రాత్రి సరిగ్గా 7-15 నిమిషాలు.

 

    ఆడిటోరియంకు కొంచెం దూరంలో వున్న బేకరీ షాప్ ముందు అంబాసిడర్ కారు ఆగింది.

 

    "నువ్వెళ్ళి...... పరిస్థితి గమనించి రా" చెప్పింది మోహిత. కారు దిగి ఆడిటోరియంవేపు నడిచాడు మైత్రేయ.

 

    "ఆ క్షణాన ఆమెను ఎవరు చూచినా, ఆమే మొహితని గుర్తుపట్టలేని విధంగా వుంది.

 

    మెయిన్ గేటు దగ్గర అటూ -యిటూ పోలీసులు..... లోపల.... జనం... జనం..... జనం..... కిక్కిరిసిన జనం..... ఇంకా ప్రోగ్రామ్ మొదలుకాలేదు.

 

    ఆడిటోరియంలోకి ఎంటరయ్యే ప్రతి వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్నంగా శోధిస్తోంది. ఎవరి దగ్గర ఏ చిన్న ఆయుధమున్నా, నిలదీసి అక్కడికక్కడే ఎంక్వయిరీ మొదలెడుతున్నారు. ఆ పరిస్థితుల్ని చూసి, మైత్రేయ ఒకింత నెర్వస్ గా ఫీలయ్యాడు.

 

    హాల్లోంచి బయటికొచ్చి హాలు వెనక్కి వెళ్ళాడు. ఆ పక్క గ్రీన్ రూమ్ లో మేకప్  చేసుకుంటున్న నాటికకు చెందిన ఆర్టిస్టులు..... జనరేటర్ రూమ్ లో ఇద్దరు ఆడిటోరియం స్టాఫ్.....

 

    అంతా పరిశీలించాక వెనక్కొచ్చి ఆ విషయం మొహితతో చెప్పాడు మైత్రేయ.

 

    అప్పుడు సమయం 7-20 నిమిషాలు.

 

    "నేను లోపలికి వెళతాను..... నువ్వు పావుగంట తర్వాత వచ్చి గ్రీన్ రూమ్  బయట నిలబడు" చెప్పి కారు దిగింది మోహిత. ప్లాన్ ఏమిటో అర్థంకాలేదు మైత్రేయకి.

 

    
                                         *    *    *

 

    మోహిత లోనికి నడిచి, గ్రీన్ రూమ్ దగ్గరికెళ్ళి నలువేపులా చూసింది. హాల్లోకి వస్తున్నా జనం..... అక్కడక్కడా పోలీసులు.

 

    గ్రీన్ రూమ్ లోకి వెళ్లింది మోహిత.

 

    నాటిక డైరెక్టర్, ముఖాలకు మేకప్ చేసుకుంటున్న ఆర్టిస్టులు ఆమెవేపు చూస్తున్నారు ఆసక్తిగా.

 

    "సన్మానం జరగబోతున్న డాన్సర్, మా సిస్టరే.... నేను కాసేపు గ్రీన్ రూమ్ లో వుండొచ్చా?" అడిగిందామె డైరెక్టర్ని.

 

    "ఉండండి..... మాకేం అభ్యంతరం లేదు" చెప్పాడు డైరెక్టర్.

 

    గ్రీన్ రూమ్ డోర్ పక్కన మెట్లు..... చిన్న సందులోంచి పక్కకు తిరిగితే..... వేదిక.....

 

    నాటికజరిగేటప్పుడు ప్రాంప్టర్స్ నిలబడేది అక్కడే.

 

    అక్కడినుంచి చూస్తే డయాస్ మీద వ్యక్తులే కాకుండా, ఆడిటోరియంలోని జనం కూడా స్పష్టంగా కన్పిస్తారు.

 

    ఆ సందులో ఒక పక్కగా నిలబడింది మోహిత.

 

    స్టేజీమీద కుర్చీల ఎరేంజ్ మెంట్ చేస్తున్నారు ఆడిటోరియం స్టాఫ్. కొంచెం ముందుకెళ్ళి.....

 

    వేసున్న కర్టెన్ ని పక్కకు తప్పించి, ఆడిటోరియం వేపు చూసింది.

 

    ముందువరుసలో వి.ఐ.పి.లు కూర్చున్నారు. అందులో మూడవవ్యక్తి రాజేంద్రకుమార్ పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు.

 

    
                                           *    *    *

 

`    రాజేంద్రకుమార్ పక్కనున్న వ్యక్తివేపు చూస్తూ......

 

    "నా అంచనా ప్రకారం ఏ సమయంలో అయినా. ఆ మోహిత రావచ్చు. మనవాళ్ళను జాగ్రత్తగా వుండమను. నా కళ్ళు ఆమెను వెతుకుతూనే వుంటాయి. ఆమెను నేను గుర్తించగానే సెల్ ఫోన్ లో నీకా విషయం చెప్తాను. వెంటనే కాల్చెయ్యండి. తర్వాత నేను చూసుకుంటాను..... ఓ.కే!"

 

    "ఎస్ సర్!" ఆ వ్యక్తి ముందుకు నడిచి, వి.ఐ.పి. సీట్ల వరుస చివరనున్న గేటు పక్కన నుంచున్నాడు.

 

                                           *    *    *

 

    ఆ వ్యక్తినే గమనిస్తోంది మోహిత. అతని దగ్గరకు ఇంకొందరు రావడం, మాట్లాడడం , వెళ్ళడం అంతా కర్టెన్ వెనకనుంచి చూస్తోందామె.

 

    మరో పదినిమిషాలకు మీటింగ్ ప్రారంభమయింది.

 

    ప్రార్థన, గెస్టుల్ని స్టేజీ మీదకు పిలవడం, గెస్టులొచ్చి కూర్చోవడం లాంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి ప్రపంచంలోని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు.

 

    రాజేంద్రకుమార్ డేగచూపులు నలువేపులా పరికిస్తున్నాయి.

 

    మోహిత పక్కనే మరో నలుగురు మహిళలు చేరారు. సన్మానం జరగబోయే డాన్సర్ కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    గ్రీన్ రూమ్ లోంచి వచ్చి మెట్లపక్కన నుంచుని ఆడవాళ్ళందరివేపు చూస్తున్న మోహిత  చూపులు పోలీసు కానిస్టేబుల్ మీద పడ్డాయి.

 

    అతని చేతిలో రైఫిల్-

 

    అతను కొంచెం ముందుకొచ్చి స్టేజ్ ఎక్కి రాజేంద్రకుమార్ కి కొంచెం దూరంలో నుంచున్నాడు.

 

    ఆ కర్టెన్ కి రెండో చివరనున్న మోహిత మెల్లిగా ముందుకు నడిచి, ఆ గన్ మేన్ పక్కకొచ్చింది.

 

    ఆ గన్ మేన్ తనకు కొంచెం దూరంలో నుంచున్న మోహితవేపు ఒకసారి చూసి, మళ్ళీ తన డ్యూటీలో తను పదిపోయాడు.

 

    పది నిముషాలు గడిచాయి.

 

    రాజేంద్రకుమార్ మీద ఎలా దాడిచేయాలో అప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది మోహిత, గన్ మేన్ చేతిలో వున్న రైఫిల్ ని చూస్తూ....

 

    సభాధ్యక్షుడు ప్రసంగం పూర్తయింది.

 

    "ఇప్పుడు చీఫ్ గెస్ట్ రాజేంద్రకుమార్ గారు ప్రసంగిస్తారు" అనౌన్స్ చేసి, తనసీట్లో కూర్చున్నాడు.

 

    రాజేంద్రకుమార్ లేచి మైకు ముందుకెళ్ళి, గొంతు సవరించుకున్నాడు.

 

    సరిగ్గా అదే సమయంలో మోహిత గబగబా వెనక్కి గ్రీన్ రూమ్ డోర్ దగ్గరికి వచ్చింది.

 

    అప్పటికే అక్కడకొచ్చి నుంచున్నాడు మైత్రేయ.

 

    "మైత్రేయ! ప్లాన్  అంతా రెడీ..... ఇప్పుడు టైమెంతయింది?" తన చేతివాచీ వేపు చూస్తూ అడిగింది.

 

    "ఏడూ నలభయ్ నిముషాలు" చెప్పాడు మైత్రేయ.

 

    "కరెక్ట్ గా ఏడు యాభై నిముషాలకు నువ్వు జనరేటర్ రూమ్ లో కెళ్ళి, మెయిన్ స్విచ్ ఆపేసి, బయటికెళ్ళిపో..... అయితే అయిదునిముషాల్లో నేనక్కడకు వచ్చేస్తాను..... కారు స్టార్ట్ చేసి రెడీగా వుండాలి" రహస్యంగా చెప్పింది.

 

    "బీకేర్ పుల" వెనకొచ్చేసింది మోహిత.

 


                                                            *    *    *

 

    అయిదు నిముషాల తర్వాత.....

 

    మైత్రేయ జనరేటర్ రూమ్ లో కెళ్ళాడు.

 

    
                                             *    *    *

 

    మోహిత గన్ మేన్ పక్కకు వెళ్ళి నుంచుని స్టేజీమీదున్న రాజేంద్రకుమార్ వైపు ఒకసారి, చేతివాచీవేపు ఒకసారి చూసుకుంది.

 

    ఏడు నలభై ఎనిమిది నిముషాలు.....

 

    రెండు నిముషాల తర్వాత....

 

    మైత్రేయ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు పరుగెత్తాడు.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోహిత మెరుపువేగంతో గన్ మేన్ చేతిలోని గన్ ని  లాక్కుని-

 

    రాజేంద్రకుమార్ వేపు గురి పెట్టి ట్రిగ్గర్ నొక్కింది.

 

    వరుసగా స్టేజీమీద హాహాకారాలు.... ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

 

    ఆ పేలుళ్ళకు ఆడిటోరియంలో ప్రేక్షకులు బయటకు ప్రాణభయంతో పరుగులు తీయటం ప్రారంభించారు.

 

    అంతా గందరగోళం...... అరుపులు, కేకలు.

 

    తనను పట్టుకోడానికి ప్రయత్నించిన గన్ మేన్ ని పక్కకు తోసేసి, వెనక్కి పరుగెత్తింది మోహిత.

 

    గ్రీన్ రూమ్ డోర్ లోంచి బయటికొచ్చి, బయటకు పరుగెడుతున్న జనంలో కలిసిపోయిందామె క్షణాల్లో.

 

    సరిగ్గా మూడు నిముషాల తర్వాత కారు దగ్గరకొచ్చింది మోహిత.

 

    అప్పటికే కారుని స్టార్ట్ చేసి రెడీగా వుంచాడు డ్రైవర్. ఆమె ఎక్కి కూర్చోవడం, డ్రైవర్ కారు గేరుని మార్చడం ఒకేసారి జరిగాయి.

 

    కారు ఆ ప్రాంతంలోంచి మాయం కావడానికి రెండే రెండునిముషాలు పట్టింది.

 

   
                                           *    *    *

 

    శ్రీకృష్ణరాజు వడయార్ మెడికల్ కాలేజీ.....

 

    ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రూమ్ లోంచి బయటికొచ్చాడు డాక్టర్ అరుణ్ కుమార్.

 

    అప్పటికే అక్కడ రాజేంద్రకుమార్ మనుషుల్తో పాటు, సిటీపోలీసు కమీషనర్ , మరికొందరు పోలీస్ ఆఫీసర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 

    "భుజంమీద బలంగా గాయాలు తగిలాయి..... ప్రాణభయం లేదు. మీరెళ్ళి చూడవచ్చు" సిటీ పోలీసు కమీషనర్ తో చెప్పి, ముందుకెళ్ళిపోయాడు డాక్టర్ అరుణ్ కుమార్.

 

    సిటీ పోలీస్ కమీషనర్ ఇంటెన్సికేర్ యూనిట్ లోకి నడిచాడు, పోలీస్ ఆఫీసర్ తో సహా.

 

    రాజేంద్ర కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా, షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.

 

    అప్పుడు రాత్రి పదిన్నర దాటింది.

 

    "ఇంత సెక్యూరిటీ..... ఇంత పోలీస్ ఫోర్స్ వున్నా, ఆడిటోరియంలో మీమీద దాడి జరగడం హారిబుల్.... డోన్ట్ వర్రీ.... నిందితులు ఎలా ఆడిటోరియంలోకి ప్రవేశించారో? ఎలా పారిపోయారో అంతా తెలిసిపోయింది. వాళ్ళొచ్చిన అంబాసిడర్ కారును ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం" చెప్పాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    "నాకు ఇంకమీదట మీ పోలీస్ ఫోర్స్ ప్రొటెక్షన్ అక్కర్లేదు...... వాళ్లను ఎలా పట్టుకోవాలో, ఎలా ముక్కలు ముక్కలు చెయ్యాలో నాకు తెలుసు" కోపంగా అన్నాడు రాజేంద్రకుమార్.

 

    సిటీ పోలీస్ కమీషనర్ ఏం మాట్లాడలేదు.

 

    పావుగంట తర్వాత ఆ రూమ్ లోంచి సిబ్బందితో బయటకు వచ్చేశాడు ఆయన.

 

 

                                          *    *    *

 

    వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకు సెల్ ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు రాజేంద్రకుమార్

 

    "సార్..... నేను సిద్ధరామయ్యను మాట్లాడుతున్నా."

 

    "చెప్పు."

 

    "గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్ లో వున్న సుధా హోటల్లో ఒక ఆడ- మగ దిగారట. రాత్రి తొమ్మిది గంటలకు అంబాసిడర్ కారులో వచ్చి, రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయార్ట."

 

    "ఆ మోహిత ఫోటో వాళ్ళకు చూపించి , కన్ఫర్మ్ చెయ్యి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra