Home » Polkampalli santhadevi » సంధ్యాకళ్యాణం

   
    "సిగ్గు కంటే ధైర్యం ఎక్కువుంటుంది కదా?"

    "తనకి లేదా ధైర్యం? ధైర్యం లేనిదే పీటలమీది పెళ్ళికాదని నీతో వచ్చేసిందా?"

    "ప్రతిమా!" అరుణ్ తెల్లబోయినట్టుగా చూశాడు. "తను ఏ పరిస్థితిలో ఆ పెళ్ళికాదని వచ్చిందో నీకు వివరంగా తెలిస్తే నువ్వలా అనవు!"

    "పల్లెటూరి పిల్లలకి ధైర్యం ఉండదని నువ్వంటే అనాల్సి వచ్చింది ఆ మాట!"

    "మీరిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి! నేను టిఫిన్, టీ పట్టించుకు వస్తాను!" అని అరుణ్ క్రిందికి వెళ్ళిపోయాడు.

    కాని అరుణ్ వచ్చేదాకా ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు.

    అరుణ్ కి తనొక్కతే స్నేహితురాలు కాదు. మరో స్నేహితురాలుంది. అది నిన్న మొన్నటి స్నేహం కాదు. రాజానగరం నుండి ఈ ఊరికి వచ్చినప్పటినుండీ ఉంది. ఆ సంగతి అరుణ్ తనకి వ్రాసిన ఉత్తరంలో వ్రాశాడు కదా? ఆ ప్రతిమే ఈ ప్రతిమ కావాలి! ప్రతిమ మాటలు చేష్టలు అరుణ్ కి ఆమె ఎంత సన్నిహితురాలో తెలియజెప్పుతున్నాయి.

    తన చిన్ననాటి స్నేహితుడు 'పెళ్ళి' అనే ఆపద నుండి తనని రక్షించి తెచ్చాడన్న ఆనందం - మనసు సరిగా అనుభవించకముందే, ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. ఒక పెద్దమనిషి తరహాగా, తనకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడ్డాడేగాని ఆ చిన్ననాటి మమకారంతో కాదు! ఆ మమతని ఈ ప్రతిమ దోచుకొన్నట్టుంది.

    తను వీళ్ళతో వచ్చేప్పుడు పెద్దగా సంకోచపడలేదు. అరుణ్ పిలువగానే నిస్సంకోచంగా వెంట వచ్చేసింది. కాని, వీళ్ళు తన వాళ్ళు కాదు! పరాయివాళ్ళు! తను రావడం చాలా పొరపాటైపోయింది.

    ఇప్పుడేం చేయాలి?

    ప్రతిమ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి.

    చిన్ననాటి స్నేహితురాలిని చూడడానికి వెళ్ళి, వెంటబెట్టుకు మరీ వచ్చేశాడు! అరుణ్ తనతో స్నేహం చేసిన క్రొత్తలో 'మా సంధ్య మా సంధ్య' అంటూ ఎప్పుడూ కబుర్లు చెప్పేవాడు. ఈ మధ్యకాలంలో కాస్త మరిచినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తానని వెళ్ళి, వెంటబెట్టుకు వచ్చాడు కదా, ఇప్పుడు సంధ్య పట్ల అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో!

                    *        *        *

    "సంధ్యా! షాపింగ్ కి వెడదాం! తయారవ్వు!"

    "షాపింగ్ కి ఎందుకు?"

    "నీకు చీరలు తీసుకొంటాను, ఇంకా బొట్టు కాటుకలాంటి చిన్న చిన్న వస్తువులు కొందాం!"

    "చీరలున్నాయిగా?"

    "మా పని మనిషి కూడా కట్టదు ఆ చీరలు! నా ఇంట్లో నువ్వా చీరలు కట్టుకు తిరిగితే నాకు నామోషీ!"

    "అరుణ్, నేను నీకేమౌతానని ఎవరైనా అడిగితే నువ్వేం చెబుతావు?" సంధ్య మెల్లని స్వరంతో అడిగింది.

    "ఒక్క ప్రాణమా అన్నట్టు మెలిగిన నా చిన్ననాటి స్నేహితురాలివని చెబుతాను!" అరుణ్ తడుముకోకుండా సగర్వంగా చెప్పాడు.

    "మీ ఇంట్లో పనిమనిషికి కూడా పనికిరాని పేదదాన్ని! నన్ను స్నేహితురాలినని చెప్పుకోడానికి నామోషీ వేయదా?"

    అరుణ్ ఒక్కక్షణం నిరుత్తరంగా చూశాడు. "పేదవాళ్ళయితే స్నేహితులని చెప్పుకోడానికేం?" అన్నాడు షాక్ నుండి తేరుకొని.

    "మరి పేదదాన్ని పేదదానిగా ఉంటే నీకేం నామోషీ చెప్పు?"

    "సారీ! నా మాటని వెనక్కి తీసుకొంటున్నాను, సంధ్యా!" నొచ్చుకొన్నట్టుగా అన్నాడు. "కాని, చిన్నప్పుడు మీ అమ్మ నీకని ఏం పెట్టినా దాచి, నాకని తీసుకువచ్చేదానివి! ఏ సంతోషమైనా నాతో పంచుకోనిదే నీకు మనసు కుదిరేది కాదు.

    "ఇవాళ భగవంతుడి దయవల్ల నేను మంచి స్థితిలో ఉన్నాను! నా ఐశ్వర్యాన్ని కొద్దిగా నా పేదస్నేహితురాలికి పంచితే ఏం? పిడికెడు అటుకులకే కుచేలుడికి అష్ట ఐశ్వర్యాలని ప్రసాదించాడట కృష్ణుపరమాత్మ! మరి చిన్ననాడు నీ చేత తిన్న చిరుతిళ్ళకు నేనేమివ్వాలి?" నవ్వు తెచ్చుకొని అన్నాడు, ఎక్కడ ఆమె అభిమానం గాయపడుతుందోనని చాలా జాగ్రత్త పడుతూ.

    "అయితే నాకెంత ఇస్తే, నీ రుణం తీరిపోతుందో లెక్కగట్టి నువ్వే తీసుకురా!"

    "ఇంట్లో ఏంచేస్తావ్? అలా వస్తే సిటీ చూడొచ్చుకదా?"

    "నిజమే! నాకేం తోచడం లేదిక్కడ! మళ్లీ రాజానగరం వెళ్ళిపోదామా అనిపిస్తూంది!"

    "అప్పుడే నువ్వు చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నావా?"

    "పశ్చాత్తాపమా? అదేం లేదు! క్రొత్తచోటుకదా? ఏమిటో గుబులుగా ఉంది."

    "అందుకే ఒంటరిగా ఇంట్లో ఉండిపోకు! నాతో వస్తే చీరలు చూసినట్టుంటుంది! సిటీ చూసినట్లవుతుంది! తయారవ్వు!"

    బీరువాలోంచి డబ్బుతీసి పర్సులో పెట్టుకొని తల్లి గదిలోకి వెళ్ళాడు అరుణ్. "నేనూ, సంధ్యా షాపింగ్ కి వెడుతున్నాం, అమ్మా!"

    జానకమ్మ నిన్నటి నుండి పక్కదిగలేదు! ఆవిడకు గుండెలో అప్పుడప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది. ఇవాళా వచ్చింది.

    "సంధ్య ఎందుకు నీతో? ఆమెకేం కావాలో నువ్వు తెచ్చేస్తే సరిపోదూ?" ఇద్దరు కలిసి వెళ్ళడం ఇష్టంలేనట్టుగా అంది జానకమ్మ.

    "ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తుంది? బోర్ కొడుతుందని నేనే రమ్మన్నాను!"

    "పరాయి పిల్లను వెంటేసుకు త్రిప్పుతానంటావేమిటిరా? నలుగురూ నాలుగు రకాలుగా అనుకోగల అవకాశం ఎందుకివ్వాలి?"

    "సంధ్యని వెంట తీసుకొని షాపింగ్ కి వెళ్ళినంతమాత్రాన నలుగురు నాలుగు రకాలుగా అనుకొంటారా? ఎవరా నలుగురు? ఏమా నాలుగు రకాలు?"

    "నలుగురెవరో, నాలుగురకాలేమిటో తెలీనంత పసిబిడ్డవికాదు! ఆ రాజానగరం ఎందుకు వెళ్ళానా, వెళ్ళకపోతే ఎంత బాగుండేది అని ఇప్పుడనుకొంటున్నాను."

    "అంత జరుగరాని ఘోరం ఇప్పుడేం జరిగిందని?" అరుణ్ చిరాకుపడ్డాడు. "సంధ్యని నేను తీసుకొని వెళ్ళడం బాగుండకపోతే నువ్వు వెళ్ళు ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచేస్తే ఈ వాతావరణానికి త్వరగా దిగులుపడిపోతుంది. అలా బయిటికి తిప్పితే ఈ వాతావరణానికి త్వరగా అలవాటు పడిపోగలదని నా నమ్మకం!"

    "ఈ వాతావరణానికి అలవాటు చేసి ఆమెను పట్నం దొరసాని చేసేయాలని తాపత్రయపడుతున్నావన్నమాట!"

    "మంచికో చెడుకో ఆమెను మనతో తీసుకువచ్చాం! ఆమెకు ఏదో ఒకటి చేయాలికదా?"  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra