Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

 

     ఫోను గబగబ మోగింది   

    'నువ్వు తియ్యి నాకోసం అడిగితే ఎవరైనా లేననిచెప్పు' నీరజ ఫోను తీసుకుంది.
   
    "ఓ - శారదానువ్వా. అదేమిటీ దినేష్ రాలేదింకా నువ్వెప్పుడొచ్చావ్
   
    "దినేష్ రాలేదా"
   
    "రాలేదు - నాకు ఖంగారుగావుంది. అసలు మీ ఊరినించి వచ్చాడా"
   
    "అదేమిటి - నన్ను హోటల్ దగ్గర దింపి వెళ్ళాడు" శారద గొంతులో ఖంగారు.
   
    "వస్తాడులే - రాకేం చేస్తాడు. దినేష్ వస్తే ఫోను చేస్తానులే "పెట్టేసింది ఫోను నీరజ.
   
    హలో, హలో, హలో - శారద కాళ్ళీడ్చుకుంటో ఇంట్లోకొచ్చింది దగ్గరలో వున్న సూపర్ బజారునించి ఫోను చేసింది - దినేష్ రాలేదు ఎక్కడి కెళ్ళినట్టు -
   
    లలిత యింటి నుంచి వచ్చిన వేంకటేశు తండ్రి దగ్గర కెళ్ళాడు 'నాన్నగారూ, మీరు పిన్ని వెళ్ళిపొండి. నేను నాలుగురోజులుండి వస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడవలసిన పనులుచాలా వున్నాయి. వీలయితే రామంతో మాట్లాడుదామనుకుంటున్నాను 'వేంకటేశు గొంతువిని గదిలోంచి వచ్చింది శారద. వెంటనే మాటమార్చేశాడు "నాన్నగారూ, పిన్నివెళ్ళిపోతానంటున్నారు. పంపించేస్తాను" "నాకూ సెలవలయిపోయింది నేను రేపటి నుంచి డ్యూటీలో చేరాలి" అంది శారద.
   
    "మరినువ్వెప్పుడొస్తావురా" రాజారావు విసుగ్గా అన్నాడు ఇక్కడికి వచ్చి చేసిందేమిటి ? శారదని ఒక్క విషయం అడగలేదు - ఉద్యోగం మానేయమని చెప్పనేలేదు - ఈ విడాకులగొడవ అయ్యాక ఏం చేస్తావు అని అడగలేదు - ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోవడమేమిటీ -
   
    "నేను రాను, నువ్వు పిన్ని వెళ్ళండి - నా బతుకు నన్ను బతకనీయండి "శారద అరిచింది. వేంకటేశు ఓర్పు అయిపోయింది - 'ఏమిటీ వాగుతున్నావ్ - నీ బతుకు నువ్వు బతుకుతావా - నీకు బతకటం వచ్చా - నీ కొస్తే మేమంతా ఎందుకిక్కడ - ఎవడిని నమ్మాలో, ఎవడిని నమ్మకూడదో తెలియని ఆడపిల్లవి - ముందు చూపు లేకుండా లక్షణమైన కాపురాన్ని కూలగొట్టుకున్న తెలివిలేని దానివి నువ్వు - నీ బతుకు నువ్వు బతుకుతుంటే, మేము చూస్తూ ఊరుకోవాలా - చెప్పు, నాకు చెప్పు" - వేంకటేశు వీరావేశంతో కేకలేశాడు.
   
    "నీకు నేను సమాధానం చెప్పక్కర్లేదు -మీరంతా ఇక్కడ నుంచి వెడితే చాలు" -
   
    "ఉండటానికొచ్చామా - వెడుతాం తల్లీ - బావుందే అమ్మా - ఆడపిల్ల ఆడలక్షణం లేకుండానూ" రాజమ్మ పిన్ని దీర్ఘం తీసింది. "ఊరుకోవమ్మా రాజారావు రాజమ్మతో అన్నాడు. అమ్మా శారదా నువ్వేమంటావు. ఇక్కడే ఒక్కర్తివీ ఉద్యోగం చేసుకుంటూ పడివుంటానంటావు - ఒంటరి ఆడపిల్ల, ఇలావుంటే ఎంత ప్రమాదమో తెలుసా - న ఆమాట విను తల్లి - నేను నీ తండ్రిని - నేను బతికున్నంత వరకు నీ బాధ్యత నాకు తప్పదు రాజారావు శారదని బతిమాలు తున్నాడు.
   
    "నేనేమో రామాన్ని కలిసి ఏదో బతిమాలి, కాళ్ళు పట్టుకుని, కాంప్రమైజ్ పిటీషన్ నీచేత వేయించి ఎలాగో ఈ కాపురం చక్కదిద్దాలని చూస్తుంటే, నువ్వేమో మామాట వినవేం". వేంకటేశు చెల్లెలి చెయ్యి పట్టుకుని కూచో పెట్టాడు "ఏమిటీ కాంప్రమైజ్ పిటీషన్ - రామంతో కలసి మళ్ళీ కాపురం చేయాలా - మీ అందరికీ పిచ్చిపుట్టింది - రామానికి నాకూ కుదరదు, కుదరదు.
   
    గుండె గట్టి చేసుకుని వినండి' శారద అందరివైపుచూసింది.       
   
    'అంటీ పోను' - మేడమీద నుంచి కేక వినబడింది. గబగబా పరిగెత్తింది శారద.
   
    'ఆ చెప్పు తొందరగా వచ్చాడా".
   
    'ఏం చెప్పాడూ'
   
    అన్ని విషయాలు - దుర్గకొండ"
   
    "చెప్పాడా నేను సాయంత్రంరానా"-
   
    "వద్దు మూడు రోజులు వాళ్ళ అన్న దగ్గర కెళ్ళి వస్తాడుట. తర్వాత బొంబాయి ప్రయాణం. బహుశా ఆరోతారీఖున" -
   
    "ఆరోతారీఖు -నేను ఈ మూడు రోజుల్లో అన్నీ సద్దుకుంటా సరేనా"
   
    "సరే -బెస్ట్ ఆఫ్ లక్ - పెట్టేస్తున్నా" - నీరజ ఫోను పెట్టేసింది - నీరజ పక్కనున్న దినేష్ హాయిగా ఊపిరిపీల్చుకున్నాడు.....
   
    "ఎవరే ఫోను చిన్నన్నయ్యా" అన్నాడు తండ్రి శారదను చూస్తూ.
   
    'నాకులెండి - శారద వంటింట్లోకెళ్ళి మంచినీళ్ళు తాగింది.

    "అమ్మా - డబ్బు జాగ్రత్తగా దా చావా' రాజారావుకి సడెన్ గా గుర్తొచ్చింది. కొబ్బరి తోటలమ్మగా వచ్చిన డబ్బు తనది కొంత ఫిక్సెడ్ లో వేసుకుని, కొంత శారదకిచ్చాడు, ఇక్కడ ఒక్క చిన్న ఫ్లాట్ కొని పెట్టమని ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది.
   
    "నాన్నగారూ మీరిచ్చిన మూడు లక్షలతో ఇక్కడ ప్లాటు రాదు - కానీ ఆ మూడు లక్షలు షేర్స్ కొంటె ఆ కంపెనీకి లాభాలొస్తాయి. మనమూడు లక్షలు మూడుకోట్లవుతాయి.
   
    "ఏమిటీ - షేర్స్ కొంటావా" వేంకటేశు అరిచాడు.
   
    "ఏంకొంటే - మీరందరూ కొనగాలేంది నేనుకొంటే తప్పా అయినా ఏదైనా ధైర్యంగా ఒకపని చేయాలంటే ఊరికే భయపడిపోతావే - శారదకి ఇందాకటి ఫోనుకాలు చాలా ఆనందపరిచింది - అయితే అది ఎవరితోనూ చెప్పుకోటానికి వీల్లేదు. లలితతో చెప్తే - హమ్మో లలితతోనా అది అన్నయ్యకి చెప్తుంది. అన్నయ్య నాన్నకి చెప్తాడు. అంతా కలసి తన కాళ్ళుచేతులు కట్టేసి నరసాపురం తీసుకుపోతారు. అందుకే పని అయేవరకూ ఎవరికీ చెప్పకూడదు - తనకింత అదృష్టమా అని వదినలు దిష్టికొడుతారు కూడా.
   
    'నిన్ను కన్న తండ్రి - నీతో బుట్టువు అన్న కన్నా శ్రేయోభిలాషులు వుండరు కదా ఈ లోకంలో - వాళ్ళదగ్గర రహస్యాలేమిటి - నువ్వు చెప్పదల్చుకున్నదేమిటో చెప్పు" -వేంకటేశు చెల్లెలివంక చూసాడు.
   
    'ఇప్పుడు చెప్పను -నామనసు కాస్త కుదుటపడనీ. రాత్రి చెప్తాను" శారద రివ్వున లోపలకెళ్ళి తలుపేసుకుంది. వేంకటేశు తిన్నగా బస్ స్టాండు కెళ్ళాడు. రెండురోజులవరకూ టిక్కట్లులేవు - తను రిజర్వేషన్ లేక పోయినా వెళ్ళిపోగలడు - కానీ నాన్నకి, పిన్నికి కుదరదు.
   
    బస్ స్టాండు నుంచి వస్తున్న వేంకటేశు రామం, ఆటోని ఒక్కసారిగా ఆపాడు. వాళ్ళిద్దరూ - ఎవరూ - రామం, లలిత -
   
    'హలో ఎక్కడ నుంచి' ఆటోదిగాడు వేంకటేశు.
   
    'మీరు రమ్మన్నారని చెప్పాను' అంది లలిత.
   
    'నేనే వస్తానుగా ఆయన్ని ఇబ్బంది పెట్టడమేమిటీ - రండి వెడదాం, ఆటోలో రామం, లలిత, వేంకటేశు కూర్చున్నారు.
   
    వేంకటేశు చెల్లెలి కాంప్రమేజ్ పిటీషన్ గురించి లలితతో అని వెళ్ళాక, లలిత ఆ విషయం రామంతో చెప్పింది. నిజానికి విడాకులకు పడేసింది శారదే రామం మనుష్యుల మనస్తత్వాన్ని తేలిగ్గా అర్ధం చేసుకోగలడు - పైగా శారదని తను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు - తనకాపురం కుదుటపడితే తనకేం అభ్యంతరం లేదు. శారద ఒప్పుకుంటుందా! వాళ్ళ అన్న ఒప్పించగలడా - ఇదేనిజమైతే మళ్ళా తన జీవితం కొత్తగా ప్రారంభించాలి. మళ్ళీ వసంతం రావాలితన బతుకులో - అమ్మను తెచ్చి తన దగ్గర పెట్టుకోవాలి. గాయత్రి మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలి - తను ఇలా ఆటోలోవస్తే అన్నతో కలసి, శారద లోనికి రానిస్తుందో, గెట్ అవుట్ అంటుందో - లలిత నేను ఇలా రావటం బాగుండదు - మనందరం ఈ దగ్గర్లో హోటల్లో మాట్లాడుకుందాం" అంటూ - రామం ఆటోదిగాడు. అది బాగానేవుందనిపించింది వేంకటేశుకి పైగా శారద చాలా తిక్కది. ఇంటికొచ్చిన వ్యక్తిని అగౌరవపరిస్తే బాగుండదు -మళ్ళీ ఒక్కసారి చెల్లెల్నీ ఒప్పించే ప్రయత్నం చేయచ్చని, అనుకుంటూ ఒక్కడూ ఆటోలో ఇంటికొచ్చాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra