Home » Polkampalli santhadevi » హృదయాంజలి

   
    "మీ అత్తగారు బాగా డబ్బున్నవాళ్ళని, వాళ్ళ ఆస్థి మీకు కలిసిందనీ విన్నాను. అంటే ఆవిడ బాగా కలవారి అమ్మాయన్న మాట. మరి నేను కలవారి అమ్మాయినికాదు. నన్ను వెంటాడేది కలవారి అబ్బాయి అయినప్పుడు ప్రేమకథ పెళ్ళివరకూ వెళ్ళకుండా రివర్స్ అయ్యే అవకాశమే ఎక్కువ కద సర్? డబ్బున్న అబ్బాయిల్ని నమ్మి బాగుపడిందెవరు?"
 
    "పేదవాడో , డబ్బున్నవాడో ఎవరో ఒక అబ్బాయైతే వెంటపడనీయవమ్మా!"
 
    "జీవితం అపహాస్యం కాకూడదనుకుంటే అటువంటి పొరపాటు పని నేనెప్పుడూ చేయనండి."
 
    "దగ్గరికి వస్తే అన్నింటినీ దహించివేసే నిప్పు తనేం మూటగట్టుకుంటుంది? చివరికి తనూ బుడిదగా మిగలాల్సిందే కదా?"

    "బూడిదగా మిగిలినా మాలిన్యం అంటకుండా చూసుకోవడమే కదా నిప్పు ప్రత్యేకత? అది చాలదా?"
 
    "భవిష్యత్తు గురించి నీకేం ఆలోచనలు రావా! ఊహించుకొంటుంటే భవిష్యత్తు శూన్యంగా కనిపించడం లేదూ?"
 
    "ఊహించుకొంటే కదా శూన్యంగా కనిపించేది?"

    "ఈ వయసులో ఈ జడత్వం ఆరోగ్యకరమైందికాదు!"
 
    "నాకెప్పుడూ మా నాన్నగారి గురించే ఆలోచన! ఆయన గురించే నా దిగులు! ఆయన ఇప్పుడు కుంటివారై మంచంలో ఉన్నారుగాని ఒకప్పుడు సాగరకెరటంలా తృళ్ళిపడుతూ జీవించినవారు! టీచరుగా చేసేవారు. నాటకాలు ఆడేవారు. ఆడించేవారు. చక్కగా పాడేవారు...." ఏక్సిడెంటులో కాళ్ళుపోయి తండ్రి జీవితం ఎలా తలక్రిందులైందో చెబుతుంటే అపురూప స్వరం అశ్రురుద్దమైంది.

    "ఇన్నాళ్ళూ ఇంత వివరంగా చెప్పలేదేం? ఈ అపురూపను కన్నతండ్రి అపూర్వమైన వ్యక్తిత్వం కలవారన్నమాట. ఆయన్ని నేనో సారి చూడాలి! ఎప్పుడు తీసికెడతావు మీ ఇంటికి?"
 
    "ఏం చూస్తారు వచ్చి? కాళ్ళుపోయి జీవచ్చవమై రోజులు లెక్క బెట్టుకుంటున్న ఆయన్ని చూసి ఏం చేస్తారు?"

    "దురదృష్టవశాత్తూ శరీరం కుంటిదైపోయినంత మాత్రాన మనసుకూడా కుంటిది కానక్కరలేదని చెబుతాను! ఆయనలో ఉత్సాహానికి ప్రాణం పోస్తాను! అలనాటి నాటకాల పాటలు పద్యాలు పాడించుకు వింటాను! నేను పాడలేనుగాని, ఎవరైనా పాడితే అన్నాహారాలు మానేసి వినగల రసపిపాసిని!"

    "ఆయన గొంతు ఎన్నడో మూగబోయింది. ఆయనచేత పాడించడం మీవల్ల కాదులెండి!"
 
    "ఇరవయ్యేళ్ళకే అరవయ్యేళ్ళ ముసలిదానివయ్యావు! ఆశ అన్నది బొత్తిగా లేదు! ముందు చికిత్స నీకు చేయాలి!"

                               *    *    *

    అపురూపకు ఆయన్ని ఇంటికి తీసికెళ్ళడం ఇష్టంలేదు!

    వయసు ఇచ్చిన వాత్సల్యంతో తనతో చనువుగా మసలినంత మాత్రాన ఆయన ఎక్కడ తను ఎక్కడ? ఏ.సి. కార్లలో తిరిగి ఎ.సి. గదుల్లో ఉండే ఆయన! పెద్ద పత్రికాధిపతి! నరకానికి వేరే దారి ఉండదనిపించే గల్లీల్లో నడిపించి తన ఇంటికి ఎలా తీసికెళ్ళగలదు? ఇల్లా అది? పరమదరిద్రం!

    మరోసారి........మరోసారి అంటూ అపురూప తప్పించుకోవాలని చూసినా పరంజ్యోతి తప్పించుకోనీయలేదు.

    ఆమె ఆంతర్యం తెలిసినవాడిలా,  "నిన్ను తీసికెళ్ళమనడం ఏమిటి? నిన్నే నేను తీసికెడతాను. పద! కారెక్కు!" ఒకరోజు ఆఫీసు కట్టేశాక కారెక్కుతూ అపురూపను బలవంతంగా కారెక్కించాడు. "దారి చెప్పు డ్రైవర్ కు!"

    అపురూపకి ఇక తప్పలేదు. డైరెక్షన్స్ ఇవ్వసాగింది.

    దారిలో కారాపించి డ్రైవర్ని పంపి స్వీట్లు, పండ్లు తెప్పించాడు పరంజ్యోతి.

    తరువాత కారు మళ్ళీ సాగింది కొంతదూరం.

    "కారు ఇక్కడ ఆపాల్సిందే! గల్లీల్లో వెళ్ళదు"

    కారు దిగి నడక సాగించారు. ముందు అపురూప, వెనక పరంజ్యోతి పళ్ళు, స్వీట్స్ పట్టుకొని డ్రైవరు. అలవాటున్న దారి కాబట్టి అపురూప చకచక వెళ్ళిపోతుంటే జాగ్రత్తగా అనుసరిస్తున్నాడు పరంజ్యోతి. కొంత దూరం నడిచాక. "మరీ ఇంత మురికివాడలో ఉన్నారేమిటి? పందులు ఉండాల్సిన చోటిది!" అన్నాడు.

    "దరిద్రం మనుషుల్ని పందుల స్థాయికి తీసుకు వస్తుంది సార్!"
 
    "నా దగ్గర పని చేస్తున్న వాళ్ళు పందుల్లా జీవిస్తున్నారంటే నాకే అవమానం రేపే ఇళ్లు మార్చేయండి!"
 
    "ఇస్తారా జీతం ఓ మూడు నాలుగువేలు?" తమాషాకి అడుగుతున్నట్టుగా అంది.

    "పత్రిక నాదే అయినా దానికీ రూల్సూ, లిమిట్స్ ఉన్నాయి! వాటిని అతిక్రమించి నేనేం చేయలేను. నేనూ మీలాగే జీతగాణ్ని! కాక పోతే పెద్ద జీతగాణ్ని!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra