Home » D kameshwari » Aruna

 

    "సరే అయింది ఎలాగూ అయింది. చూడు ఇంట్లో మిగతా వాళ్ళన్నా జాగ్రత్తగా ఉండండి. ఆ పిల్లాడి గుడ్డలు అలాగేనా పడేయడం. వెంటనే అవి తీసి ఉతకడం అవి చేయకుండా? గొయ్యితీసి కప్పెట్టడమో, కాల్చడమో చేయండి, గుడిసెఅంత శుభ్రం చేసి ఫినాయిల్ చల్లండి. ఇదిగో ఆ పిల్లలు చూడు ఇంట్లో కలరా ఉంటే ఈగలు ముసురుతున్న మామిడిపండ్లు తింటున్నారు. ఇలా ఉంటే కలరా ఎందుకురాదు? ముందు ఆ పళ్ళు తీయి. ఆ ఈగలు పోయేట్టు బాగా అంతా శుభ్రం చేయండి. లేకపోతే ఆ పిల్లలకీ కలరా వస్తుంది తప్పకుండా. "తీసుకోవలసిన జాగ్రత్తలు బోధపరిచింది అరుణ రాములుకి.      గుడిసే ముందుకి రాగానే, గూడెంవాళ్ళందరూ అక్కడే మూగి భయంగా చూస్తున్నారు.    
    "అమ్మో కలరా: ఒకపాలి వచ్చిందంటే తుడిచిపెట్టేస్తుంది. అమ్మో డాక్టరుగారూ కలరా రాకుండవుండడానికి ఏదన్నా మందీయితల్లీ" అరుణకి దండాలు పెడుతూ అందరూ అడిగారు.    
    ఆ గుంపులోపిల్లా పెద్దా ఏభైమంది ఉన్నారు. మగవాళ్ళంతా పనులమీద పోయి ఉంటారు. అక్కడ ఉన్న గుడిసెలని బట్టి ఎంత లేదన్నా ఓ రెండు వందల మందిని వసిస్తున్నట్లున్నారు. ఇలా దగ్గిర దగ్గిరగా కట్టిన గుడిసెలు, ఈ అపరిశుభ్ర వాతావరణంలో ఏ కలరాయో రావడానికి, ఏ అంటు రోగమన్నా వచ్చిందంటే నిమిషాల మీద గూడెం, గూడెం తుడిచిపెట్టుకుపోవడానికి అట్టేరోజులు పట్టదు. తగినంత జాగ్రత్తగా లేకపోతే ఆ ప్రజలకి తెలియజెప్పవలసిన బాధ్యత తనమీద ఉంది.    
    "ఇదిగో చూడండి, మందుల కంటే ముఖ్యం ఏమిటో తెలుసా? ముందు మీరు ఈ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. కలరా దేనివల్లవస్తుంది? ఈగల వల్ల అని తెలుసునా? ఆ ఈగలువాలిన వస్తువులు తింటే కలరా వస్తుంది. మీరు ఇంత అపరిశుభ్రంగా ఉంటే కలరా రాకేమవుతుంది? రోడ్డుమీద దొడ్లు, ఇంటిముందు చెత్తకుప్పలు...... ఇవన్నీ ఏమిటి? అరుణ మామిడిపళ్ళు పనసపళ్ళు...... వాటినిండా ఎన్నివేల ఈగలున్నాయో చూడండి. అసలేకలరా ఉంది దానికి తోడుఇంత అసహ్యంగా మీరు మీ గుడిసెలు ముందుమీరు పిల్లల్ని మామిడి పండ్లు అవి తిననీయకండి.    
    పిల్లల్ని ఇంటి ముందర పాయిఖానాకి కూర్చోపెట్టకండి. వెంటనే ఆ చెత్తకుప్పలన్నీ తవ్వి దూరంగా పారబోయండి. మీ గుడిసెలన్నీ శుభ్రంగా ఉంచుకుని ఫినాయిల్ రెండుమూడు సార్లు చల్లండి. ఈగలు రాకుండా తినేవాటిమీద మూతలు ఉంచండి. నీళ్ళు కాచుకుని తాగండి. ఎక్కడపడితే అక్కడ దొడ్లు చేయకుండా దూరంగా గోతులు తీసివెంట వెంటనే మట్టితో పూడ్చండి. ఇవన్నీ చేశాక మందులు ఏమన్నా చేయగలవు. కానీ ఇంత గలీజుగా ఉంచుకుని మందు తిన్నంత మాత్రాన కలరా రాకుండా పోదు. ఏం నే చెప్పింది అర్ధమవుతుందా?" అరుణ జాగ్రత్తగా ఓపిగ్గా అందరికి అర్ధం అయ్యేట్లు చెప్పింది.    
    "మాకెలా వస్తాయమ్మ గోరూ ఆ ఫినాయిలు గట్రా: ఏం చేసేదమ్మా? ఎదవలు ఈపిల్లెదవలు దొడ్లు ఎల్లేస్తారు. ఈ ఆడాళ్ళూ అంతే. ఇల్లు ఊడ్చి ఇంటిముందేకుప్పెడతారు. బుద్దిలేని ఎదవలు..... సేప్పినా ఇనుకోరు" అందులోంచి ఓ ముసలాడన్నాడు.        "చూడుతాతా ఇది మీ మంచికోసమే చెపుతున్నాను. ఈ వేళ రాములి కొడుకుఅయ్యాడు. రేపు ఇంకోరింట్లో జరుగుతుంది ఇలా ఒక్కరివల్ల అయ్యేపనిగాదు ఇది. అందరికీ ఎవరిమట్టుకు వారికి బాధ్యత ఉండాలి...... శుభ్రంగా పరిసరాలుంచుకోవాలి అని, గూడెం అంతా కూడబలుక్కుని ఎవరి ఇల్లు వారు శుభ్రంగా ఉంచుకోవాలి. మనఇల్లు శుభ్రంగా ఉంచుకుని చెత్త తీసుకెళ్ళి రోడ్డుమీద పోస్తే ఏం లాభం? ఆ ఈగలు మన ఇంటికే గదా వస్తాయి? రోగం వచ్చి మనుషులు చచ్చిపోతుంటే బాధ, నష్టం ఎవరికీ? ఈ మాత్రం తెలుసుకోవాలి మీరు. వెంటనే మగవాళ్ళందరూ కలిసి అరుణ చెత్తకుప్పలు తీసి దూరంగా పోసి కాల్చండి రోడ్డు తుడిచి ఫినాయిల్ చల్లండి."    
    "ఆఫినాయిల్ లేందో ఎక్క డుంటుంది అమ్మగారూ? మాలాంటివాళ్ళం కొనగలమా?"    
    "బజార్లో ఉంటుంది లేకపోతే నే తెప్పించి ఇస్తాను ఇదిగో చెపుతున్నాను. మళ్ళీ ఎవరికన్నా వచ్చిందంటే రమ్మంటే మీ గూడెం మీ గుడిసెలు అవి శుభ్రంగా ఉంచుకోకపోతే నేనురాను, మీరు శుభ్రం నేర్చుకోనంతవరకు నేను మాత్రం రాను. ఆ తరవాత మీ ఇష్టం, నేనురేపొకసారి వచ్చి చూస్తాను. ఇలా ఉండకూడదు తెలిసిందా? ఇది మీ అందరి మంచికోసమే చెపుతున్నాను, తెలిసిందా? తరవాత ఎవరికన్నా విరోచానాలు, వాంతులు అయిన వెంటనే తీసుకురండి. వాళ్ళవి వేరే ఉంచండి ఆ గుడిసెలో ఎవరూ ఉండద్దు. ఆ బట్టలు అవి దూరంగా ఉంచాలి, తెలిసిందా?"    
    అందరూ వినయంగా బుర్రలు ఊపారు. "ఆ తాతా ఊళ్ళో కలరా ఉంటే మీ ప్రెసిడెంటుగారు కలరా ఇంజక్షన్లు అవి ఇప్పించే ప్రయత్నం ఏం చేయడం లేదు. వెంటనే వెళ్ళి కలరా ఉంది, ఇంజక్షన్ ఇప్పించమని చెప్పండి. హెల్తు డిపార్టుమెంటు మనుష్యులు వస్తారు. "చెప్పవలసినదంతా చెప్పి అరుణ ఇంటికివెళ్ళిపోయింది. వెడుతూనే రెండు మూడు పెద్ద ఫినాయిల్ టిన్నులు మణిచేత సైకిలేసి పంపి తెప్పించి, గూడెంలో వాళ్ళకి ఇప్పించింది.    
    కలరా ఇంజక్షన్లు ఇప్పించమని గూడెంలో వాళ్ళువెళ్ళి అడిగితే ప్రెసిడెంట్ తిట్టాడట. "ఆ నేనేం సెయ్యాలో ఆ డాక్టరమ్మ చెప్పనక్కరలేదు. నాకు తెల్సు మీరు పొండి" అని కసిరాడట. ఆ రాత్రి మరోపిల్లాడు మర్నాడు ప్రొద్దున ఓ ముసల్ది చచ్చిపోగానే గూడెంలో వాళ్ళందరికి భయం పట్టుకుంది అందరూ "రక్షించు డాక్టరమ్మ గోరూ" అంటూ అరుణ ఇంటిమీదికి వచ్చి పడ్డారు.    
    మూర్ఖుడయిన ప్రెసిడెంట్ తో తనకేమిటి వంతు అని అరుణ ఆలోచించి హెల్తు సెంటర్ వాళ్ళకి ఓ ఉత్తరం రాసి ఓ మనిషిచేత పంపింది. హెల్తు డిపార్టుమెంటుకి కూడా వెంటనే వచ్చి ఇంజక్షన్లు ఇచ్చి, తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవలసిందని రాసింది.    
    ప్రెసిడెంట్ అరుణ ఉత్తరం రాసిన విషయం విని మండిపడ్డాడట. "అదెవర్తి నా పనిలో కలగ చేసుకోవడానికి? ఊరికినే ప్రెసిడెంట్ ని, నా ఊళ్ళో వాళ్ళ మంచిచెడ్డలు నాకంటే ఆవిడగారికి ఎక్కువయ్యాయా? పెద్ద సేవ చేస్తూంది అనుకుంటుంది గాబోలు. మీరు వెర్రి వెధవలు. అది చెప్పిన మాటలునమ్ముతున్నారు" అంటూ మంచి, మర్యాదలేకుండా నోటికొచ్చినట్టుకూశాడని గూడెంలో వాళ్ళుచెపితే అరుణవిని, నవ్వి ఊరుకుంది.    
                                                                    * * *    
    అర్దరాత్రి ఎవరో తలుపులు దడదడ తట్టుతున్న ధ్వనికి మెలుకువ వచ్చింది అరుణకి వీధి గదిలో పడుకున్న మణి లేచి తలుపులు తీసినచప్పుడు, ఏవో మాటలు వినిపించాయి అరుణకి. ఏముంది? మళ్ళీ ఎవరో పేషెంట్లు వచ్చి ఉంటారు. ఊళ్ళో కలరా ఉండడంతో ఓ రెండువిరోచనాలు మామూలుగా వెళ్ళినా గాభరాపడిపోయి రాత్రి, పగలు అన్న భేదం లేకుండా వస్తున్నాడు కేవలం డయేరియానో, కలరానో తేల్చాలంటే అరుణ తప్పక వెళ్ళి చూడవలసి వచ్చేది దానితో అర్దరాత్రి అపరాత్రి అనక తిరగవలసిరావడంతో అరుణకి విశ్రాంతి అన్నది చిక్కడంలేదు పదిరోజులనించి సాయంత్రం పొరుగూరు వెళ్ళి తొమ్మిది గంటలకి తిరిగి వచ్చింది అప్పుడు స్నానం, భోజనం చేసి పడుకుంది. అలిసిమంచి నిద్రలో ఉన్న అరుణకి ఆ అర్దరాత్రి ఎవరో రావడం చికాకనిపించింది.

    మణిలోపలికి వచ్చి గది గుమ్మం దగ్గిర నిలబడి అరుణనిపిలిచాడు. అరుణ కళ్ళు విడివడ్డం లేదు. బలవంతంగా లేచిపైకి వచ్చింది బైటజీపు, ఓ ఇద్దరు మనుష్యులు నిలబడి ఉన్నారు. ట్రావెలర్స్ బంగళాలో టూర్ మీద వచ్చినవాళ్ళ ఆఫీసరుకి హోటలు భోజనం చెయ్యగానే విరోచనాలు, వాంతులు మొదలెట్టాయట, చాలా నీరసపడి వాలిపోయాడట. వెంటనే ఎవరన్నా డాక్టరుంటే తీసుకురావడానికి డ్రైవరు, బంట్రోతువచ్చారు. వెంటనేరావాలంటూ గాభరాపెట్టారు ఇద్దరూ అర్దరాత్రి...... ఊరికి చివర ఉన్న ట్రావెలర్స్  బంగళాకి వెళ్ళాలంటే కాస్త సందేహించింది. కాని తప్పదు, అవతల ఆఫీసరు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. తీసుకెళ్ళి తీసుకొచ్చి దిగబెడతారు. భయపడడానికి ఏముంది అని అరుణ మొహంకాస్త ఛన్నీళ్ళతో కడుక్కొని కావలసిన మందులు అవి తీసుకుని వారి వెంట బయలుదేరింది.    
    బయట గాడాంధకారం వర్షం పడకపోయినా మబ్బులు పట్టి, అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తున్నాయి. ఊరంతా నిద్రపోతూంది. కీచురాళ్ళ రొద, జీపులేకుండా ఉంటే ఈ రాత్రిఅరుణ కదిలేదికాదు.    
    ట్రావెలర్స్ బంగళా చేరగానే గుమ్మం ముందు మరోముగ్గురు మనుష్యులు నిలబడి ఉన్నారు. అరుణ చూడగానే వినయంగా దండాలు పెట్టి." అయ్యగారు లోపల ఉన్నారు, చూడండి" అంటూ లోపలికి దారి తీశారు.    
    అరుణ గది గుమ్మంలో అడుగుపెట్టి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. గది ఖాళీగా ఉంది. మంచం ఖాళీ, ఏ బాత్ రూములోకి వెళ్ళాడేమో నని అడగడానికి అరుణ వెనక్కిచూసింది. అంతే!! అరుణ నిశ్చేష్టురాలైంది. గుమ్మందగ్గిర కనపడ్డ ముగ్గురు లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టారు. వెంటనే ఒకడు దీపం ఆర్పేశాడు. అరుణ మీది మీదికి ఒకడు రావడం ఆరంభించాడు. అరుణ స్థాణువై పోయింది. అసలు జరుగుతున్నది ఏమిటో అర్ధం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టింది. ఎదురుచూడనిది ఈ హఠాత్పరిణామానికి నోటమాట రానంతగా దిమ్మెరపోయింది. వాళ్ళు ముగ్గురూ ఏం చెయ్యబోయేది తలుచుకోగానే అరుణప్రాణాలు పైకి ఎగిరిపోయాయి. కెవ్వున కేకపెట్టింది.    
    "ఏయ్..... ఎవరు...... ఎవరు మీ రెవరు? ఎందుకు నన్నిక్కడికి తీసుకొచ్చారు?...... ఎవరుమీరు?" వణుకుతున్న గొంతుతో లేని ధైర్యం తెచ్చుకుంటూ అడిగింది.    
    వాళ్ళు జవాబీయలేదు. విలన్ నవ్వులాంటినవ్వు నవ్వారు. ఆ చీకట్లోనే ఒకడు తన మీదికిరావడం గుర్తుపట్టి గజగజ వణికిపోయింది అరుణ. అప్పటికే అరుణకిఅసలు సంగతి అర్ధం అయింది. ఈ అర్దరాత్రి ఈ ఊరు చివరతనెలాంటి ఆపదలో చిక్కుకుందో అర్ధం అయింది.    
    ఈ చోటతనకింక దిక్కెవరు? ఎంత మూర్ఖురాలు: ఒక్కపిసరు ఆలోచన లేకుండా అర్దరాత్రి కొత్తవాళ్ళ వెంట ఎందుకు రావాలితను? అసలు వీళ్ళెవరు? తను వాళ్ళనేం చేసింది? తననిఇలా తీసుకొచ్చి ఇంత అత్యాచారానికి ఎందుకు ఒడిగట్టారు? అరుణకి భయంతో ఏం చెయ్యాలో తోచడంలేదు. ఆ చీకట్లో ఆ మనిషి తడుముకుంటూ అరుణచేతులు గట్టిగాపట్టుకున్నాడు. అరుణగావుకేక పెట్టింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra