Home » Koduri kousalya devi » Dharmachakram


    కోర్టులో చేరిన ప్రేక్షకు లందరూ ఆశ్చర్యం ప్రకటించారు.
    సత్య తిరిగి తన వాదం కొనసాగించింది. "క్రమంగా ధర్మారావు పెరిగి పెద్దవాడై , పట్ట భద్రుయ్యాడడు. తండ్రి ఉంటున్న సెంట్రల్ జైలు కే ధర్మారావు ను సూపరింటెండెంట్ గా తేవడం లో ఆ దయామయీ నారాయణస్వామి లెంత అఖండు లో అర్ధమవుతున్నది.
    "ధర్మారావు వచ్చిన దగ్గర నుండీ అతడి చర్యలు కోర్టు వారికి తెలిసినవే. అతి ఆదర్శంగా , దయామూర్తి గా నటించి, అందరి ఆదరణ కూ పాత్రుడై , అతి చాకచక్యంగా తన తండ్రి గౌతమ్ కు చట్ట విరుద్దంగా కారాగార విముక్తి కలిగించాడు. ప్రభుత్వం వారే ఇప్పట్లో మేల్కొని ధర్మారావు ను బందీ చేయకుంటే, ఈసారికి ఇతడు పారిపోయిన తన తల్లిదండ్రులను కలుసుకొని, అందరూ ఏకమై దేశద్రోహానికి తలపడి ఉండేవారు.
    "దేశం ఇటువంటి ఆత్యయిక పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక ప్రమాదకరమైన దేశ ద్రోహి పారిపోవటానికి ఇంత చతురంగా పన్నాగం పన్నిన ఈ ధర్మారావు దోషి, శిక్షా పాత్రుడు."
    నిందితుని తరపున అర్జున్ లేచాడు. "యువరానర్! ఎదుటి పక్షం వారు ఆరోపించినట్టు ముద్దాయి ధర్మారావు అనాధశ్రమం లో పెరిగిన వాడే. అయితే, వారు ఆరోపించినట్టు అతడు నటకుడూ, మోసగాడూ కాడు. తన కసలు తల్లీ , తండ్రీ ఉన్నారన్న విషయం గాని, వారి పూర్వ చరిత్ర గాని అతడికి ఇప్పటి వరకూ తెలియవు.
    "ధర్మారావు అపురూపమైన వ్యక్తీ. ఆదర్శ పురుషుడు. ఇతడు ప్రవేశ పెడుతున్న నూతన సంస్కరణ పద్దతులు ఇష్టం లేక, అందువల్ల తాము తీస్తున్న లాభాలు దెబ్బ తినడం తో కాంట్రాక్టరు భుజంగం, వార్డెన్ రాధాయ్ వంటి వ్యక్తులు వారి వంటి పెద్దల తోనే కలిసి పన్నిన పన్నాగం ఇదంతా."
    "అది నిరాధారం." అంటూ సత్య లేచింది.
    అర్జున్ జడ్జి వైపు తిరిగాడు. "యువరానర్! ఇందుకు ఆధారాలున్నాయి. వాటిని కోర్టు వారి దృష్టి కి తేవడానికి అనుమతి ఇవ్వాలి."
    "ఇచ్చాము."
    జడ్జి అనుమతించగానే అర్జున్ తన రికార్డు లో నుండి తీసి, మూడు కాగితాలను కోర్టు వారికి దాఖలు చేస్త్గూ చెప్పాడు : "ఖైదీలకు సరిగా భోజనాలు పెట్టించకుండా లాభాలు తీస్తున్నాడు జైలు కాంట్రాక్టరు భుజంగం. ఖైదీలను చూచుకో వచ్చిన వారివారి బంధువుల వద్ద లంచాలు తీసుకుంటూ ఆర్జన చేస్తున్నాడు వార్డెన్ రాదాయ్. విధ్యుక్త ధర్మ నిర్వహణ కు అంకితమైన ధర్మారావు జైలు సూపరింటెండెంటుగా రావడంతో ఈ ఇద్దరి చర్యలకూ ఆటంకం ఏర్పడింది. వారు ధర్మారావు ను మొదట మంచి మాటలతో, లంచాలతో లొంగ దీసుకోవడానికి ప్రయత్నించారు. కాని నీతి, న్యాయాలకు కట్టుబడి ఉండే ధర్మారావు వద్ద వారి పధకం సఫలం కాలేదు. అందువల్ల వారు బెదిరించి, అతడిని లొంగ దీసుకోవాలని యత్నించారు. ఒక సాయంత్రం వాహ్యాళి కి వెళ్ళిన అతడి చెంతకు, ఒక బెదిరింపు లేఖతో కలిపి ఒక బాకును విసిరారు."
    "ఇదంతా కట్టు కధ. ఇందు కాదారాలేవి?" సత్య అడిగింది.
    చకితుడైన అర్జున్ ధర్మారావు దెస చూచాడు. ఏమాత్రం చలనం లేకుండా నిలబడి ఉన్న ధర్మారావు ను చూచి, లోలోన మహా ఆశ్చర్య పడ్డాడు అర్జున్ , అతడి నిగ్రహానికి.
    అర్జున్ నెమ్మదిగా అన్నాడు, సత్య వదనం లోని కదిలికలను జాగ్రత్తగా పరీక్షిస్తూ : "ఆరోజున ధర్మారావు వెంట ఆ సమయం లో అతడికి ఆప్త స్నేహితులైన వారొకరు ఉన్నారు. అయితే, దురదృష్టవ శాత్తూ ప్రస్తుతం వారు సాక్ష్యం ఇవ్వగల స్థితిలో లేరు."
    లజ్జా భారంతో వాలిపోయింది సత్య ముఖం. అది ఒక్క అర్జున్ కే అర్ధమయింది.
    "అయితే ఇంకా ఆధారాలు లేకపోలేదు." అర్జున్ తిరిగి ప్రారంభించాడు : "ఆ కత్తి మీ, ఉత్తరం మీద వేలిముద్రలు సదరు భుజంగం, రాధాయ్ లనేనని నిపుణుల పరీక్ష లో తేలింది. అనంతరం భుజంగం, రాదాయ్ సబ్- ఇన్ స్పెక్టర్ల సమక్షం లో తమ తప్పిదాన్ని అంగీకరించి, నాకూ, ధర్మారావు కూ వ్రాసి ఇచ్చిన క్షమాపణ పత్రాలె ఇప్పుడు దాఖలు చేసిన మూడు పత్రాలలో రెండు. మూడవది బాకుకు చుట్టి ఆనాడు విసిరిన ఉత్తరం. తమరు అనుమతిస్తే సాక్షులుగా ఆ వెలి ముద్రల నిపుణుడినీ, సబ్ ఇన్ స్పెక్టర్ల ను ప్రవేశ పెట్టగలను."
    జడ్జి అనుమతి తో సాక్షి విచారణ లు అయ్యాయి. దాఖలు పరిచిన పత్రాలలో విశేషాలు యదార్ధంగా ధ్రువ పడ్డాయి.
    విషయాన్ని జడ్జి గారు నోట్ చేసుకున్నారు.
    అర్జున్ తన వాదాన్ని కొనసాగించాడు : "ఒక ఖైదీ పారిపోవడానికీ , ధర్మారావు కూ ఎటువంటి సంబంధం లేదు. ధర్మారావు కు తలిదండ్రులు న్నారని అతడికీ తెలియదు; ఎవరికీ తెలియదు. అతడెప్పుడూ ఏకాకిగానే బాధపడేవాడు. తానొక అనాధ శరణాలయం లో పెరిగిన వాడు కావడాన ఆ సంబంధమైన కష్ట నిష్టూరాలు , బాహ్య, అంతరంగిక , మానసిక బాధలూ అతడికి తెలుసు. అందుకే అతడు దీనులైన ఖైదీ లను ఉద్ధరించి , సన్మార్గం ఏర్పరచ ప్రయత్నించాడు. వారి బాధ లను బాసే ఏర్పాట్లు మొదలు పెట్టాడు. ఖైదీ లందరూ అతడికి సమానులే. గౌతమ్ ఎవరో అతడికి అప్పుడూ, ఇప్పుడూ కూడా తెలియదు. కాని ఈ స్వార్ధ ప్రపంచం పూర్వా పరాలు ముడి వైచి, అందమైన కట్టు కధ అల్లి అతడికి చుట్టింది. ధర్మారావు కేవలం నిర్దోషి. తనకు తల్లీ, తండ్రీ ఉన్నారని గాని, ఆ సంబంధమైన మరే విషయాలు గాని అతడి కెంత మాత్రం తెలియవు. దేశ ద్రోహి కుమారుడుగా జన్మించడం అతడి నేరం కాదు. అది కేవలం అప్రస్తుత విషయం. ధర్మారావు నిర్ధిషిత్వాన్ని కోర్టు వారు గుర్తించాలి." ఇదీ అర్జున్ వాదం.
    వాదోపవాదాల తో రోజులు గడుస్తున్నాయి.
    సత్య, అర్జున్, ధర్మారావు ల స్నేహభిమానాల విషయం తెలిసిన అందరికీ ఈ విషయం చాలా కుతూహలం కలిగించి ఉబుసుపోక అయింది.
    న్యాయాధిపతి న్యాయమిత్ర మానసిక స్థితి మరీ ఘోరంగా ఉంది. అతడు న్యాయమూర్తి గా ఎంతటి ధర్మ పరుడో, ఎంతటి కఠినత్ముడో స్వాభావికంగా  అంతటి మృదుల హృదయుడైన వ్యక్తీ. సహజంగా న్యాయ ధర్మాల పట్ల తనకు గల ప్రీతి వల్లనే తనవంటి నిస్వార్ధ వ్యక్తే అయిన ధర్మారావు ను అతడు విశేషంగా అభిమానించాడు: ఎందుకో తెలియకుండానే ప్రేమించాడు. ధర్మారావు తలపెట్టిన చక్కటి సంస్కరణ లకు సదా అభినందించు తుండేవాడు. అటువంటి తానె ధర్మారావు ను దోషి గా నిలబెట్టి న్యాయ నిర్ణాయాదికారిగా కూర్చోవడానికి అతడిలోని సభ్య మానవ పర్వం సిగ్గు పడుతున్నది.
    ఆ విషయమే ఆ రాత్రి భోజనాల దగ్గర సుమిత్ర తోనూ, సత్య తోనూ అన్నాడు మిత్రా.
    "ఏ మాట కామాటే అనుకోవాలి. బొత్తిగా ఇటువంటి చిరునామాలేని అనాదుడికి అధికారాలిమ్మని ఎవరు చెప్పారు?' తేలికగా అనేసింది సుమిత్రాదేవి.
    ఉలిక్కిపడ్డాడు మిత్రా. "ఛీ. నువ్వూ అదే మాటంటావటే?"
    "ఏం? తప్పా? ఎంతటి పని చేశాడు! ఎంతటి పని! వాడిది గుండెనా, లేక చెరువా!" మళ్ళీ నూతనంగా ఆశ్చర్యపోసాగింది సుమిత్ర.
    "ఛ. ఊరుకో. నా కేమిటో అంతరాత్మ చెబుతుంది -- అతడు తప్పు చేయలేదని. కాని అంతరాత్మ లెవరి క్కావాలి? చట్టం చట్టమే!"
    "పోనీలెండి. చేస్తే చేశాడు కాని, ఏదో చిన్న శిక్ష వేసి వదిలేయండి."
    "నాకే అధికార ముంటే ఏ ఆధారాలూ లేకనే, నా అంతరాత్మ అభిప్రాయం ప్రకారం ధర్మారావునే విడిచి పెట్టేసి ఉండును. కాని, ఆ అధికారం లేదు. ఏ చట్టమూ ఆ స్వతంత్రాన్ని న్యాయమూర్తు లకు ప్రసాదించ లేదు." అన్నాడు బాధగా.
    ఆ సంభాషణ అతి బాధాకరంగా, ఉండి, అక్కడి నుంచి చటుక్కున లేచి వెళ్ళిపోయిన సత్యకు తలుపు వెనక , వరండా లో నిల్చుని అంతా జాగ్రత్తగా వింటున్న కొత్త వంట ముసలమ్మ కనిపించింది.
    అమితంగా ఆశ్చర్యపోయిన సత్య పెదవి కదప కుండానే ఆమె వైపు ప్రశ్నార్ధకంగా చూచింది -- ఏమిటా మాటల మీద నీకంత శ్రద్ధ ? అన్నట్టు.
    గ్రహించిన వంటలక్క సిగ్గుపడుతూ , వెకిలి నవ్వు నవ్వుతూ చెప్పింది. "డిటెక్టీ కధ లిలాగే ఉంటాయమ్మాయి గారూ! సదూతుంటే బలే గమ్మత్తుగా ఉంటాయి."    
    "ఈకాలం లో పసి పిల్లలకూ, పండు వ్రుద్దులకూ కూడా ఈ పుస్తకాలే నచ్చాయి." నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది సత్య.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra