Home » D kameshwari » Chikati Podduna Velugu Rekha


    ఇంట్లో అతని మొహమాటం, బిడియం సుజాతకి పెద్ద సమస్యగా తయారయ్యాయి. అతను ఏది కావాల్సినా నోరు తెరచి అడిగేవాడు కాడు. ఆఖరికి మంచినీళ్ళు కావల్సివచ్చినా ఎంతో మొహమాటంగా సిగ్గుపడుతూ తప్పుపని చేస్తున్నట్టు అడిగేవాడు. అతనికి కాఫీ టిఫిను, సుజాత వేళలు గుర్తుంచుకొని పెట్టాల్సిందే కాని అతను అడిగేవాడు కాడు.
    ఉదయం లేస్తూనే సుజాత కల్యాణికి కాఫీ తీసికెడుతూ, నౌకరు కుర్రాడితో రామకృష్ణ కో కప్పు పంపేది అతని గదిలోకి. అతను ఏడు గంటలకల్లా స్నానం అదీచేసి రెడీ అయి ఆస్పత్రికి వెళ్ళబోయే ముందు డైనింగ్ హాలులోకి వచ్చి టేబిల్ ముందు కూర్చునేవాడు. అతను రావడంచూసి సుజాత టిఫిను తీసుకొచ్చిపెట్టేది. మొదటిరోజు టిఫిను గదికి పంపితే రామకృష్ణ చాలా మొహమాటపడ్తూ తనకి అలా అన్నీ అందీయవద్దని తనేవచ్చి తింటానన్నాడు. సరే ననుకుంది సుజాత. భోజనానికి, టిఫినుకి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్న అతన్ని ఏదన్నా పని హడావిడిలో సుజాత చూడకపోతే ఎన్ని నిమిషాలయినా అలాగే కూర్చునేవాడు ఏ పేపరో తిరగేస్తూ. "అరే, పిలవకపోయారా, చూడలేదు." అనేది సుజాత నొచ్చుకుంటూ. "పరవాలేదు, పనిలోవున్నారని పిలువలేదు." అనేవాడు తలవంచుకుని ఆడపిల్లలా అతను సుజాతతో మాట్లాడడానికే సిగ్గుపడిపోయేవాడు సుజాత అడిగినవాటికీ అంటీ ముట్టనట్టు సమాధానాలు చెప్పి, గటగట ఆ టిఫిను తినేసి వెళ్ళిపోయేవాడు. ఇంత మొహమాటస్థుడు ఎలా బ్రతుకుతాడో అనిపించేది సుజాతకి. మధ్యాహ్నం కళ్యాణితోపాటు కారులో ఇంటికి రమ్మంటే "అబ్బెబ్బే ఫరవాలేదు నడిచి వస్తాను" అన్న రామకృష్ణని కల్యాణి ఓ విధంగా బలవంతంగా కారులోకి ఎక్కించింది. "కారు ఇంటికి ఖాళీగా వస్తూంటే ఎండలో నడిచి వస్తానంటావు. ఇదేమిటోయ్.....ఇంత సత్తెకాలం మనిషివి" అంది. అలాగే మధ్యాహ్నం కళ్యాణితోసహా డైనింగ్ టేబుల్ దగ్గిర కూర్చుని భోంచెయ్యడానికి ఇబ్బంది పడ్తున్న అతన్ని కల్యాణి మందలించింది. "చూడు రామకృష్ణా, వినయం, గౌరవం చూపడం మంచిదేకానీ మరీ బొత్తిగా ఇంతలా బానిసత్వం అనిపించకూడదు. నీవూ ఒక డాక్టరువి అన్నవిషయం మరిచిపోయి ఏదో మరీ నా క్రింద నౌకరులా ప్రవర్తించకు.....నా దగ్గిర పనిచేసినంత మాత్రాన నా సరసన కూర్చుని భోంచెయ్యకూడదని ఏం రూలులేదు. నర్సింగ్ హోములో వున్నంతసేపే నా అసిస్టెంట్ వి......రాకూర్చో..... రోజూ వుండేదానికి మొహమాటపడితే ఎలా! సుజాత కూర్చోడంలేదూ నాతో ..... అలాగే నీవూనూ..... సుజాతా, ముగ్గురికి వడ్డించు" అంది కల్యాణి మెత్తగా అతన్ని మందలించి.
    అతని మొహమాటం, బిడియం పోగొట్టడానికి, అతనికేం కావాలో అడిగేపాతి చనువు, ధైర్యం అతనికి వచ్చేట్టు చెయ్యడానికి సుజాతకి, కల్యాణికి మూడునెలలు పట్టింది.
    ఓ రోజు ఉదయం కల్యాణి ఎవరినో బ్రేక్ ఫాస్ట్ కి పిలిచింది. వంటింట్లో ఊపిరి ఆడని పనిలో మునిగిన సుజాత అతన్ని చూడలేదు. ఆ హడావిడిలో అతను టిఫినుకి వచ్చి వుంటాడన్న సంగతీ గుర్తు రాలేదు. రామకృష్ణ ఓ పావుగంట యెదురు చూసి, మరో పావుగంట అక్కడ తచ్చాడి, ఆఖరికి టిఫిను అడగకుండా, తినకుండానే ఆస్పత్రికి వెళ్ళిపోయాడు.
    తరువాత ఆ సంగతి గుర్తించి సుజాత యెంతో నొచ్చుకుంది. కల్యాణి టిఫిను తింటున్నప్పుడు ఆ సంగతి బాధగా చెప్పింది. "ఇదెక్కడి వాడు, ఇంత మొహమాటం అయితే యెలా ఇతనితో.....పోనీ ఒక్క పూట టిఫిన్ తినకపోతే మరేం కొంప మునగదు. నీ వెంతకని అన్నీ చూసుకుంటావు!" కల్యాణి కాస్త కోపంగా అంది. కాని సుజాత మొహంలో ఆవేదన, బాధ చూసి "సరే, నే వెళ్ళి అతన్ని పంపిస్తాను" అంది.
    కల్యాణి పంపించాక ఇంటికి వచ్చిన రామకృష్ణని చూసి, "అంత చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా" అంది నిష్ఠూరంగా సుజాత.
    "అదేమిటి? నేను.....నేను.....ఏం చేశాను...." అన్నాడు తెల్లబోతూ, గాభరాగా చూస్తూ.
    "ఏం చెయ్యలేదు! అదే నేనూ అంటున్నాను. పని హడావిడిలో వుండి మరిచిపోతే పిలవలేరా? దానికోసం టిఫిన్ మానేసి వెళ్ళిపోవాలా? ఇలా ఆకలితో యే రెండు గంటలవరకో వుండి యెవరిని సాధిద్దా మనుకున్నారు" సుజాతకి ఆ రోజు పనితో చాలా అలసటగా వుంది. దానికి తోడు రామకృష్ణ చర్య ఆమెకి కష్టం కలిగించింది. ఆ బాధలో కాస్త కఠినంగా, నిష్ఠూరంగానే అంది.
    రామకృష్ణ మొహం యెర్రనయింది. "సారీ.....ఎక్సూజ్ మీ......నేను టిఫిను తినని పూటలు చాలా వుండేవి యిదివరకు. ఇప్పుడు ఒకపూట తినకపోతే యేం ఫరవాలేదు అన్న ఉద్దేశంతో మీరు అవతల బిజీగా వున్నారని వెళ్ళిపోయాను...." అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra