అభిరాం వాచ్ చూసుకున్నాడు. ఉదయం ఎనిమిదిన్నరయింది టైమ్. "అంటే సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకూ మృత్యువుతో పోరాటం చేస్తాడు తన స్నేహితుడు మహదేవ్" అనుకున్నాడతను. అతనికి మనస్విని గుర్తొచ్చింది.... మహదేవ్, మనస్వినిల ప్రేమ గుర్తొచ్చింది.
    
    "ఆమెకీ విషయం చెప్పాలా? వద్దా?" అనుకున్నాడు.
    
    చెప్పకూడదనే చివరికి నిశ్చయించుకున్నాడు.
    
    "అంతా బాగయ్యాక మామూలు గాయాలయ్యాయని చెప్పవచ్చు. ఇప్పుడే చెప్పేస్తే ఆమెనీ కంగారు పెట్టడం తప్ప ఉపయోగమేమీ వుండదు" అన్పించింది.
    
    "మీ స్నేహితునికి బంధువులు, తల్లీ దండ్రీ ఎవరూ లేరా?" అడిగాడు డాక్టర్.
    
    "తళ్ళీ, చెల్లీ వున్నారు. తల్లి గుంటూరుకు దగ్గరలోని పల్లెటూరిలో వుంటుంది. చెల్లెలికి మ్యారేజ్ అయిపోయింది. అయినా ఎవరికీ ఏమీ చెప్పనవసరం లేదు. వాళ్ళని భయపెట్టడం తప్ప" అన్నాడు అభిరాం.
    
    "నిజమే" నన్నట్టు తలూపాడు డాక్టర్.
    
    అభిరాం, వరప్రసాదం బయటికి నడిచారు. విజిటర్స్ సోఫాలో వెనక్కి వాలి భారంగా కళ్ళు మూసుకున్నాడు అభిరాం. అతని పక్కనే కూర్చుని అతన్ని సముదాయిస్తున్నట్టు అతని భుజం మీద చెయ్యేసి నిమిరాడు వరప్రసాదం. సమయం నత్తనడక నడుస్తోంది.
    
    అభిరాం గుండె వేగంగా కొట్టుకుంటోంది. వరప్రసాదం భావ రహితంగా వుండిపోయాడు.
    
                                                        *    *    *    *    *
    
    ఆరోజు ఎందుకో మనస్విని అదోలా వుంది. మంచు తిన్న కోయిల పాట పాడలేనట్టు, చినుకురాలక మయూరం నర్తించలేనట్టు.
    
    అన్యమనస్కంగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుంది. కాఫీ మాత్రం తాగింది. టిఫిన్ కూడా చేయబుద్ది కాలేదు. మహదేవ్ వాళ్ళమ్మకి తమ విషయం చెప్పటానికి వెళతానన్నాడు... అన్న విషయం గుర్తుకొచ్చి టైమ్ చూసింది. టేబుల్ క్లాక్ ఉదయం ఏడున్నర చూపిస్తోంది సమయం.
    
    ఆమెకెందుకో ఎప్పుడూ లేనంత నిస్సత్తువ ఆవరించింది. "మహదేవ్ తల్లి తమ పెళ్ళికి అంగీకరించదన్న అనుమానంతోనా" తనని తానే ప్రశ్నించుకుందామె కాదు..... ఇంకేదో కారణం. ఇదీ అని చెప్పలేని దిగులు......ఆ సమయంలో గుండెలో గుబులు చెప్పుకోవటానికి ఎవరయినా వుంటే బాగున్ననిపిస్తుంది ఎవరికయినా, ఆమెకీ అలాగే అనిపించింది.
    
    కానీ ముందు నుంచి తన పనేదో తాను చేసుకుపోతూ ఎవరితోనూ కలవని తనకి ఎవరూ దగ్గరకాకపోవటం గుర్తొచ్చి భారంగా విశ్వసించింది.
    
    ఆఫీస్ కి కూడా వెళ్ళబుద్ది కాలేదు.
    
    ఫోన్ చేసి ఆ విషయం చెప్పాలని హాస్టల్ వార్డెన్ గదిలోకి నడిచింది. సినిమాల్లోనూ, తెలుగు నవలల్లోనూ వర్ణించినట్టు కాకుండా సౌమ్యంగా, హాస్టల్ లోని వారందర్నీ ఓ పెద్ద దిక్కుగా ఆదరించే మేడమ్ ప్రమీలాదేవి మనస్విని తన గదికి రావటంతో కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతి అరుదుగా ఆమె తన గదికి వస్తుంది. అదీ ఎంతో ముఖ్యమయిన పనుంటేనే. మనస్విని నడవడిక, ఆమె ముక్కుసూటితనం ప్రమీలాదేవికి నచ్చుతాయి.
    
    "ఒక ఫోన్ చేసుకుంటాను మేడమ్" వినయంగా అడిగింది మనస్విని.
    
    "చేసుకోమ్మా" అందామె.
    
    మనస్విని తన ఆఫీస్ నెంబర్ డయల్ చేసింది.
    
    అట్నుంచి రింగవుతోంది కానీ ఎవారూ ఎత్తటం లేదు. ఫోన్ రింగఉతున్నంతసేపూ ఓపికగా ఎదురుచూసిందామె. లాభం లేకపోయింది.
    
    ఎవరూ ఎత్తలేదు. ఫోన్ కట్టయిపోయింది. ఆమె రిసీవర్ క్రెడిల్ చేసి వెనుదిరగబోయింది.
    
    "ఎక్కడికి చేశావమ్మా ఫోన్?" అడిగింది మేడమ్.
    
    "ఆఫీస్ కి" బదులిచ్చింది మనస్విని.
    
    "మీ ఆఫీస్ ఎనిమిదింటికే మొదలైపోతుందా? మరి నువ్వు రోజూ ఇక్కడినుంచి వెళ్ళటమే ఎనిమిదిన్నరకి వెళతావ్" అనడిగిందామె.
    
    అప్పుడు గుర్తుకొచ్చిందామెకి తమ ఆఫీస్ తొమ్మిదింటికి కదా అన్న విషయం.
    
    "ఏమైందీ రోజు తనకి.... తన ఆఫీస్ అవర్స్ సైతం మర్చిపోయేంతగా మెదడు మొద్దుబారి పోయిందా?" అని అనుకుందామె.
    
    "కూర్చో మనస్వినీ" మార్దవంగా వుంది మేడమ్ కంఠస్వరం. మౌనంగా కూర్చుందామె.
    
    మనస్విని మొహంలో ఏదో దిగులు గమనించగలిగింది ప్రమీలా దేవి.
    
    "అమ్మా నాన్న గుర్తుకొచ్చారా?" లాలిస్తున్నట్లు అడిగిందామె.
    
    లేదన్నట్టు తలూపింది మనస్విని.
    
    "మరేమిటి ఈరోజు దిగులుగా కనిపిస్తున్నావ్?"
    
    మేడమ్ అల అడిగేసరికి ఏం చెప్పాలో తెలీలేదామెకి. అసలు తనకంటూ తెలిస్తే కదా.
    
    "ఏం లేదు మేడమ్. బాగానే వున్నా" అనేసింది.
    
    ఈ వయసులో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా యిలా దిగులుగా వుండి ఏమీ లేదంటున్నారంతే వాళ్ళు తప్పకుండా ప్రేమలో పడ్డట్లే! ప్రేమలో పడ్డవారికి సైతం చిన్న చిన్న ప్రణయ కలహాలు తప్పవ్. అవే గోరంతలు కొండతలుగా వూహించుకుని బెంబేలు పడిపోవటం, మరీ బలహీన మనస్కులు ఆత్మహత్యలు చేసుకోవటం కూడా తెలుసామెకు.
    
    మనస్విని కూడా అదే స్థితిలో వుందేమో అనుకుందామె. సాధ్యమైనంతవరకూ ఆమెను తన మాటలతో ఊరడించాలనుకుంది. ఆమె మనస్సుని తను పడే బాధకి దూరంగా డైవర్ట్ చేసి ఉపశాంతి లభింప జేయాలనుకుని మాటల్లో పెట్టింది.
    
    "సృష్టికి మూలమైన స్త్రీ.... అంటే మనమే.... తెలుగులో స్త్రీని ఎన్ని రకాలుగా పిలుస్తారో తెలుసా నీకు?"
    
    ముందు అర్ధం కాలేదు మనస్వినికి మేడమ్ తనని ఏమని అడిగారో!
    
    ప్రమీలాదేవి అదే ప్రశ్న మళ్ళీ అడిగింది.
    
    దాంతో మనస్విని మెదడు పొరలు కడలిన భావన, ఎక్కడో చదివింది..... అవును స్త్రీకి పర్యాయపదాలు ఇన్ని వుంటాయా అన్పించేటన్ని పదాల్ని తనెక్కడో చదివింది. మెల్లమెల్లగా ఆమె భావరహితమైన స్థితి నుంచీ, ఆందోళనా సుడిగుండాల నుంచీ బయటపడి మెదడు అందిస్తున్న సమాచారాన్ని అందుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది- ఏకాగ్రత- కోసమన్నట్లు కళ్ళు మూసుకుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra