Home » Gullapalli sundaramma » Athani Lakshyam

 

                                       14
    మనుష్యుల్లో , స్వతహా వస్తుండే ఈ అలవాట్ల కీ కాలానికీ ఏవిధమైన సంబంధమూ ఎప్పుడూ వుండదు. అయినా ఎంతో లోతైనదనుకుంటూ మళ్ళీ ఆ మనసులోని మాటల్నీ, భావాల్నీ గేలం వేసి లాగాలనుకోవడం ఎంత అసభ్యమో , అలోచించి చూడండి. ఎప్పుడైతే వారి భావాల్ని అంత లోతుగా దాచి వుంచారో అప్పుడే అవి తెలియ జేయవలసిన వారి వద్ద తప్ప వాట్లని బయట పెట్టరన్నది, అందరికీ అర్ధమయ్యే సంగతేగా! అందువల్ల ఈ విషయాన్ని గురించి ఇక చర్చే అనవసరం' అనేశాడు రఘు అనుకోకుండా. ఈ విధంగా తన నిశ్చయాన్ని తెల్పెందుకో మార్గం ఏర్పడ్డందుకు ఆనందిస్తూ.
    అయితే సుధ సంగతో?
    ఏళ్ల తరబడి; ఎన్నెన్నో ప్రయత్నాల్చేసీ ఏ కొంచెం ఆచూకీ నీ పైకి తియ్యలేక పోయిన ఈ సమస్య ని 'ఏదో ఇదొక సాధారణ విషయం. దీన్ని తేల్చు కుందుకు ఎందుకు నీకంత ఆందోళన' అన్నట్టు ఎంత సులువుగా పరిష్కరించేశాడో ఈ రఘు. అనుకుని చాలా చిరాకు పడిపోయింది రాధ.
    అతనన్నట్టు అతని భావాల్ని తెల్సుకోవలసిన వారు అతనికి వేరే వున్నట్టు స్పష్టం చేస్తున్నా తనెందు కింకా అవి తెల్సుకోవాలని ఇలా తహతహలాడ్డం?
    అదీగాక ఏదో ప్రపంచ మంతా గొడ్డు పోయిందన్నట్టు,  తనెందుకు ఇతన్ని లా ఆశ్రయించి నిరాశ పడాలి? ఇంతకీ, తనేమన్నా అనాకారా, విద్యా విహీనురాలా. గతి లేనిదా, ఎందుకని ఇంత హైన్య పడాలి తను. ఏదో మమకారం కొద్దీ, అతని మీద మనసు పడిందే గాని, తను 'సారీ' అంటే చాలునానుకుని తన కోసరం నిరీక్షిస్తుండేటట్టీ ఇతని తలదన్నేవా రెందరెందరో'
    ఇలా పరుగురేత్తాయి రాధ అలోచనలు.
    'మరీ! ఈదర గాలిగా వుంది. ఇంక లోపలి కేల్తామా?' అన్నాడు . తన కుర్చీ పట్టుకు లేస్తూ రఘు. మాట్లాడకుండా రాధ లోపలి కెళ్ళి పోయింది. రఘు మాత్రం వరండా లో కుర్చీ వేసుకుని ఏదో పుస్తకం చదువు కుంటూ కూర్చున్నాడు. ఇంతలో పుల్ సూట్ లో సవిలసంగా ఈల వేసుకుంటూ వచ్చాడు చంద్ర మౌళి.
    'హల్లో రండి' అంటూ మరో కుర్చీ ముందుకు తోశాడు రఘు తను కూర్చున్న పళాన్నే.
    'రాధ ఇంకా రాలేదా' అతని కళ్ళు అందుకే వెతుకుతున్నాయి.
    'లోపలున్నట్టుంది పొడిగా అన్నాడు రఘు.
    'అలాగా' అంటూనే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గుమ్మం తెర వత్తిగించుకు లోపలి కెళ్లి పోయాడు చంద్రమౌళి. 'రాధతో తప్ప, నీతో నాకేమీ నిమిత్తం లేస్సుమా' అన్నట్టున్న అతని ప్రవర్తన రఘుకి కొంచెం కష్టం గానే అనిపించింది. అయినా తను రాయవెల్లూరు వెళ్ళొచ్చి నప్పట్నుంచీ అతని రాకపోకలు ఎక్కువ గానే వున్నట్టు రఘు గ్రహించాడు. అదీ గాక, మొదట్నుంచీ ఇతని ప్రయత్నం రాధ పరిచయం కోసరం మాత్రమే నని అనిపించడంతో పాటు ఎప్పుడూ సిగరెట్ తాగుతూ విలాస చేష్టలు చేస్తుండే చంద్రమౌళి యందు మొదట్నుంచీ రఘుకి మంచి అభిప్రాయం లేదు.
    'వోసారలా షైరు వెళ్లోద్దాం వస్తారా' విధి లేక అడిగినట్టుగా అన్నాడు చంద్రమౌళి మెట్లు దిగి వెళ్లి పోతూ. అతని పక్కనే అంటీ అంటనంత దగ్గరగా నడుస్తున్న రాధ అదీ అనలేదు సరికదా, రఘు వేపు చూడనన్నా చూడలేదు.
    'సారీ, నాక్కొంచెం కోల్డు గా వుంటుంది' అన్నాడు ఒక్క మారి వారిద్దరి వేపూ చూసి మళ్ళీ తల దించేసు కుంటూ రఘు. వారిద్దరూ వెళ్లిపోయారు. చంద్రమౌళి వదిలి వెళ్ళిన అత్తరుల పరిమళం మాత్రం ఇంకా అక్కడ గుబాలిస్తూనే వుంది.
    'హు , ఇంత చంచల మైన దన్న మాట ఈ రాధ మనసు' అని ఏవేవో ఆలోచించుకుంటూ పోయిన రఘు మనసు మళ్లీ,
    'అయినా ఆవిణ్ణి శాసించెందుకో అనుమానించెందుకో తనకేం అధికారం వుంది' అనుకుని మళ్లీ సర్దుకుంది.
    'అయితే మాత్రం! నీ దేశం, నీ జాతి , నీ ఊరు . మరి ఆ పిల్ల మంచి చెడులు నిన్ను బాధించడం లో ఆశ్చర్య మేముందీ.' అంటుంది , ఏ మూల్నుంచే అంతరాత్మ.
    ఇంతకీ ఈ విషయం లో కల్గజేసు కోవడమా, మానుకోవడమా , ఇదో కొత్త బాధొచ్చి పడింది రఘుకి. ఆరోజు కారోజు రాధ ప్రవర్తన లోని మార్పు చూస్తుంటే రఘు కేదో వంచనన్నట్లుగా అతని మీదేదో కక్ష సాధించేటందుకు నడుం కట్టుకున్నట్టుగా తోస్తుంది రఘుకి.
తరచూ చంద్ర మౌళి ఇక్కడే భోజనం చేస్తుండడం, తన రాకపోకల్తో నిమిత్తం లేకుండా ఇద్దరూ టిఫిన్లూ, భోజనం కానిచ్చేస్తుండడం, రాత్రి పది గంటల దాకా హల్లో పెకాటా, వెకవేకలూ , పకపకలూ . వారని ఏం అనచ్చో? ఏం అనకూడదో ? ఏమీ తోచడం లేదు రఘు కి.
    తనతో ఏ నిమిత్త మూ లేకుండా వారలా వుంటున్నప్పుడు తను హల్లో కూర్చోవడం కన్నా తన గదిలో కెళ్లి పొతే బాగుంతుందేమోననే అనిపించేది రఘు.
    అయితే వారంతా అయోగ్యతగా వున్నా, తనూ వారికింకా అనునివ్వడం తన సభ్యతకి ఏమీ బాగుండదనుకుని ఏదో చదువుకుంటూ ఎడంగా ఆ హల్లో నే కూర్చునే వాడు రఘు మొదట్లో. అల్లా రాగానే వెళ్ళే ముందూ నామకానికోసారి తనని పలకరించే చంద్రమౌళి కాలక్రమేణా అది కూడా మానేశాడు. అయినా కూడా రాధని ఇంకా బొత్తిగా విచ్చల విడిగా వదిలెయ్యడం అంటే, రఘుకి మనసొప్పడం లేదు. అది ఒకరి పతనాన్ని సహించలేని ఒక పవిత్ర భావం అంతే.
    ఇంతకీ రాధ అటువంటి కెవలమైన అలవాట్లూ, అభిప్రాయాలూ కలది కాదన్నది రఘుకి బాగా తెలుసు. కేవలం తన నేదో అవమానం చెయ్యాలన్న మూర్క భావంతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తుందన్నదీ , రఘుకి తెలుసు. అయితే ఈ దృష్టి తో మాత్రమే ముందూ వెనకా లలోచించకుండా మొండిగా ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తన ని, నిజంగానే రాధ నెలాగైనా చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం లో వుండే చంద్రమౌళి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ఏ అవినీతి కన్నా తలపడ్డాడంటే అప్పుడిక రాధ భవిష్యత్తు ఎంత ఘోరంగా పరిణమిస్తుంది?' ఇదే రఘు బాధ.
    అదీగాక మొగుడు కొట్టినందుక్కాదన్న, సామెత లాగ ఇంటిలోని పరివారం మొదలైన వారంతా, ఈ విపరీతపు మార్పులకి రాధతో పాటు తననీ ఏ అపార్ధం చేసుకుంటారో నని కూడా రఘు కి చాలా బాధగా వుంటుండేది.
    అసలు, చంద్రమౌళి చెల్లెలు హాస్పిటల్లో వున్నప్పుడే ఇతను ఒకరిద్దరు నర్సుల వద్ద అసమంజసంగా ప్రవర్తించిన కారణంగా కొన్ని గొడవల్జరిగాయి కూడా. తన తోడి డాక్టరొకతను, అదివరకే ఈ చంద్రమౌళి వల్ల బతుకే నాశనం చెయ్యబడ్డ కొందరి చరిత్రల్ని , తప్పతాగి పోలీసు చేతుల్దాకా వెళ్లిన అతని దురలవాట్లు మొదలైన అతని లీలలన్నీ మిగతా వారివద్ద వర్నిస్తుండడం ఎన్ని మార్లో విన్నాడు రఘు. అటువంటి చంద్ర మౌళి తో రాధ ఇంత చనువుగా ప్రవర్తించడం చాలా హైన్య మనిపించడమే గాక ప్రమాదమైన పనని కూడా అనిపించింది రఘు కి. ఇన్నాళ్ళ బట్టీ రాధ తన యందు అభిమానం చూపుతూ ప్రవర్తించిందంతా స్వలాభం కోసరం తప్ప నిజమైన సద్భావం తన యందుండి కాదనీ తను రాధ విషయం లో తన అభిప్రాయం సూచన మాత్రం తెలియ పరిచే సరికీ ఆ కాంక్ష క్రోధంగా మారిపోయిందనీ ఇందు మూలకంగా బాగా అర్ధమయి పోయింది రఘు కి. అందువల్ల 'ఇంకా నయం. చపలత్వం కొద్దీ ఆ అందానికి మురిసి తను లొంగి పోలేదు . అనుకుని సంతోషించాడు రఘు.

                   
    అంతేకాదు ప్రతుఫలా పేక్షన్న  మాటలేని సుధ నిర్మల ప్రేమ ముందు . రాధ తత్వాన్ని తల్చుకుందుక్కూడా హేయంగా అనిపించిందతనికి. తనయందూ తన భవిష్యత్తు యందూ సుధ కెంత తాపత్రయం? ఈమాట అనుకోగానే ఈ ఏడాది మధ్యా సుధకీ తనకీ ఉత్తరాల ద్వారా జరిగిన వాదనలన్నీ గుర్తుకొచ్చాయి రఘు కి. ఉత్తరమంతా బావకి ఆనందాన్ని గూర్చే సంగతులు, ఆరోగ్యం విషయమై బావ అనుష్టించాల్సున్న విధులూ, అదే పిచ్చిగా వైద్యం గొడవల్లో పడి ములిగి తెల్తూ వుండక, కొంచెం మనసుకి హాయినిచ్చే కులాసా కాలక్షేపాలూ చేస్తుండవలసిందిగా చిన్న చిన్న మందలిం పులూ రాసి, ఎక్కడో ఒక చోట బావ భవిష్యత్తు సుఖంగా జరగాలని తను ఆశిస్తున్న సూచనా ఇముడుస్తూ రాస్తుండేది సుధ.
    సుధ కాలు  వైద్యానికి ముందు రోజు సుదకి బెంగ తోచకుండా వుత్సాహంగా వుంచాలను కుని సుధ మంచం దగ్గరగా కుర్చీ వేసుక్కుర్చుని జానకిని కూడా భోజనం చేసి రమ్మని పంపించేశాడు రఘు.
    అయితే అతని అభిప్రాయం సుధని తృప్తి పరచడం అయితే సుధ అభిప్రాయం అతని పెళ్లిని గురించి అతని అభిప్రాయం తెల్సుకుని తనూ హెచ్చరించలని. అందువల్ల అతను ఎన్నిమార్లు మాట మార్చినా సుధ మళ్ళీ ఆ మాటల్లోనే దింపడం చూసి ఇక తప్పనిసరిగా తనూ తన అభిప్రాయం బయట పెట్టేసెందుకే నిశ్చయించాడు రఘు. అదీగాక అందువల్ల సుధకి మరికొంత ఆనందం కల్గుతుందని అతని అభిప్రాయం. అయితే సుధ సులువుగా, అందు కంగీకరించక పోవడం అతని కశ్చర్యాన్నే కల్గించింది . అబ్బ! బావ సుఖం కోసరం తన స్వసుఖాన్నే త్యాగం చేసేందుకు  సిద్ద పడుతుందా సుధ? అనుకుని ఆ నిర్మల ప్రేమకి ముగ్ధుడై పోయాడు రఘు. ఈ జ్ఞాపకం రాగానే తన గదిలో కెళ్లి కూర్చుని లైటు ఆఫ్ చేసేసి ఆనాటి సంభషణ ని, గుర్తుకు తెచ్చుకుందుకు ప్రయత్నించాడు రఘు.
    తను వెళ్ళడం తోనే హాస్పిటల్ వరండా లో బెంచీ మీద కూర్చుని ఏవో తర్కించుకుంటున్న తన వాళ్ళంతా కుశల ప్రశ్నలడిగారు.
    'మునపటి కన్నా ఇప్పుడే బాగునంట్టున్నాడే రఘూ' అని. అయితే సుధ ?
    'ఇదేవిటి బావా! ఇలా అయిపోయావ్?' అంది తనని చూడగానే విస్తుబోతూ.
    'బాగుంది అందరూ నేనెంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నానంటే--
    'ఏమో ఈ ఆరునెలల్లోనూ ఆరేళ్ళు పెద్దవాడి వై పోయినట్టనిపిస్తున్నావ్ నాకంటికి' అంది సుధ.
    నిజం. మితిమించిన ఆలోచనల వల్ల తను అలా అయిపోయాడను కోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు, అయితే తనని బాగా తెల్సుకున్న సుధ ఒక్కర్తే కే ఆ మార్పు తెలిసొచ్చింది.'
    'అక్కడా నీ వైద్యపు గొడవల్లో నే మునిగి పోతున్నావా. లేక ఆ చుట్టూ పట్ల ఏవైనా చూసోస్తున్నావా బావా?'
    'ఏవో ముఖ్యమైనవి కొన్ని చూశాం.  అంతే.
    'ఫోటోల్తియ్యలేదూ' మరీ.
    'తీశా, తెచ్చావో లేదో గుర్తు లేదు. ఆ ఫోటో ల్లో చాలావరకూ తననీ రాదనీ కలిపి అక్కడి స్నేహితులు తీసినవే అవడాన్ని అందువల్ల సుధ వాట్లని చూస్తె ఏవన్నా అపార్దాల్చేసుకుంటుందేమోనన్న జంకు వల్ల అలా అన్నాడు రఘు.
    'నీ పెట్టె ఇక్కడేగా వుందీ?....తీస్చూడు బావా?' గునిసింది సుధ. నవ్వుకుంటూ లేచి వెళ్ళి ఆ ఫోటోలున్న కవరు తీసుకొచ్చి ఇచ్చాడు రఘు. ఆదుర్దాతో వాట్లని వరుసగా చూస్తుంది సుధ, సుధ భావం ఏవిధంగా వుందో తెల్సుకుందుకని పరిశీలనగా సుధ ముఖాన్నే చూడసాగాడు రఘు. అయితే వో పసిపాప తను కోరుకున్న బొమ్మ చేజిక్కించుకున్నప్పుడు దాన్ని చూసి ఆనందం పొందుతున్నటువంటి భావం మాత్రమే సుధ మొహం లోనూ స్పురించింది రఘుకి.
    'ఇలా ఇచ్చేయి మరి మరి ఫోటోల కవర్ని తలగడ కింద పెడుతుండడం చూసి చేయి చాచాడు రఘు.
    'అమ్మా వాళ్ళందరికీ చూపించోద్దు మరీ.'
    'ముందు నీ అభిప్రాయం చెప్పు.
    'బాగుంది ఫోటోల్ని గురించి అభిప్రాయం చెప్పడం ఏవిటి బావా?' తెల్లబోయింది సుధ.'
    'అంటే వాట్లని చూస్తె ఎలా వున్నాయి అని' తన మనసులో మాట పై కొచ్చేసి నందుకు నాలి క్కోరుక్కుని మళ్లీ అలాటి ధోరణి తోనే అడిగేశాడు. తడబడి పోయిన తను,
    'ఏవిటి బావా అక్కడికి ఏవీ ఏరంగనట్టు.'
    'అబ్బ అ ఎరిగున్న దేదో చెప్పదూ త్వరగానూ.'
    'చెప్పనా, కోరీ వరించీ పెళ్లి చేసుకున్న ఒక నవ దంపతుల ఉల్లాస ప్రయాణాల్లో తీసుకునే ఫోటోలు ఎలా వుంటాయో , ఎలా వుండాలో అలాగే వున్నాయి. చాలా! ఇంకా విపులంగా చెప్పాలా?' నిజమైన ఆనందంతో అంది సుధ.
    'నిజం చెప్పు సుధా. ఆ ఫోటోల్ని చూస్తె నీకు బాధగా లేదూ?'
    'నాకా? ఎందుకూ?.... నివ్వేరబోతూ అడిగింది సుధ.
    'పైగా 'ఎందుకూ' అనడుగుతున్నావా? అన్నీ నానోటే చెప్పించాలని ప్రయత్నిస్తున్నావా సుధా.'
    'ఆ ఇప్పుడు నాకంతా అర్ధమవుతుంది . నాకటు వంటి సంకుచిత భావం ఎప్పుడూ లేదు బావా, ఇప్పటి కైనా నువ్వు నీ మనసు మార్చుకుని నీకు తగిన పిల్లని ఎంచు కున్నందు కు నేనెంతో ఆనందిస్తున్నాను బావా. ఇవి త్రికరణ శుద్దిగా చెప్తున్నవి గాని పై పై మాటలు కావు బావా, నన్ను నమ్ము' ఆవేశంగా అంది సుధ.
    'అలా నువ్వనుకున్నట్టు నీ అభిప్రాయం నిజం కాదు సుధా.'
    'ఔను. అదే నిజం. ఒకవేళ ఇంతవరకూ అది నిజం కాకపోయినా, ఈ పైన అది నిజమయ్యేటట్టు నువ్వు ఒప్పుకోవాలి బావా.'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra