Home » Vasundhara » Vasundhara Kadhalu - 9

 

                                     8
    
    ఆనంద్ తలుపు తట్టి ఆశగా ఎదురు చూస్తున్నాడు.
    అంతకు ముందురోజు కాకినాడ వచ్చాడు. వెంకట్రావు కళ్ళ బడకుండా అతన్ని బ్యాంకు నించి అనుసరించి ఇల్లు కనుక్కున్నాడు. ఆరోజు కాగి ఈరోజు వెంకట్రావు బ్యాంకు చేరిన అర్ధగంట కు నెమ్మదిగా అతని ఇల్లు చేరి తలుపు తట్టాడు.
    తలుపు తీసిన కుసుమ ఏం చేస్తుంది? నిండు మనసుతో ఆహ్వానిస్తుండా? లేక ఇది సమయం కాదని నిరుత్సాహ పరుస్తుండా?
    తలుపులు తెరచుకున్నాయి. ఆశగా చూసిన ఆనంద్ దెబ్బతిన్నాడు.
    ఆమె కుసుమ కాదు. కుసుమ కంటే అందంగా వుండడం సాధ్యం కాదు గాబట్టి కుసుమంత అందంగా ఉందని చెప్పవచ్చు. కామీ ఆమె ఎవరు?
    "ఇది సేట్టీస్ బ్యాంకులో పనిచేస్తున్న వెంకట్రావు గారిల్లెనండీ?"
    'అవును-"
    "మీరెవరు?"
    "వారి భార్యను...." అందామె.
    ఆనంద్ ఉలిక్కిపడి -- "నిజంగా?' అన్నాడు.
    ఆమె కళ్ళలో ఆశ్చర్యం కనబడింది. "భార్యలు అబద్దం గా కూడా ఉంటారా?"
    "వెంకట్రావు నాకు తెలుసు. అతను విశాఖపట్నం లో పని చేసేటప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు. అందువల్ల అతని భార్య నాకు తెలుసును. ఆమె పేరు కుసుమ...."
    "ఈసారి ఆమె కళ్ళలో ఆశ్చర్యం కనపడలేదు -- "లోపలకు రండి" అంది.
    ఆనంద్  లోపలకు వెళ్ళేక ఆమె కుర్చీ చూపించింది. 'ఆయనకిది రెండవ వివాహమని నాకు తెలుసు. అయన అవన్నీ నాకు చెప్పేరు. మొదటి భార్య చాలా అందమైనది. అపురూపంగా చూసుకునేవారు. కానీ ఆమె ప్రవర్తన సరైనది కాదు. బరితెగించిన ఆడది, చుట్టుపక్కల వున్న మగవాళ్ళందర్నీ ఏదో సమయంలో ఆమె తన ఇంటికి రప్పించు కునేది.
    ఈ విషయంలో ఆయనకు బలమైన ఆధారాలు దొరికాయి. అయన మనసు చెదిరిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఒకరోజీ విషయంలో ఇంట్లో పెద్ద ఘర్షణ జరిగింది. కుసుమ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అయన వెంటనే ట్రాన్స్ ఫర్ కి ప్రయత్నించారు.
    కుసుమ ప్రవర్తన తెలిసినప్పట్నించీ నాతొ కరెస్పాండన్సు లో వున్నారు. మేమిద్దరం కాలేజీలో ఒకరికొకరికి బాగా తెలుసు. నాకు నా అన్న వాళ్ళెవరూ లేనట్లే . బంధువులింట్లో కాస్త హీనమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఈయన వివరాలన్నీ విన్నాక ఈయన్ని పెళ్ళి చేసుకుంటే నేను సుఖపడి తన్ను సుఖ పెట్టగలనని నాకు తోచింది. అంగీకరించాను. దయచేసి మీరాయన్ను మళ్ళీ కలుసుకొని కుసుమ సంగతులు గుర్తు చేయకండి" అందామె.
    "ఇప్పుడు నేను వెంకట్రావు గారి కోసం మీ ఇంటికి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడి వెడుతున్నాను. ఇది చూసిన ఇరుగూ పొరుగూ చిలవలూ, పలవలూ అల్ల వచ్చు. అది మీ అయనకు చేరి మిమ్మల్ననుమానించవచ్చును. అప్పుడు మీకూ కుసుమ గతే పట్టవచ్చు. వివాహానికి ముందు మీ అయన మాటల్లోని నిజం గురించి అలోచించడానికి ప్రయత్నించారా?' అన్నాడు ఆనంద్. ప్రవర్తన సరైనది కాని కుసుమ తనకు ఒక్క సారి కూడా దక్కలేదని అతనికి చాలా మంటగా వుంది.
    "ఆయన్ను నేను బాగా అర్ధం చేసుకున్నాను. అయన అబద్దం చెప్పరు. మీరే చెప్పండి. కుసుమకు పారుగునే ఉంటున్నారు. ఆమె ప్రవర్తనలో మీకే లోపమూ కనబడలేదా?' అందామె.
    ఉల్లి పాయలకు వచ్చినాప్పుడు చేయి పట్టుకుంటే ఇంట్లో అయన వున్నారన్న కుసుమ -- తన కౌగిలి లో అరక్షణం పాటు కరిగిన కుసుమ -- తను నడుము పట్టుకు నడిపిస్తే తనతో కొన్ని అడుగులు వేసిన కుసుమ -- అతని కళ్ళ ముందు మెదిలింది, అయినా అతను "లేదు" అన్నాడు.
    "అబద్దం" అందామె. "ఆయనీ వూళ్ళో ఉన్నారని మీకు తెలుసు. ఇదాయన ఇల్లని మీకు తెలుసు. ఈ టైములో ఆఫీసులో ఉంటారాయన అని తెలుసు. అయినా మిరిప్పుడే వచ్చి తలుపు తట్టారు. అంటే మీరు వచ్చింది కుసుమ కోసం. అందులో ఇంకేమీ సందేహం లేదు. అయన మాటల్లోని నిజం, కుసమ ప్రవర్తన లోని లోపం బయల్పరచడానికి-- ఇంతకంటే బలమైన దృష్టాంతం అవసరం లేదు..."
    ఆనంద్ దెబ్బతిన్నాడు. చటుక్కున లేచి "వస్తా నమ్మా!" అన్నాడు అప్రయత్నంగా.
    "మంచిది, వెళ్ళి రండి!" అందామె.

                                                               9
    "మీతో ఒక క్షణం మాట్లాడాలి" అన్నాడు ఆనంద్.
    వెంకట్రావు తలెత్తి చూసి "ఓహ్ మీరా" అన్నాడు ఆశ్చర్యంగా. అతని ముఖంలో కాస్త ఇబ్బంది కూడా కనబడింది. అయినా లేచి "రండి" అన్నాడు. ఇద్దరూ ఒక చిన్న గదిలోకి వెళ్ళారు.
    "ఏమిటి చెప్పండి?"
    "మీరు చేసినపని ఏమీ బాగాలేదు...." అన్నాడు ఆనంద్.
    "ఏ పని?"
    "కుసుమని వదిలిపెట్టి వివాహం చేసుకోవడం."
    'అది మీ కనవసరం" అన్నాడు వెంకట్రావు కోపంగా.
    "అవసరం కాదు. వ్యవహారం కోర్టు దాకా వెడుతుంది."
    "ఎందుకని?"
    "కుసుమకు న్యాయం చేకూర్చాలి కాబట్టి...."
    "కుసుమకూ మీకూ ఏమిటి సంబంధం?"
    "ఏ సంబంధమూ అవసరం లేదు. ఆమె మా యింట ఆశ్రయం కోరింది. ఒక సహ్రుదయుడిగా నేనామెకు సహాయపడదల్చుకున్నాను...."
    "కుసుమ మీ దగ్గరకు వచ్చిందా?" అని నవ్వాడు వెంకట్రావు. "బహుశా నా భార్యగా ఉన్నప్పుడయ్యుంటుంది."
    "ఏమిటి మీరనేది?"
    "మీకూ తెలిసే ఉంటుంది. కుసుమ ప్రవర్తన సరైనది కాదు.ఆమెను వదలిపెట్టేయ దల్చుకున్నాను. ఆ సంగతి ఆమెకు చెప్పాను. ఆమె విని ఊరుకుంది. కానీ ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు ఇద్దరం ఘర్షణ పడ్డాం. తను నన్నువదిలి వెళ్ళిపోతానని వాగ్దానం చేసింది కుసుమ. ఆరాత్రే ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది."
    "ఎక్కడకు...."
    "నేరుగా నరక లోకానికి. ఎక్కడకు పొతే నా కెందుకు?"
    "కానీ కుసుమ ఇప్పుడు నా దగ్గరుంది."
    "ఉంచుకోండి- మీ దగ్గరే. కానీ కుసుమ లాంటి ఆడదాన్ని మీఇంట్లో వుంచుకునేందుకు మీ ఆవిడ ఒప్పుకోక పోవచ్చు. కొత్త మగవాణ్ణి చూస్తె ఆమె మనసు నిలవదు...."
    "ఒక భార్య బ్రతికుండగా ఇంకో వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం...."
    "బ్రతికుందని మీరు రుజువు చేయండి....' అని వెంకట్రావు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. ఆనంద్ మ్రాన్పడిపోయాడు.
    బ్రతికుందని తను ఋజువు చేయాలిట. అంటే కుసుమ బ్రతికిలేదా? ఆనంద్ మనసులో రంగు మారిన తన ట్రంకు పెట్టి తళుక్కుమంది.

                                    10
    "నేను నమ్మను" అంది రాజేశ్వరి. "వెంకట్రావు దుర్మార్గుడవునో కాదో నాకు తెలియదు. కానీ ఒక మనిషిని హత్య చేసిటంత నీచుడై వుంటాడని నేననుకోను."
    'అది సరే, ఈరోజు రాత్రి పెళ్ళాం పుట్టింటికి వెడితే మర్నాడుదయం అతగాడికి మనిషి పట్టేటంత ట్రంకెందుకు కావల్సోచిందట?" అన్నాడు ఆనంద్.
    "ఏమో-- ఎందుకో -- మన కెందు గ్గానీ అసలింతకీ ఈ ట్రంకు నీ దగ్గరెందుకుందిట?' అంది రాజేశ్వరి.
    ఆనంద్ కు వెంటనే జవాబు దొరకలేదు. క్షణం అలోచించి "ఎక్కువ సామాను పడుతుంది కదా అని కొన్నాను" అన్నాడు.
    "అందుకే వెంకట్రావూ అడిగుండ వచ్చు. చేజారి పోయిన కుసుమ గురించి ఎక్కువ అలోచించి మనసు పాడు చేసుకోకు. దానికి మద పిచ్చి, అదే దాన్ని నాశనం చేస్తుంది" అంది రాజేశ్వరి.
    ఆనంద్ ఇంక ఈ విషయంలో మాట్లాడ దల్చుకోలేదు. మర్నాడు సినిమా నుంచి తిరిగి వచ్చిన రాజేశ్వరి కంగారుగా అతన్ని పలకరించే వరకూ అతనామేతో ముభావంగా వున్నాడు.
    "బహుశా మన మీ ఊరు వదిలి పోవాలేమో " అంది రాజేశ్వరి.
    "ఎందుకు?"
    "సినిమా అయిపోయాక చూశాను. హాల్లోంచి బయటకు వెడుతూ కనిపించాడు నాకు. నన్ను చూశాడో లేదో తెలియదు కానీ నా శరీరమంతా వణికిపోయింది. చూస్తుండగా జనంలో కలిసిపోయాడు..."
    "ఎవరు?"
    "రంగారావు" అంది రాజేశ్వరి.
    "ఇంపాజిబుల్" అన్నాడు ఆనంద్ అప్రయత్నంగా.
    "రంగారావు నాకు తాళికట్టిన భర్త, నీ అంత దగ్గరగా నాకు వచ్చిన మగవాడు. అతన్ని గుర్తుపట్టడంలో నేను పొరపాటు చేయను. నాకిప్పుడు చాలా భయంగా వుంది. నేను చేసిన మోసం గ్రహించి నామీద పగ తీర్చుకుంటాడెమోనని...." అని ఆగింది రాజేశ్వరి.
    "నీకు అండగా ఆనంద్ వున్నాడు. అలాంటి భయాలేమీ పెట్టుకోకు. రంగారావు నిన్నేమీ చేయడు చేయలేడు. నేను హామీ ఇస్తున్నాను...." అన్నాడు ఆనంద్.
    "ఏమో బాబూ .... నన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాడే మోనని నాకు చాలా బెంగగా ఉంది ....' అంది రాజేశ్వరి.
    ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. రంగారావు ను తను చేతులారా చంపాడు. అతను బ్రతకడం అసాధ్యం. అయితే రాజేశ్వరి ఎవర్ని చూసింది? ఆ చూసినతనికి రంగారావు పోలికలు ఉన్నాయా. లేక రాజేశ్వరి తన దగ్గర ఏదైనా ట్రిక్స్ వేస్తోందా?
    ఆమె ట్రిక్స్ వేస్తోందను కుందామనుకుంటే ఎందుకు? ఆమెకు తన మీద అనుమానం కలిగే అవకాశం ఈ షణ్మాత్రం కూడా లేదు. అలాంటప్పుడు ఏం జరిగింది?
    అతనికి జవాబు తోచలేదు. చిరాగ్గా అతను అరుగు మీదకు వెళ్ళాడు. ఆలోచిస్తూ పదిహేను నిముషాలు నిలబడ్డాడు. ఇంతలో అతన్ని ఎవరో పిలిచారు.
    "సార్, మే పేరేనా ఆనంద్."
    "అవును, ఏం?" అన్నాడు కుర్రవాడిని పరీక్షగా చూస్తూ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra