Home » Dr c. ananda ramam » Nisabdha Sangeetham

 

    "ఇప్పుడు నాతొ ఏ విషయాలూ చర్చించకు. నీకు చేతనయింది చేసుకో అన్నాడు కరుగ్గా.
    సరళ ముఖంలో విజయ గర్వం తాండవమాడుతుంది. మాధవ కరుకుతనానికి చిన్నబుచ్చుకోకపోగా చిరునవ్వు నవ్వింది.
    "ఎందుకలా కసురుకుంటావు? నీకు జానకి గురించిన సమాచారం చెప్పడానికొచ్చాను."
    మాధవ విసుగు త్రుటిలో మాయమయింది.
    "జానకి గురించా? క్షేమంగా ఉంది కదా? ఎక్కడుంది?"
    జానకి పేరు వినగానే మాధవలో వచ్చిన మార్పు, అతని కంఠంలో ధ్వనించిన ఉత్సాహము సరళను కోటి శూలాలతో పొడిచాయి.
    శాంతం తెచ్చి పెట్టుకుంటూ నవ్వింది.
    "క్షేమంగానే ఉంది. మెడ్రాసు లో వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి కుసుమ దగ్గరుంది."
    "నీకెలా తెలిసింది?"
    "మోహన్ కి ఉత్తరం రాసింది"
    ఉలిక్కిపడ్డాడు మాధవ.
    జానకి మోహన్ కి ఉత్తరం రాసిందా?"
    "తను అక్కడ ఎవరి దగ్గరో వంద రూపాయలు అప్పు చేసి మెడ్రాస్ వెళ్ళిందట. మోహన్ ని ఆ వందా వాళ్ళకు పంపెయ్యమని ఉత్తరం రాసింది. వాళ్ళ అడ్రస్ ఇచ్చింది. కొన్ని రోజుల్లోనే మోహన్ అప్పు తీరుస్తానని రాసింది."
    మలినమైన ముఖంతో మాధవ అలాగే నించున్నాడు. ఆ ముఖం చూసిన సరళకు సంతృప్తి కలిగింది.
    మరో సమిధ వెయ్యకుండా వుండలేకపోయింది.
    "నిన్నే ప్రేమించిన జానకి అన్నయ్యను సహాయం కొరటమేమిటో! ఆ వందా మళ్ళీ ఎలా తీరుస్తుందో! నీ అడ్రస్ తెలుసుగా! నీ ఆస్తి దస్తావేజులు నీకు పోస్ట్ లోనైనా పంపలేదేం?"
    విపరీతమైన ఆవేదనా, వెర్రి కోపమూ మనసును నమిలేస్తుండగా సరళను ఉద్దేశించి "కుసుమ అడ్రస్ తెలుసా నీకు?" అన్నాడు.
    "తెలుసు"
    జానకి మోహన్ కు రాసిన ఉత్తరాన్ని మాధవ కందించింది సరళ.
    సరళ ప్రవర్తన మోహన్ కు నచ్చలేదు. మాధవ మరొకర్ని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ భార్య భర్తలిద్దరికీ పరస్పరం ప్రేమనురాగాలున్నప్పుడు సరళ ఇంకా మాధవ కోసం పాకులాడటంలో అర్ధం లేదనిపించింది. ఆ విషయమే సరళకు చెప్పి చూశాడు. అయినా సరళ తన పట్టు విడవలేదు. విసుగు పుట్టి సరళ విషయంలో జోక్యం కలిగించుకోవటం మానేశాడు మోహన్.
    తనకు జానకి రాసిన ఉత్తరం చూపించి మాధవకు జానకి సమాచారం తెలియజెయ్యమని మోహన్ సరళతో చెప్పాడు.
    కాని సరళ ఆ ఉత్తరాన్ని ఒక అస్త్రంలా ఉపయోగించుకుంటుందని మోహన్ ఊహించలేదు. కసిగా చేతిలో ఉత్తరాన్ని నలుపుతున్న మాధవను సంతృప్తిగా చూస్తూ విజయగర్వంతో వెళ్ళిపోయింది సరళ.


                                                           10


    శ్రీనివాసు , కుసుమ, శ్యామ్, జానకి అందరూ కుసుమ తీసుకున్న రెండు గదుల అద్దె వాటాలో ముందు గదిలో కూచుని మాట్లాడుకుంటున్నారు.
    "మీ యిష్టం. మీరెప్పుడు మూహూర్తం నిశ్చయిస్తే అప్పుడే చేసుకుంటాను" వినయంగా అన్నాడు శ్యామ్.
    శ్రీనివాస్ తేలిగ్గా నిట్టూర్చాడు.
    కుసుమ ముఖం సంతోషంతో వెలిగిపోలేదు. ఒక్కసారి నిరసనగా శ్యామ్ వంక చూసి "ఈయన చాలా మంచివారు నాన్నా!' అంది వ్యంగ్యం ఉట్టిపడుతున్న స్వరంతో.
    ఆ వ్యంగ్యం శ్యామ్ ను నొప్పించినా తేలిగ్గా నవ్వేశాడు. జానకి ఏదీ మాట్లాడకుండా తలవంచుకుని కూచుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ యింట్లో అడుగు పెట్టాడు మాధవ.
    తలవని తలంపుగా మాధవను చూసిన సంబరంలో చటుక్కున లేచి నించుంది జానకి.
    ఒక్కవారం రోజుల్లో ఏదో పెద్ద జబ్బుపడి లేచినదానిలా వున్న జానకిని చూస్తూ "ఈ నా జానకి మరొకరిని ప్రేమించటమా?" అనుకున్నాడు మాధవ.
    అకస్మాత్తుగా మాధవను చూసినందుకు సంతోషం. అతను సరళతో లజ్జాకరమైన తన రహస్యం చెప్పాడే అన్న విషాదం. అతనిముందు వెలితి పడకుండా తెచ్చి పెట్టుకున్న గంభీర్యం ఒకదాని వెనుక మరొకటి తెరలలా కమ్ముకున్నాయి జానకి ముఖాన్ని. అందరిలో ముందుగా శ్రీనివాస్ ఆశ్చర్యం నుండి తేరుకుని "రండి.....రండి.....కూచోండి" అని ఆహ్వానించాడు.
    శ్రీనివాస్ ప్రక్కన కూచుంటూ శ్యాం వంక చూశాడు మాధవ.    
    అతడి చూపులు గమనించి "ఇతను శ్యామ్ సుందర్. మా కుసుమకి కాబోయే భర్త" అని పరిచయం చేశాడు శ్రీనివాస్.
    "ఈయన పరిచయం నాకూ కలిగించండి మరి" అని నవ్వుతూ మాట కలిపాడు శ్యామ్.
    "ఈయన మాధవరావుగారు. జానకి భర్త."
    మాధవ సూటిగా జానకి కళ్ళలోకి చూశాడు. ఆ చూపులకు నిలువెల్లా వణికి తలదించుకుంది జానకి.
    "ఇక్కడకు పనిమీద వచ్చావా జానకీ? నాకు తెలియచెయ్యటానికి వ్యవధి లేకపోయిందా?' సౌమ్యంగా అడిగాడు మాధవ.
    జానకి ఏ సమాధానమూ చెప్పలేకపోయింది. ప్రక్కనే శ్యామ్ ఉన్నాడు ఏం మాట్లాడగలదు?
    "వెంటనే బయలుదేరు మన ఊరికి వెళ్దాం. అన్ని సంగతులూ వివరంగా చెపుతాను. నాకు సెలవు లేదు. ఒక్కరోజే సెలవు పెట్టాను. రేపు డ్యూటీలో జాయినవ్వాలి."
    అప్పటికీ జానకి మాట్లాడలేదు. కుసుమ చేతిని గట్టిగా పట్టుకుని అలాగే కూచుంది.
    మాధవలో అసహనం కలిగింది.
    "లే జానకీ! బయలుదేరు" అన్నాడు అజ్ఞాపిస్తూన్నట్లు.
    "క్షమించండి. నేను రాలేను." పూడుకుపోతున్న గొంతును పెగల్చుకుంటూ అంది.
    "రాలేవా?" ఎప్పుడు రాగలవు?"
    తలెత్తి మాధవను చూసే సాహసం లేక అలాగే తలదించుకుని సమాధానం చెప్పింది జానకి.
    "ఎప్పటికీ రాలేను"
    శ్యామ్ విచిత్రంగా అందరి వంకా చూశాడు.
    ఇందరిలో జానకి చెప్పిన సమాధానం మాధవ మనస్సును మండించింది.
    "ఒహొ౧ ఇప్పుడు నువ్వు ఆస్తిపరురాలివి కదూ! నాలాంటి వాళ్ళను వంద మందిని పోషించగలవు.... నా దగ్గరకు రావలసిన అవసరం లేదు , నా ఆశ్రయం నీకిక అక్కర్లేదు.'
    పెనుగాలికి కంపించే తీగెలా జానకి వణికిపోవటం స్పష్టంగా కనిపించింది మాధవకు. కుసుమ చెయ్యి గట్టిగా పట్టుకుని తలదించుకుని కూచుంది. కుసుమ తన చేతిని జానకి భుజం చుట్టూ వేసి దగ్గరగా అదుముకుంది.
    ఎప్పటిలా "ఇది నా ఆస్తి కాదు. మీది" అని జానకి అంటుందని ఆశించిన మాధవ జానకి ఏమాటా లేకుండా కూచోవటంతో మండిపోయాడు.
    "ఇప్పుడు నువ్వు కావలసినంత కట్నమిచ్చి నాకన్నా అన్నివిధాల యోగ్యుడైన భర్తను సంపాదించుకోగలవు. కట్నమిచ్చుకోలేక నాలాంటి సామాన్యుడిని ప్రాధేయపడవలసిన అవసరం లేదు . నీకు విడాకులెప్పుడు కావాలో చెపితే...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra