Home » Dr c. ananda ramam » Nisabdha Sangeetham

 

    "కొడుకెంతో , కూతురూ అంతే, వాడికోసం దీని బ్రతుకు బండలు చెయ్యమంటావా?"
    ఎంతో విశాల హృదయంతో మాట్లాడుతున్న తండ్రి ముందు కుసుమ కుంగిపోయింది. తన తొందరపాటుకు కుమిలిపోతూ తండ్రి పాదాల నల్లుకుని ఏడ్చింది. శ్రీనివాసు కి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. "లే తల్లీ! పొరపాట్లు అందరూ చేస్తారు. కాని తొందరపడి నోటికెంత వస్తే అంత అనకమ్మ! తల్లిదండ్రులకు బిడ్డల క్షేమం అక్కర్లేదా? ఏం చెయ్యగలం! కాని రోజులొచ్చాయి. సంఘం ఇలా తయారయింది. పెళ్ళి మగవాడికి డబ్బు సంపాదించుకునే సాధనమయి కూచుంది. లే! దిగులు పడకు. ఏదో ఆలోచిద్దాం."
    మరునాడు లేచేసరికి కుసుమ కనబడలేదు. అలమేలు బాధపడసాగింది. శ్రీనివాసు ఆందోళనగా కుసుమ పక్క మీద వెతికాడు. చీటీ కనిపించింది.
    "నాకోసం కంగారు పడకండి. నేనే అఘాయిత్యమూ చెయ్యను. నా ఉద్యోగంలో నేను మళ్ళీ చేరుతున్నాను. నన్నేదుర్కొన్న క్లిష్టపరిస్థితులను నేనే చక్కదిద్దుకోగలను. నా సమస్యలను నేనే పరిష్కరించుకోగలను. నా బ్రతుకు నేనే బ్రతకగలను. నాకోసం ఇల్లు అమ్మకండి.

                                                                                                          మీ కుసుమ.
    కుసుమ క్షేమంగా ఉందని విన్నాక అలమేలు గాభరా తగ్గింది. ఇల్లు అమ్మవలసిన అవసరం తప్పి పోయినందుకు సంతోషం కూడా కలిగింది. శ్రీనివాసుకు మాత్రం ఆందోళన తగ్గలేదు. ఒక్కసారి మెడ్రాస్ వెళ్లి సంగతి సందర్భాలు స్వయంగా విచారించి రావాలని నిర్ణయించుకున్నాడు.


                                                         9

    మోహన్ చెప్పిన గుర్తుల వల్ల మాధవ ఇల్లు తేలిగ్గానే కనుక్కోగలిగింది సరళ. తాను ఎన్నడూ చూడని ఆ అపరిచితురాలీని ఆశ్చర్యంతో ఆహ్వానించింది . మాధవకు ఉత్తరం రాస్తోన్న జానకి.
    "మీకు నేను తెలియకపోవచ్చు. కాని నాకు మీరు తెలుసు" జానకి మడిచి పుస్తకంలో దాచిన ఉత్తరం వైపు చూస్తూ ఆమె చూపించిన కుర్చీలో కూచుంటూ అంది సరళ.
    జానకి ఏ సమాధానమూ చెప్పలేక అందమైన సరళ విగ్రహాన్ని చూస్తూ కూచుంది.
    "నా పేరు సరళ."
    ఉలిక్కిపడింది జానకి.
    "నాకు మీరు తెలుసు" అని అప్రయత్నంగా అనేసింది.
    "ఎలా? ఎలా తెలుసు? మాధవ చెప్పాడా?"
    "లేదు"
    "మరి మా అన్నయ్య చెప్పాడా?"
    "మీ అన్నయ్య ఎవరు?"
    మోహన్ మీకు తెలీదూ? మాధవతో కూడా ఇక్కడికి వచ్చాడు"
    "ఆయనా! తెలుసు. మీ అన్నయ్యని తెలీదు"
    "పోనీలెండి. మీకు చాలా కష్టం కలిగించే విషయాలు మాట్లాడటానికి వచ్చాను నేను. నేనెవరినో తెలుసునన్నారు. మరి మీ పెళ్ళికి ముందు నుంచీ మాధవకూ, నాకూ మధ్య అనుబంధం కూడా తెలుసా?"
    జానకి మాట్లాడలేదు.
    "తెలుసునని మీ ముఖం చూస్తె అర్ధమయిపోతుంది. ఇంక నీ సంగతి కూడా నాకు తెలుసు. మాధవ మరీ ఇంత మంచివాడు కాకపోతే - ఈనాడు నేను కోరరాని కోరిక కోరుతున్న ఒక దోషిగా మీ ముందు నిలబడవలసి వచ్చేది కాదు."
    "మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్ధం కావటం లేదు" "హీనస్వరంతో అంది జానకి.
    "మీరు కన్నీళ్ళతో మాధవ మనసులోని మంచితనాన్ని ఉపయోగించుకొని మీ మెడలో తాళి కట్టించుకున్నారు. అయినా మాధవ నావాడు. నా మాధవను నాకిచ్చేయ్యమని అడగటానికి వచ్చాను "
    జానకి తల గిర్రున తిరగసాగింది.
    ఆనాడు తనను పెళ్ళి చేసుకోవలసిందని మాధవను ప్రాధేయపడ్డ సంఘటన ఎప్పుడు గుర్తుకొచ్చినా లజ్జతో కుంగిపోతూ ఉంటుంది జానకి. నిజానికి ఆ కారణం వల్లనే మాధవ ముందు తను అప్రయత్నంగా ముడుచుకుపోతుంది. తనంత తను మాధవను సాహసించి ఏనాడూ సమీపించలేదు. సమీపించటానికి ప్రయత్నించలేదు.
    తనకు ఎంతో లజ్జాకరమైన ఈ సంఘటనను మాధవ ఎవరితోనైనా చెప్పగలడని ఏనాడూ ఊహించలేదు జానకి! మాధవ జీవితంలోంచి వెళ్ళిపోవటానికి తను సిద్దంగా ఉంది. అతడు కట్టిన మంగల్యాన్ని అతణ్ణి బంధించేందుకు వాడుకోనని ఎన్నోసార్లు చెప్పింది. అయినా మాధవ ఈ రహస్యాన్ని సరళ\కు చెప్పాడు. పైగా ఈ బంధాన్ని తెంచుకోవలసిందని సరళ ద్వారా కబురు చేశాడు.
    "అయన ఆ సంగతులన్నీ మీకు చెప్పారా?" వణుకుతున్న గొంతుతో అడిగింది.
    'చెప్పలేక రాశాడు చూడండి.....' మాధవ తనకు రాసిన ఉత్తరం బేగ్ లోంచి తీసి జానకి చేతి కందించింది సరళ.
    ఆ ఉత్తరంలో ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క సమ్మెట పోటై తగలసాగింది జానకికి. ఇటీవల మాధవ చూపుతున్న ఆదరణ అంతా ఒక పెద్ద వెక్కిరింతలా తోచింది. తన బ్రతుకు మొత్తం ఒక పరిహాసమయింది.
    "నేను మాట్లాడే మాటలు ధర్మం కావని నాకు తెలుసు. అయినా నాకు మాధవ ప్రేమ తప్ప ఏ ధర్మమూ అక్కర్లేదు. మాధవను చూచాక ప్రేమకు అర్ధం తెలుసుకున్నాను. మాధవ మీది ప్ర్రేమతో నా గుండెలు నింపుకున్నాను. మాధవ చుట్టూ నా బ్రతుకు అల్లుకున్నాను. నా మాధవను నాకు విడిచి పెట్టండి."        "నన్నెందుకిలా బ్రతిమాలుతున్నారు?" నేను అభ్యంతర పెడతానని చెప్పారా?"
    "అది కాదు మాధవ మంచివాడు. మిమ్మల్ని నిరాధారంగా వదల లేనంటున్నాడు. నామీద ఎంత ప్రేమున్నా ఒక జీవితాన్ని నాశనం చెయ్యలేనంటున్నాడు. మీమీది జాలితో నా బతుకు నాశనమైనా , తనకు సంతోషం శూన్యమైన సహిస్తానంటున్నాడు."
    "నన్నేం చెయ్యమంటారు?"
    "మీరు మాధవకు విడాకులివ్వాలి...."
    "ఇస్తాను...."
    "ఆ తరవాత....."
    "దాని గురించిన ఆలోచన మీకెందుకు?"
    "నాకు లేదు, మాధవ ఆ తరువాత గురించే ఆలోచిస్తున్నాడు. మీకు ఆ తరువాత ఆశ్రయం లేకుండా పోతుందని.....మీరు కూడా మరొకర్ని పెళ్ళి చేసుకుంటే గాని..."
    "ఛీ! గర్జించింది జానకి.
    ఒక్కక్షణం సరళ గుండెలు దడదడలాడాయి. అంతలో ఒళ్ళు తెలియని కోపం వచ్చింది.
    "నా మాధవని కన్నీళ్ళతో కట్టిపడేసుకున్నారు. ఇప్పుడు పాతివ్రత్యనాటకంతో వదలనంటున్నారు. కన్నెపిల్ల అమాయకంగా హృదయంలో నిలుపుకున్న మూర్తిని చెయ్యి చాచి బిచ్చంలా తీసుకోవటం 'ఛీ' అనిపించలేదు గాని, ఈనాడు ఆమె సొత్తు ఆమె కివ్వటం ;ఛీ' అనిపిస్తోంది? మీకు వేరు ఆశ్రయం లేదనేగా మాధవను పెళ్ళి చేసుకోమని ప్రార్ధించారు? నా మాట నమ్మండి. అన్ని విధాల మాధవతో సమానమైన వరుడే మీకు దొరుకుతాడు. మీకు ఏ లోటూ రాదు. నా గుండెల్లో చిచ్చు పెట్టకండి" వెక్కి వెక్కి ఏడవసాగింది సరళ.
    "పాతివ్రత్య నాటకం!" ఈ మాట జానకి చెవులలో మారుమోగింది.
    తనది నాటకమా?

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra