Home » Yerramsetti sai » Bomma Borusu


    "హేమ మీరేనా?" అడిగిందామె.
    "అవునండి! మీరెవరు?" కుతూహలంగా అడిగింది హేమ."
    నా పేరు శాంత! నేను మీ అభిమానురాలిని. మీ నవల చదివి ఎంతగా పొంగిపోయానో, ఎంతగా ఆనందించానో ఎలా చెప్పమంటారు? మిమ్మల్ని చూడాలన్న కుతూహలం చంపుకోలేక మీ అడ్రస్ కోసం ఎన్నో తిప్పలుపడి ఇన్నాళ్ళకు సంపాదించగలిగాను....." ఆదరంగా అందామె. "రండి! కూర్చోండి ముందు!" ఆమెను లోపలకు ఆహ్వానించింది హేమ.
    "చూడమ్మా నువ్వు నాకంటే చిన్నదానివి. కానీ నువ్వు ఇంత ధైర్యంగా ఈ రాస్కెల్స్ లో ఉన్న కుళ్ళు నంతా బయటపెట్టి, వాతలు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. నువ్వు రాసేవన్నీ నిజంగా మన దేశ స్త్రీలలో ముప్పాతిక భాగం అనుభవిస్తున్నవే. ఈ మగవాళ్ళనిలాగే తిట్టాలనీ, వారికుక్క మనస్తత్వం గురించి అందరికీ చటాలనీ అందరూ అనుకొనేదే! కానీ ఎవ్వరూ అంత ధైర్యం చేయలేకపోతున్నారు అలాంటి అవకాశం లేకనోరు మూసుకుని జీవితాలు గడిపేస్తున్నారు. అమెరికాలో నీగ్రోలు ఎలాగో, మనదేశంలో హరిజనులెలాగో, మన స్త్రీల పరిస్థితి అలాగే ఉంది. వారందరికన్నా ఎక్కువ హింస, అవమానం బాధలూ అనుభవిస్తున్నారు. మన పరిస్థితి చూసి జాలిపడి దేముడే నీకీ రచనలు చేసేవరం ఇచ్చాడని నా కనిపించింది...." ఆవేశంగా మాట్లాడిందామె.
    హేమ ఆమె మాటలు ఆశ్చర్యంగా వింటూండిపోయింది.
    "నా జీవితం కూడా ఈ మగాడిపాపాల వల్లే నాశనమయిపోయిందమ్మా! అయినా నేను భయపడలేదు పారిపోలేదు. తలవంచలేదు. మనసు గట్టిపరచుకుని ఎదుర్తిరిగి నా ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతున్నాను. అందువల్ల ఎదురయిన ఇబ్బందులు, అవహేళనలు, సమస్యలు అన్నీ యిన్నీ కాదు. అయినా సహించాను. మొండిదానిలాగా, సిగ్గూ, శరం విడిచేసి జీవితం గడిపేస్తున్నాను! జరిగినదంతా గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుపొస్తోంది. ఆత్మహత్య చేసుకు ఛస్తే ఏ బాధా ఉండదు కదా అని విరక్తి కలుగుతుంది. నేనిలా అనడానికి కారణమయినవాడిని చంపి పారేసి జైలుకెళదామనిపిస్తుంది. అందువల్ల కనీసం నా గురించి అందరకూ తెలుస్తూందనీ, అలా భార్యలను హింసించే మగాళ్ళు భయపడి ఓ పాఠం నేర్చుకుంటారనీ ఆశ! కానీ మనసు గట్టిపరచుకోలేకపోతున్నాను. ఎప్పుడో బాగా తిక్కరేగిందంటే అంత పనీ చేయడం ఖాయం! ఆ తరువాత ఏం జరిగినా సరే! అలాంటి సమయాల్లో అసలు కథంతా అందరికీ ఎలా తెలుస్తుంది? అందుకేనా డయిరీలన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ నీ దగ్గరే వుంచుకో. అన్నీ చదువ్! నాజీవితాన్ని నవలగారాయి. నేనే రాద్దామని అనేకసార్లు ప్రయత్నించాను. కానీ కొన్ని కొన్ని సంఘటనలు రాసేటప్పుడు నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నిగ్రహం కోల్పోతున్నాను. కోపం, కసి బాధ నన్ను కాకుండా చేస్తున్నాయ్. నేను భరించిన, సహించిన అవమానాలు తల్చుకుంటే నాకే ఏడుపొచ్చేస్తుంటుంది. అవన్నీ నీకు చెప్పటం కూడా నా వల్ల కాని పని! దయచేసి అవన్నీ సానుభూతితో చదువుకో నా పరిస్థితిలోనే నువ్వున్నట్లు ఊహించుకుంటే అంతా నీకు అర్ధమయిపోతుంది....." కళ్ళవెంబడినీళ్ళు తుడుచుకుంటూ అందామె.
    హేమ ఆమెను చూసి చలించిపోయింది. ఆమె ఎంతటి కఠినమయిన బాధలు అనుభవిస్తే ఇంతగా కృంగిపోతుంది? ఆమె కళ్ళు తుడుచుకోవడం చూసేసరికి హేమకుకూడా కళ్ళ వెంబడినీళ్ళు తిరిగినయ్.
    "నేనింక వెళతానమ్మా.....నీ సమయం చాలా వృధాచేశానేమో?" అంది శాంత వెళ్ళడానికి సిద్దపడుతూ.
    "కొంచెంసేపుండండీ! కాఫీ తెస్తాను....." అంది ఆమె లోపలకు నడుస్తూ.
    కాఫీ తాగాక ఆమె శలవు తీసుకుని బయటకు నడిచింది.
    "నా అడ్రస్ ఆ డయిరీల్లోనే ఉందమ్మా! ఏమయినా ఇక్కడికి ఇరవై మైళ్ళు వుంటుందిరావడం పెద్ద కష్టమేం కాదు"
    "అలాగేనండీ".
    "అయ్యో అసలు విషయం మర్చిపోయాను! నీ గురించి ఏమీ తెలుసుకోనేలేదు. పిల్లలా నీకు?"
    "అవునండీ! ఓ ఆడపిల్ల!"
    "మీ ఆయనెలాంటివాడు? మంచాడేనా లేక మగవాడా?" హేమకు నవ్వొచ్చింది.
    "నాదీ అంత అదృష్టం చేసుకున్న సంసారం కాదులెండి." అంది నవ్వేస్తూ.
    "నేననుకున్నానమ్మా! అలాంటి కష్టాలేవో అనుభవించబట్టే అంత చక్కగా రాయగలుగుతున్నావ్. అయితే నేనో విషయం చెప్పనా? నీకలా జరగడం మంచిదే అయింది. లేపోతే ఇవన్నీ నువ్వు రాయగలిగేదానవా? మన ఆడవాళ్ళకి ఇలా కనువిప్పు కలిగించేదానివా? ఆలోచించడం నేర్పగలిగేదానవా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నా మనసులోని ఆవేదనయిదంతా....." ఆమె వెళ్ళిపోయింది.
    హేమ తలుపు దగ్గరే నిలబడి చాలాసేపు ఆమె వెళ్ళినవేపే చూస్తూండిపోయింది.


                                                              * * * * * *


    "ఏమిటోయ్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" అడిగాడు శంకరం శ్రీనివాసరావ్ టేబుల్ దగ్గరకొస్తూ.
    "ఏముందీ? మామూలే!" అన్నాడు శ్రీనివాసరావ్.
    "నీలాంటి అదృష్టవంతుడు కూడా ఏవేవో సమస్యలున్నట్లు అలా ఆలోచించడం బావుండలేదోయ్...." నవ్వుతూ అన్నాడతను.
    "నా అదృష్టం నీకొక్కడికే కనబడుతోందనుకుంటాను!"
    "అదృష్టవంతులందరూ ఇలాగే అంటారులే! అసలు మరి కొన్నాళ్ళుపోతే నువ్వీ ఉద్యోగమే చేయనక్కరలేదుగా! మీ ఆవిడ సంపాదన మీద దర్జాగా బ్రతికేయచ్చు...." ఆ మాట శూలంలాతాకింది శ్రీనివాసరావ్ కి అయితే అతను తొందరపడలేదు.
    "ఏం సంపాదన?"
    "ఏమీ తెలీనట్లు బుకాయించకు? నువ్వు దాచి పెట్టినంతమాత్రాన దాగుతాయా ఏమిటి, ఇలాంటి  విషయాలు!"
    "దేన్ని గురించోయ్, నువ్వు మాట్లాడుతోంది?" అర్ధంకాక అడిగాడు శ్రీనివాసరావ్."
    "ఇంకాదేన్ని గురించి మీ శ్రీమతిగారు రాసిన నవల గురించి ఇందాకే అద్దెకు తెచ్చానా నవల! దాని మీద ఫోటో చూసేవరకూ ఆమె మీ శ్రీమతే అని తెలీదు నాకు! ఎప్పుడో పెళ్ళిలో చూడటమేగా ఆమెని!"
    "నవల పబ్లిషయిందా? ఏదీ? చూడనీ ఓసారి" అడిగాడు శ్రీనివాసరావ్.
    "అబ్బ! అద్భుతమైన నటనోయ్ నీది? హైద్రాబాద్ లో నాటకాలేసే వాడినన్నావ్ కదూ! లేకపోతే ఏమిటి? మీ ఆవిడ పుస్తకం పబ్లిషయినట్లు నీకు తెలీదంటే ఎవరు నమ్ముతాడు?" "ఊహు! అది కాదోయ్! ప్రచురించబడిన మాట నిజమే కాని ఆ నవల నేనింతవరకూ చూడనే లేదు! నా సంగతి నీకు తెలీందేముందీ? ఇరవైనాలుగ్గంటలూ ఏదొక బిజీగానే వుంటాను. ఇలాంటి విషయాలమీద ఆసక్తీ లేదు. సమయమూలేదు."
    "తమాషాగానే ఉంది! శ్రీమతి రాసిన నవల చదవకపోతే మానె, చూడ్డానికి కూడాతీరికలేదంటే ఆశ్చర్యంగానే ఉంది! సరే- నీమాటెందుకు కాదనాలి? తెచ్చిస్తానుండు...." మళ్ళీ తన టేబుల్ దగ్గరకు నడిచి డ్రాయర్ లో నుంచి ఓ నవల తీసుకొచ్చి శ్రీనివాసరావ్ కి అందించాడు.
    ఆతృతగా అది తీసుకుని చూశాడు శ్రీనివాసరావ్. ముందు అట్టమీద నవల పేరు దానికంటే పెద్ద అక్షరాలలో హేమ అన్న పేరు. ఓ అందమయిన అమ్మాయి బొమ్మ, కర్కశత్వంచోటు చేసుకున్న ఓ మొగాడి మొఖమూ! ఆమె జడనే కొరడాలా పట్టుకున్నాడతను వెనుక అత్తా మీద ఆమె ఫోటో, దానికింద ఆమె రచనల వివరాలూ ఉన్నాయ్. 'వివాహితురాలు ఓ పాప' అన్న విషయాలు తప్పిస్తే ఆమె వ్యక్తిగతవివరాలేమీ రాయలేదక్కడ మొదటి పేజీలో నవలా వ్యాసంగం చేపట్టడానికి కారణ భూతుడయినా నా ఆప్తమిత్రుడు చంద్రకాంత్ కి కృతజ్ఞతలతో అని ఉంది. తరవాత పేజీలో ఎవరికి అంకితమిచ్చిందీ రాసింది.
    "యుగయుగాలనుంచీ బానిసత్వంలో మ్రగ్గిపోతున్ననాతోటి స్త్రీలకు ఈ నవల అంకితం".
    తన గురించే ఆ నవలరాసిందేమో అన్న అనుమానం హఠాత్తుగా కలిగింది శ్రీనివాసరావ్ కి. అయితే మాత్రం తనేం చేయగలడు? అతనికి బాగా కోపం కలిగించిన విషయం ఆ నవలలో చంద్రకాంత్ కి కృతజ్ఞతలు తెలియజేయడం!
    "కనీసం రెండు మూడు వేలయినా ఈ నవలల మూలాన లభించి ఉంటుంది! అవునా, కాదా?" అడిగాడు శంకరం.
    "ఎన్నినవలలు చూశావ్ నువ్వు?"
    "రెండు! మరోటి ఏ మధ్యే వచ్చిందట! అది చూడలేదా నువ్వు?"
    "ఊహు! ఇంతకూ నీకు కావలసింది కాఫీయేగా పద పోయిస్తాను" అతనిని కాంటీన్ కి తీసుకెళ్ళి ఫలహారం ఇప్పించాడు శ్రీనివాసరావ్. తరువాత తనసీట్లో కూర్చుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. శంకరం చెప్పినదాన్నిబట్టి చూస్తే ఆమె డబ్బు బాగానే సంపాదిస్తోందన్నమాట! ఇక తననెందుకు లెక్క చేస్తుంది మరి? అందుకే రాకుండా అక్కడే కూర్చుంది! అమ్మాయి సంపాదన అంత ఎక్కువగా వుంటే ఏ తండ్రి మాత్రం ఎందుకు కూతురుని బరువుగా భావిస్తాడు?
    వీటన్నిటికన్నా చంద్రకాంత్ విషయమే అతనికి భరించరానిదిగా ఉంది. అక్కడ ఎలాగూ తన అడ్డులేదు కాబట్టి ఇద్దరూ హాయిగా ప్రణయకలాపాలు జరుపుతున్నా ఆశ్చర్యపడనక్కరలేదు. అతనిలో అశాంతి మొదలయింది. తను ఆమెకేదో గొప్ప గుణపాఠం నేర్పాననుకుంటున్నాడుగానీ నిజానికి హేమకేం పాఠం నేర్పగలిగాడని? నవలలు రాసుకుంటూ డబ్బు సంపాదిస్తూ, చంద్రకాంత్ తో ప్రణయం జరుపుతూ హాయిగా స్వేచ్చగా ఉంది. తన దగ్గరకంటే ఎంతో సుఖం పొందుతుంది.
    "ఊహు! ఇలాక్కాదు. ఆమెను నిస్సహాయురాలిగా చేసి బాధించాలి." తప్పయిపోయింది, మీరు చెప్పినట్లు వింటాను! కుక్కలా పడిఉంటాను" అనేవరకూ హింసలు పెట్టాలి. అది ఆమె తండ్రి దగ్గరుంటే సాధ్యంకాదు ఆమె చేతినిండా డబ్బుంటే అసలేసాధ్యంకాదు. ఈ రెండురక్షణలూ ఉన్నంతకాలం ఏ స్త్రీ కూడా భర్తను గౌరవించదు! తన నిర్లక్ష్య ధోరణి మార్చుకోదు. ఆమెను ఏ సాకుతో మళ్ళీ తనదగ్గరకు తీసుకురావాలా, తను రాజీకొచ్చినట్లు తెలీకుండా ఎలా నాటకమాడాలా అని ఆలోచించసాగాడతను.
    సాయంత్రం అయిదయిపోయింది. ఆఫీస్ నుంచి బయటపడి నెమ్మదిగా నడుస్తూ ఇంటికి బయల్దేరాడతను. సత్యన్నారాయణపురం పార్కులోకి చేరుకొని చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడతను. చీకటి పడినా అతనికేమీ తట్టడం లేదు. 'హేమను ఎలాగోలా తీసుకురావాలి' అని మాత్రం నిర్ణయించుకున్నాడు. ఏదో రైలు వచ్చి స్టేషన్ లో ఆగివెళ్ళిపోయింది మళ్ళీ! రైలు దిగిన ఓ జంట ఇద్దరు పిల్లలతో సామాను తీసుకుని ప్లాట్ ఫారం మీద నడుస్తూ కనిపించారతనికి అందరూ ఏ గొడవలూ లేకుండా హాయిగా ఎలా సంసారం చేస్తున్నారు? వారి మధ్య ఎక్కువతక్కువలు ఎందుకు తలెత్తటంలేదు? వారి భార్యలు ఎందుకు భర్తలకు సహకరిస్తున్నారు? ఎందుకు భర్త మాటను గౌరవిస్తున్నారు? ఎందుకు అణగిమణిగి ఉంటున్నారు? వారిలోనూ చదువుకున్నవారున్నారే? వారిలోనూ తెలివితేటలుగల వారున్నారే? మరి ఈ హేమ ఒక్కర్తే ఎందుకిలా ప్రవర్తిస్తోంది?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra