Home » Merlapaka murali » Preminchandi Please


    అతనికి ఏం సమాధానం చెప్పాలో చప్పున తోచలేదు. గుటకలు మింగుతున్నాడు.
    "ఫిగర్ కోసం వచ్చావా?" మళ్ళీ ఆ వ్యక్తే ప్రశ్నించాడు.
    అవునన్నట్టు తల వూపాడు.
    "అందరూ బుక్ అయిపోయారు. కాసేపు వెయిట్ చేయాలి" అని అమ్మాయిల్తో మాటల్లో పడ్డాడు.
    ఆ మాటలు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించాయి ఆంజనేయులుకు.
    గుంపులు గుంపులుగా మగవాళ్ళు సిగరెట్ పొగలు బరువుగా గాలిలోకి ఎగబాకుతున్నాయి. విస్కీ వాసన ఆ ప్రాంతాన్ని పహరా కాస్తున్నట్టు అనిపిస్తోంది.
    ఆంజనేయులు అలా నిలబడే వున్నాడు.
    వరండాలో కూర్చున్న అమ్మాయిల్లో ఒకామె షడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు పైకి లేచింది.
    "బిడ్డ ఏడుస్తున్నట్టుంది. ఉండు మల్లికా! తీసుకొస్తాను" అని లోపలికెళ్ళి మరో నిముషంలో చిన్న బిడ్డతో వచ్చింది.
    పద్మాసనం వేసి కూర్చుని బిడ్డను పడుకోబెట్టుకుంది. ఆ బిడ్డ ఏడ్వడానికి కూడా శక్తిలేనట్టు మెల్లగా ఏడుస్తోంది.
    ఆమె పైట తప్పించి, రొమ్ము అందించింది. అయినా బిడ్డ ఏడుపు ఆగలేదు. ఆమె ఎంతో ప్రయత్నించినా వాడు ఏడుపు ఆపటంలేదు. ఆమెకు విసుగొచ్చింది.  "ఛీ ఛీ! ఏం బతుకో. బిడ్డకు పాలివ్వడానికి కూడా లేదు. పార్టీకి వచ్చిన ప్రతి నా కొడుకూ జాకెట్ విప్పమనేవాడే. పచ్చి బాలింతనురా పాలు కారిపోతాయంటే కూడా వినరే. పాలన్నీ పైకి చిదుముతున్నా ఆపరే. ఛీ ఛీ వెధవ మనుషులు" ఆమె విటులమీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వుందని ఆంజనేయులకు అర్ధమైంది.
    సిగ్గుతో తల వంచుకున్నాడు.
    ఆమె బిడ్డతో సతమతమౌతూ వుంది. అక్కడున్న వాళ్ళల్లో ఎవరూ ఆమె గురించి పట్టించుకోవడం లేదు.
    "ఏమో చంద్రికా! ఏమిటీ అరుపులు - కేకలు?" ఎక్కడనుంచి వచ్చిందో ఏమోగానీ ఒకామె అధికారికంగా ప్రశ్నిస్తోంది.
    "ఏం చేయను అక్కా ఏడుస్తున్నాడు."
    "లోపలికెళ్ళి పోతపాలైనా పోయి. ఈ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర కూడా పాలుంటాయా?"
    చంద్రిక వెళ్ళిపోయింది.
    ఆమె ఆంజనేయులు దగ్గరకువచ్చి "పార్టీనా?" అంది.
    ఆ మాటా అర్ధం కాలేదు ఆంజనేయులుకు. ఆమె ఓసారి కింద నుంచి పైవరకు చూసి "మళ్ళీ పార్టీనా?" అని అడిగింది.
    అప్పటికి దాని అర్ధం స్ఫురించడంతో "అవును" అన్నాడు.
    "అందరూ బుకింగ్ అయిపోయారు. కాసేపు ఆగాలి." అని అరుగు దగ్గరికి వెళ్ళింది.
    ఆమె పేరు బుజ్జి అది అసలు పేరో, ముద్దు పేరో ఆమెను వుంచుకున్న ఎస్.ఐ.కి కూడా తెలియదు. ఆమె ఆ బ్రోతల్ హౌస్ ఓనర్. పాతికేళ్ళ వయసే అయినా ఒకటి రెండేళ్ళు పెద్దగా కనిపిస్తుంది చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది.
    ఆమె తల్లి కూడా ఇదే వ్యాపారం చేసేది. తల్లి చచ్చిపోయాక వారసత్వంగా దీన్ని నడుపుకొస్తోంది. బుజ్జికి పెళ్ళిచేసి ఈ రొంపిలోకి దించడానికి వాళ్ళమ్మ అనుకున్నా వీలుకాలేదు. దేంతో వ్యాపారం చేస్తున్నామో అది రుచిచూడకుండా, దూరంగా వుంచడం కష్టమని గ్రహించిన ఆమె బుజ్జిని కూడా వ్యాపారంలోకి దించింది అన్ని మెళకువలు నేర్పించింది. మొదట ఆ వూరికి కొత్తగా ట్రాన్స్ ఫరైన ఎస్.ఐ. చేత కన్నెరికం చేయించింది.
    ఇప్పుడు మరీ ముఖ్యమైన వ్యక్తులు వస్తే తప్ప బుజ్జి మంచం ఎక్కదు. మిగిలిన విషయాలు చూడడానికే ఆమెకు టైమ్ సరిపోతుంది.
    బుజ్జి మరీ స్ట్రిక్ట్ గా వ్యాపారం చేసుకునే రకంగాదు. కాస్తంత జాలి, కరుణ వుండే మనిషి డబ్బు కక్కుర్తి తక్కువ. పైపెచ్చు మంచి మాటకారి.
    "ఏమిటి బుజ్జీ! బహు రద్దీగా వుంది" అప్పుడే వచ్చిన ఓ వ్యక్తి అడిగాడు. డ్రాయర్, బనీను తప్ప ఏ ఆచ్చాదనా లేదు ఆయన ఒంటిమీద. ఆ వీధి చివరలో ఆయన కాపరం. ఆయన వాలకం చూస్తుంటే, 'అదేదో, గుర్తొచ్చి నిద్ర పడకమీద నుంచి లేచి వచ్చేసినట్టున్నాడు.
    'ఏం చేద్దాం వెంకటసామీ! బయట ఆడోళ్ళు పతివ్రతలుగా వున్నంత కాలం మాలాంటి కొంపలు రద్దీగానే వుంటాయి."
    "బాగా అలిసిపోయినట్లున్నావ్"
    "చెప్పాను గదా బహు రద్దీగా వుందని చూశావా జనాన్ని మేం లేకపోతే వీళ్ళంతా ఏం చేసేవారా అని దిగులుగా వుందనుకో" అని నవ్వింది బుజ్జి.
    ఆమె నవ్వు ఎంతో బావుందనిపించింది ఆంజనేయులుకు.
    "ఇంతకీ కొంపలో ఎవరున్నారు! కొత్తపిట్టలేమైనా వచ్చి వాలాయా?" ఆయన నాలుకను పెదవులమీద రాస్తూ అడిగాడు.
    ఆయన అడగడం చూస్తే కొత్త అమ్మాయిని కాల్చుకు తినేస్తాడనిపించింది ఆంజనేయులుకు.
    "కొత్తవాళ్ళు ఎవరూలేరు. అంతా పాతవాళ్ళే మొన్ననేకదా అటు పక్క వరదలొచ్చింది. ఇక వస్తారు. కొంపాగోడు పోయినవాళ్ళు అంతకంటే ఏం చేస్తారు?"
    "సరే భాగోతం చదవకు. ఎవర్నో ఒకరిని పంపు" అని ఆయన లోపలికి వెళ్ళారు.
    ఆ ఇంటివెనుక అడ్డాపిల్లు వుంది. దాన్ని పార్టిషన్స్ చేస్తూ తడికలు కట్టారు.
    "నిలబడే వుండావెందుకు? రా కూర్చో" అంది బుజ్జి ఆంజనేయులుతో.
    అతనికీ కూర్చోవాలనిపించింది. కానీ ఏదో బెరుకు అడ్డుతగులుతూ వుంది.
    ఆ చోటుకు అతను కొత్త అని బుజ్జి క్షణంలో గ్రహించింది.
    అంతలో ఇంట్లోంచి ఓ జంట వచ్చారు.
    అతను ప్యాంటును చేతుల్లో పట్టుకుని బయటొచ్చి బాత్రూం దగ్గర నిలబడ్డాడు.
    అరుగు దగ్గరున్న అతని మిత్రబృందం "హాయ్" అంటూ పలకరించింది.
    "అదరగొట్టేసినట్టున్నావే" ఒకడు అడిగాడు.
    "మరి ఈ యుగంధర్ అంటే తమాషానా ఆ పిల్లకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి" ప్యాంటు యువకుడు గర్వంగా చెప్పాడు.
    "ఆర్ట్స్ కాలేజీ పరువు నిలిపావన్నమాట. ప్రిన్సిపాల్ తో చెప్పి సర్టిఫికెట్ ఇప్పిస్తాలే" మరో ఫ్రండ్ వేసిన జోక్ కి అతను తృప్తిగా నవ్వాడు.
    అతను వచ్చాక మిత్రబృందం కదిలింది.
    ఆ అమ్మాయి కూడా వరండాలోకి వచ్చింది.
    ఆమె స్టూడెంట్స్ మలుపు తిరిగేవరకు అటు చూసి ఆ తరువాత బుజ్జితో అంది యుగంధర్ గాడు చంపేశాడనుకో వాడు దీన్ని బలప్రదర్శన శాల అనుకుంటాడేమో. ఒళ్ళంతా నజ్జు నజ్జు చేశాడు. ఈరోజు బాగా తాగి వచ్చాడు ఎంతకీ చల్లారి పోడే. త్వరగా వెళ్ళకూడదనే తాగొచ్చానని చెప్పాడు మధ్యలో. వెధవలంజాకొడుక్కి ఫిట్స్ వచ్చి ఇటురాకుండా పోయినా బావుండు."
    "ఇక్కడికి వచ్చే ప్రతివాడూ అంతే మరో అమ్మాయి వంతపాడింది.
    అక్కడున్న మగవాళ్ళు వాళ్ళ మాటలు వినడం లేదుగానీ ఆంజనేయులు మాత్రం శ్రద్దగా వింటున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra