Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

 

       - ఆ వ్యక్తిని తప్ప మరెవరినీ తరచుగా కలుసుకొనే అవకాశమూ (ఆపర్చునిటీ), మాట్లాడే వీలూలేక, దొరికిన ఆ ఒక్కడే గొప్పగా కనపడి, ఆ ఇరుకుసందుల్లో స్నేహం చెయ్యవలసివస్తే అది ఆకర్షణ!
   
    - పరిచయం అయిన మొదటిరోజుకన్నా సంవత్సరం తరువాత అవతలి మనిషి సాన్నిధ్యం తక్కువ ఆనందాన్నిస్తే అది ఆకర్షణ.
   
    అంటే-
   
    ఉదయంపూట నీడలా తరిగేది ఆకర్షణ!
   
    "కిరణక్కా! మేమొక విషయం మాట్లాడటం మొదలుపెట్టగానే వెంటనే ఆలోచనల్లో పడిపోతూ వుంటావేం?" అడిగింది నీలూ.
   
    "బహుశ మనం చెప్పిన విషయాలను మననం చేసుకొంటూ అందులోని సైకాలజీ స్టడీ చేస్తుందేమో" అంది ఇందు.
   
    "నిజమే - సైకాలజీ చాలా లోతైన సబ్జెక్టు! ఇన్ ఫినిట్ అన్నమాట. శోధిస్తే ప్రతివ్యక్తి దగ్గిర్నించీ ప్రతి నిముషం మనకు ఏదో ఒక పాయింట్ దొరుకుతూనే వుంటుంది."
   
    "అందుకేనా నువ్వెప్పుడూ తక్కువ మాట్లాడతావ్?"
   
    "నిజం చెప్పాలంటే నాకు ఆత్మీయులైన స్నేహితులెవరూ లేరు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఒకటే అనిపిస్తుంది. చిన్నప్పటినుంచి నేను పెరిగిన తీరు, నా ఇంటి వాతావరణం నాలో చాల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని కలిగించాయనుకుంటాను, దాంతో, నాలో మెచ్యూరిటీ కలిగేవరకూ, అంటే ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ నేను వంటరినే. అంత వయసు వచ్చాక మనస్పూర్తిగా మనసువిప్పి చెప్పుకోవాలన్నంత స్నేహం చేయటం కష్టమే. చిన్నతనంలో అయితే భేదాభిప్రాయాలు లేకుండా స్నేహం చెయ్యొచ్చు. వయసుతోపాటు, సంకోచంకూడా పెరుగుతుంది కదా! ఏదో సందర్భంలో అనుకోకుండా వచ్చిన చర్చల్లో తప్ప మనసులో ఆలోచన్లు బయటపడే అవకాశం లేదు. అల ఇంట్రావర్ట్ లు అయిపోతారు మనుష్యులు అందులో నేనొకదాన్ని."
   
    "ఇంత చక్కగా ఆలోచిస్తావ్ కదా. రమణి భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నావ్ అక్కా? తను జీవితంలో ఎలా సెటిల్ అవుతుంది?"
   
    "చక్కటి గృహిణిగా సెటిల్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలకి సాధారణంగా  నోట్లో నాలుకలేని మొగుళ్ళు దొరుకుతారు. భర్త గురించి, పిల్లల గురించి, హైసొసైటీ గురించీ తప్ప మరోమాట మాట్లాడదు. ఇప్పటి మొగ స్నేహితులెవరైనా అప్పుడు కనిపించినా తొట్రుపడదు. 'ఈయన రాజారావు నాకు అన్నయ్యలాటివాడు' అని భర్తకు పరిచయం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొంతకాలం అయ్యాక ఆమెకి పాతజీవితం మళ్ళీ గుర్తొస్తుంది. నరమాంసం మరిగిన పులిలా, తిరిగి కోరిక కల్గితే, మళ్ళీ పరిచయాలు ఏర్పర్చుకుంటుంది."
   
    "కానీ అందరూ అలా అంతరాత్మలని నిద్రపుచ్చి మామూలుగా వుండగలరా? నాకయితే ఆలోచిస్తేనే భయమేస్తూంది."
   
    "అందరూ రమణిలా వుండలేరు. దీనికో థియరీ అంటూ లేదు. కొందరు జీవితంలో ఒకేసారి ప్రేమిస్తారు. కొందరు ఒకే టైమ్ లో ఒకర్నే  ప్రేమించగలంకదా అంటారు. మరికొందరు ఒకేటైమ్ లో నలుగురైదుగురు స్నేహితుల్తో గడపగలరు. ఒకర్ని ప్రేమిస్తూ మరొకరితో వుండగలరు."
   
    "రమణిలాంటి వాళ్ళు తమ కిష్టమైనట్టు తిరగ్గలరు. కానీ అపురూపలక్ష్మిలాటివారు మాత్రం ఏది అనుభవిస్తున్నా నిరంతరం బాధపడుతూనే వుంటారు."
   
    ఆ మాటలకి కిరణ్మయి అన్నది- "అపురూపలక్ష్మి అలా తయారవటానికి కారణం ఈ వాతావరణం! తనవారిమీద బెంగతో ఒంటరిగా ఫీలయింది ఆ అమ్మాయి. సాయంత్రం అయ్యేసరికి దాదాపు ప్రతీ అమ్మాయీ ఎవరో ఒక స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లేది. కిటికీ తెరిచిచూస్తే బయట తోటనిండా జంటలు కనపడేవి. బోయ్ ఫ్రెండ్ వున్న అమ్మాయిలందరూ ఆనందంగా వుండటం, ఎప్పుడు సాయంత్రమవుతుందా అన్నట్టు హుషారుగా ఎదురుచూడటం గమనించి వుంటుంది. తన బెంగపోవటానికీ, డిప్రెషన్ తగ్గటానికీ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒక్కసారిగా అడుగుపెట్టగానే బైట తిమింగిలాలు కబళించి వుంటాయి. సరిగ్గా ఇలాటి అవకాశం కోసమే ఎదురుచూసే మొగవాళ్ళు తమలోనే ఒక తండ్రిని, అన్నని, ప్రియుడిని కూడా  చూపించగల సమర్ధులు ఇలాంటి అమ్మాయిలకి తొందరగా స్నేహితులవుతారు. స్వేచ్చకి కొత్త అర్ధం చూపుతారు."
   
    గుమ్మం దగ్గిర ఏదో చప్పుడవటంతో మాటలాపి కిరణ్మయి తల తిప్పి చూసింది. ఒకమ్మాయి నిలబడి వున్నదక్కడ. ఆమె మొహం పాలిపోయివుంది. అంతలో నీలూ అంది-
   
    "రా రాధా. ఈమె కిరణ్ అని. ఎమ్.ఫిల్. చెయ్యటానికి వచ్చారు. చక్కగా సైకాలజి గురించి చెపుతోంది రా."
   
    "వద్దు. నా కలాంటి చర్చలంటే భయం" అందా అమ్మాయి ఆమెకూడా చిన్నపిల్లె, అపురూపలక్ష్మి వయసుంటుంది.
   
    "ఎందుకు భయం? అందరికీ సంబంధించిన సబ్జెక్టే కదా!"
   
    "కావొచ్చు. కానీ అలా అందరి మనస్తత్వాల్ని విశ్లేషించుకుంటూ పోతే అమ్మా, నాన్న, ఆప్తులు కూడా భయంకరంగా కనపడతారు" ఆ అమ్మాయికళ్ళలో ఏదో తెలీని విషాదాన్ని గమనించింది కిరణ్మయి.
   
    "ఎందుకీ పలాయన వాదం?" అని అడగలేదు. నవ్వుతూ అంది - "ఆలోచన అనేది అంతర్లీనం! ఆలోచన అనేది ఎలా తప్పనప్పుడు అది ఊహా, గాలిమేడా కాకుండా 'అంతర్మధనం' అయితే మంచిది. మనం బ్రతుకుతున్న జీవన విధానమే చాలా గొప్పది అనుకునే వాళ్ళ బ్రతుకులు కూపస్థమండూకాలు. నిరంతర అంతర్మధనం వల్లే మనిషి జీవితంలో ఎదుగుదలకి పునాది పడుతుంది. అందుకని మన ఆలోచన్లని కనీసం అప్పుడప్పుడయినా బైటకి చెప్పాలి."
   
    ఆ అమ్మాయి మొహం వివర్ణమైంది. గిరుక్కున తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
   
    మిగిలిన ముగ్గురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
   
    "ఎవరా అమ్మాయి?" కిరణ్మయి అడిగింది.
   
    "అనూరాధ అని - చెప్పాగా అపురూపలక్ష్మికి ఒక క్లోజ్ ఫ్రెండ్ వుండేదని ఈ అనూరాధే-"
   
    కిరణ్మయి వంట్లో రక్తప్రసరణ ఒక్కసారిగా హెచ్చింది.
   
    అనూరాధ!
   
    ఎవరికోసం తనింతకాలం చూస్తుందో - ఆ అనూరాధ!
   
    .... తనలో సంచలనం బయటపడనీకుండా-చాలా మామూలుగా కనపడటానికి ప్రయత్నించింది కిరణ్మయి. తనని తాను పరిచయం చేసుకోవటానికి వడివడిగా బయటకు వెళ్ళింది. అనూరాధ ఎక్కడా కనపడలేదు. రూమ్ నెంబర్ కనుక్కుని వెళ్తే - అది తాళం వేసి వుంది. మళ్ళీ వెనక్కి వచ్చింది.
   
    "ఏమిటక్కా అంత కంగారుగా వున్నావ్?"
   
    "ఏంలేదు. ఏంలేదు." అని మాట మార్చి, "అపురూపలక్ష్మి, అనూరాధా మంచి ఫ్రెండ్సా?" అని అడిగింది.
   
    "అనూరాధ - రమణిలైకర్"
   
    "లైకరా?.... అంటే?" నుదురు చిట్లిస్తూ అడిగింది.
   
    "హాస్టల్స్ లో సాధారణంగా సీనియర్లు అందమైన అమ్మాయిల్ని వెంట తిప్పుకోరు. అదివాళ్ళ కాంప్లెక్స్ కి భంగం! కాస్త బీద అమ్మాయిల్నీ, నెమ్మదస్తుల్నీ ఎన్నుకుంటారు. కంపెనీగా వుంచుకుంటారు. ఈ అమ్మాయిలకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సీనియర్ అంటే అభిమానం వుంటుంది. వీళ్ళని 'లైకర్స్' అంటారు. ఒకోసారి ఈ లైకర్స్ మరీ విపరీతమైన అభిమానం చూపించి, మితిమీరుతూ వుంటారు కూడా" అంది మిగతాది అర్ధం చేసుకొమ్మన్నట్లు.
   
    కిరణ్మయి చాలాసేపు స్తబ్దుగా వుండిపోయింది. ఇది తనకి తెలియని కొత్త విషయం!
   
    "ఈ రూమ్మేట్స్ మధ్య గొడవలు రావా?"
   
    "ఎందుకురావు? నా పౌడర్ నువ్వు వాడుకున్నావని ఒకళ్ళూ, నా దువ్వెన కనపడటం లేదు, నువ్వె తీసావని రెండోవాళ్ళూ ఒక్కోసారి తెగ పోట్లాడుకుంటారు, మళ్ళీ సాయంత్రమయ్యేసరికి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకుంటారు. కలిసిపోతారు. ఇలా వుంటాయి ఇక్కడి విశేషాలు."
   
    కిరణ్మయి మరో విశేషం కూడా గమనించింది. అది..... టెలిఫోను! రూపాయిబిళ్ళ వేసి మాట్లాడే ఫోన్ అది. హాల్లో వుంది.
   
    దాని పక్కనే ఒక నోటీసు అంటించి వుంటుంది.
   
    "డియర్ ఫ్రెండ్స్.
   
    ఈ టెలిఫోన్ రిసీవర్ విరిగింది. కష్టపడి అతికించాం. వాడేటప్పుడు జాగ్రత్త. దానికేమైనా అయితే బాయ్ ఫ్రెండ్సు ఇబ్బంది పడతారు. అందుకే దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి."
   
    ఆ టెలిఫోన్ సాధారణంగా బిజీగానే వుంటుంది. రాత్రిళ్ళు అర్దరాత్రి దాటినా దానిచుట్టూ ముగ్గురో, నలుగురో నిలబడి వుంటారు. మాట్లాడేది ఒక్కరే గంటల తరబడి మాట్లాడతారు. ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ తోనే..... పక్కవాళ్ళు వాళ్ళ సంభాషణ ఒకవైపు నించుని విని సంతోషపడుతుంటారు. జోక్స్ వేసుకుంటారు. అవతల వాళ్ళను ఫూల్ చేస్తున్నామని తృప్తిపడతారు. 'ప్రేమ' అనే పవిత్రమైన బంధం ఎంత చీఫ్ గా మారిపోతుందో ఆ ఫోన్ దగ్గర అరగంట నిలబడితే తెలిసిపోతుంది.
   
    కొన్నిసార్లు ఫోన్లు వస్తుంటాయి. చేసింది ఎవరో తెలియకపోయినా కొందరమ్మాయిలు వాళ్ళతో మాట్లాడేస్తుంటారు. అలాంటి ఫోన్స్ ఎక్కువగా మెన్స్ హాస్టల్ నించి వస్తాయట. లేడీస్ హాస్టల్ నంబరు తెలిసిన అబ్బాయిలు తోచక ఇలా ఫోన్ లు చేసి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి వీళ్ళే ఫోన్ చేసి కాయిన్ వెయ్యకుండా అవతలి వాళ్ళను ఏడిపిస్తుంటారు.      

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra