Home » Vasundhara » Vasundhara Kadhalu - 10

 

    నా గుండెలు అవిసిపోయాయి. అతని మాటలు నేను నమ్మలేదు. అప్పటికప్పుడు రాజకుమార్ గదిలో ఫిల్సు ప్రదర్శించి చూపేక నామీద నాకే అసహ్యం వేసింది. ఎటువంటి దానికి ఎటువంటి గతి పట్టింది?
    "ఇది ఇంకెవరయినా చూశారా?"
    "నిన్ననే ఒక మినిస్టర్ గారికి మా లాడ్జికి సంబందించిన కొన్ని ఫిల్మ్స్ చూపించాం. అయన నీమీద మోజు పడ్డారు. ఎల్లుండి రాత్రి పది గంటలకి మహూర్తం పెట్టేరు. ఆయనతో మాకో ముఖ్యమయిన పని వుంది. ఈ దెబ్బతో మాపని కూడా జరిగిపోతుంది" నీకు పది వేల రూపాయలు బహుమానం కూడా వుంటుంది" అన్నాడు రాజకుమార్.
    "నాకు వివాహమయిందనీ భర్త ఉన్నడనీ తెలుసుగదా మీకు...."
    'అదేగా నీ అభ్యంతరం!" అని రాజకుమార్ నవ్వేడు. ఆ నవ్వు చూస్తుంటే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. అతని దృష్టిలో నా స్థానం యేమిటో ఆ నవ్వు చెబుతుంది. "నీ భర్తకు నిద్ర మందు పెట్టి మేము పంపించిన కారులో ఎక్కి ఇక్కడకు వచ్చి పని పూర్తీ చేసుకుని పది వేల రూపాయలతో తిరిగి వెళ్ళు ."
    'చెప్పవలసింది చెప్పావుగా. ఇంక వెళ్ళు" అన్నాను కసిగా.
    "వెడతాను. కానీ అప్పుడే కాదు...." అన్నాడు రాజకుమార్. అతన్ని నేను వారించగల నైతిక శక్తిని ఎప్పుడో కోల్పోయాను.
    రాజశేఖరం తిరిగి వచ్చేదాకా రాజకుమార్ అక్కడే వున్నాడు. నాకు నా శరీరం అంటే అసహ్యం వేస్తోంది. రాజశేఖరం రాజకుమార్ ని చూసి, "యిందాకట్నుంచీ ఇక్కడే వున్నావా?" అన్నాడు.
    "లేదు , మళ్ళీ ఇప్పుడే వచ్చాను. గంగాధర్ కల్సుకున్నారా?" అన్నాడు.
    "ఊ" అన్నాడు రాజశేఖరం అదోలా. అతని ముఖంలో దిగులు కనిపించింది. రాజకుమార్ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
    "రాజా -- నువ్వు నన్నేం చేయదలచుకున్నావో నాకు తెలియడం లేదు" అన్నాను.
    "ఏమయింది?" అన్నాడు రాజశేఖరం . అతను చాలా నిరుత్సాహంగా వున్నాడు.
    "ఈ రాజకుమార్ -- ఈ గదిలో మనం పొందిన అనుభవాలన్నింటినీ సినిమాగా తీశాడు"అన్నాను.
    రాజశేఖరం ఆశ్చర్యపోయాడు. అతనికి వివరంగా వాడు చెప్పిన మాటలు చెప్పాను. వాడు నన్ను లోబర్చు కున్న విషయం మాత్రం చెప్పలేదు.
    రాజశేఖర్ పిడికిళ్ళు బిగిశాయి. "ఆ స్కౌండ్రల్ని చంపేస్తాను..." అన్నాడు.
    "వెంటనే ఆ పని చేయి. దేశానికి మేలు జరుగుతుంది అన్నాను.
    రాజశేఖరం ముఖం గంబీరంగా అయిపొయింది. "కానీ వాడి దగ్గర ఫిల్ము వుండిపోయింది. ఇలా యెంత మందికి సంబంధించినవి వున్నాయో వాడి దగ్గర. ఆ విశేషాలన్నీ బయట పెట్టకుండా ...." అంటూ ఆగాడు.
    "నువ్వు రాజకుమార్ ని చంపావు. చంపలేవు. నాకు తెలుసు" అన్నాను.
    "ఏం?" అన్నాడు రాజశేఖరం.
    "ఇదంతా నువ్వాడుతున్న నాటకం. తెలివి తక్కువగా ఇందులో నేనిరుక్కుపోయాను. నీపాత్ర లేదని ఇంకా నన్ను నమ్మించాలని చూడకు" అన్నాను.
    రాజశేఖరం అట్టే తడబడలేదు -- "పరిస్థితులా వచ్చాయి. నువ్వలాగనుకోవడంలో తప్పు లేదు. కానీ నా పవిత్ర ప్రేమను నువ్వర్ధం చేసుకునే రోజు రాకపోదు"
    "ఎప్పుడు?" నేను ఆత్మహత్య చేసుకున్నాకనా?" అన్నాను.
    "ప్లీజ్ మోహనా! ఆత్మహత్య గురించి ఆలోచించకు. త్వరలోనే మనమిద్దరం వివాహం చేసుకుందాం"మన్నాడు రాజశేఖరం.
    "గంగాధర్ ఎవరు?" అన్నాను.
    "అవన్నీ నీకు తర్వాత చెబుతాను" అన్నాడు రాజశేఖరం.    
    "నాకు తెలుసు . గంగాధర్ అన్నది నీవు సృష్టించిన పాత్ర. గదిలో నన్నీ పరిస్థితుల్లో కాసేపు రాజకుమార్ కు అప్పగించి వెళ్ళడం కోసం ఈ నాటకం ఆడారు...." అన్నాను.
    "నువ్వేమనుకున్నా సరే, రేపు మళ్ళీ లాడ్జికీ రావడం మానవద్దు. నువ్వు లేకపోతె నేనుండలేను" అన్నాడు రాజశేఖరం దీనంగా నావంక చూస్తూ. అ చూపులకు నేను కరిగిపోలేదు. అతని వంక అసహ్యంగా చూస్తూ -- "నేనెంత తెలివి తక్కువదాన్ని! ఎంతో అసహ్యకరమైన అనుబంధానికి ప్రేమ అని నువ్వు పేరుపెడితే నమ్మి నువ్వు చెప్పినట్టల్లా ఆడాను. ఇంక అలా జరగదు. రేపు నా గుమ్మం తోక్కాలో ఉరేసుకు చస్తాను" అన్నాను.
    అక్కడింక ఒక్క క్షణం కూడ వుండబుద్ది వేయలేదు. తక్షణం బయటపడ్డాను.

                                     9
    మర్నాడు బుద్దికి నేను వెళ్ళలేదు. రాజశేఖరం నా ఇంటికీ రాలేదు. ఆరోజు మధ్యాహ్నం నాకు హాయిగా నిద్ర పట్టేసింది. ఆ మర్నాడు మధ్యాహ్నం కూడా నేను మంచి నిద్రలో వున్న సమయంలో ఎవరో యింటి తలుపు తట్టారు.
    వెళ్ళి తీశాను. పరిచయం లేని ఆడపిల్ల!
    లోపలకు రమ్మన్నాను. ఆమె తలుపులు వేసి "రాత్రి పనికోసం స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకువచ్చాను. ఇది స్పెషల్ వెరైటీ. ఒక్క టాబ్లెట్ వేసుకుని పడుకుంటే ఎనిమిది గంటల సేపు మహా ప్రళయం వచ్చినా లేవకుండా నిద్రపోతారు" అంది.
    ఆమె కంఠం అదోలా వుంది. నేనామె వంక ఆశ్చర్యంగా చూసేలోగా -- "కంగారు పడకు . నేను నీకేమీ అపకారం చేయను" అందామె. ఆమె ఆడపిల్ల కాదని మగవాడనీ అప్పుడే నాకు తెలిసిపోయింది. అతను రాజకుమార్.
    "నిజానికి ఈ వేషం వేయాల్సిన అవసరం నాకు లేదు. నీపట్ల ఆకర్షణ చాలా బలంగా వుంది నాకు. నలుగురి అనుమానానికి గురయ్యే పరిస్థితుల్లో నిన్నుంచడం ఇష్టం లేక ఈ వేషంలో వచ్చాను" అన్నాడు రాజకుమార్.
    అతన్నీ ఏమనాలో తెలియకపోయినా వారించే శక్తి లేక వూరుకున్నాను. అతను వెళ్ళిపోయాక నా జీవితం గురించి మళ్ళీ కాసేపు ఆలోచించుకున్నాను. ఎందుకో నాకు ఏడుపు వచ్చింది.
    రాత్రి తొమ్మిదిన్నరకు టాబ్లెట్ ప్రభావంతో వళ్ళు తెలీయకుండా నిద్రపోతున్న వీర్రాజును చూస్తుంటే నాకు మొదటి సారిగా జాలి కలిగింది. అతని ఉద్యోగ జీవితం యెటువంటిదో నాకు తెలియదు. కానీ నిజ జీవితం లో మాత్రం అంతులేని క్రమశిక్షణ పాటిస్తాడు. పాటించమని నన్ను వేదిస్తాడు. అతని మాటలు అక్షరాలా పాటించి వుంటే నాకీ గతి పట్టి వుండేది కాదేమో!
    రాత్రి పదిగంటలకు ఇంటి ముందు కారాగింది. ఇంటికి తాళం పెట్టి అందులో వెళ్లాను నేను.
    సాధారణంగా ఆ సమయానికి వీధి నిర్మానుష్యంగా వుంటుంది. నన్నెవరూ గమనించి ఉంటారనుకోను. ఒకవేళ ఎవరయినా గమనించినా ఆయనకు చెప్పే అవకాశం లేదు. వీధిలో ఎవ్వరి తోటీ ఆయనకు పరిచయం లేదు. క్రమశిక్షణ పేరుతొ ముభావంగా వుండడం వల్ల అయన అంటే చాలామందికి కిట్టదు కూడా.
    ఆ మినిస్టరన్నవాడు చాలా అసహ్యంగా వున్నాడు. నలభై అయిదేళ్ళు ఉంటాయేమో! మనిషి లావుగా వున్నాడు" పెద్ద బొజ్జ , చూపుల్లో కుళ్ళు! గారపట్టిన పళ్ళు!
    అంతవరకూ నన్ను నేను అసహ్యించుకున్నానెమో గానీ ఆ రాత్రి నేను  వ్యభిచారిణి నన్న భావం నాలో కలిగింది. వాడు రాజశేఖరం లో నేను పొందిన అనుభవాలు సినిమా చూస్తూ తన్ను రాజశేఖరం కంటే ఉన్నతుడిగా భావిస్తూ నాతొ మాట్లాడుతూ నన్ను శారీరకంగా మానసికంగా చిత్రహింస చేశాడు. వాడు దగ్గరున్నంత సేపూ నరకంలో వున్నట్లే వుంది కానీ అసహ్యించుకునే స్వతంత్రత లేక రాజకుమార్ చేసిన హెచ్చరికలను దృష్టిలో వుంచుకుని ఎంతో ఆనందాన్ని నటిస్తూ రసికతను ప్రదర్శించాను.
    అక్కణ్ణించి బయటపడే ముందు నాకు వందరూపాయల నోట్లు అందాయి. మళ్ళీ కారెక్కాను.
    ఇదేనా నేను కోరుకున్న స్వేచ్చ! క్రమశిక్షణ గురించి పట్టుబట్టే భర్త బాధ భరించలేక నేను రాజశేఖరాన్ని ఆశ్రయిస్తే నాకు లభించినదేమిటి? నా కిష్టం లేని మనిషికి నేనసహ్యించుకునే మనిషికి నన్ను నేను అర్పించుకోవలసి వచ్చింది.
    కారును సందు మొదలులో అపిచేయమని చెప్పాను. అక్కణ్ణించి దిగి తిన్నగా ఇంటికి వెళ్ళి తలుపు తీస్తుంటే భుజం మీద ఎవరిదో చేయి పడింది. ఉలిక్కిపడి అటు తిరిగాను.
    అతను గోవిందరావు ! మా వీధిలోని బ్రహ్మచారి.
    "ఎంత ధైర్యం?" అనుకున్నాను కానీ అనలేదు. ఆ ధైర్యానికేదో కారణముంటుందని వూహించగలను. ఐతే నా గురించి ఇతని క్కూడా తెలిసిపోయిందా?
    "మీ ఇంటికి కారు రావడం చూశాను. మీరొక్కరే అదేక్కడం చూశాను. నా స్కూటర్ మీద కారుని అనుసరించాను కుతూహలంతో. కారు శోభా లాడ్జికి వెళ్ళింది. మీరు లాడ్జికి వేడతారని నాకు తెలియదు. లేకపోతె ఎప్పుడో ప్రయత్నించేవాణ్ని. అక్కడే పడిగాపులు పడి కూర్చున్నాను. మీరు బయటకు వచ్చేదాకా! మీ సంగతి నాకు తెలిసిపోయింది. నన్ను మీరు కాదనకూడదు...." అన్నాడు గోవిందరావు.
    భోరుమని ఏడవాలని పించింది. ఎంచేతో కళ్ళలోకి నీళ్ళు రాలేదు.
    అతనికి ఏదోవిధంగా నచ్చజెప్పి, మర్నాడు అతని కోరిక తప్పక తీరుస్తానని చెప్పిపంపేశాను.

                                  10
    వీర్రాజు ఆఫీసుకు వెళ్ళిపోయాక ఓ అరగంట సేపు తీరుబడిగా ఆలోచించాను.
    నేనిప్పుడు గౌరవమందుకోగల ఆడదాన్ని కాదు, బజారు మనిషిని, రోజురోజుకు నన్ను లొంగదీసుకునే మగవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ బ్రతుకు నాకు దుర్భరంగా వుంది. ఇలా జీవించాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకొక్కటే మార్గం కనబడుతోంది! దే నా ప్రాణాలు నేను తీసుకోవడం!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra