Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

   

      మాట్లాడకుండా తల వంచుకుని కూర్చున్నాడు బాలూ. తన భార్య గర్భవతి కావటానికి ఎవరో గుర్తు తెలియని 'దాత' కారణం కాదు. ఆ కారణభూతం ఎవరో బాగా తెలుసు తనకి.    
    "మీరు ఏ అఘాయిత్యం తలపెట్టనని నాకు మాట ఇవ్వాలి" అంది డాక్టర్ మృదుల.    
    అవునన్నట్లో, కాధన్నట్లో అర్ధంకాకుండా తలాడించాడు బాలూ నిస్పృహగా. తర్వాత ముసలాయన తాలూకు బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు.    
    తన కోసమే ఎదురుచూస్తున్నట్లు సోఫాలో కూర్చుని వుంది సౌదామిని.    
    ఒక్కసారి అతని బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్లయింది. అప్పుడే అక్కడే అందరూ చూస్తూండగానే ఆమె మెడని పక్షి మెడని విరిచినట్లు విరిచి వెయ్యాలన్పించింది.    
    కష్టంమీద తనను తాను అదుపులో పెట్టుకున్నాడు బాలూ.    
    ఏం ఆలోచిస్తున్నాడు తను? తన ప్రాణానికి ప్రాణం అనుకున్న సౌదామిని ప్రాణం తియ్యాలనా!    
    ఒకప్పుడు ఆమెకి కడుపు నెప్పి వచ్చి బాధపడుతుంటే తనకు మరణవేదన కలిగింది.    
    అలాంటి సౌదామిని ప్రాణాలు తియ్యాలనేనా తను ఆలోచిస్తున్నాడు.    
    అయినా ఈ ఆలోచన తనకు రాక్షసంగా కనపడటంలేదు.    
    "వెళదామా" అంది సౌదామిని అతన్ని చూసి లేచి నిలబడుతూ. అతడు జవాబు చెప్పలేదు ముసలాయన్ని కార్లో ఎక్కించాడు. జానకి ఆయన ప్రక్కన కూర్చుంది. ముందు సీట్లో సౌదామిని కూర్చుంది.    
    కారు స్టార్ట్ చేశాడు బాలూ. అతని ఆలోచనలు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.    
    హాస్పిటల్ కి వచ్చేవరకూ పతివ్రతగా చెలామణీ అయిన సౌదామిని ఇప్పుడు పతితగా, పత్తిత్తుగా బయటపడిపోయి తిరిగి వెళుతోంది....    
    తనో!    
    తనుకూడా అంతే హాస్పిటల్ కి వచ్చేటప్పుడు చట్టాలకి తలవంచి నడుచుకుపోయే మంచి పౌరుడు. ఇప్పుడు భార్యని చంపటానికి ప్లాను వేస్తున్న కాబోయే హంతకుడు. అవును! తను సౌదామినిని చంపబోతున్నాడు!!    
    "హంతకుడు" అన్న పదం అతనికెందుకో రుచించలేదు. అమాయకులను అన్యాయంగా చంపితే హంతకుడనాలి. అపరాధం చేసినవాళ్ళని చంపితే అది హత్యకాదు.    
    పూలమొక్కని పట్టుకున్న చీడపురుగుని చంపితే అది హత్య అవుతుందా! చంపినవాడు హంతకుడవుతాడా!    
    కాడు సౌదామినిని చంపినా తను హంతకుడు కాదు.    
    కానీ ఎలా చంపాలి? అదే సమస్య.    
    కారు మలుపు తిరిగింది.    
    వెంటనే హాంకీ తీసి ముక్కుకి అడ్డుపెట్టుకుంది సౌదామిని. "ఈ వాసన మాత్రం మనకి ఏ రోజూ తప్పదు" అంటూ.    
    వాళ్ళ ఇంటికి వెళ్ళేదారిలోనే ఒక కెమికల్స్ ఫ్యాక్టరీ వుంది.    
    రోజూ అందులోనుంచి ఏదో గ్యాస్ వదుల్తారు. భరించలేని వాసన. అది పీలిస్తే తలనొప్పి.    
    గ్యాస్!    
    అతని మెదడులో మెరుపు మెరిసినట్లయింది.    
    గ్యాస్! అవును. స్మూక్షంలో మోక్షం.    
    వంట్లోని ఉత్సాహమంతా పాదాల్లోకి ప్రవహించి యాక్సిలరేటర్ మీద ప్రెజర్ గ మారింది.    
    కారు మరింత వేగం పుంజుకుంది.    
    తనకు ఏ రకం చావు కావాలో తనకు తెలియకుండానే సౌదామిని సూచించింది.    
    ఓరగా ఆమెవైపు చూశాడు.    
    ప్రొఫైల్ గా అందంగా కనబడుతోంది సౌదామిని మొహం. నున్నగా వున్నాయి చెంపలు. చూడగానే పెదవులతో స్పృశించాలని అనిపించేటట్లు వున్నాయి అవి. తను చాలాసార్లు చేశాడలాగ.    
    ఆంజనేయులు కూడా చేసే వుంటాడు.    
    అప్పుడు సౌదామిని రియాక్షన్ ఎలా వుంటుందో తనకి అనుభవమే! లత్తుక దిద్దినట్లు ఎర్రగా వుండే ఆమె పెదిమలు "స్స్ స్స్ స్స్" అని తెరుచుకుంటాయి. బాధగా ఆ తియ్యటి బాధతోనే చీకటిలాంటి కాటుక దిద్దుకున్న కళ్ళు పరవశంగా మూసుకుపోతాయి. అలాంటి సమయాల్లో ముక్కుపుటాలు అప్రయత్నంగానే పెద్దవి చేస్తుంది ఆమె నుదుటిమీదకు జారిన ముత్యాలపాపిటి బొట్టులా స్వేదపు బిందువులు ఏర్పడి అందంగా కనబడతాయి.    
    సౌదామిని ఒంట్లో వచ్చే ఈ సున్నితమైన మార్పులు, సన్నిహితమైన రియాక్షన్స్ తనకు తప్ప ఇంకో నరమానవుడికి తెలియదనీ, ఆ అందం ఆ చందం అంతా తన ఒక్కడికే సొంతమని గర్వంగా ఫీలయ్యేవాడు ఇన్నాళ్ళూ.    
    కాదని ఇవాళ తేలిపోయింది. ఆ గర్వమంతా గాలి బుడగలా పేలిపోయింది.    
    రేప్రొద్దున సౌదామిని శరీరం కూడా అంతే. బాంబులా పేలిపోతుంది. ముక్కలు-ముక్కలుగా చీలిపోతుంది.    
    అతని వేళ్ళు స్టీరింగ్ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. స్టీరింగ్ ని గబగబ తిప్పి తమ బంగళాలోకి మళ్ళించాడు కారుని.    
    వరండాలోనే బాబు ఆడుకుంటున్నాడు. మొహానికి షర్టుకీ అంతా ఏదో జిగురుగా అంటి వుంది.    
    "ఏమిట్రా! అల్లరి వెధవలా ఒంటికంతా పూసుకున్నావ్" అంది సౌదామిని మురిపెంగా కోప్పడుతూ.    
    "కాడ్ బరీ తిన్నా" అన్నాడు బాబు గర్వంగా.    
    "కాడ్ బరీ ఎక్కడిదీ?" అని అడిగి చప్పున ఆ ప్రశ్న ఎందుకు అడిగానా! అని భయపడుతున్నట్లు తల తిప్పుకుని ఇంట్లోకి నడిచింది.    
    కానీ బాబు ఆ ప్రశ్న విననే విన్నాడు.    
    "అంకుల్ కొనిచ్చారు" అన్నాడు సంతోషంగా.    
    సౌదామిని వాడికి ఏది కావాలన్నా కొనిస్తుంది. ఒక్క చాక్లెట్లు తప్ప! చాక్లెట్లు తింటే పళ్ళు చెడిపోతాయని ఆమె భయం.    
    అందుకనే అంత పెద్ద చాక్లెట్ తిన్నందుకు మహా సంబరంగా వుంది బాబుకి.    
    "అంకుల్ చాలా మంచి అమ్మ చాలా చెడ్డ" అన్నాడు జడ్జిమెంట్ చెప్పేస్తూ.    
    మాట్లాడకుండా ఇదంతా వింటున్నాడు బాలూ అతడి ఆలోచనలు వేరేచోట వున్నాయి.    
    సౌదామినిని ఫినిష్ చేసిన తర్వాత వీడినేం చేయాలి తను? ఎవరికో పుట్టినవాడిని తన కొడుకుగా పెంచగల ఔనత్యం తనలో లేదు. ఉండవలసిన అవసరం కూడా లేదు.    
    మరి వీడేమవుతాడు?    
    ఆంజనేయులు వచ్చి తన కొడుకుని తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళకపోతే ఏమవుతాడు వీడు.    
    వీడి సంగతి తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్.    
    సౌదామిని మీద కోపంతో కుతకుతలాడిపోతున్న బాలూకి ఎదురింటి జానకీ, ముసలాయనా గుర్తుకు వచ్చారు. వీళ్ళేరీ? అసలు వీళ్ళని కార్లో ఎక్కించుకుని వెనక్కి తీసుకొచ్చాడా తను, లేకపోతే ఆలోచనల్లో పడి నర్సింగ్ హోమ్ లోనే వదిలేసి వచ్చాడా?    
    ఎదురింటివైపు చూశాడు.    
    కారు బాలూ కాంపౌండులో ఆగగానే దిగి, భర్తను నడిపించుకుని తమ ఇంటికి తీసుకువెళ్ళిన జానకి, వరండాలో నిలుచుని అతనివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూస్తోంది.    
    కాంతి దూరం పయనించినకొద్దీ అందులో వెలుగు తగ్గుతుంది.    
    కానీ ఆమె అంతదూరంలో నిలబడి వున్నా ఆమె కళ్ళలోని కాంతి మరెన్నో రెట్లు ఎక్కువయి తనని చేరుతున్నట్లు  అన్పించింది బాలూకి.    
    చిరునవ్వు నవ్వి తల పంకించాడు.    
    ఆమె లోపలికి వెళ్ళిపోయింది.    
    అతడు కూడా లోపలికెళ్ళాడు.    
    తాము లేనప్పుడు వచ్చిన "అంకుల్" ఎవరని యింక నిగ్గదీయలేదు. బాలూ అదసలు పట్టించుకోనట్లే మొహం కడుక్కుని కిచెన్ లోకి వచ్చాడు.    
    గ్యాస్ స్టౌ మీద కాఫీ పెడుతోంది సౌదామిని. సైలెంట్ గా చూస్తున్నాడు బాలూ.    
    ఆమె పక్కనే ఎర్రటి గ్యాస్ సిలిండర్ డేంజర్ మార్కులా! దానికి ఆకుపచ్చ ట్యూబు- డేంజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వున్నాయి.    
    సింపుల్ ఆపరేషన్.    
    అయితే తను చెయ్యదల్చుకున్న పని రాత్రి బాగా పొద్దుపోయాక ఆమె వంటిల్లు అంత సర్దేశాక, చెయ్యాలి ఇప్పుడే కాదు.    
    ఆ తర్వాత.    
    ఆ తర్వాత చెయ్యాల్సింది మరొకటుంది. సౌదామిని ప్రాణాలు పోయే సమయానికి తను యింట్లో వుండకూడదు. ఇంకోచోట ఎక్కడయినా వుండాలి. అంతేకాదు, అక్కడ ఉన్నట్లు గట్టి ఎలిబీ కూడా సృష్టించుకోవాలి.    
    తప్పనిసరిగా యిది పోలీసు కేసు అవుతుంది. అందుకని తన ప్లాను పకడ్బందీగా వుండటం అత్యవసరం అనుమానం తన మీదకు రాకూడదు.    
    ఆమె వెనక్కు తిరిగి, అతన్ని గమనించి నవ్వింది. అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు.    
    మళ్ళీ ఆలోచనలు.    
    ఆమెని పెళ్ళి చేసుకుంటే చాలు స్వర్గం అందినట్లే అనుకునే వాడు తను.    
    పెళ్ళి చేసుకున్న తర్వాతే తను నరకంలో పడ్డాడు. తన బాచిలర్ లైఫ్ స్వర్గంలా కనబడుతోంది యిప్పుడు. తిన్నా తినక పోయినా చీకూ చింతా ఉండేది కాదు. తన మ్యూజుక్కూ, తన ఫ్రెండ్సూ, తన అల్లరీ అంతే!    
    మళ్ళీ ఇప్పుడు ఆమెను వదిలించుకున్న తర్వాత తను కోల్పోయిన ఆ స్వర్గం తిరిగి వస్తుందా?    
    మనసులో రగులుతున్న ఈ అగ్నిగుండం చల్లారుతుందా! చూడాలి.    
    కాఫీ కప్పు పట్టుకుని గదిలోకి వచ్చింది సౌదామిని.    
    "మీరలా వుంటే నాకు తోచదు" అంది జాలిగా మొహం పెట్టి నిరాసక్తంగా చూశాడు బాలూ.    
    ...'మరింకెలా ఉండాలి? సంతోషం పరవళ్ళు తొక్కుతూ ఉండాలా నువ్వు ఆడుతున్న ఆటకు?' అనుకుంటూ, పైకి మాత్రం ముభావంగా "ఏమీలేదే" అన్నాడు.    
    "చిరాగ్గా ఉన్నారు ఎందుకో".    
    "పనులు! లక్ష పనులు నెత్తిన పెట్టుకుని చస్తుంటాం కదా! రెండు వారాలు బద్దకంగా గడిపేశాం. ఇంకా రేప్రొద్దున నుంచి ఫుల్ స్వింగ్ లో మొదలుపెట్టాలి', అని ఆగి, "నువ్వు ఒక పని చెయ్యగలవా?" అడిగాడు.        "చెప్పండి".    
    "రేపు మూడున్నరకల్లా నన్ను లేపాలి. కాఫీ రెడీగా ఉంచగలవా ఆ టైమ్ కి? అర్లీగా? వెళ్ళిపోవాలి నేను".    
    "అదెంత పని తప్పకుండా!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra