Home » Vasundhara » Vasundhara Kadhalu - 10

 

    "అదేమిటి మోహనా! అలాగంటావ్ -- వాడు నా స్నేహితుడు ...."
    "ఏమీ అనుకోవద్దు మిసెస్ వీర్రాజు! వీర్రాజుతో నాకొక పని వుంది. అది నీ వల్లనే కావాలి. రాజశేఖరానికి నువ్వు ప్రియురాలివి కావడం నా అదృష్టం" అన్నాడు ఆ యువకుడు.
    "ఏమిటిదంతా రాజా!" అన్నాను చిరాగ్గా.
    "నీ కోసం వాడికి లొంగిపోయాను మోహనా! వాడు మనిద్దరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు గానూ ఓ ప్రతీఫలం కోరుతున్నాడు. అందులో ప్రమాదమేమీ లేదు. వాడు చెప్పింట్లు విను" అన్నాడు రాజశేఖరం.
    ఏం చేయాలో నాకు తోచలేదు. ఆ యువకుడి వంక తిరిగాను.
    "నా పేరు జయదేవ్!" అంటూ ప్రారంభించాడతను.

                                       6

    మంచినీళ్ళ  గ్లాసులో టాబ్లెట్ వేశాను. అది కరగడానికి కొద్ది సేపు పట్టింది. తర్వాత దాన్ని వీర్రాజు  కంచం పక్కన పెట్టాను.
    పెద్ద కబుర్లేమీ లేకుండానే ఇద్దరి భోజనాలూ అయి పోయాయి. ఏ అనుమానాలూ లేకుండానే వీర్రాజు మంచి నీళ్ళు తాగేశాడు. వీర్రాజు కి వెంటనే ఏమీ కాలేదు. ఎటొచ్చీ తొమ్మిదిన్నరాకు మంచం మీద వాలుతూనే అతను నిద్ర పోయాడు. ఒక పది నిముషాలాగి నేను అతన్ని కదిపి చూశాను. ఇంచు మించు శవంలా వున్నాడు.
    అప్పుడతని మొలలోంచి తాళం చెవులు తీశాను.
    పగలల్లా జేబులో వుండే తాళం చెవులనతను రాత్రి పడుకోబోయే టప్పుడు మొలలో వుంచుకుంటాడు అందులో పెద్ద రహస్య మేమీ లేదు కానీ నాకు అందుబాటులో లేనిది ఒకే ఒక ట్రంకు పెట్టె వుంది.
    రోజూ రాత్రి భోజనానికి ముందు ఓ గంట సేపు అ పెట్టె ముందు కూర్చుంటాడతను. అందులో ఏముంటుందో నాకు తెలియదు. నేను దాని గురించి ప్రశ్నించకూడదని అతను ఖచ్చితంగా చెప్పేశాడు. అతని పట్ల నాకు ఏర్పడిన విముఖత కారణంగా నేనా పెట్టె రహస్యం గురించి మరీ ఎక్కువగా ఆలోచించలేదు.
    తాళాల గుత్తి తీసుకుని పెట్టె దగ్గరకు వెళ్ళాను. పెట్టె తెరిచి కుతూహలంగా చూశాను. లోపల చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. అరడజన్ బైండు పుస్తకాలూ నాలుగు ఫైల్సు వున్నాయి.
    ఓ బైండూ పుస్తకం తీశాను. అందులో ఎన్నో పేర్లు చిరునామాలు వున్నాయి. అవన్నీ ఏమిటో , ఎందుకో నాకు తెలియలేదు. రెండో బైండు పుస్తకంలో ప్రతి పేజీలో కొన్ని అంకెలున్నాయి. మూడో పుస్తకంలో పేజికి ఒకటి చొప్పున చిన్న కధలున్నాయి. నాలుగో పుస్తకంలో దేశంలోని ఊళ్ళ పేర్లూ, తారీఖు లు వున్నాయి. ఫైల్సు నిండా ఎక్కడేక్కడివో రసీదు లున్నాయి.
    ఎంత ఆలోచించినా ఒక్క విషయం కూడా నా బుర్ర కెక్కలేదు.
    సరిగ్గా రాత్రి పదిన్నరకు వెళ్ళి వీధి తలుపులు తీశాను. గుమ్మం దగ్గర జయదేవ్ వున్నాడు. అతను లోపలకు రాంగానే తలుపులు వేసేశాడు.
    "వీర్రాజు కు నిద్ర పట్టేసిందా?"
    "ఊ" అన్నట్లు తలాడించాను.
    "ఆ పెట్టె తాళం ఏదీ!" అన్నాడు జయదేవ్.
    చూపించాను. జయదేవ్ జేబులోంచి ఓ మైనపు ముద్ద తీశాడు. ట్రంకు పెట్టె తాళాన్ని మైనపు ముద్ద మీద బలంగా వత్తాడు. తర్వాత నాకు తాళం తిరిగి ఇచ్చేసి -- "దీనికి నకలు తయారు చేస్తున్నాను. అది నీకిస్తాను. దాన్నుపయోగించి మేము అడిగినప్పుడల్లా ఆ పెట్టెలోని పుస్తకాలూ కాగితాలూ మాకు ఇస్తుండాలి , వాటికి ఫోటో కాపీలు తీసుకుని మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాం . తెలిసిందా?" అన్నాడు.
    "ఎందుకీదంతా ?" అన్నాను.
    "నీ భర్త పని చేస్తున్నది పేరుకు ఆఫీసు కానీ అక్కడున్నదంతా స్మగ్లింగ్ వ్యవహారమే! దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కొనసాగిస్తున్న ప్రేమ చంద్ కు ఇలాంటి ఆఫీసులు చాలా ఊళ్ళ లో వున్నాయి. మీ అయన ఇక్కడి ఆఫీసులో కీలక పాత్ర వహిస్తున్నాడు. అతడి వద్ద ఎప్పుడెప్పుడు ఏయే నగరాలలో , ఏయే వ్యక్తులతో వ్యవహారాలూ జరుగుతున్నాయో వివరాలుంటాయి. అంకెలు, మాటలతో వాళ్ళు ఉయోహిగించే కోడ్ రహస్యాలుంటాయి. ఇవి తెలుసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాము. దొంగతనం జరిగితే క్షణాల మీద వాళ్ళు పద్దతులన్నీ మార్చేస్తారు. అందుకని వాళ్ళకు తెలియకుండా ఈ రహస్యాలూ సంపాదించే మార్గం కోసం అన్వేషిస్తున్నాం. ఇన్నాళ్ళకు రాజశేఖరం ధర్మమా అని నువ్వు దొరికావు" అన్నాడు జయదేవ్.
    "నువ్వు పోలీసుల మనిషివా?" అన్నాను భయంగా. వీర్రాజు స్మగ్లింగ్ వ్యవహారాల్లో వున్నాడంటే నాకు ఆశ్చర్యంగానూ, భయంగానూ వుంది.
    "కాదు, మాది ప్రేమ చంద్ కు పోటీ సంస్థ. ప్రస్తుతం ప్రేమచంద్ పోటీని తట్టుకోలేకుండా వున్నాం. వీళ్ళ రహస్యాలు తెలుసుకుంటేనే కానీ లాభం లేదు. అందుకే నిన్ను పట్టాను.
    'ఆయనకేం ప్రమాదం కలగదా ఇందువల్ల?"
    "కలగదు. సమాచారం లీక్ అయినట్లు ప్రేమ చంద్ కు అనుమానం కలగని విధంగా మేము ప్రవర్తిస్తాము. ఒకవేళ అనుమానం కలిగినా ఎక్కణ్ణించి లీక్ అవుతుందో తెలుసుకోవడం వాళ్ళ తరం కాదు. లీక్ అయినట్లు వాళ్ళకు తెలియడం మాకూ నష్టమే!" అన్నాడు జయదేవ్.
    ఈ వ్యవహారం నాకు వింతగా వుంది. వీర్రాజు క్రమశిక్షణ పేరుతొ తనకు సంబంధించిన రహస్యాలు నాకు తెలియకుండా వుంచుతున్నాడా?"
    జయదేవ్ వంక చూసి "నీ పని అయింది గదా. వెళ్ళు!" అన్నాను.
    'ఇంకా పూర్తీ కాలేదు" అంటూ అతను నా నడుం చుట్టూ చేయి వేశాడు.
    ఇది నేనూహించలేదు. చటుక్కున చేయి తొలగించి "నేను నీ మిత్రుడు రాజశేఖరం కాబోయే భార్యను" అన్నాను.
    "రాజశేఖరం చేసుకోబోయేది వీర్రాజు వాసన చూసిన పువ్వునే కదా -- ఇంతలో నీ పవిత్రత చెడిపోదు. అనవసరంగా గొడవ చేయకు. రాజశేఖరానికి చెప్పనులే!" అన్నాడు జయదేవ్ నా నడుం చుట్టూ చేయి వేసి.
    ఆ చేయి మళ్ళీ తోసేసి -- "నన్ను గురించి ఏమనుకుంటున్నావ్!" అన్నాను.
    "కనీసం ఇద్దరు మగవాళ్ళతో వుంటున్న ఆడదానివి నువ్వు. ఇద్దర్నీ ఇష్టపడ్డదానికీ మరోకడంటే ఇష్టపడ్డం కష్టం కాదు. అలా కాక ఇద్దరిలో ఒకరంటే ఇష్టం లేదంటావా? ఇష్టం లేకుండా ఓ మగవాడితో ఎలాగూ వుంటున్నాప్పుడు నాతోనూ వుండవచ్చు. ఇష్టాన్ని త్యాగం చేయడమూ, పవిత్రతను చెడగోట్టుకోవడమూ -- రెండూ అలావాటే నీకు, నన్ను కాదనకు...." అన్నాడు జయదేవ్ మళ్ళీ తన చేతిని నడుం చుట్టూ వేస్తూ.
    ఈసారి ఆ చేతిని తీసి వేయలేకపోయాను. నా మనసులో ఏదో భయం కలిగింది. నేనెటు వైపు పయనిస్తున్నాను?" నా జీవితం ఏం కాబోతోంది ?
    ఒకప్పుడు రాజశేఖరం నన్ను తనతో వచ్చేయామని పదేపదే అడిగితె సమాజం అంగీకరించదని పని చేయలేక ఊరుకున్నాను. ఇప్పుడు వీర్రాజు నీడలో వుంటూ రాజశేఖరాన్ని ప్రోత్సహిస్తున్నాను. అతనికే నన్నర్పించుకున్నాను. ఇప్పుడు జయదేవ్ నన్ను కోరుతుంటే వారించలేని దుర్గతికి దిగజారిపోయాను.
    రాజశేఖరమంటే ఇష్టపడి అతనికి నన్ను నేను సమర్పించుకున్నాను. కానీ ఇప్పుడు జయదేవ్ కు లొంగి పోవడం నాకే మాత్రమూ ఇష్టం లేదు. అయినా తప్పడం లేదు. అతనికి నా గురించిన కొన్ని రహస్యాలు తెలిశాయి. తన రహస్యాలు అతను దాచడం కోసం నేను అతను చెప్పినట్లు వినాలి.
    రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జయదేవ్ మా ఇల్లు విడిచాడు.

                                        7
    
    "ఏమిటిది -- ఇలా సరాసరి ఇంటి కొచ్చాశావ్?" అన్నాను ఆశ్చర్యంగా.
    "ఏం చేయను మోహనా! నిన్ను వదిలి వుండలేను. ఈరోజు నువ్వెందుకు రాలేదు ?" అన్నాడు రాజశేఖరం.
    "ఆ ఇంటికి రాలేను. జయదేవ్ మంచి వాడు కాడు. నీ మాటలు నమ్మి చాలా ఇబ్బందుల్లో పడ్డాను. ఆ ఇంటి కింకా వచ్చానంటే నాకు చాలా ప్రమాదాలు కలగవచ్చు. ఇప్పటికి జరిగింది చాలు" అన్నాను.
    రాజశేఖరం ముఖం బాధగా అయిపొయింది. "ఇలాంటి ప్రమాదం ఊహించి వుంటే నేను జయదేవ్ ఇంట్లో మకాం తీసుకుని వుండేవాడిని కాదు" అన్నాడు.
    "అయిందేదో అయిపొయింది. మన ఇద్దరి విషయాలు మరో వ్యక్తికీ తెలిసిపోయింది. ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు? మన మెక్కడి కైనా వెళ్ళి పోదాం!' అన్నాను.
    'అలా కుదరదు. జయదేవ్ కు కనీసం కొన్ని నెలలపాటు నీ అవసరముంది. అంతకాలం నువ్వు వీర్రాజు నీడలో ఉండక తప్పదు. అలా ఉండని పక్షంలో మనిద్దరికీ కూడా ప్రమాదం. వాడు చాలా ప్రమాదకరమైన మనిషి...."
    "జయదేవ్ కు నువ్వు భయపడుతున్నట్లు కనబడుతోంది. వాడు చెప్పినట్లల్లా వినమంటున్నావ్. వాడు నన్నే కోరికే ఏం చేయాలి?" అన్నాను కోపంగా.
    "వాడు నిన్ను కోరాడా?" అన్నాడు రాజశేఖరం. ఆవేశంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి -- "నువ్వు చెప్పంది నిజమే అయితే వాణ్ణి చంపేస్తాను . ఆ తర్వాత నేనేమై పోయినా ఫరవాలేదు."
    అతని ఆవేశం నిజమైనదేననిపించింది. అందుకే అతన్ని శాంతపరిచి -- 'అలాంటి వాళ్ళ సావాసం మనకు మంచిది కాదు. వాడు నావైపు చూసే చూపులు బాగోలేవు. ఎపప్తికైనా వాడివల్ల నాకు ప్రమాదముంది" అన్నాను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra