Home » Kommuri venugopala rao » Ardhachandra


    ఇన్నాళ్ళబట్టీ తాను వెదుకుతున్న వ్యక్తి అజ్ఞాతంగా ఆరాధిస్తున్న స్త్రీ విశారదే విశారదే అని మనసు ఘోషిస్తుంది.
    
    రాత్రంతా మేలుకుని కూర్చుని ఆమెకో ఉత్తరం రాశాడు. అందులో తన ఆలోచనలు, వేదన- అన్నీ ఒలకబోశాడు.
    
    రాసి, రాసి తెల్లవారుజామున ఏ నాలుగుగంటలకో నిద్రపోయాడు.
    
    మర్నాడు యూనివర్శిటీ క్యాంపస్ లో విశారద కనిపిస్తుందేమోనని ఎదురుచూశాడు. ఒకటి, రెండుసార్లు దూరంనుంచి కనిపించింది గానీ, ఆమె పక్కన ఎవరో ఉండటం వల్ల కలుసుకునేందుకు వీలుపడలేదు. సాయంత్రం అయిదు గంటలవేళ ఒంటరిగా నడిచి వస్తూ కనిపించింది.

    అతన్ని దూరం నుంచి చూసి విష్ చేద్దామని ఏదో తోచి నిగ్రహించుకుంది.
    
    ఇద్దరూ ఎదురెదురుగా వచ్చారు. ఆమెను చూసి అతను స్లో అయ్యాడు. ఆమె కూడా నడక వేగం తగ్గించింది.
    
    ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా ఆగిపోయారు.
    
    "చెప్పండి" అన్నట్లు చూసింది.
    
    "ఎలా చెప్పను?" అన్నట్లు మొహమాటపడుతూ చూస్తున్నాడు.
    
    చివరకు ఆమే "ఏం కావాలి?" అనడిగింది.
    
    అతని గుండె గబగబా కొట్టుకుంటుంది. "ఊ?" అన్నాడు.
    
    "చెప్పండి ఏం కావాలి?" అన్నది లీడ్ ఇస్తూ.
    
    "మీరు" అందామనుకున్నాడు చెంప పగలగొడుతుందేమో అని హడలి పోయి ఊరుకున్నాడు.
    
    ఇద్దరం మాట్లాడకుండా బొమ్మల్లా ఇదేం బాగాలేదు" అంది.
    
    కాదు కొంచెం ఉంది" అన్నాడు తడబడుతూ.
    
    "చెప్పండి ఫర్వాలేదు."
    
    "మీకు కోపమొస్తుందేమో!"
    
    "వస్తే ఏం చేస్తాం? ఆ విషయం తరువాత ఆలోచిద్దాం."
    
    "చెప్పడం కాదు ఇవ్వాలి."
    
    "ఏమిటిస్తాడు ఇంత బహిరంగంగా?' ఆమె గుండె గబగబా కొట్టుకుంది.
    
    అటూ ఇటూ చూసింది. దగ్గర్లో ఎవరూ కనబడలేదు.
    
    "త్వరగా ఇచ్చెయ్యండీ" అంది.
    
    అతను కంగారుగా జేబులోంచి చెయ్యి తీసి ఆమె చేతిలో పెట్టేశాడు. ఆమె అందుకుని జాకెట్ లో పెట్టేసుకుంది.
    
    "చదువుకుని..." అంటూ అక్కన్నుంచి గబగబా వెళ్ళిపోయాడు.
    
                                              * * *
    
    విశారద కళ్ళు విప్పింది. ఒంట్లో కొంచెం కొంచెం ఓపిక వస్తోంది.
    
    ఈ గదిలో తామిద్దరూ... సృష్టిలో తామిద్దరే మిగిలి ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది.
    
    ఆ ప్రేమలేఖ చూసి ఎంత మురిసిపోయింది! ప్రపంచ చరిత్రలో అంతకు మునుపు ఎంతో మంది యువతీ యువకులు ప్రేమించుకుని ఉండి ఉండవచ్చు గాక ఎన్నో లక్షల, కోట్ల ప్రేమలేఖలు రాసుకొని ఉండవచ్చు. ఈ జంట వేరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్.
    
    ఇద్దరూ అవకాశమొచ్చినప్పుడల్లా కలసి తిరుగుతుంటే యూనివర్సిటీ కాంపస్ అంతా శోభించినట్లు ఉండేది. ఇద్దరూ సముద్రపు ఒడ్డున విహరిస్తుంటే ప్రకృతి కళకళ్ళాడిపోయేది.
    
                                              * * *
    
    ఇద్దరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి.
    
    విశారద తండ్రి రామ్మోహనరావుగారు ఆమెనోరోజు దగ్గరకు పిలిచారు.
    
    "అమ్మాయ్! నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను."
    
    తల్లి గౌరీదేవి దగ్గర్లోనే నిలబడి ఉంది. ఆమె మొహం వ్యాకులపాటుతో నిండి ఉంది.
    
    విశారద ఏమే మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడి ఉంది.
    
    "మాట్లాడవేం?"
    
    "నేను..."
    
    "చెప్పమ్మా..."    
    
    "రాజాచంద్రను" చేసుకుందా మనుకున్నాను."
    
    తల్లీ తండ్రీ ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు.
    
    "ఆ అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలీవు" అన్నాడు తండ్రి కొంచెమాగి.
    
    "నేను చెబుతాను. ఆయన తండ్రి శేషశాయిగారు పేరెన్నికగన్న బిజినెస్ మెన్. వాళ్ళ తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కొడుకు. రాజాచంద్ర నాకు అన్ని విధాలా నచ్చాడు. మేమిద్దరం...
    
    తల్లీ తండ్రీ లోపలకెళ్ళి అయిదు నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. తరువాత బయటకు వచ్చారు.
    
    "నీ ఇష్టానికి వ్యతిరేకంగా మే మెప్పుడూ ప్రవర్తించమమ్మా! కాని ఇది జీవితానికంతటికీ సంబంధించిన సమస్య నువ్వు ఏవిధంగానూ బాధలు పడకూడదన్నదే మా అభిమతం."
    
    "నేనతన్ని బాగా స్టడీ చేశాను. మనస్పూర్తిగా లైక్ చేశాను. అతన్తో నా జీవితం సవ్యంగా సాగిపోతుందనే నమ్ముతున్నాను నాన్నగారూ"
    
    "అతను?"
    
    "అతనూ నన్ను బాగా స్టడీ చేశాక ఈ నిర్ణయానికి వచ్చాడు నాన్నగారూ!" జీవితం సవ్యంగా సాగిపోతుందనే నమ్ముతున్నాను నాన్నగారూ"
    
    "అతను?"
    
    "అతనూ నన్ను బాగా స్టడీ చేశాక ఈ నిర్ణయానికి వచ్చాడు నాన్నగారూ!"
    
    "మీ ఇష్టమమ్మా.
    
    వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది.
    
                                                 11
    
    విశారదను హాస్పటల్ నుంచి డిశ్చార్జి చేశారు. ఆ వారం రోజులూ రాజాచంద్ర ఆఫీసు కెళ్ళలేదు. హాస్పటల్లో ఉన్నంతసేపూ ఆమె నంటిపెట్టుకునే ఉండిపోయాడు.
    
    విశారద రెండు మూడు నెలలపాటు బాగా రెస్ట్ తీసుకోవాలి. రాజాచంద్ర తాత్కాలికంగా ఓ వంటమనిషిని ఏర్పాటు చేశాడు.
    
    హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన మర్నాడు కూడా అతను ఆఫీసు కెళ్ళే ప్రయత్నం చెయ్యకపోవటం చూసి "ఇదేమిటి? ఇప్పటికే చాలారోజులు వర్క్ పోయింది. ఈవేళయినా ఆఫీసుకు వెళ్ళండి" అంది విశారద.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra