Home » Mainanpati bhaskar » Claimax

మళ్ళీ రింగులు -
మళ్ళీ స్థంభం -
చిక్కటి వలయాలు - పల్చటి రింగులు -
"కొండకొమ్ము మీద ముసలమ్మ శవానికి కాపువున్న మనవాళ్ళు పొగద్వారా సంకేతాలు పంపుతున్నారు" అన్నాడు మంత్రాల మల్లయ్య. తర్వాత ఆ సంకేతాలని చదువుతున్నట్లు కదలడం మొదలెట్టాయి అతని పెదిమలు.
"ముసలమ్మ ........శరీరాన్ని...........తినడానికి ..........మన పూర్వికుడు..........పక్షి రూపంలో ..........వచ్చేస్తున్నాడహో"
దృష్టి కేంద్రీకరించి ఆకాశంలోకి చూశాడు మంత్రాల మల్లయ్య తర్వాత నిదానంగా అన్నాడు -
"మనవాళ్ళు పొరబడ్డారు! ఆ వస్తోంది పక్షి రూపంలో వున్న పూర్వికుడు కాడు. వస్తున్నది ఒక ఇనపరెక్కలపక్షి! అందులో వుంటారు తెలివిమీరిన తెల్లతోళ్ళ మనుషులు! జాగ్రత్త యుద్దానికి సిద్దంకండి!"
అతను చెప్పింది నిజమే.
హరీన్ రక్షించే ప్రయత్నంలో , పోలీసుపార్టీని తీసుకుని, రెండు హెలికాప్టర్లతో సహా వస్తున్నాడు ప్రొడ్యూసర్ రఘుపతి.
ఈలోగా -
గుహలోనుంచి వెళుతున్న హరీన్, కరుణా గుహ అవతలభాగానికి చేరుకున్నారు.గుహకి అటువైపున కూడా అంతే! ఆ గుహద్వారానికి మరుగుపరుస్తూ , అక్కడ కూడా ఆకాశమంత ఎత్తున పెరిగి వున్నాయి. వటవృక్షాలు. గుహద్వారాన్ని కాపలా కాయడానికి ఎవరో కావాలనే వాటిని అక్కడ చిరకాలం క్రితం నాటినట్లు కనబడుతున్నాయి అవి.
"ఎలాగైతేనేం, మృత్యులోయలోనుంచి బయటికి రాగలిగాం" అంది కరుణ తేలిగ్గా నిట్టూర్చి.
చిరునవ్వు నవ్వి, ముందుకు దృష్టి సారించాడు హరీన్.
అక్కడికి దగ్గరలోనే కనబడుతోంది ఒక చిన్న సముద్రపుపాయ. అలల ఉదృతం ఎక్కువ లేకుండా పెద్ద తటాకంలా కనబడుతోంది అది. దాన్ని చుట్టుకుని వెళితే, దానివేనకగా వున్న కొండలవరసని చేరుకోవచ్చు. ఆ కొండల మీద బొమ్మరిళ్ళలా కనబడుతున్నాయి ఇళ్ళు. కొండల మధ్య నుంచి వంకర్లు తిరిగి సాగిపోతోంది ఒక షూట్ రోడ్డు.
ఆ రోడ్డు మీద ఎర్రటి పురుగు పాకుతున్నట్లు వెళ్తోంది ఒక .........."అదిగో ........ఒక బస్సు కూడా కనబడుతోంది!" అంది కరుణ ఎగ్జయిటేడ్ గా. "హరీన్ .......మీరు ఇదివరకు ఒకసారి అన్నారు కదా, మనం కొద్దిదూరం నడవగలిగితే ఏ బస్సో, లేకపోతే కనీసం ఏ గవర్నమెంటు జీపో కనబడుతుందని! సరిగ్గా అలాగా జరుగుతోంది ఇప్పుడు! అదిగో బస్సు శబ్దం కూడా వినబడుతోంది. విన్నారా?"
చాలా దూరంనుంచి, అతి చిన్నగా వినబడుతోంది ఇంజను శబ్దం.
చెవులు రిక్కించి విన్నాడు హరీన్. తర్వాత తల అడ్డంగా ఆడించాడు.
"అది బస్సు ఇంజను శబ్దం కాదు కరుణా!"
"మరి?" అంది కరుణ.
"అది హెలికాప్టర్ శబ్దం."
ఆకాశం వైపు చూసింది కరుణ. ఆమెకు అక్కడ హెలికాప్టర్ ఏదీ కనబడలేదు.
తర్వాత హరీన్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
ఆమె మనసులో మెదులుతున్న ప్రశ్నకి సమాధానంగా అన్నాడు హరీన్ - "లోయకి ఉత్తరదిశగా వుంది ఈ గుహ! దానిలో నుంచి బయటికి వచ్చేశాం మనం. నా అంచనా సరి అయితే, దక్షిణం వైపు నుంచి లోయని సమిపిస్తూ వుండవచ్చు ఆ హెలికాప్టర్. అందుకే మనకి కనబడటం లేదు అది."
అంతలోనే తుమ్మెద ఝుంకారంలా వినబడుతున్న హెలికాప్టర్ శబ్దం ఆగిపోయింది.
తాము దాటేసివచ్చిన లోయచుట్టూ కోటగోడల్లా వున్న కొండలు వైపు సందిగ్ధంగా చూస్తూ వుండిపోయాడు హరీన్.
అప్పుడు కొండలే ఎలుగెత్తి పిలుస్తున్నట్లు, కొండల్లో, లోయల్లో ప్రతిధ్వనిస్తూ వినబడింది ఒక కంఠస్వరం.
ఎవరో మెగాఫోన్ లో మాట్లాడుతూ వుండి వుండాలి. లేకపోతే అంత పెద్దగా వినబడదు. పెద్దగా వినబడుతోంది గానీ, అస్పష్టంగా వినబడుతున్నాయి మాటలు.
కొద్దిక్షణాల తర్వాత అర్ధం అయింది హరీన్ కి, ఎక్కడో, ఎవరో , ఎవరినో పిలిస్తున్నారు!
ఎవరిని? ఎవరు?
ఈసారి మరికొంత స్పష్టంగా వినబడింది ఆ పిలుపు!
"హారీన్! హరీన్! హరీన్!" తననే పిలుస్తున్నారు! ఎవరది?
మళ్ళీ వినబడ్డాయి మాటలు.
"హరీన్ నేను రఘుపతిని! నీకోసం వచ్చాం. కొండ కొమ్ము దగ్గరికి వచ్చేసేయ్ హరీన్! వెళ్ళిపోవచ్చు మనం! హెలికాప్టర్ సిద్దంగా వుంది."
"రఘుపతిగారు!" అన్నాడు హరీన్ ఉద్వేగంగా.
"రఘుపతిగారా.........ఆయనేవరు?" అంది కరుణ.
"రఘుపతిగారు ఒక ప్రముఖ నిర్మాత, అంతేకాదు ! అయన నాకు గురువు, బంధువు, మిత్రుడు, స్నేహితుడు, తల్లి తోడు, దైవం - అన్నీ ఆయనే!"
అని ఆగి, మళ్ళీ అన్నాడు హరీన్ - "కరుణా........మనల్ని రక్షించాలనే తపనతో, ప్రాణాలను తెగించి వచ్చారు మనవాళ్ళు. వాళ్ళు అపాయంలో పడిపోకుండా చూడటం మన ధర్మం కరుణా! నిన్ను ఆ తూరుపు కొండల్లో కనబడుతున్న పల్లెల్లో దింపేసి, నేను తిరిగి ఈ గుహలోనుంచి లోయలోకి వెళతాను. రఘుపతిగారూ వాళ్ళు ఏ ప్రమాదంలోనో చిక్కుకోకుండా హెచ్చరించి, వాళ్ళతో కలిసి తిరిగివస్తాను -ఏమంటావ్?"
"అలా వద్దంటాను" అంది కరుణ.
ఆశ్చర్యంగా చూశాడు హరీన్.
"ఎందుకని?"
"హరీన్ ........మిమ్మల్ని రక్షించడానికి వచ్చినవాళ్ళు ప్రమాదంలో పడిపోతారేమోనన్న ఆరాటంలో లోయలోకి తిరిగి వెళుతున్నారు మీరు. అలాగే నన్ను రక్షించడానికి వచ్చిన మీరు మళ్ళీ ప్రమాదంలో పడిపోతారేమోనన్న ఆదుర్దా నాకు వుండదా హరీన్! మిమ్మల్ని వదిలేసి నా దారి నేను చూసుకోవడం ఏం న్యాయం?"
కొద్దిక్షణలపాటు తదేకంగా ఆమెవైపు చూస్తూ వుండిపోయాడు హరీన్. తర్వాత ఆర్ద్రంగా అన్నాడు -
"సరే కరుణా...........నీ ఇష్టప్రకారమే చేద్దాం!"
తిరిగి గుహలో ప్రవేశించారు వాళ్ళు. అతిప్రయాసమీద మళ్ళీ లోయలోకి వచ్చారు. లోయలోకి రాగానే ఇప్పుడు మరింత స్పష్టంగా వినబడింది రఘుపతి గొంతు.
"అడవి మనుషుల్లారా! మా హరీన్ గనక మీ దగ్గర బందీగా వుండివుంటే , అతన్ని తక్షణం వదిలి పెట్టెయ్యండి! లేదా తీవ్ర పరిణామాలు తప్పవు"
తర్వాత తెలుగుబాష ఆ ఆటవికులకి అర్ధం అవుతుందో లేదో అని సందేహంతో, మరో భాషలో హెచ్చరికని, అంచజేయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లుగా -
తుపాకులు వర్షంలా తూటాలని కురిపిస్తున్న శబ్దం వినబడింది.
వయోలెన్స్!
                                               26

గుహలోనుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి , లోయలో ఉన్న రఘుపతి యూనిట్ ని చేరుకోవడానికి వడివడిగా నడుస్తున్న హరీన్ కీ - కరుణకీ కమనీయ దృశ్యం ఒకటి కనబడింది.
అక్కడ కొంతమేర దట్టంగా పచ్చిక పెరిగి వుంది. ఒక జింకా, దానిపిల్లా కలిసి ఆ పచ్చికను మేస్తున్నాయి. జింకపిల్ల చాలా చిన్నది. తల్లి ఎక్కడ మేస్తుంటే తనూ అక్కడే మేస్తోందది. లేత గడ్డిపరకలు ఇలా కొరికి అలా పడేస్తోంది. మధ్య మధ్యలో తల్లిని తలతో కుమ్ముతోంది.
అంతా ఆటగా వుంది దానికి!
హరీన్ కరుణా దాన్ని మురిపెంగా చూస్తూ నడుస్తున్నారు. వాళ్ళు చూస్తుండగానే ఒక ఘోరం జరిగిపోయింది.
అప్పటిదాకా ఎక్కడ పొంచి వుందో గానీ ఒక బెబ్బులి గాండ్రిస్తూ హటాత్తుగా పొదలలో నుంచి తల్లి జిన్కమీదకి లంఘించింది. గాలిలో నుంచి కిందికి దిగుతూ వుండగానే దాని కోరలు జింక మెడని కొరికి పట్టుకున్నాయి. పంజా పొట్టని చీల్చేసింది. అ తర్వాత మేడ విరిగి, నిర్జీవంగా కళ్ళు తేలేసి వున్న జింకను ఈడ్చుకుంటూ చెట్లనడుమ అదృశ్యమైపోయింది పెద్ద పులి.
కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయింది ఇదంతా!
ఆటలో మునిగి ఉన్న జింక పిల్ల ఇదేమీ గమనించలేదు. కొద్ది క్షణాల తర్వాత తలెత్తి చూసేసరికి తన తల్లి కనబడలేదు దానికి. వెంటనే జాలిగొలిపేలా అరుస్తూ, అటూ ఇటూ తొట్రుపడుతూ పరిగెత్తడం మొదలెట్టింది అది. క్షణం క్రితం నిర్భీతిగా తల్లి పక్కన గెంతుతూ , మేస్తూ వున్న ఆ జింకపిల్ల క్షణం గడిచేసరికి దిక్కులేని దీనావస్థలో పడిపోయింది.
"సరిగ్గా నాలాగే" అనుకుంది కరుణ.
తన పరిస్థితి అలాగే అయింది. పది సంవత్సరాల క్రితం ఒకరోజున నాన్నగారు ఏమయిపోయారో, ఎక్కడికి పోయారో తెలియకుండా అదృశ్యమయిపోవడంతో తమ బతుకు బజారునపడిపోయింది.
నాన్నగారు తమ బిజినెస్ తాలూకు డబ్బంతా తీసుకుపోయారని అయన పార్ట్ నర్స్ అనుమానపడ్డారు. తమకు రావలసిన బకాయిలకు బదులుగా నాన్నగారి ఆస్తి అంతా జప్తు చేయించారు. ఇల్లు వేలం వేయించారు.
అంతకు ముందు రోజు దాకా అందరిచేతా పెద్దమనిషి , ఘరానావ్యక్తీ అనిపించుకున్న నాన్నగారి మీద ఘరానాదొంగ అన్న ముద్రపడిపోయింది. ఆ తర్వాత మనోవ్యాధితో మంచం పట్టి మరణించింది అమ్మ.
అమ్మనీ, నాన్నని పోగొట్టుకుని అనాధలాగా ఎవరి పంచనో పెరిగింది తను.
ఈ అష్టకష్టాలన్నిటికీ , ఈ అరిష్టాలన్నిటికీ కారణం ఎవరు?
ఇదంతా కేవలం కాకతాళీయంగా జరిగి వుండదనీ, దీనీ వెనక ఎవరిదో అదృశ్య హస్తం వుందనీ తనకు గట్టి నమ్మకం.
నిశ్చయంగా ఎవరో ఏదో హాని చేసి వుంటారు నాన్నగారికి.
అంతేగానీ, పరోపకారం చెయ్యడమే తప్ప మరొక ధ్యాస లేని నాన్నగారు పరాయివాళ్ళ సొమ్ముని ఆశించి పార్ట్ నర్స్ ని ముంచేటంత పాపానికి ఒడిగట్టి వుంటారని ఎప్పటికీ నమ్మలేదు తను - చివరికి కలలో కూడా -
మరి ఆ పార్ట్ నర్స్ ఎలా నమ్మారో ఆశ్చర్యంగా వుంది.
వాళ్ళు కూడా మనసారా నమ్మారా? లేక డబ్బు మీద మమకారం వాళ్ళని అలా మార్చేసిందా?
ఇవన్నీ తలుచుకున్నప్పుదల్లా 'చచ్చిపోతే ఎంత బాగుంటుంది' అనిపిస్తుంది. నిజంగానే బతుకుమీద భ్రమలేదు తనకి.
మళ్ళీ రింగులు -
మళ్ళీ స్థంభం -
చిక్కటి వలయాలు - పల్చటి రింగులు -
"కొండకొమ్ము మీద ముసలమ్మ శవానికి కాపువున్న మనవాళ్ళు పొగద్వారా సంకేతాలు పంపుతున్నారు" అన్నాడు మంత్రాల మల్లయ్య. తర్వాత ఆ సంకేతాలని చదువుతున్నట్లు కదలడం మొదలెట్టాయి అతని పెదిమలు.
"ముసలమ్మ ........శరీరాన్ని...........తినడానికి ..........మన పూర్వికుడు..........పక్షి రూపంలో ..........వచ్చేస్తున్నాడహో"
దృష్టి కేంద్రీకరించి ఆకాశంలోకి చూశాడు మంత్రాల మల్లయ్య తర్వాత నిదానంగా అన్నాడు -
"మనవాళ్ళు పొరబడ్డారు! ఆ వస్తోంది పక్షి రూపంలో వున్న పూర్వికుడు కాడు. వస్తున్నది ఒక ఇనపరెక్కలపక్షి! అందులో వుంటారు తెలివిమీరిన తెల్లతోళ్ళ మనుషులు! జాగ్రత్త యుద్దానికి సిద్దంకండి!"
అతను చెప్పింది నిజమే.
హరీన్ రక్షించే ప్రయత్నంలో , పోలీసుపార్టీని తీసుకుని, రెండు హెలికాప్టర్లతో సహా వస్తున్నాడు ప్రొడ్యూసర్ రఘుపతి.
ఈలోగా -
గుహలోనుంచి వెళుతున్న హరీన్, కరుణా గుహ అవతలభాగానికి చేరుకున్నారు.
గుహకి అటువైపున కూడా అంతే! ఆ గుహద్వారానికి మరుగుపరుస్తూ , అక్కడ కూడా ఆకాశమంత ఎత్తున పెరిగి వున్నాయి. వటవృక్షాలు. గుహద్వారాన్ని కాపలా కాయడానికి ఎవరో కావాలనే వాటిని అక్కడ చిరకాలం క్రితం నాటినట్లు కనబడుతున్నాయి అవి.
"ఎలాగైతేనేం, మృత్యులోయలోనుంచి బయటికి రాగలిగాం" అంది కరుణ తేలిగ్గా నిట్టూర్చి.
చిరునవ్వు నవ్వి, ముందుకు దృష్టి సారించాడు హరీన్.
అక్కడికి దగ్గరలోనే కనబడుతోంది ఒక చిన్న సముద్రపుపాయ. అలల ఉదృతం ఎక్కువ లేకుండా పెద్ద తటాకంలా కనబడుతోంది అది. దాన్ని చుట్టుకుని వెళితే, దానివేనకగా వున్న కొండలవరసని చేరుకోవచ్చు. ఆ కొండల మీద బొమ్మరిళ్ళలా కనబడుతున్నాయి ఇళ్ళు. కొండల మధ్య నుంచి వంకర్లు తిరిగి సాగిపోతోంది ఒక షూట్ రోడ్డు.
ఆ రోడ్డు మీద ఎర్రటి పురుగు పాకుతున్నట్లు వెళ్తోంది ఒక .........."అదిగో ........ఒక బస్సు కూడా కనబడుతోంది!" అంది కరుణ ఎగ్జయిటేడ్ గా. "హరీన్ .......మీరు ఇదివరకు ఒకసారి అన్నారు కదా, మనం కొద్దిదూరం నడవగలిగితే ఏ బస్సో, లేకపోతే కనీసం ఏ గవర్నమెంటు జీపో కనబడుతుందని! సరిగ్గా అలాగా జరుగుతోంది ఇప్పుడు! అదిగో బస్సు శబ్దం కూడా వినబడుతోంది. విన్నారా?"
చాలా దూరంనుంచి, అతి చిన్నగా వినబడుతోంది ఇంజను శబ్దం.
చెవులు రిక్కించి విన్నాడు హరీన్. తర్వాత తల అడ్డంగా ఆడించాడు.
"అది బస్సు ఇంజను శబ్దం కాదు కరుణా!"
"మరి?" అంది కరుణ.
"అది హెలికాప్టర్ శబ్దం."
ఆకాశం వైపు చూసింది కరుణ. ఆమెకు అక్కడ హెలికాప్టర్ ఏదీ కనబడలేదు.
తర్వాత హరీన్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
ఆమె మనసులో మెదులుతున్న ప్రశ్నకి సమాధానంగా అన్నాడు హరీన్ - "లోయకి ఉత్తరదిశగా వుంది ఈ గుహ! దానిలో నుంచి బయటికి వచ్చేశాం మనం. నా అంచనా సరి అయితే, దక్షిణం వైపు నుంచి లోయని సమిపిస్తూ వుండవచ్చు ఆ హెలికాప్టర్. అందుకే మనకి కనబడటం లేదు అది."
అంతలోనే తుమ్మెద ఝుంకారంలా వినబడుతున్న హెలికాప్టర్ శబ్దం ఆగిపోయింది.
తాము దాటేసివచ్చిన లోయచుట్టూ కోటగోడల్లా వున్న కొండలు వైపు సందిగ్ధంగా చూస్తూ వుండిపోయాడు హరీన్.
అప్పుడు కొండలే ఎలుగెత్తి పిలుస్తున్నట్లు, కొండల్లో, లోయల్లో ప్రతిధ్వనిస్తూ వినబడింది ఒక కంఠస్వరం.
ఎవరో మెగాఫోన్ లో మాట్లాడుతూ వుండి వుండాలి. లేకపోతే అంత పెద్దగా వినబడదు. పెద్దగా వినబడుతోంది గానీ, అస్పష్టంగా వినబడుతున్నాయి మాటలు.
కొద్దిక్షణాల తర్వాత అర్ధం అయింది హరీన్ కి, ఎక్కడో, ఎవరో , ఎవరినో పిలిస్తున్నారు!
ఎవరిని? ఎవరు?
ఈసారి మరికొంత స్పష్టంగా వినబడింది ఆ పిలుపు!
"హారీన్! హరీన్! హరీన్!" తననే పిలుస్తున్నారు! ఎవరది?
మళ్ళీ వినబడ్డాయి మాటలు.
"హరీన్ నేను రఘుపతిని! నీకోసం వచ్చాం. కొండ కొమ్ము దగ్గరికి వచ్చేసేయ్ హరీన్! వెళ్ళిపోవచ్చు మనం! హెలికాప్టర్ సిద్దంగా వుంది."
"రఘుపతిగారు!" అన్నాడు హరీన్ ఉద్వేగంగా.
"రఘుపతిగారా.........ఆయనేవరు?" అంది కరుణ.
"రఘుపతిగారు ఒక ప్రముఖ నిర్మాత, అంతేకాదు ! అయన నాకు గురువు, బంధువు, మిత్రుడు, స్నేహితుడు, తల్లి తోడు, దైవం - అన్నీ ఆయనే!"
అని ఆగి, మళ్ళీ అన్నాడు హరీన్ - "కరుణా........మనల్ని రక్షించాలనే తపనతో, ప్రాణాలను తెగించి వచ్చారు మనవాళ్ళు. వాళ్ళు అపాయంలో పడిపోకుండా చూడటం మన ధర్మం కరుణా! నిన్ను ఆ తూరుపు కొండల్లో కనబడుతున్న పల్లెల్లో దింపేసి, నేను తిరిగి ఈ గుహలోనుంచి లోయలోకి వెళతాను. రఘుపతిగారూ వాళ్ళు ఏ ప్రమాదంలోనో చిక్కుకోకుండా హెచ్చరించి, వాళ్ళతో కలిసి తిరిగివస్తాను -ఏమంటావ్?"
"అలా వద్దంటాను" అంది కరుణ.
ఆశ్చర్యంగా చూశాడు హరీన్.
"ఎందుకని?"
"హరీన్ ........మిమ్మల్ని రక్షించడానికి వచ్చినవాళ్ళు ప్రమాదంలో పడిపోతారేమోనన్న ఆరాటంలో లోయలోకి తిరిగి వెళుతున్నారు మీరు. అలాగే నన్ను రక్షించడానికి వచ్చిన మీరు మళ్ళీ ప్రమాదంలో పడిపోతారేమోనన్న ఆదుర్దా నాకు వుండదా హరీన్! మిమ్మల్ని వదిలేసి నా దారి నేను చూసుకోవడం ఏం న్యాయం?"
కొద్దిక్షణలపాటు తదేకంగా ఆమెవైపు చూస్తూ వుండిపోయాడు హరీన్. తర్వాత ఆర్ద్రంగా అన్నాడు -
"సరే కరుణా...........నీ ఇష్టప్రకారమే చేద్దాం!"
తిరిగి గుహలో ప్రవేశించారు వాళ్ళు. అతిప్రయాసమీద మళ్ళీ లోయలోకి వచ్చారు. లోయలోకి రాగానే ఇప్పుడు మరింత స్పష్టంగా వినబడింది రఘుపతి గొంతు.
"అడవి మనుషుల్లారా! మా హరీన్ గనక మీ దగ్గర బందీగా వుండివుంటే , అతన్ని తక్షణం వదిలి పెట్టెయ్యండి! లేదా తీవ్ర పరిణామాలు తప్పవు"
తర్వాత తెలుగుబాష ఆ ఆటవికులకి అర్ధం అవుతుందో లేదో అని సందేహంతో, మరో భాషలో హెచ్చరికని, అంచజేయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లుగా -
తుపాకులు వర్షంలా తూటాలని కురిపిస్తున్న శబ్దం వినబడింది.
వయోలెన్స్!
                                               26

గుహలోనుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి , లోయలో ఉన్న రఘుపతి యూనిట్ ని చేరుకోవడానికి వడివడిగా నడుస్తున్న హరీన్ కీ - కరుణకీ కమనీయ దృశ్యం ఒకటి కనబడింది.
అక్కడ కొంతమేర దట్టంగా పచ్చిక పెరిగి వుంది. ఒక జింకా, దానిపిల్లా కలిసి ఆ పచ్చికను మేస్తున్నాయి. జింకపిల్ల చాలా చిన్నది. తల్లి ఎక్కడ మేస్తుంటే తనూ అక్కడే మేస్తోందది. లేత గడ్డిపరకలు ఇలా కొరికి అలా పడేస్తోంది. మధ్య మధ్యలో తల్లిని తలతో కుమ్ముతోంది.
అంతా ఆటగా వుంది దానికి!
హరీన్ కరుణా దాన్ని మురిపెంగా చూస్తూ నడుస్తున్నారు. వాళ్ళు చూస్తుండగానే ఒక ఘోరం జరిగిపోయింది.
అప్పటిదాకా ఎక్కడ పొంచి వుందో గానీ ఒక బెబ్బులి గాండ్రిస్తూ హటాత్తుగా పొదలలో నుంచి తల్లి జిన్కమీదకి లంఘించింది. గాలిలో నుంచి కిందికి దిగుతూ వుండగానే దాని కోరలు జింక మెడని కొరికి పట్టుకున్నాయి. పంజా పొట్టని చీల్చేసింది. అ తర్వాత మేడ విరిగి, నిర్జీవంగా కళ్ళు తేలేసి వున్న జింకను ఈడ్చుకుంటూ చెట్లనడుమ అదృశ్యమైపోయింది పెద్ద పులి.
కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయింది ఇదంతా!
ఆటలో మునిగి ఉన్న జింక పిల్ల ఇదేమీ గమనించలేదు. కొద్ది క్షణాల తర్వాత తలెత్తి చూసేసరికి తన తల్లి కనబడలేదు దానికి. వెంటనే జాలిగొలిపేలా అరుస్తూ, అటూ ఇటూ తొట్రుపడుతూ పరిగెత్తడం మొదలెట్టింది అది. క్షణం క్రితం నిర్భీతిగా తల్లి పక్కన గెంతుతూ , మేస్తూ వున్న ఆ జింకపిల్ల క్షణం గడిచేసరికి దిక్కులేని దీనావస్థలో పడిపోయింది.
"సరిగ్గా నాలాగే" అనుకుంది కరుణ.
తన పరిస్థితి అలాగే అయింది. పది సంవత్సరాల క్రితం ఒకరోజున నాన్నగారు ఏమయిపోయారో, ఎక్కడికి పోయారో తెలియకుండా అదృశ్యమయిపోవడంతో తమ బతుకు బజారునపడిపోయింది.
నాన్నగారు తమ బిజినెస్ తాలూకు డబ్బంతా తీసుకుపోయారని అయన పార్ట్ నర్స్ అనుమానపడ్డారు. తమకు రావలసిన బకాయిలకు బదులుగా నాన్నగారి ఆస్తి అంతా జప్తు చేయించారు. ఇల్లు వేలం వేయించారు.
అంతకు ముందు రోజు దాకా అందరిచేతా పెద్దమనిషి , ఘరానావ్యక్తీ అనిపించుకున్న నాన్నగారి మీద ఘరానాదొంగ అన్న ముద్రపడిపోయింది. ఆ తర్వాత మనోవ్యాధితో మంచం పట్టి మరణించింది అమ్మ.
అమ్మనీ, నాన్నని పోగొట్టుకుని అనాధలాగా ఎవరి పంచనో పెరిగింది తను.
ఈ అష్టకష్టాలన్నిటికీ , ఈ అరిష్టాలన్నిటికీ కారణం ఎవరు?
ఇదంతా కేవలం కాకతాళీయంగా జరిగి వుండదనీ, దీనీ వెనక ఎవరిదో అదృశ్య హస్తం వుందనీ తనకు గట్టి నమ్మకం.
నిశ్చయంగా ఎవరో ఏదో హాని చేసి వుంటారు నాన్నగారికి.
అంతేగానీ, పరోపకారం చెయ్యడమే తప్ప మరొక ధ్యాస లేని నాన్నగారు పరాయివాళ్ళ సొమ్ముని ఆశించి పార్ట్ నర్స్ ని ముంచేటంత పాపానికి ఒడిగట్టి వుంటారని ఎప్పటికీ నమ్మలేదు తను - చివరికి కలలో కూడా -
మరి ఆ పార్ట్ నర్స్ ఎలా నమ్మారో ఆశ్చర్యంగా వుంది.
వాళ్ళు కూడా మనసారా నమ్మారా? లేక డబ్బు మీద మమకారం వాళ్ళని అలా మార్చేసిందా?
ఇవన్నీ తలుచుకున్నప్పుదల్లా 'చచ్చిపోతే ఎంత బాగుంటుంది' అనిపిస్తుంది. నిజంగానే బతుకుమీద భ్రమలేదు తనకి.
కానీ తను చావకుండా ఇంకా బతికే వుండటానికి ఒకే ఒక్క కారణం వుంది.
అది - తన మనసుని కాలేచేస్తున్న కసి! కసి! కసి!
నాన్నగారికి ఎవరో ఏదో అపకారం చేశారని తన మనసుకి తెలుసు. సర్వశక్తులు ధారపోసి , కష్టనష్టాలకు ఓర్చి, ఆ వ్యక్తీ ఆచూకీ కనుక్కోవాలి తను. ఆ వ్యక్తీ నోటిద్వారానే నిజాన్ని కక్కించాలి. తమ కుటుంబం మీద పడ్డ మచ్చని తొలగించాలి.
ఆ తర్వాత ఆ వ్యక్తిని, ఆ వ్యక్తీ తాలూకు కుటుంబాన్ని ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలనీ కూడా మట్టిలో కలిపెయ్యాలి.
తాము అనుభవించిన ఘోర నరకం వాళ్ళు కూడా అనుభవించేలా చెయ్యాలి.కానీ తను చావకుండా ఇంకా బతికే వుండటానికి ఒకే ఒక్క కారణం వుంది.
అది - తన మనసుని కాలేచేస్తున్న కసి! కసి! కసి!
నాన్నగారికి ఎవరో ఏదో అపకారం చేశారని తన మనసుకి తెలుసు. సర్వశక్తులు ధారపోసి , కష్టనష్టాలకు ఓర్చి, ఆ వ్యక్తీ ఆచూకీ కనుక్కోవాలి తను. ఆ వ్యక్తీ నోటిద్వారానే నిజాన్ని కక్కించాలి. తమ కుటుంబం మీద పడ్డ మచ్చని తొలగించాలి.
ఆ తర్వాత ఆ వ్యక్తిని, ఆ వ్యక్తీ తాలూకు కుటుంబాన్ని ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలనీ కూడా మట్టిలో కలిపెయ్యాలి.
తాము అనుభవించిన ఘోర నరకం వాళ్ళు కూడా అనుభవించేలా చెయ్యాలి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra