Home » Merlapaka murali » కలగంటినే చెలీ

    సిగ్గు కళ్ళలోకి పాకి, ఆ తరువాత పైటను బరువెక్కించినట్లనిపించింది.

    అందుకే ఆమె పైటను సవరించుకుంది.

    అతను అక్కడ చూసి ఏదో గుర్తొచ్చినట్లు "దానిమ్మపళ్ళు" అన్నాడు ఆకాశంవంక చూస్తూ.
 
    అతను ఎందుకలా అన్నాడో అర్ధమై పైటను మరింతగా భుజం చుట్టూ లాక్కుంది. కోపంగా చూసింది. అతను అదేమీ పట్టించుకోనట్లు చిన్నగా నవ్వుతూ వుండిపోయాడు!

    ఆమె ఆ కోపంలో గమనించక లోతుగా వుండే ప్రదేశంలో అడుగేసింది! దాంతో బ్యాలెన్స్ తప్పి నీటిలో పడబోయింది!

    ఇది గమనించిన అతను ఠక్కున ఆమె ఎడమ చేతిని పట్టుకుని ఆపాడు.

    ఆ కంగారులో అతని చేయి పట్టుకుందిగానీ ఆ తరవాత తను ఏం చేస్తున్నదీ స్పురణకు వచ్చి వెంటనే వదిలేసింది. అయితే ఇంగువ కట్టిన బట్టకి ఇంగువ పోయినా ఆ వాసన వదిలిపోనట్టు అతనిచేయి వదిలేసినా ఆ స్పర్శ తాలూకు అనుభూతి అలాగే మిగిలిపోయినట్టు తోస్తోంది. ఆ స్పర్శ కత్చాన్నంతా గిలకొట్టేసినట్టు కదిలిపోయింది. మాటిమాటికి అతని చేయి తాకాలనిపిస్తుంది.

    ఏమైంది తనకి? ఇన్ని రోజులు పాపమని నమ్మిన పనులను తాను చేసేస్తోంది. పైపెచ్చు మనసంతా మధురభావన కమ్మేస్తోంది. పాపానికి ఇంత ఆకర్షణ వుండడం అసంభవం. కాబట్టి ఇదేం పాపంకాదు అని ఆమె అనుకుంటూండగా అవతలి గట్టు వచ్చేసింది.

    ఇసుక్కాలువ దాటి అగ్రహారం చేరుకుని, అక్కణ్నుంచి చౌడు భూములకేసి నడుస్తున్నారు.

    రవి ఏదేదో జోక్ లు చెప్పి ఆడపిల్లల్ని నవ్విస్తున్నాడు. మద్య మధ్యలో అతను తన రియాక్షన్స్ ని గమనసి్తున్నట్లు తెలుస్తోంది. అతని  చూపులకే ఏదో గొప్ప శక్తి వున్నట్లు అతను చూస్తున్నప్పుడంతా పైట బిరుసెక్కుతోంది ప్రవీణకు.

    వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ అసలు చోటుకి చేరేసరికి నాలుగ్గంటలయింది. సాయంకాలపు ఎండ శరీరానికి చక్కిలిగింతలు పెడుతోంది. గాలి కూడా అదే ప్రయత్నంలో వున్నట్లు మెల్లగా వీస్తోంది.

    అమ్మాయిలంతా చౌడు దుమ్మును జల్లించి, మెత్తటి పిండిని బుట్టల్లో పోసుకున్నారు.
 
    ఇదంతా పూర్తయ్యేసరికి సాయంకాలం ఆరుగంటలయింది ప్రవీణ తనతో జల్లెడ తెచ్చుకోకపోవడంతో మరో అమ్మాయి జల్లించుకున్నాక ఆమె దగ్గర జల్లెడ తీసుకుంది. దాంతో చివరికి ప్రవీణ మాత్రం మిగిలిపోయింది.

    "నేనూ ప్రవీణా వస్తాంలెండి. మీరు మెల్లగా నడుస్తూ వుండండి" అని రవి చెప్పడంతో అమ్మాయిలంతా ముగ్గు బుట్టలతో బయల్దేరారు.

    "ఆంజనేయుల గుడి దగ్గరుంటాం. త్వరగా వచ్చేయండి" అని చెప్పారు అమ్మాయిలు.

    "మీరు త్వరపడాలి. ఆలసించిన ఆశాభంగం" నాకట ఫక్కీలో అన్నాడు రవి ప్రవీణతో.
 
    అప్పటికే జల్లెడపడుతూ అవస్థ పడుతోంది ఆమె.

    "నేను జల్లెడ పడతాను! మీరు ముగ్గుపిండిని పైనుంచి పోస్తూ వుండండి" అని కూర్చున్నాడు.

    అంత దగ్గరగా కూర్చున్న అతన్ని చూడడం ఇబ్బందిగా వుంది ఆమెకి.
 
    అతని శరీరం తనను గుచ్చేస్తున్నట్లుంది. పైట బదులు అతని చూపులనే తను కప్పుకున్నట్లు ఫీలవుతోంది. తన నడుము ఎక్కడుందోనని వెతుక్కుంటున్నట్లు అతను అటూ యిటూ కదులుతున్నాడు.

    ఆమె పైనుంచి ముగ్గుపిండిని పోస్తోంది.

    అతను జల్లెడ పడుతున్నాడు.

    అదంతా పూర్తయ్యేసరికి అరగంట పట్టింది.

    అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి.
    సాయంసంధ్య రాత్రి కడుపులోకి దూరిపోయినట్లు క్రమక్రమంగా అదృశ్యమౌతోంది.

    "రండి. వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు" అని తన పాత్రను తను అందుకున్నాడు.
 
    కాని ఆమె తన బుట్టను లేపలేకపోయింది.

    ఇది గమనించి అతను తన పాత్రను కింద దించిపెట్టి బుట్టను ఆమె తలపై కెత్తాడు.

    అతను కావాలనే చేశాడో, లేదా, ఏమరపాటువల్ల తగిలిందోగానీ అతని వేళ్ళు ఆమె జాకెట్టును అలా సవరించాయి. అతను జాకెట్టును తాకినా ఆమెకి మాత్రం గుండెను స్పృశించినట్టుంది.

    రక్తం శరీరమంతా పరుగులెత్తి, ఇక ఎటూ పోను వీలులేకుండా ఎదమీద పుక్కళింతలౌతున్నట్లు సంచలనాలు రేగుతున్నాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra