Home » Vasireddy seeta devi novels » చిలకలు


    "రామకృష్ణ హత్య జరిగిన రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా?" నరేంద్ర అడిగాడు.
    నరేంద్ర ప్రశ్న నేమరికణ తన కంకరాయి తగిలినట్టుగా తాగిలింది రమణరావుకు.
    "అదేం ప్రశ్న? నాకు లక్షా తొంభై పనులుంటాయ్. ఫలనా రోజు ఎక్కడి వెళ్లావని అడగడానికి మీరెవరు?" కోపంతో రెచ్చిపోతూ అన్నాడు రమణరావు.
    నరేంద్ర చిరునవ్వుతో అద్వయితం కేసి చూశాడు.
    "మిస్టర్ రమణరావ్! చనిపోయిన వాడు నీ చేత విల్లు రాయించాడు కనక మేము మిమ్మల్ని ప్రశ్నించితీరాలి. అది మాడ్యూటీ. అడిగిన ప్రశ్నలకు  సమాధానాలు చెప్పండి. తాపీగా బాగా ఆలోచించుకొనే చెప్పండి" అన్నాడు అద్వయితం.
    "నామీదే హత్యా ప్రయత్నం జరిగిందని మిమ్మల్ని పిలిస్తేవన్నే హంతకుడనట్టుగా నిలదీస్తున్నరేం?"
    "మీరు పిలవకపోయినా మేము  వచ్చేవాళ్ళమే" అన్నాడు  అద్వయితం.
    "చెప్పండి. రామకృష్ణ హత్య జరిగిన రోజు అంటే మీరు  అతడి చేత వీలునామా రాయిఅమ్చిన రోజు రాత్రి మీరు ఎక్కడున్నారో చెప్పండి" అన్నాడు నరేంద్ర తాపీగా సిగరెట్ తాగుతూ.
    "ఇంట్లోనే."
    "ఏ ఇంట్లో?" ఠపీమని  అడగాడు ఇన్స్ స్పెక్టర్.
    "ఇంకే ఇంట్లో మా ఇంట్లోనే ఇన్స్ స్పెక్టర్ గారు తమాషాగా కూడా మాట్లాడుతారే?" అని నవ్వాడు రమణరావు.
    "తమాషాగా  మాట్లాడడంలేదు. సీరియస్ గానే మాట్లాడుతున్నాను" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ సీరియస్ గా ముఖం పెట్టి.
    "ఆ సాయంకాలం నాలుగు గంటల నుంచి ఇంట్లోనే ఉన్నాను. 6 గంటలకు రామకృష్ణ వచ్చి విల్లు రాయించుకొని 8 గంటలకు  వెళ్ళి పోయాడు.
    "విల్లు రాయించుకొని వెళ్ళిపోయాడా?"
    "అవును!"
    "అంటే ఆయన రాయించిన విల్లు తీసుకొని వెళ్లాడా?"
    "లేదు. కమలాంబకివ్వమని నా చేతికి ఇచ్చాడు."
    నరేంద్ర అర్థం అయిందా అన్నట్టుగా ఇన్స్ స్పెక్టర్ ముఖంలోకి చూశాడు. ఆ ముఖం చూసి అతడికి అర్థం కాలేదని గ్రహించాడు. అంతలో సూర్యనారాయణ వచ్చాడు. అతడు ఒక అర్థగంట ఉండి వెళ్ళాడు." అన్నాడు రమణరావు.
    తొమ్మిదికి ప్రారంభం అయిన శూలనొప్పి తెల్లవారుజాముదాకా తగ్గలేదు. రాత్రంతా పైడయ్యా  సేవలు చేస్తూనే ఉన్నాడు."
    "పైడయ్యను పిలవండి."
    "రమణరావు పైడయ్యను పిలిచాడు."
    "శనివారంనాడు అంటే నిన్నకాక పోయిన శనివారంనాడు మీ అయ్యగారు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడు?"
    "ఆ రోజాండి?" తల  గోక్కున్నాడు పైడయ్య.
    "ఆ ఆరోజే! బాగా గుర్తు  చేసుకుని చెప్పు."
    "ఆ రోజు మా అయ్యగారు బయటికే వెళ్ళలేదండి."
    "ఏం? ఎందుచేత?"
    "ఆరోజు ఆయగారికి చాలా శూలనొప్పి వచ్చిందండి. చాలా  బాధపడ్డారండి. యూక్లిప్టస్  ఆయిల్ రుద్ది, తెల్లవార్లూ వేడినీళ్ళ కాపడం పెట్టానండి" అన్నాడు పైడయ్య.
    ఇన్స్ స్పెక్టర్ కు ఏదో గాలానికీ తగులుకొన్నది ఇట్టే జారి పోయినట్టుగా అన్పించింది.
    "మీ అయ్యగారికి అప్పుడప్పుడు శూలనొప్పి వస్తూ ఉంటుందా?"
    నరేంద్ర పైడయ్య కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించారు.
    "ఆ! వస్తుందండి. అది వచ్చినప్పుడు మనిషి అల్లడి తల్లడి అయిపోతారండి" అన్నాడు పైడయ్య.
    "ఏ డాక్టర్ దగ్గర ట్రీట్ మెంటు తీసుకొంటున్నారు?"
    "మా ఫామిలి డాక్టర్ మాధుర్ దగ్గర" తడుముకోకుండా చెప్పాడు రమణరావు.
    ఇక ప్రశ్నలు అడగడం అవసరం అన్పించింది ఇన్స్ స్పెక్టర్ కు.
    "సరే! అంతకు ముందు రోజు రాత్రి ఎన్నిగంటలకు వచ్చారు."
    "అంటే శుక్రవారమా బాబూ!"
    "అవును. శినివారానికి ముందు రోజు శుక్రవారమేగా?" తీవ్రంగా పలికింది నరేంద్ర కంఠం.
    ఇన్స్ స్పెక్టర్ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. రాధారాణి హత్య ఆ రోజే జరిగింది. తలాతోకా దొరకని కేసు. నరేంద్ర మంచి ప్రశ్నే వేశాడు. ఆమె పనివేస్తున్న కంపెనీలోనే వీడు లీగల్ అడ్వజరు. ఆ సోమసుందరంగాడితో చేరి వీడే హత్య చేసి ఉంటాడు. మధ్యలో ఈ నరేంద్ర ఒకడు. ఆ సోమసుందరంగాడ్ని ఆరోజే మూసేస్తానంటే వద్దన్నాడు. ఆరోజు వాడికి నాలుగు తగిలించివుంటే హంతకుడెవరో వెంటనే తెలిసిపోయి ఉండేది.
    "ఇన్స్ స్పెక్టర్  ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
    "ఆ ఏం లేదు నరేంద్రా! నువ్వు రాధారాణి హత్య జరిగిన రాత్రి రమణరావు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడనేగా ప్రశ్నిస్తున్నావ్?"
    రమణరావు చివ్వున లేచి నిల్చున్నాడు. కోపంతో నిలువెల్లా ఊగిపోతున్నాడు.
    "ఏమిటి ఉద్దేశ్యం?" హైదరాబాద్ లో జరిగిన హత్యలన్నీ నేనే చేసినట్టుగా ప్రశ్నిస్తున్నారు?"
    "అంత భయమెందుకూ? రాధారాణి మీ ఆఫీసులోనే పని చేస్తుంది కనుక, అందర్నీ ప్రశ్నించినట్టే మిమ్మల్నీ ప్రశ్నిస్తున్నాం. భయపడకుండా తాపీగా జవాబులు చెప్పండి."
    "నేనెందుకు భయపడ్తాను?"
    "అలాంటప్పుడు అంత రెచ్చిపోవాల్సిన అవసరంలేదు."
    రమణరావు విసురుగా సోఫాలో కూలబడ్డాడు.
    "ఊ చెప్పు! ఆరోజు మీ అయ్యగారు రాత్రి ఎన్నిగంటలకు ఇంటికి వచ్చారు?" ఇన్స్ స్పెక్టర్ పైడయ్యను గద్దిస్తున్నట్టుగా అడిగాడు.
    పైడయ్య ఇన్స్ స్పెక్టర్  కేసి భయం భయంగా చూశాడు.
    "ఆ రాత్రి అయ్యగారు 9 గంటలకల్లా వచ్చారయ్యా. తెల్లవారి కోర్టులో ఏదో ముఖ్యమైన కేసుందని. పెందలకడ భోంచేసి పుస్తకాలు తిరగేస్తూ ఉండిపోయారు రాత్రి ఒంటిగంటదాకా."
    "మీ తమ్ముడ్ని ఒకసారిపిలుస్తారా?"
    "పైడయ్యా! చిన్నదొరగార్ని  పిలువు అన్నాడు రమణరావు. పైడయ్య లోపలకు వెళ్ళాడు.
    రెండు నిమషాల్లో రమణరావు తమ్ముడు విక్రమ్ బయటికి వచ్చాడు అతడికి దాదాపు 27,28 ఏళ్ళు ఉంటాయి. అతడు  రమణరావు కంటే పొట్టిగా. బొద్దుగా ఉన్నాడు. బలిష్టంగా ఉన్నాడు. గుబురు కనుబొమ్మల కింద మరుకైన చూపులు కదులుతూ ఉంటాయి. జుట్టు దువ్వుకున్న  తీరూ  వేషధారణా చూడగానే ఎవరో తెలుగు సినిమా హీరోను అనుకరిస్తున్నట్టుగా అన్పిస్తుంది. 
    విక్రమ్ ఇన్స్ స్పెక్టర్ ను చూసి ఠక్కునే ఆగిపోయాడు.
    కొద్ది క్షణాల్లో తెప్పరించుకొని "నమస్కారం" అన్నాడు విక్రమ్.
    "నమస్కారం. రావయ్యా యంగ్ మాన్. కూర్చో" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    అన్న పక్కన సోఫాలో కూర్చున్నాడు విక్రమ్.
    "విక్రమ్! వీరు ప్రఖ్యాత డిటెక్టివ్ నరేంద్రగారు. వీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. బాగా ఆలోచించుకుని సమాధానాలు చెప్పండి. అబద్దాలు చెప్తే కష్టాలు కొని తెచ్చుకొన్నట్లు అవుతుంది.
    విక్రమ్ అన్నకేసి అయోమయంగా చూశాడు.
    రమణరావు ముఖం కందగడ్డలా అయింది.
    "దేన్ని గురించి ప్రశ్నిస్తారు?" విక్రమ్ అడిగాడు.
    "ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన హత్యలన్నీ నువ్వూ నేనూ కలిసి చేసినట్టు వాళ్ళ అనుమానం. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు" కసికసిగా అన్నాడు రమణరావు.
    నరేంద్రకు నవ్వు వచ్చింది. రమణరావు ధోరణికి.
    "రాధారాణి హత్య జరిగిన  రాత్రి పన్నెండూ రెండు గంటల మధ్య ఎక్కడ ఉన్నావ్?" ఇన్స్ స్పెక్టర్  విక్రమ్ ను ప్రశ్నించాడు.
    విక్రమ్ సాగదీసి గూబపగలగొట్టినట్టు ముఖం పెట్టాడు.
    నరేంద్ర సిగరెట్ తాగుతూ విక్రమ్ ముఖంలో కదులుతున్న మార్పులను గమనిస్తున్నాడు.
    కొద్ది క్షణాల తర్వాత విక్రమ్ తమాయించుకొని చిరునవ్వు నవ్వాడు.
    "ఆ రాత్రి తొమ్మిది గంటల మంచి ఒకటిన్నరదాకా రోహిణి స్టూడియోలో చెట్టుమీద కూర్చుని ఏం చేస్తూన్నావయ్యా? అదీ "అంత రాత్రప్పుడు రోహిణీ స్టూడియోలో చెట్టు మీద కూర్చుని ఏం. చేస్తున్నావయ్యా? అదీనగారానికి ఎంతో దూరంలో ఉన్న స్టూడియోలో?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డగా అయింది.
    నరేంద్ర ముసిముసిగా నవ్వుకొన్నాడు.
    రమణరావు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు.
    "చెట్టుమీద కాదు. సెట్టుమీద ఇన్స్ స్పెక్టర్ గారూ! సెట్టుమీద అంటే రాత్రి కాల షీట్ వర్కు చేశాం" అన్నాడు విక్రమ్ కోపంగా.
    "ఆ మాత్రం నాకూ తెలుసు లేవయ్యా!అర్థరాత్రి దాకా పెట్టుమీద ఏం పని  చేశారూ అని?" అన్నాడు  అద్వయితం.
    "మేము వర్తమాన తారను ఒక దాన్నిమా "వయ్యారి భామ "కు బుక్ చేసుకున్నాం. ఆవిడా మా ప్రాణాలు తీసేస్తోంది, ఆ రాత్రయితే  ఆవిడ వేలకొదీ అడుగుల ముడి ఫిలిం తీనేసింది. రెండు టేకులు కూడా సరిగా రాలేదు."
    "అవునూ! "వయ్యారిభామ" అనే సినిమా ఒకదాన్ని చిన్నప్పుడు చూశానే! అదే మళ్ళీ  తీస్తున్నారా?"
    "కాదండీ , పేరు  మాత్రమే పాతది. కథ కొత్తదే"
    ఇన్స్ స్పెక్టర్ సినిమా కబుర్లలో పడిపోవడాన్ని గ్రహించాడు నరేంద్ర .
    "ఆరోజు ఒకటిన్నరదాకా రోహిణీ స్టూడియోలో ఉన్నారన్న మాట?" అన్నాడు నరేంద్ర కల్పించుకొని.
    "అవునండీ."
    "ఆ తర్వాత తిన్నగా ఇంటికే వచ్చాశారా?"
    విక్రమ్ ముఖం వెలవెలా పోయింది అన్న ముఖంలోకి చూశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra