Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

      "బావుంది! ఈ సంఘటన జరిగింది 1947లో అప్పటికి మీరు హిమాలయాల్లో తపస్సు చెసుకుంటుండాలి. గాంధీగారిని కలిసే అవకాశమే లేదే!"
   
    దెబ్బతిని "ఆఫీసు ఎకౌంట్స్, కరస్పాండెన్స్ లో మీరు పర్ ఫెక్టు అని విన్నాను. చరిత్రని ఔపోసన పట్టారని యిప్పుడే తెలుస్తోంది" అన్నాడు.
   
    "దీనికి చరిత్ర నమిలి మింగాల్సిన అవసరం లేదు. లారీ కాలిన్స్ వ్రాసిన 'ఫ్రీడం ఎట్ మిడ్ నైట్' చదివితే చాలు".
   
    "మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానం అన్న విషయం నిజమేగాని అది ఒన్ సైడెడ్ అఫెయిర్ అయిపోతుంది. మనిషికి పుస్తకంతోపాటు పుస్తకంలాంటి మంచి స్నేహితుడి అవసరం కూడా వుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు?"
   
    "నిజమేనంటాను. కాని ఒక్క విషయం మంచి పుస్తకాలు చదివే అభిరుచి ఉన్నవాళ్ళు 'అందరితోనూ'స్నేహం చెయ్యలేరు. వాళ్ళు చదివే పుస్తకాల స్థాయిలో వుండే స్నేహాన్నే అభిలషిస్తారు".
   
    "అయితే మీతో స్నేహానికి నేను అర్హున్నేమో ఒకసారి పరిశీలించండి".
   
    ఈసారి తను దెబ్బతిన్నట్లు చూసింది అనూరాధ. "సారీ! నేనేదో అధికురాలిననీ, అందరితో స్నేహం చేయడం నా స్థాయిని తగ్గిస్తుందనీ నేననుకోవడంలేదు. నేను మామూలు సంభాషణల్లో యిమడలేను. పిల్లల చదువులు, చీరలు, నగలు, కొత్త వంటలు లాంటి కబుర్లలో ఉత్సాహంగా పాల్గోలేను. అది నాలో బలహీనతేమో! కాస్త పై స్థాయిలో వుండేవాళ్ళతో స్నేహం చేస్తే నాకు లాభం అన్న స్వార్ధం కూడా నాలో ఉందేమో".
   
    చిన్నగా నవ్వాడతడు. "మీరేం అనుకోనంటే ఒకమాట చెపుతాను".
   
    'చెప్పండి అనుకునేదేముంది?"
   
    'ఈ వారం రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను కూడా ఎలా అని అడక్కండి? మీతో స్నేహం చెయ్యాలనే కోరిక కంటే స్నేహంలోని మాధుర్యాన్ని మీకు తెలియచెప్పాలనే కోరిక ఎక్కువగా కలిగింది. నా గురించి మీకు తెలియదు కాని మీ అభిరుచులకు దగ్గరలోనే వున్నానన్న విషయం నాకు తెలుసు. చెప్పండి నాతో స్నేహం చేయగలరా?"
   
    "నేనెప్పుడూ ఎవరితోటి రెండు నిమిషాలకంటే ఎక్కువ మాట్లాడి ఎరుగను. మన స్నేహం మొదలయి పది నిమిషాలు కావస్తోంది".
   
    "థాంక్యూ" అన్నాడతను సంతోషంగా.
   
    "ఒక్క విషయం! స్నేహంలో థాంక్యూలు, సారీలు ఉండకూడదని ఎవరూ చెప్పలేదా మీకు?"
   
    "చెప్పారు రవీంద్రనాధ్ టాగోర్ గారన్నారు. చనిపోతూ నాకాయన ఇచ్చిన చివరి సందేశం అదే".
   
    "ఇప్పుడే 'ఫేర్ వెల్ మై ఫ్రెండ్" అనకండి".
   
    "నో...నో సీ యూ అగైన్ మై ఫ్రెండ్" నవ్వుతూ వెళ్ళిపోయాడతను.
   
    వారం తిరిగేటప్పటికి మంచి స్నేహితులయిపోయారిద్దరూ. రాధలో కొత్త ఉత్సాహం, అతడు తెచ్చిన పుస్తకాలు చదవడం, వీలు దొరికినప్పుడల్లా అతడి దగ్గర కూర్చుని వాటి గురించి చర్చించడం! ఇదివరలో త్వరగా ఇల్లు చేరాలని పని పూర్తి చేసుకునేది కాని ఇప్పుడు అతడితో కొద్ది సమయం గడపడం కోసం పని గబగబా చేస్తోంది.
   
    ఎప్పుడూ ఎవరితోటి ఎక్కువగా మాట్లాడని ఓ స్త్రీ ఉన్నట్లుండి ఒక పురుషుడితో అందునా వయసులో వున్న బ్రహ్మచారితో స్నేహం చెయ్యడం జరిగితే దానికి వేరే కారణం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం రాదెవరికీ రాధ, సుభాష్ స్నేహాన్ని గురించి కథలు ప్రచారంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు. అవి మోహాన్ని చేరడం కూడా జరిగిపోయింది.
   
    "ఏమిటి? నీకెవరో స్నేహితుడు దొరికాడట. పొద్దస్తమానమూ వాడితో పకపకలట. ఎవడు వాడు?"
   
    "ఆ ప్రశ్న మా గురించి చెప్పినవారినే అడగరాదూ?"
   
    "నేను నీనుంచి వినాలనుకుంటున్నాను".
   
    "అయితే విను. నాకు కొత్త, పాత స్నేహితులంటూ ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే పేరు సుభాష్".
   
    మోహన్ ఆ పూట అరబాటిల్ విస్కీ ఖాళీ చేశాడు. అతడి దురలవాట్లకి సమాధానం చెప్పుకోవడానికి సమర్దించుకోవడానికి ఒక కారణం దొరికిందిప్పుడు.
   
                              *    *    *
   
    "కూర్చో! ఇప్పుడే వస్తాను" లోపల గదిలోకి వెళ్ళాడు సుభాష్. అతడు సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసయ్యాడు. నెలరోజుల్లో ఇంటర్వ్యూ వుంది. దానికోసం లీవు పెట్టేశాడు. మళ్ళీ అతడు ఊరికి రాకపోవచ్చు.
   
    అనూరాధ గదంతా పరిశీలించి చూసింది. చాలా నీట్ గా వుంది. ఒక బ్రహ్మచారి గదిలా లేదు.
   
    పెళ్ళవకముందు మోహన్ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడివుంటే తీసి సర్దిపెట్టి మోహన్ మెచ్చుకోలు కనిపిస్తే మురిసిపోయేది. ఇలామ్టి చిన్న అనుభూతులే జీవితంలో రసదాయకం అవుతాయని ఆ రోజుల్లో అనుకునేది! పొగడ్తకై పొంగిపోయే స్త్రీ, నాలుగు మెచ్చుకోలు మాటలతో వూరించే పురుషుడు.....అతి మామూలు వాళ్ళకి మానసిక పరిపక్వత కలిగాక అర్ధమవుతోంది. మగవాడితోపాటు కష్టపడి పనిచేసే స్త్రీ ఇంటి బాధ్యతల్లో కూడా అతడు భాగం పంచుకోవడాన్నే హర్షిస్తుంది.
   
    సుభాష్ చాలా కష్టపడి పనిచేస్తాడు. అతడి పనిలో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఇంకా ఏదో సాధించాలనే తపన కనిపిస్తుంది. కేవలం ఆర్ధికంగా పై స్థాయిలోకి వెళ్ళాలన్న కోరిక మాత్రమే కాదది. అతడిలో పట్టుదలా, దీక్షా కనిపిస్తాయి. ఆఫీసు విషయమైనా, చదువైనా, ఇంటి అలంకరణ గురించయినా చూస్తే అతడిలో డిసిప్లిన్ వుంది.
   
    త్వరలో అతడు దూరంగా వెళ్ళిపోతాడంటే ఆమెకు దిగులుగా వుంది. ఒక మంచి స్నేహితుడు దొరికాడన్న ఆనందం సంవత్సరం పాటైనా లేదు. అతడు కేవలం స్నేహితుడేనా? అంతకుమించి స్థానం తన మనసులో లేదా? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడల్లా ఆమెకు భయం వేస్తుంది. ఆత్మవిమర్శ చేసుకునే వ్యక్తి ఆత్మవంచన చేసుకోలేడు.
   
    ఒకప్పుడు తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడింది. ఆవేశం తప్ప ఆలోచన లేదు. మోహన్ తో శారీరకంగా కలిసిపోయింది. తన ప్రేమ ముందు మిగతా ప్రపంచమంతా అల్పంగా తోచింది. కాని ఇప్పుడు...
   
    "ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" కాఫీ కప్పు అందిస్తూ అన్నాడు సుభాష్.
   
    "అబ్బే , ఏం లేదు" మౌనంగా కాఫీ సిప్ చేయసాగింది. అతడి స్నేహం తర్వాత ఆమెలో చాలా మార్పొచ్చింది. మర్చిపోయిన సంగీత పుస్తక జ్ఞానాన్ని మరోసారి నెమరు వేసుకోగలుగుతోంది. అతడు తన గురించి ఎంత ఆలోచిస్తాడో ఆమె గురించి అంతగానూ ఆలోచిస్తాడు. ఆమె మనసులో ఏ విషయం ఆలోచిస్తుందో తెలిసినట్లు అదే విషయం ప్రస్తావిస్తాడు.
   
    "నా ఎదురుగా కూర్చుని నా విషయమే ఆలోచించడం ఏం బాగోలేదు" అన్న సుభాష్ మాటలకు ఉలిక్కిపడింది.
   
    "నీ గురించి అలోచిస్తున్నానని ఎందుకనుకుంటున్నావ్?"
   
    "మరో విషయమైతే నాతోటే చెప్తావు అందుకని".
   
    రాధ నవ్వింది. "ఇంత పట్టుదలగా ఇవ్వాళ ఇంటికి తీసుకొచ్చావ్? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావోనని ఆలోచిస్తున్నానంతే".
   
    "భయంగా వుందా?"
   
    ఒక్క క్షణం ఆగి జవాబు చెప్పింది. "అవును. కాని.....నువ్వనుకుంటున్న విషయం గురించికాదు, ఆ తర్వాత జరగబోయేదాని గురించి".
   
    "ఆ తర్వాత విషయం గురించి మాట్లాడడానికే పిలిచాను. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే లేకుండా బ్రతకలేను" అన్న డైలాగులు చెప్పుకునే స్టేజి దాటిపోయింది. నీ యింట్లో నీకు సుఖం, శాంతి లేవు. కేవలం వాటికోసం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న అనుమానం నాకు రాలేదు. నువ్వు నా నుంచి ఆశించింది జాలి కాదు, అభిమానం నా మనసులో వున్నా విషయం సూటిగా చెప్తాను. నువ్వూ ఆలోచించు నాకిప్పుడే సమాధానం అవసరంలేదు". ఒక్కక్షణం ఆగాడతడు. రాధ గుండెల్లో గుబులు మొదలయింది. అతడి మనసులో విషయం అర్ధమయి పోయినట్లుగా అనిపిస్తోంది. వినాలంటేనే భయంగా వుంది.
   
    "నాకీ సెలక్షన్ వస్తుందనే నమ్మకం వుంది. తర్వాత దాదాపు రెండేళ్ళపాటు ట్రయినింగు వుంటుంది. నువ్విప్పుడే డైవర్స్ కి అప్లయిచెయ్యి పిల్లల్ని తీసుకుని విడిగా వుండు. నీకు సహాయం చేసే స్నేహితులను పరిచయం చేస్తాను. నా ట్రైనింగ్ పూర్తయ్యేసరికి నీకు విడాకులు దొరుకుతాయి. నార్త్ ఇండియాలో పోస్టింగ్ వేయించుకుని వెళ్ళిపోదాం. పెళ్ళి చేసుకుందాం. నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి నువ్వెప్పటికీ పశ్చాత్తాపపడకుండా చూసుకునే భారం నాది. నిన్ను సుఖపెట్టగలననే నమ్మకం నాకుంది. నీ మీద నీకు ఆ నమ్మకం వుందన్న విషయమూ నమ్మకమే. ఆలోచించుకో రాధా! నాకూ పెళ్ళి చేసుకుని సెటిలవ్వాలనే వుంది. మావాళ్ళూ త్వరపెడుతున్నారు. నేనింకా సమాధానం చెప్పలేదు".
   
    రాధ తల దించుకుంది-అతడికి తనమీద అభిమానం వుందని తెలుసు. కాని యింత సీరియస్ గా అలోచించి ఓ స్థిర నిర్ణయానికి వచ్చాడన్న విషయం ఆమె ఊహ కందలేదు. మాటల్లో, చేతల్లో ఎప్పుడూ బయటపడనివాడు ఈ రోజు ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే ఆ విషయాన్ని ఎంత సీరియస్ గా ఆలోచించాడో తెలుస్తోంది. చాలా సులభంగా ఆచరణీయమవగలదా?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra