Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 31

      ఇబ్బందిగా నవ్వింది ఆమె. ఆమెకి గుర్తు రాలేదని అర్ధమైపోతూనే వుంది. ఇలాంటి ఉపకారాలు ఎంతమందికి, ఎన్నిశ్రాలు చేసిందో ఆమె. "ఫలానా రోజున చంద్రోదయం చాలా బాగుంది. నాకు గుర్తుండిపోయింది, నీకు గుర్తుందా!" అని చందమామని ప్రశ్నిస్తే ఎలా వుంటుంది? ఎన్నెన్నో చంద్రోదయాలు! ఎంతో మందికి వెలుగునివ్వడం! దాదాపు నిత్యకృత్యం అది చందమామకు.    
    అలాంటిదే డాక్టర్ మృదుల కూడా! చేసిన ప్రతి పరోపకారాన్నీ డైరీ రాసి పెట్టుకునే మనస్తత్వం కాదు ఆమెది.    
    ఆమెకి తనెవరో గుర్తు తేవడానికి మరికొంత విఫలప్రయత్నం చేశాడు బాలు.    
    సహనంగా విని, "బాబు బాగున్నాడా?" అందామె అసలు సంగతి చెప్పమన్నట్లు సూచిస్తూ.    
    "పిల్లాడు బాగానే వున్నడు డాక్టర్! తల్లే".    
    వెంటనే ఆమె మొహం అటెంటివ్ గా అయిపోయింది.    
    "ఏమైంది తల్లికి?"

    సంకోచంగా అరచేతులవైపు చూసుకున్నాడు బాలు.    
    "చెప్పండి ఫర్వాలేదు" అంది డాక్టర్ అతనికి ధైర్యం చెపుతూ.    
    "పుట్టిన బాబు... బాబు.... నాకొడుకేనో కాదో నిర్ధారణ చేసుకోవాలి డాక్టర్".    
    నిశ్చలంగా అతనివేపు చూసింది డాక్టర్ మృదుల.    
    "అసలు ఎందుకొచ్చింది అలాంటి అనుమానం?"    
    "నా కారణాలు నాకున్నాయ్! దయచేసి, ఈ విషయం నిర్ధారించగలరా డాక్టర్! ఇది అత్యవసరం!"    
    మాట్లాడకుండా చేతిలోని పెన్ టార్చ్ ని చూస్తూ వుండి పోయింది డాక్టర్ మృదుల కాసేపు.    
    "అసలు అలా నిర్ధారణ చెయ్యడం వీలుకాదా డాక్టర్? ఈజ్ ఇట్ ఇంపాజిబుల్?"    
    "వెల్!" అంది డాక్టర్ మృదుల. "కొన్ని కేసుల్లో, ఐ రిపీట్, కొన్ని కేసుల్లో మాత్రమే రక్తం గ్రూపుని పరీక్షించి తండ్రి ఫలానా మనిషి అవునా కాదా అని చెప్పటానికి వీలౌతుంది".    
    బాలూకి గుండె వణుకుతున్న అనుభూతి కలుగుతోంది. చెవులు అప్పగించి వింటున్నాడు.    
    "ఉదాహరణకి, తల్లితండ్రులు యిద్దరిదీ ఓ-టైపు బ్లడ్ గ్రూపు అయితే, పిల్లలకి కూడా ఓ - టైపు బ్లడ్ వస్తుంది. తల్లితండ్రులలో ఒకరిది ఓ-తైపూ, ఒకరిది ఏ-టైపు బ్లడ్ అయితే పిల్లలకి ఏ-టైపు రక్తమే వస్తుంది. ఎందుకంటే ఓ-టైపు కంటే, ఏ-టైపు ఆధిక్యత కలది. అలాగే బి-టైపు రక్తం కూడా ఓ-కంటే డామినేటింగ్ గా వుంటుంది.    
    "ఓ-టైపు బ్లడ్ వున్న ఒక తల్లి బి-టైపు రక్తం వున్న శిశువుకి జన్మయిస్తే, ఆ తండ్రి "బి" తిపుకి చెందినవాడై వుండాలి. ఉదాహరణకి ఆ తండ్రిది ఏ-టైపు రక్తమో, ఓ-టైపు రక్తమో అయితే నిశ్చయంగా ఆ శిశువు అతనికి పుట్టినది కాదన్న మాట. అయితే, ఈ పరీక్ష కేసుని నెగటివ్ గా ఫ్రూవ్ చేయడానికి మాత్రమే పనికివస్తుంది. పాజిటివ్ గా ఫ్రూవ్ చెయ్యడానికి ఉపయోగపడదు."    
    "అంటే?"    
    "సపోజ్  ఆ స్త్రీ భర్తకూడా బి-టైపు రక్తం కలవాడనుకుందాం. అప్పుడు కేసుని ఎటూ ఇతమిద్దంగా తేల్చి చెప్పలేం. ఆ శిశువు అతని సంతానమే కావచ్చు లేదా అంకెవరన్నా బి-టైపు రక్తంగల పురుషుడి సంతానం కావచ్చు లేదా "ఏ" ఏ బి టైపు రక్తంగల మగవాడికి పుట్టినదైనా కావచ్చు. అందుకనే చెబుతున్నాను. ఫలాని శిశువు ఫలాని పురుషుడి సంతానం కాదు అని తేల్చడానికి మాత్రమే పనికివస్తుంది ఈ పరీక్ష అంతేగానీ, దీని వల్ల ఫలాని శిశువు ఫలాని పురుషుడి సంతానం అని మాత్రం ఖండితంగా చెప్పలేం"    
    కాసేపు మౌనంగా వుండి అన్నాడు బాలూ.    
    "ఓ.కే డాక్టర్, లెట్ మీట్రై మై లక్".    
    "వెల్! అందుకోసం మీ ముగ్గురి రక్తం పరీక్ష చెయ్యాలి".    
    కనుబొమలు ముడేసి ఆలోచించాడు బాలూ.    
    గుర్రాన్ని నీటి దగ్గరికి అతికష్టంమీద లాక్కెళ్ళవచ్చు గానీ బలవంతంగా దానిచేత నీళ్ళు మాత్రం తాగించలేం- అన్న నానుడి గుర్తొచ్చింది అతనికి.    
    సౌదామినికి బ్లడ్ టెస్ట్ చేయించటం మాట అటుంచి డాక్టరు దగ్గరికి తీసుకురావడం కూడా దాదాపు అసంభవమే!    
    అసలు ఏం కారణం చెబుతాడు తను. నిక్షేపంలా ఉన్న మనిషిని పట్టుకుని "పద! వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంధువుగాని!" అంటే ఎంత అసహజంగా వుంటుంది. తను అలా అంటే విని ఊరుకునే మనిషి కాదు సౌదామిని. "అలానా! వచ్చేటప్పుడు సరదాగా ఆపరేషన్ కూడా ఏదన్నా చేయించుకు రానా! చాల్లెండి మీ వాగుడూ మీరూనూ".    
    లేదా తన మనుస్లోని ఉద్దేస్యనని కనిపెట్టేసి ముభావంగా "మి యిష్టం" అనగలదు అగ్ని పరీక్షకైనా నేను సిద్దం అన్నట్లు తను పరమ దగుల్భాజీలాగా ఫీలవవలసి వస్తుంది అప్పుడు.    
    అదీకాకపోతే తను అనుమానపడినందుకు ఆమె అవమానం ఫీలై ఏదైనా అఘాయిత్యం తలపెట్టవచ్చు.    
    ఇంకో విధంగా ఆలోచిస్తే తను ఆ మాట అనగానే నోటిమాట రాగానే కాళ్ళమీదకు జారిపోయి తన అనుమానాన్ని అప్పుడే అక్కడే రుజువు చేసేస్తూ తప్పు ఒప్పేసుకోవచ్చు.    
    లేదా...    
    ఆలోచనల వేడికి మెదడు కరిగిపోయి కళ్ళలో నుంచీ, చెవులలో నుంచీ కారిపోతుందేమోనని భయం వేసింది అతనికి.    
    ఆమెకి రక్తపరీక్ష చేయించాలి.    
    అంత  పెద్ద సమస్య గోటితో  తీసేసినట్లు తీరిపోతుందని అతను ఊహించలేదు అప్పుడు.    
    నర్సింగ్ హోం నుండి యింటికి తిరిగి వచ్చేశాడు బాలూ రాయిలా తిరుగుతున్న ఎదురింటి ముసలాయన ఖాయిలా పడ్డాడు ఒక రోజున. చిన్న యాక్సిడెంట్ అయింది ఆయనకి. ఆయన నాలుగు రోజులకి ఒకసారి గడ్డం చేసుకుంటాడు. ఎడమ చెంపమీద చిన్న కణితిలాంటిది వుంది ఆయనకు. పటుత్వం తప్పిన చేతులతో గెడ్డం చేసుకుంటూ ఉంటే ఆ కణితిలాంటిది వుంది ఆయనకు. పటుత్వం తప్పిన చేతులతో గెడ్డం చేసుకుంటూ ఉంటే ఆ కణితికి రేజరు తగిలి లోతుగా గాయమయింది. ధారగా కారిపోయింది రక్తం చాలా రక్తం పోయినందువల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయాడు.    
    జానకి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఆ వార్త. ఆమె ఎంత దుఃఖంలో ఉందంటే చీర వధులైపోయి సగం వూడిపోయినట్లు కూడా గమనించలేదు.    
    చెప్పులు కూడా వేసుకోకుండా హడావిడిగా ఎదురింటికి వెళ్ళిపోయాడు బాలూ. అతని వెనకనే ఆసెయ్య వచ్చాడు. ముసలాయన మొహం అంతా రక్తంతో తడిసి ఎర్రగా భయంకరంగా కనబడుతోంది.    
    ఆసెయ్య సాయంతో ఆయన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చోబెట్టాడు బాలూ. వెనక సీట్లో జానకి కూర్చుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది తను ఆమెకి సాయంగా ఉండడానికి సౌదామిని కూడా వచ్చి కారెక్కింది బాబుతో సహా.    
    కారు పరుగెత్తి డాక్టర్ మృదుల నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. వెంటనే ఆయన్ని అటెండ్ అవటం మొదలు పెట్టింది డాక్టర్ మృదుల.    
    ముసలాయన చాలా బలహీనంగా వున్నాడు. రక్తం ధారాళంగా కారిపోయింది.    
    "వెంటనే రక్తం ఎక్కించాలి. ఆయన గ్రూపు రక్తం మా దగ్గర రెడీగా లేదు. మీరెవరైనా డొనేట్ చేస్తారా" అంది మృదుల.    
    "తప్పకుండా డాక్టర్! అన్నాడు బాలూ.    
    "ముందర మీ బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చెయ్యాలి ఇటు రండి" అంది ఆమె లోపలికి దారితీస్తూ.    
    బాలూ రక్తం, సౌదామిని రక్తం కూడా ఆయనకు సూటయ్యే గ్రూపు కాదని తేలింది. హడావిడిగా ఇంకో నర్సింగ్ హోమ్ కి ఫోన్ చేసి కావలసిన బ్లడ్ తెప్పించింది మృదుల.    
    మొత్తానికి ముసలాయన గండం గడిచి బయటపడ్డాడు.    
    ఆ రోజంతా తన సొంత ప్రాబ్లమ్ గురించి మర్చిపోయాడు బాలూ. సాయంత్రం బిల్లు చెల్లించి వెళ్ళబోతూ వుండగా అతన్ని వెనక్కి పిలిచింది మృదుల.    
    "అనుకోకుండా మీ యిద్దరి గ్రూప్స్ చెక్ చెయ్యటం జరిగింది ఇవాళ. దానితోబాటు పనిలో పనిగా మీ బాబు బ్లడ్ కూడా పరీక్షించాను".    
    హఠాత్తుగా ఆగిపోయి, మరణశిక్ష కోసం ఎదురుచూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలూ. రిజల్టు చెప్పటం మొదలు పెట్టింది డాక్టర్ మృదుల.    
    "మీ బ్లడ్ గ్రూప్ 'ఏ', మీ భార్య బ్లడ్ గ్రూప్ 'ఓ' ఆ విధంగా మీ పిల్లవాడి బ్లడ్ గ్రూప్ 'ఏ' అయితీరాలి. కానీ..."    
    "కానీ..."    
    "కానీ... మీ వాడి బ్లడ్ గ్రూప్ 'బి'. "ఆమె చెప్పటం పూర్తిచేసింది.    
    అనెషిస్తీయా యివ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధతో కూడిన షాక్ తగిలింది బాలూకి ఆ మాటలు వినగానే.    
    బాబు తన కొడుకు కాదు! తన రక్తం పంచుకు పుట్టిన వాడుకాదు. ఉన్న ఒక్క ఆశపోయి, తప్పు నిర్ధారణ అయిపోయింది తనకన్నా ముందు- తన భార్యతో సంబంధం వున్నవాడు...    
    ...ఆంజనేయులు!!    
    సందేహం లేదు వాడే దీనికి కారణం. మరో విధంగా జరిగి వుండటానికి వీల్లేదు.    
    రెండున్నర సంవత్సరాల క్రితం సౌదామిని తనతోబాటు ఆశ్రమం వదిలి వచ్చేస్తూ వుంటే ఆమెతో ఆంజనేయులు అన్న మాటలు మళ్ళీ గుర్తుకువచ్చాయి.    
    "ఆర్నెల్ల తర్వాత నిన్ను ఒకసారి కలిసి మాట్లాడతాను సౌదామినీ! పర్మిషనివ్వు!"    
    సో.. కోట వదిలేనాటికే సౌదామిని మూడో నెల అయివుండాలి. అయివుండాలేమిటి! మూడో నెలే.    
    ఇప్పుడర్ధమవుతోంది-ఆరునెలల్లోనే పుట్టిన పిల్లాడు అర్భకుడిలా కాకుండా అదరగండంల ఎలా పుట్టాడో!    
    పిల్లాడు తన రక్తం పంచుకు పుట్టినవాడు కాదని రూఢి అయిపోయాక రక్తం సలసల మరిగిపోతున్నట్లు అనిపించింది బాలూకి.    
    ఇప్పుడేం చెయ్యాలి తను?    
    తనకు ఇంత ద్రోహం చేసిన సౌదామినికి ఎలాంటి శిక్ష విధించాలి. అతడు ఆవేశంతో వూగిపోతున్నాడు.    
    అది గమనించి - "చూడండి" అంది డాక్టర్ మృదుల చాలా మృదువుగా "టూ ఎర్ర్ ఈజ్ హ్యూమన్ - అన్నారు. తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పుని కప్పిపుచ్చి ఒప్పుగా చెలామణి చెయ్యడం కూడా అందరూ చేస్తుండే పనే. సంతానం కలగక పిల్లల కోసం తపించిపోయే దంపతుల్లో భర్త, ఎవరో గుర్తు తెలియని "దాత" తాలూకు వీర్యంతో, ఆర్టిఫీషియల్ ఇన్ సెమినేషన్ ద్వారా తన గర్భం ధరించటానికి కూడా అంగీకరిస్తున్న రోజులివి. మీది అలాంటి కేసే అనుకుని రాజీపడి పోవటం ఉత్తమం. ఏమంటారు?"

 Previous Page Next Page