను."
    "మీ పెద్దమ్మతో చెప్పు. ఎంతయినా ఆదుకుంటారు. వారికీ తెలియకపోతే డాక్టరును తీసుకొస్తాను."
    బిడ్డ ఏడుపు విని వంటింటినుండి బయటికి వచ్చారు, కమలమ్మగారు.
    బిడ్డ కళ్ళు తెరచుకొని పడుకుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళనుండి నీరు కారుతూంది.
    "ఎంతకంగారు పెట్టావు మీరా మనం పెట్టుకున్నట్టు మొరటుగా కాటుక పెట్టరాదు పిల్లలకు. నొప్పయిందేమో పాపం ఏడవకేం చేస్తుంది?" అన్నారు.
    పిల్లల్ని ఎలా చూసుకోవాలన్న విషయం మీద ఒకగంట లెక్చర్ ఇచ్చాడు, శాము మీరకు. ఏ విషయంలోనైనా మాటపడక ఎదురుతిరిగే మీర, నోరు మెదపక బుద్ధిగా భర్త చెప్పినదంతావింది. పెద్ద నేరం చేసిన దానిలా బాధపడుతూ "ఇంకెప్పుడూ అలా చెయ్యనండి" అని భరోసా ఇచ్చింది, శాముకు.
    శాము, మీర పీటలమీద కూర్చునేసరికి, కావేరమ్మ గారు నర్మద, కిషోర్ లోపలి కొచ్చారు. నర్మద మీర దగ్గర కూర్చుని, మీర తొడమీదున్న పాపబుగ్గ గిల్లి "అందంతో నిన్ను మీరుతుంది." అని తనే అల్లిన స్వెటర్ ఇచ్చింది. పురోహితులవారు మంత్రాలన్ని చెప్పిముగించి,
    "బిడ్డకు పేరేం పెడతారు" అనడిగారు.    
    "జానకి"
    "సరె బిడ్డ చెవిలో ఆ పేరు చెప్పెయ్యండి."
    శాము మీర తొడమీద కళ్ళుమూసుకొని ప్రశాంతంగా పడుకున్న బిడ్డచెవిలో 'జానకి' అని చెప్పాడు. వంచిన తన తల మీదుగా రెండు కోసారులు నేత్రాలు తనమీద అగ్నివర్షం కురిపిస్తున్నాయని తెలుసుకుని, ఎడమ కను బొమను కొద్దిగా పైకెత్తి, జయం తనదే అన్నట్టుగా మీరవేపుచూసి, వ్యంగ్యంగా నవ్వాడు.
    కమలమ్మగారు, కరుణా, హారతివ్వగానే, కోపంతో తొడమీద బిడ్డవున్న సంగతికూడా మరచి, పైకి లేవబోయింది. శాము "జాగ్రత్త పాప" అని హెచ్చరించాడు. మీర బిడ్డ నెత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది.
    రాజు, చంపా, నర్మదా, ముగ్గురూ మీర వెంబడే గదిలోకి వెళ్లారు.
    "కంగ్రాట్స్ మీరా తల్లివై పోయావ్. మమ్మల్ని మరచిపోకేం" చంపఅంది.
    మీర నోటి మీద వేలుంచుకుని "ష్........పాప నిద్రపోతుంది.గట్టిగా మాట్లాడకండి. బయటికి వెడదాం పదండి"
    హాల్లో చాప వేసుకుని కూర్చున్నారందరూ.
    "మీరా, ఓ శుభవార్త. చంప ఇక మా క్లబ్బువదిలేసి మీ క్లబ్బులో చేరుతోంది" అంది నర్మద.
    "ఓ. కంగ్రాట్స్, చంపా! ఎప్పుడే మా క్లబ్బుకు రావటం నువ్వు?" అంది సిగ్గుపడుతూ "ఇంకా సరిగ్గా తెలియదే అంది.
    రాజు, కసి తీర్చుకున్నట్టుగా "మీరా చంప- ఉడ్-బిని చూడాలి, నువ్వు. ఇంతవరకు నన్ను ఏడిపించినట్టుకాదు. ఆ మహానుభావుడు నడుస్తూంటే, ఓ చిన్న కొండ నడుస్తున్నట్టే ఉంటుంది. నన్ను బెలూన్ లా ఉన్నానని ఏడిపించేది కదూ? ఆయనగారో గాలి నింపిన గోనె సంచి" అంది.
    చంప మొహం ఎర్రబడింది.
    "రాజూ .... వూరుకోవే."
    "ఊ హుఁ. నువ్వెన్ని చెప్పినా వినను. ఇన్ని రోజుల అప్పూ వడ్డీతో సహా తీర్చుకుంటాను. ఇపుడు ఛాన్సు నాది" అంది.
    మీర చిరునవ్వు నవ్వి "నిజమటే? చంపా, లావుపాటి మనుష్యులంటే హాస్యాస్పద వ్యక్తులని అనేదానివిగా" అంది.
    "పాపం! ఇపుడేం చేస్తోందో తెలుసా? ఆదివారం బెంగుళూరి నుండి ఆయనగారు రాకపోయా రంటే, చూడాలి మన చంప మొహం! ఓ - తపస్సు చేయడానికి ప్రారంభిస్తుంది."
    "ఓహో, అదీ సంగతి. నాకేమీ తెలియనే తెలియదుసుమా."
    "అతను వీరి బంధువర్గంలోని వాడే" నర్మద అంది.
    "అస్తమానం 'నిన్ను చూడలేనే రాజూ, క్లాసులోపలా, బ్యా, నీ కాయాన్ని చూసి చూసి మా కళ్ళు ఎంత అలసిపోతున్నాయో? ఒక్కోబాగమే విడివిడిగా చూడాలి' అనే దానివిగా, ఇప్పుడో?" వెక్కిరించింది రాజు.
    బయట ఆడుకొంటున్న కిశోర్ పరుగెత్తు కుంటూ వచ్చి నర్మద మెడ చుట్టూ చేతులు వేసి "పిన్నీ...... పిన్నీ....." అన్నాడు ముద్దుగా.
    "వదలమ్మా మంచివాడివి కదూ" అంటూ విడిపించుకుని నర్మద, "నీకో బుల్లి పెళ్ళాం కావాలా" అంది.
    "ఊహుఁ నాకొద్దు" అంటూ బయటికి పారిపోయాడు కిశోర్.
    మళ్ళీ స్నేహితురాళ్ళు బాతాఖానీలో పడ్డారు. మీర హఠాత్తుగా "కాస్త ఉండండర్రా, పాప ఏడుస్తున్నట్టుంది" అంది. అందరూ మాటరాసి మీర వేపు ఆశ్చర్యంగా చూశారు. స్నేహితులతో మైమరచి కబుర్లు చెప్పుకుంటున్నా, మీర మనసుకు పాపాయి పిలుపు వినబడింది.
    సాయంత్రం పాపాయికి నీలం ఫ్రాకు తొడిగింది. గొలుసు వేసింది. గాజులూ, పాంజేబులూ తొడిగింది. నుదుటిమీద కాటుకతో తిలకందిద్ది, తనూ ముస్తాబవసాగింది. ఆకుపచ్చ మైసూరు క్రేప్ కట్టుకుని, పసుపురంగు చోళి  తొడుక్కుని, శాము కొత్తగా చేయించి తెచ్చిన ముత్యాలూ, కెంపులూ పొదిగిన గాదాలు వేసుకుంది.
    బిడ్డను చూద్దామని లోపలికి వచ్చిన శాము, పెళ్ళాన్నీ, బిడ్డనూ చూసి స్తబ్దుడై నిలబడి పోయాడు.
    మీర "ఏం అలా నిలుచుండిపోయారు?" అంది.
    "ఇద్దరిలో ఎవరిని ఎక్కువసేపు చూడాలా? అని ఆలోచిస్తున్నా."
    "వీణ నాకన్నా ముద్దుగా ఉంది. దాన్నే చూడండి."
    "నీకు కాదు-జాని .... జాని" శాము వత్తి పలికాడు.
    "జాని కానేకాదు-వీణ."
    "సరే నీ కెలా ఇష్టమో అలాగే పిలు. నా కిష్టమైనట్టు నేను పిలుచుకుంటాను."
    "వీణ పెద్దయ్యాక 'జాని' బాగాలేదు నాకు 'వీణా' అన్న పేరే ఉండనీ అంటేనో"
    "అప్పుడు తన కిష్టమైనట్టే పిలుస్తాను. జానీ.... జానీ...."
    "వీణా ......."
    పాపాయి పెద్దగా కళ్ళు తెరచి నవ్వింది. మీర వెక్కిరిస్తూ "చూశారా దానికి 'వీణా' అన్న పేరే ఇష్టమట!" అంది.
    "ఇప్పటి నుండి ఎందుకూ వాదించుకోవటం" అంటూ శాము వంగి పాపాయి బుగ్గలు ముద్దు పెట్టుకున్నారు.    
    మీర అతని భుజం పట్టి లాగి "బిడ్డ నెందుకు ముద్దుపెట్టుకున్నారు?" అంది.
    "ఏం. నీ కసూయా? సరే, మొదట నీకే ....."
    మీర మొహం అటు తిప్పుకొని, "ఛా! పోండి. మీరు షేవ్ చేసుకోకుండ బిడ్డను ముద్దెట్టుకోకండి. బుగ్గ మంటపెడుతుంది."
    "నొప్పయిందామ్మా" అంటూ నీకు బుగ్గ నిమిరాడు శాము.
    శాము ఇక పల్లెకు వెళ్ళాలి. జీవితంలో తొలిసారిగా పల్లెకు వెళ్ళాలంటే విసుగుపుట్టిం దతనికి. మీరను వదలి పల్లెలో ఉంటున్నప్పుడు కూడా మైసూరికి వచ్చినప్పుడు రెండు రోజులకన్నా ఎక్కువగా ఉండలేక పొయ్యేవాడు. ఇంకా ప్రపంచంలోకి అడుగుపెట్టి నెలరోజులన్నా గడవని ఆ పసికందు శాము హృదయాన్ని ఆకట్టుకుంది. వూరికి వెళ్ళే ముందు షేవ్ చేసుకుని, బిడ్డను ముద్దు పెట్టుకుని, మీరతో, "బిడ్డను జాగ్రత్తగా చూసుకో" మని పలుమార్లు చెప్పి, అయిష్టతతోనే పల్లెకు బయల్దేరాడు. ప్రతి వారమూ వచ్చి చూసి వెళ్ళేవాడు.
    బిడ్డకు నాలుగో నెల వెళ్ళగానే భార్యా బిడ్డలను తీసుకువెడతానని కృష్ణయ్యగారితో చెప్పాడు, శాము, కృష్ణయ్యగారు వారి ప్రయాణానికి ఓ మంచిరోజు చూసిపెట్టారు. రెండు రోజులు ముందుగా శాము మైసూరికి వచ్చాడు.
    ప్రయాణానికి ముందు రోజున, మీర వీణని కమలమ్మగారికి అప్పజెప్పి, భర్తతో బజారుకు వెళ్ళింది. కమలమ్మగారికి నెమలికంఠం రంగు పట్టుచీర కొంది. బిడ్డకు కావాల్సిన వస్తువులెన్నో కొంది. అన్నీ అయ్యాక శాము,
    "అయిందా రాణిగారి షాపింగ్" అనడిగాడు.
    "ఇంకా లేదు, వీణకో బండి కొనాలి."
    "బండి ! ఎద్దులబండి కాదుగా!!"
    "ఇంకా నయం. ఒక 'ప్రాం' తీసుకుందామని. పల్లెలో పాపాయిని షికారు తీసుక వెళ్ళటానికి వీలుగా ఉంటుంది."
    ఇద్దరూ అరగంట పరీక్షించి అందమైన 'ప్రాం' బేరం చేసారు. శాము రెండువందలాభై రూపాయలిచ్చి రసీదు తీసుకొని,    
    "రేపు వచ్చి తీసుకువెడదాం. అందాక ఇక్కడ ఉండండి," అని చెప్పాడు. లెక్కలేనన్ని ఆట వస్తువులు, రెడీమేడ్ దుస్తులు అన్నీ కొనటం అయింది.    
    "నీకేమీ వద్దా. మీరా?"
    "ఊ హూ. నాకేమీ అక్కర్లేదు. నాకేమైనా కొనాలనిపిస్తే వీణకే కొనిపెట్టండి."
    "దానికి ఇప్పుడు కొన్నవి చాలవా?"
    "ఇక్కడి బజారు బజారంతా కొన్నా తృప్తి లేదు నాకు."
    "నీ కెక్కడో పిచ్చి."
    సామన్లంత ప్యాక్ చేయించి, ట్రైనులో వేయించి, తామూ ట్రైనులో వస్తానన్నారు కృష్ణయ్యగారు.
    విందు భోజనాలయ్యాక శాము టాక్సీ తెచ్చాడు. మీర దేవుడికి పెద్దలకి నమస్కరించింది. వీణ చిన్ని తలను పెదనాన్న కాళ్ళకు తాకించి "నా బిడ్డను ఆశీర్వదించండి పెదనాన్నా" అంది.
    కృష్ణయ్యగారు ప్రేమతో "నీకున్న ఈ ఒక్క మొక్కలో వేయి పుష్పాలు పుష్పించు" అని ఆశీర్వదించాడు.
    కృష్ణయ్యగారిని స్టేషనువద్ద వదలి, టాక్సీ పల్లెవేపు బయలుదేరింది.
    నాలుగు నెలల పాప నీలు బొద్దుగా ముద్దుగా ఉంది. మీర ఉంగరాల జుత్తు వీణకు తల్లి నుంచి సంక్రమించిన ఆభరణంలా అమరింది. తలకు నల్లటోపి వేసినట్లుగా, ఎర్రటి మొహాన్ని ఆవరించింది. పెద్ద పెద్ద కళ్ళు తెరచి చూస్తూ అమాయకంగా నవ్వుకునే వీణ ఎవరినైనా ఇట్టే ఆకర్షించేది. శాము తెచ్చిన గాజులు, బిగువవటం వల్ల రెండే నెలలకు కత్తిరించేశారు. గులాబిరంగు పళ్ళు, సొట్టలు పడే బుగ్గలు, ఎలాటివారినైనా ఆకర్షించేవి. నాలుగు నెలల పాప బొద్దుగా పెరిగి చూడటానికి సంవత్సరపు పిల్లలా ఉండేది.
    మీర టాక్సీలో కూర్చుని, బిడ్డ్డకు శాలువా కప్పింది. వీణ మొహంమీద నుండి శాలువ తొలగించి తల్లిని చూసి నవ్వింది. మీర అక్కరతో,
    "నా చేతకాదు బాబూ, మీ అమ్మాయిగారి అల్లరి చూడండి" అంది.
    శాము చేతులుచాచి, "దామ్మ జాని. నే నెత్తు కుంటాగా" అని బిడ్డ నెత్తుకొని, మొహం మాత్రం బయటి కుండేటట్టుగా వంటినిండా శాలువ కప్పాడు. వీణ హాయిగా పడుకుని, కాస్సేపటిలో నిద్రపోయింది,

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra