Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

 

      ఆమెకేదో అనుమానం వచ్చి తలుపు సందుల్లోంచి చూసింది.
   
    "రా...జి.. రాజీ! రాజీ..."
   
    అదంతా కలకాదని, తను విన్నది నిజమేనని తనను తాను నమ్మించుకోవడానికి చాలాసేపు పట్టిందామెకు. లోపల తన చెల్లెలుంది! 'మోహన్ గుర్తుపడతాడా' అన్న అమాయకత్వపు చెల్లెలు... ఇంటర్మీడియట్ చదువుతున్న చె....ల్లె...లు.
   
    ఆ అమ్మాయి బయటకు వస్తున్న సవ్వడి వినిపించగానే పక్కకు తప్పుకుంది.
   
    ఆకాశం పగల్లేదు భూమి ఆగలేదు. అంతా మామూలుగానే ఉంది. గుండెల్లో పేలే అగ్నిపర్వతాలే మిగిలాయి.
   
    తను తప్ప మిగతా ప్రపంచమంతా లౌక్యంతో సంతోషంగా వుంది. తను మాత్రం...
   
    "వచ్చేశావా? ప్రాక్టికల్స్ బాగా చేశావు గదూ?" ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మోహన్. రాధ అతడి మొహంలోకి చూసింది. అతడి సంతోషం నటనలా అనిపించలేదు.
   
    "ఏమిటి అలా చూస్తూన్నావ్? అమ్మ ఏమందోనని ఆలోచిస్తున్నావా? నేను చెప్పానుగా నేను చెపుతే అర్ధం చేసుకుంటుందని, నిన్నోసారి తీసుకురమ్మంది".
   
    "ఏమంటుంది రాజీ?" అతడి నుంచి దూరంగా జరుగుతూ అడిగింది.
   
    "నువ్వు చూశావా ఆమెను?" అడిగాడు మెల్లిగా.
   
    ఆమె మాట్లాడలేదు.
   
    "సారీ రాధా! నీ మనసు కష్టపెట్టుకుంటావని నీకు చెప్పడానికి సందేహించాను. రాజీకి, నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఒక పిచ్చిది. అప్పుడప్పుడు నా గదికి వచ్చేసేది. ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. ఆమెను వదుల్చుకోవడానికి వేరే మార్గంలేక మాట్లాడేవాడిని. లేపోతే నేనేదో చేశానని అందరికీ చెపుతానని బెదిరించేది. నేను ఒప్పుకోకపోతే అంతపనీ చేసేదే. నన్ను నమ్ము నీ పరిచయం కలిగాక ఆమెను సాధ్యమయినంత దూరంగానే వుంచుతున్నాను. అయినా అప్పుడప్పుడు ఇలా వస్తుంటుంది ఇవ్వాళ మాత్రం యిక రావద్దని చెప్పి పంపేశాను. నువ్వు వినే వుంటావు".
   
    ఆమెకు నవ్వుతో కూడిన దుఃఖం గుండెల్నిండా నిండింది.
   
    "నన్ను క్షమించు రాధా! కాని నా మాట నమ్ము. అదంతా జరిగిపోయిన విషయం. ఇంకెప్పుడూ పొరపాట్లు జరగవు. నన్ను నమ్ము" ఆమెవంక దీనంగా చూస్తూ అన్నాడు.
   
    రాధ మాట్లాడలేదు. తన శరీరం అర్పించుకున్న మొదటి వ్యక్తిగా అతడే తన భర్త అనుకుంది. కాని మోహన్ కు తను మొదటి స్త్రీ కాదు.

    "నన్ను క్షమించలేకపోతున్నావా రాధా? నన్ను నమ్మలేవా?" అంటూ వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. రాధ తలెత్తి అతడి మొహంలోకి చూసింది. అతడి కళ్ళల్లో ఆవేదన, అర్దింపు.
   
    మెల్లగా అతడి చేతుల్లో వాలిపోయింది రాధ.
   
    స్త్రీ కదా.
   
                                 3
   
    ఆ తర్వాత నాలుగు రోజులపాటు మోహన్ ఇంట్లోనే వుండిపోయాడు. క్షణంకూడా విడవకుండా మర్చిపోయేలా చేయగలిగాడు.
   
    ఆ నాలుగురోజులకే వాళ్ళు "హనీమూన్" అని పేరు పెట్టుకున్నారు. అది కేవలం రెండు గదుల యిల్లే కావచ్చు. కాని ఆ చిన్న కుటీరం కేవలం తమ ఇద్దరిదే. అదే స్వర్గం. ఆ పిచ్చి మొక్కలే నందనవనంగా మలచుకునే మనసు ఇద్దరిలో వుంది.
   
    కాని రాధ పొరపడింది ఒక్క విషయంలో ఆ ఇల్లు కేవలం తమ ఇద్దరిదే అనుకోవడంలో ఆ ఇంటి మూడో వ్యక్తి అత్తగారు.
   
                       *    *    *


    "ఏమిటంత హుషారుగా ఉన్నావ్! మీ వాళ్ళెవరయినా కనిపించి పలకరించారా?" అడిగాడు మోహన్ రాధ అందించిణ కాఫీ కప్పు అందుకుంటూ.
   
    ఉత్సాహంగా వచ్చిన రాధ మొహం ఆ ప్రశ్నతో మ్లానమయింది. పెళ్ళయి నెలరోజులు కావచ్చింది. అమ్మా, నాన్న ఈపాటికి మనసు కుదుట పరచుకుని వచ్చి ఆహ్వానిస్తారన్న ఆశ అడుగంటిపోయింది. వాళ్ళ విషయం ఏదీ తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది.
   
    "రాధా" మోహన్ పిలిచాడు ఆర్తిగా. "పోనీలే వాళ్ళ గురించి బాధపడకు. ఇవ్వాళ కాకపోతే కొన్నాళ్ళకయినా మన ప్రేమను గుర్తిస్తారని నాకు నమ్మకం వుంది. అంతవరకూ యెదురుచూద్దాం" అన్నాడు అనునయంగా.
   
    తను బాధపడడం అతడు గమనించాడనుకోగానే సిగ్గుపడింది రాధ.
   
    "అసలు విషయం చెప్పనివ్వవేం? నాకు ఉద్యోగం దొరికింది" అంది హుషారుగా.
   
    'ఉద్యోగమా? ఎక్కడ?" ఆశ్చర్యంగా అడిగాడు.
   
    "ఆ మధ్య పేపర్లో పడితే చూసి అప్లై చేశాను. ఈ రోజు ఇంటర్వ్యూకి రమ్మని కార్డు వచ్చింది. వెళ్ళాను వెంటనే జాయినవ్వమన్నారు నెలకు రెండువందల యాభై ఇస్తారు".
   
    "అప్పుడే ఉద్యోగం దేనికి రాధా! నీ రిజల్ట్సు రానీ, మంచి ఉద్యోగమే దొరకవచ్చు. ఈ చిన్న జీతానికి పొద్దుటినుండి సాయంత్రందాకా గొడ్డుచాకిరీ చేయిస్తారు. ప్రైవేట్ ఫర్మ్స్ సంగతి నీకు తెలియదు".
   
    "పెళ్ళయిన మరుక్షణం నుంచీ నీ కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాను మోహన్. రిజల్స్టు వచ్చి మంచి ఉద్యోగం దొరకడానికి ఎన్నాళ్ళు పడుతుందో.....అప్పటివరకు నన్ను వూరికే కూర్చోమనకు. కనీసం నాకు కొంత అనుభవం వస్తుంది. ప్లీజ్ నన్ను కాదనకు" అంది రాధ.
   
    "సరే నీ ఇష్టం నీ మనసు నొప్పించడం నా అభిమతం కాదు కాని నీకేమాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే మానేయాలి. నాకు చెప్పడానికి సిగ్గుపడకు".
   
    "అలాగే! రేపే జాయినవుతాను" ఉత్సాహంగా అంది రాధ.
   
                             *    *    *
   
    అనూరాధ జీవితంలో సంపాదనాపర్వం  ప్రారంభమయింది.
   
    బయట ప్రపంచంలో పురుషాధిక్యతతో స్త్రీ పడే పాట్లు గమనించడానికి మొదటిమెట్టు ఆ ఉద్యోగం.

    పనున్నా లేకపోయినా లోపలకు పిలిచి కూర్చోపెట్టి ముఖం చూస్తూ కూర్చునే యజమాని ముఫ్ఫయ్యేళ్ళ యువకుడు సుందర్. "నువ్వు నా బిడ్డలాంటి దానివమ్మా ఆ బాస్ కి దూరంగా వుండు" అంటూ పని నేర్పించే నెపంమీద, మీద మీద పడే అరవయ్యేళ్ళ అకౌంటెంట్... బాస్ గదిలోంచి బయటకు రాగానే ఏదో అర్ధమయిందన్నట్లుగా వెకిలిగా నవ్వే ఫ్యూన్ యాదగిరి.
   
    "ఛీ! ఈ మగవాళ్ళకి స్త్రీలను చూస్తే ఆ ఆలోచనే తప్ప మరేంరాదు కాబోలు" అనుకునేది. భర్త గుర్తొచ్చేవాడు. రాజీ గుర్తొచ్చేది. మధ్యాహ్నం పూట అకస్మాత్తుగా ఇంటికెళ్ళాలన్న కోర్కెని బలవంతంగా అణుచుకునేది. ఇంట్లో ఏం జరుగుతుందో అన్న ఆలోచన రాగానే మనసు వికలమయ్యేది.
   
                              *    *    *
   

    భార్య వాంతులు చేసుకోవడం, భర్త కంగారుపడి డాక్టర్ని పిలవడం, డాక్టర్ నాడి పరీక్షించి "ఈమె  గర్భవతి" అని చెప్పటం, భర్త సంతోషంతో ఆమెను ముద్దుల్లో ముంచెత్తడం లాంటివి సినిమాల్లోనే జరుగుతాయి. ఏ డాక్టరూ చెప్పకుండా ఆరువారాల్లోనే తను గర్భవతినన్న అనుమానం వచ్చింది రాధకు.
   
    సిగ్గుపడుతూ భర్తతో "మీరు తండ్రి కాబోతున్నారు" అని చెప్పలేదు, "నాకు అనుమానంగా వుంది. డాక్టరు దగ్గరకెళ్ళి కన్ ఫర్మ్ అయితే వెంటనే అబార్షన్ చేయించుకుంటాను" అంది.
   
    "అబార్షనా? వద్దు రాధా నా కిష్టంలేదు" అన్నాడు మోహన్.
   
    "కొంచెం ఆలోచించు మోహన్! మనకా బాధ్యతలు చాలా ఎక్కువ. ఆర్ధికంగా నిలదొక్కుకోలేదింకా, నాకు మంచి ఉద్యోగమూ లేదు. ఇప్పుడప్పుడే మనకు 'పిల్లలు వద్దు'."
   
    "నేను భార్యాబిడ్డల్ని పోషించలేనంత అధమస్థితిలో వున్నానని గుర్తుచేస్తున్నావా?" బాధగా అన్నాడు మోహన్.
   
    "ఛ! నా ఉద్దేశ్యం అదికాదు కొన్నాళ్ళవరజు మనం ఇద్దరమే వుంటే బావుంటుందని అనిపించింది. ఇంట్లో కావలసినవన్నీ అమర్చుకోవచ్చుగదాని...."
   
    "నాకు పిల్లలంటే చాలా యిష్టం రాధా! అలాగే మనకు బాబుపుడితే మీ అమ్మా నాన్న కూడా నీకు దగ్గరవుతారని ఒక నమ్మకం కూడా ఒక బిడ్డ మనకేం భారంకాదు. ప్లీజ్ నా మాట విను".
   
    రాధ ఎన్ని విధాలు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. వేవిళ్ళ బాధతో ఉద్యోగంకూడా మానేసింది.
   
                             *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra