Home » Chandu harshavardhan » Made In India

 

    "పాశ్చాత్య దేశాలలో సోక్రటీస్ మరణంతో మనస్తత్వ శాస్త్రం తన ఆత్మను కోల్పోయింది. "పరమాత్మలేని మనస్తత్వ శాస్త్రం ఆత్మ రహితం" అని చార్లెస్ ఫాక్స్ తన గ్రంధంలో చెప్పిన మాట అక్షరాల నిజం. రెండవ దశలో మనస్తత్వశాస్త్రం మనసు యొక్క అధ్యయనం అయింది.
    'అయితే మనసుకు, శరీరానికి వున్న సంబంధం చిక్కుముడిగా మిగిలిపోయింది. వాటి నుంచి మనస్తత్వశాస్త్రం మతిపోగొట్టుకున్నది. మూడవ దశలో డేస్కార్ట్ స్ మనసు చైతన్యం కలిగిన వస్తువు అని స్పష్టం చేశాడు. నాటి నుంచి పాశ్చాత్య దేశాలలో మనస్తత్వశాస్త్రం చైతన్యం యొక్క అధ్యయనంగా మారింది. ఇది పాశ్చాత్యుల ఆధునిక మనస్తత్వశాస్త్రం......
    క్క్లుప్తంలో చెప్పాలంటే , పాశ్చాత్య దేశాలలో మనస్తత్వశాస్త్రం మొదట తన ఆత్మను కోల్పోయింది. తరువాత మనసును, చివరకు చైతన్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు డానికి మిగిలింది ప్రవర్తన మాత్రమే. నిజానికి ప్రాచీన భారతీయ మనస్తత్వశాస్త్రం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమని కఠోపనిషత్ చెబుతున్నది. 'పూర్వజన్మలో, జీవాత్మ యొక్క అమరత్వంలో " డానికి విశ్వాసం వున్నది.
    'ఆత్మరదారూడుడు  యజమాని అయితే, ఇంద్రియాలు గుర్రం. ఇంద్రియ విషయాలే పరుగులు దీసే గుర్రాల మార్గాలు అని గ్రహించాలి. అంటే, శరీరం, ఇంద్రియములు, మనసులతో కూడి వున్న ఆత్మనే ప్రాజ్ఞులు భోక్తగా చెబుతారు. 'గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేతకనీ చాలా శాస్త్రాలు అధ్యయనం చేయడం వలన కానీ ఎన్నో గూదార్దాల మహాత్ముల వద్ద వినడం వలన కానీ ఆత్మ ప్రాప్తి జరగదు' అని మండకోపనిషత్తు చెబుతున్నది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు క్లుప్తమైన సమాధానం ఇది.......
    కఠోపనిషత్తులో ప్రతి ప్రాణికి ఒక జీవాత్మ వున్నదని చెప్పబడింది. క్రియ, దృష్టి, మనసు బుద్ది, అహంకారం అనే లక్షణాలతో కూడిన బౌతిక సూక్ష్మ శరీరములకు బిన్నమైనది వ్యక్తీ యొక్క జీవాత్మ ఆలోచనల ద్వారా విస్తరిస్తాయి. చైతన్యం జీవాత్మ యొక్క లక్షణం . చైతన్యం అంటే బుద్ది.....
    "మానవునికి చైతన్య దశలు నాలుగు వున్నప్పటికీ జాగృత, స్వప్న, సుషు స్తిస్థితులలో మాత్రమే ఆత్మ చైతన్యం కనిపిస్తుంటుంది. ఆచరణలో ఒక భాగం నిద్రలో, మరొక భాగం మేలుకున్న స్థితిలో మాత్రమే గడుపుతున్నాడు. నిజానికి ఈ రెండు స్థితుల మధ్య తేడా బహుస్వల్పం . పాతంజలి యోగ దర్శనంలో చెప్పినట్టు ఆత్మ చైతన్య స్థితి దీర్ఘకాలం నిలచి వుండాలంటే మనం అందుకొరకు ఇచ్చాశక్తితో, క్రియాశక్తితో కృషి చేయవలసి వుంటుంది. ఇందుకొరకై మానవుడు తనపై అదుపును, అధికారాన్ని సంపాదించవలసి వుంటుంది. ఆత్మ చైతన్యాన్ని సంపాదించాలంటే మానవుడు శ్రమించి దీర్ఘకాలం పనిచేయాలి.......
    "విశ్వమంతా సృష్టించబడిన తరువాత మిగిలిన శక్తి ........శేష శక్తి హైందవ పురాణాలు డానికి శేషనాగముగా , అనంతునిగా , అది శేషునిగా వర్తిస్తున్నాయి. ఇది బ్రహ్మ యొక్క శేష శక్తి. ఈ శేష శక్తి ఐతరేయోపనిషట్ లో ఉదహరించినట్టు విశ్వంలోని నానా విధరూపములు ధరించినప్పటికి అనంతంగా మిగిలి వుంటుంది.
    'అలానే గర్భోపనిషట్ పిండం యొక్క ఉత్పత్తిని గర్భంలో శిశువు యొక్క పెరుగుదల వివరిస్తున్నది. ఏడవ నెలలో శిశువు మాడులో (బ్రహ్మరంద్రం) ప్రవేశిస్తాడని చెప్పింది. శిశువు యొక్క మాడు వద్ద ఛర్మం పలుచగా వుండడం , నాడి కొట్టుకున్నట్టు అది కొట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా చూపుతారు. ఆ విధంగా పైనుంచి వచ్చిన జీవుడు  మాడు గుండా ప్రవేశించి శరీరం అంతటా వున్న వేలాది నాడుల ద్వారా పని చేస్తాడు.
    'అందువలన సత్యశోధకుడు బ్రహ్మరంద్రం వద్ద వుండే సహస్త్రారచక్రంపై తన మూలమును తిరిగి పొందడానికి కేంద్రీకరించవలసి వుంటుంది. శరీరాన్ని సృష్టించిన తరువాత ప్రాణ శక్తి మూలాధార చక్రం వద్ద పాము చుట్టుకున్నట్టు చుట్టుకుని వుంటుంది. అదే కుండలిపి శక్తి.......
    "ఆ శక్తి వెన్నుముక మధ్యలో వున్న సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్ళి సహస్రారచక్రం వద్దకు చేరుకున్నప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. సహస్రారం పై మనసును కేంద్రీకరిస్తే సమాధి స్థితిలోని అనందానుభూతిని పొందవచ్చు. అప్పుడు యోగి సమాధి నుంచి మేలుకోనక తప్పదు. జీవనాడి సుషుమ్న యొక్క కొనసాగింపు మాత్రమే నని శ్రీ రమణ మహర్షి చెప్పారు కూడా. శిశువు జన్మించే సమయంలో ప్రాణశక్తి యొక్క ఆరో ముఖ ప్రయాణం , కుండలినీ శక్తి దాని ఊర్ధ్వముఖ ప్రయాణం.....ఇదే కుండలినీ శక్తి యొక్క రహస్యం!
    "కుండలినీ శక్తి ఎగువకు ప్రయాణం ప్రారంభించినప్పుడు కుండలిని మేల్కొన్నారని చెబుతారు. క్రమబద్దంగా దీర్ఘకాలం మనసును కేంద్రీకరించడం ద్వారా ఈ శక్తి మేలుకోలపబడుతున్నది. అయితే ఇది జరగడం బహు అరుదు. సాధకుడు ఇందులో కృతకృత్యుడు అయినా తరచు అతను ప్రమాదకర పరిస్థితులలో తనకు తానుగా చిక్కుకుంటాడు. మేలుకున్న కుండలినీ శక్తి వలన సాధకుడు నివ్వెరపోతాడు. భయబ్రాంతుడవుతాడు కూడా.
    'అయితే కుండలినీ శక్తి మానవునిలోని దివ్యాగ్నికణం ........అది మానవునిలో వున్న జీవాత్మలో అంతర్భాగం.......కుండలిని దివ్య మాతృశక్తి ........కన్నతల్లిని మించిన వాత్సల్యంతో అది వ్యక్తిని కాపాడుతున్నది. కార్యరూపంలో వున్న కుండలిని యోగ శాస్త్రంలో క్రియా యోగం అంటారు. సంక్షిప్తంగా కుండలినీ శక్తి అంటే ఇదే......కలెక్టర్ గారికి కుండలిని పై వున్న సందేహాలన్నీ తొలగిపోయి వుంటాయనుకుంటాను.....చివరగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను....
    ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తీ తన కర్యవ్యాన్ని ఎన్నడూ ఉపేక్షించడు. అతను తన విద్యుత్త ధర్మాన్ని ధర్మం కొరకే నిర్వహిస్తాడు. అందులో అతను ఆశించేది ఏదీ వుండదు. తను గెలుపొందినా , ఓడిపోయినా అతనికి ఒకటే.....గెలుపు అతనికి సంతోషాన్ని ఇవ్వదు. ఓటమి విచారాన్ని కలిగించదు. భగవద్గీతలో అలాంటి వ్యక్తిని చక్కగా వర్ణించారు.
    ".... 'యోగులు ఫలాసక్తిని విడచి దేహము, మనసు, బుద్ది ఇంద్రియాములు మొదలగువాణి ద్వారా ఆత్మశుద్ధి నిమిత్తమై కర్మలను చేయు చున్నారు...' అలానే బైబిల్ లోని 'ఐ యామ్ దట్ ఐ యామ్ '.....హిందూ మాట గ్రంధాలలోని 'అహం బ్రహ్మస్మి'......'సోహమస్మి'.....అనే సూక్తులకు సజీవ ప్రతిబింబం ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తీ....." చెప్పడం ముగించి తన ఆసనంలో కూర్చున్నాడు విష్ణు.
    భక్త జన సందోహం కరతాళధ్వనులతో మిన్నుముట్టిపోయింది.
    వేదికపై నున్న కలెక్టర్ ధీరజ గంభీరతను చూసిన కిరణ్మయి ఆలోచనలో పడింది......
    కనకదుర్గ గుడి వద్దకు వెళ్ళిన ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ అప్పుడే తిరిగి రావడం గమనించిన విష్ణు అతనిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు.
    నడవడానికి సయితం శక్తి లేనట్టు నీరసంగా విష్ణును సమీపించాడతను.
    "ఏం జరిగింది ఇన్ స్పెక్టర్ ......అలా వున్నారు?"
    "మీరు చెప్పినట్టే కనకదుర్గ సాక్షిగా ఆరు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. తన బీదరికాన్ని తట్టుకోలేని ఒక ఇల్లాలు తన ఐదుగురు ఆడపిల్లలతో కలిసి తనూ ఇంద్రకీలాద్రి పర్వతం పైనుంచి దూకి బలస్మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించింది. ఏదో ఉపద్రవం జరగబోతుందని మీరు ముందే గ్రహించి చెప్పినా ఆ ఘోరన్న్జి ఆపలేకపోయాను.నేను ఇంద్రకీలాద్రి చేరేలోపే ఘోరం జరిగిపోయింది. వాళ్ళను రక్షించలేకపోయాను" అని చెప్పి వేదికపై నుంచి దిగి వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra