Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

   

    "చెప్తాను.....కూర్చోండి" తనూ కూర్చుంటూ అన్నాడు విక్రం.
   
    ధరణి నిస్సత్తువగా సోఫాలో కూలబడి అతను చెప్పేది వింది.
   
                                     *    *    *
   
    చందూ నీరసంగా చూస్తున్నాడు.
   
    ధరణి కోపంగా అడిగింది. "అలా చిత్తు చిత్తుగా కొట్టేస్తుంటే ఎదిరించకుండా ఒళ్ళు పచ్చడి చేయించుకోవడానికి సిగ్గులేదూ!"
   
    "ఆ!!" చెయ్యి కదపబోయి అరిచాడు చందూ.
   
    శ్రీధర్ అతణ్ణి లేపి కూర్చోపెడ్తూ అన్నాడు, "ఇదేం సినిమా కాదు! నీ తమ్ముడు ఒక్కడే ఆ రౌడీలందర్నీ విరగొట్టటానికి!"
   
    "ఓహో ... అలా నిజజీవితంలో జరగదన్నమాట!" ఆశ్చర్యం నటించింది ధరణి.
   
    "అలా జరగటానికి వీడేమైనా సినిమా హీరోనా?" విసుగ్గా అన్నాడు శ్రీధర్.
   
    "మరి సినిమాలో చూపించినట్లుగా గొప్పింటి పిల్ల వెంటపడి ప్రేమా..దోమా.... అనేటప్పుడు ఈ సంగతి ఆలోచించలేదా?" వ్యంగ్యంగా అడిగింది.
   
    "ఉడుకురక్తం.. ఆలోచించలేదు" అన్నాడు శ్రీధర్.
   
    చందూ అక్క వేపు చూడలేక సిగ్గుతో తల వంచుకున్నాడు.
   
    "ఆటోడ్రైవర్ సినిమా చూసి నడిపేటప్పుడూ, గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడేటప్పుడే కరాటే, కుంగ్ ఫూ కూడా నేర్చుకోవలసింది.... లేదా నన్నుకాదు నా డూప్ ని కొట్టండి అని వాళ్ళని బతిమాలవలసింది" వెక్కిరింతగా అంది ధరణి.
   
    "అబ్బా! వాడ్ని ఏడిపించకూ.... అసలే సున్నంలోకి ఎముక లేకుండా చితక్కొట్టారు పాపం!" జాలిపడ్డాడు శ్రీధర్.
   
    ధరణి తమ్ముడి దగ్గరకొస్తూ అడిగింది- "ఇంతకీ నిన్నీ స్థితికి ఈడ్చిన పెద్దమనిషి ఎవర్రా?"
   
    "ఆ ఆటోడ్రైవర్ సినిమా తీసిన పెద్దమనిషే!" కోపంగా అన్నాడు చందూ.
   
    "ఆ!!!" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్.
   
    ధరణికి ఎదురుగా టేబుల్ మీద రెపరెపలాడుతున్న న్యూస్ పేపర్ కనిపించింది. అందులో కనిపిస్తున్న ఆటోడ్రైవర్ ఎడ్వర్ టైజ్ మెంట్ ని కోపంగా చూస్తూ పేపర్ చేతిలోకి తీసుకుంది.
   
    "నేడే శతదినోత్సవ వేడుకలు.... హోంమంత్రి ముఖ్య  అతిథిగా విచ్చేస్తున్నారు" అని, దాని క్రిందనున్న నిర్మాత పేరు కసిగా చదివింది.
   
                                           3
   
    నిర్మాత ఏడుకొండలు తెల్లని మల్లెపువ్వులాంటి బట్టల్లో నవ్వు లొలక పోస్తూ దర్జాగా కూర్చున్నాడు. కొత్త హీరోయిన్ వయ్యారంగా జుట్టు మునివేళ్ళతో సవరించుకుంటూ నిర్మాతకీ హీరోకి మధ్యలో కూర్చుంది.
   
    ప్రేక్షకులు తమ అభిమాన నటీనటుల్ని చూసి ఆనందంతో ఉర్రూత లూగుతున్నారు. దర్శకుడు మైక్ ముందుకు వస్తూవుంటే ఆగకుండా కరతాళధ్వనులు చేశారు. దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతున్నాడు.
   
    "ఏడుకొండలుగారు నిర్మించిన చిత్రాలన్నీ ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేసినవే. ఆయనలో ఓ గొప్ప సంఘసంస్కర్త దాగి వున్నాడు. ఈ చిత్ర కథను వినగానే ఆయన చలించిపోయారు. ఓ పేద యువకుడు తన స్వయంకృషితో ఆటో నడుపుతూ తన జీవనం సాగించుకుంటూ, ఓ గొప్ప యువతిని ప్రేమిస్తాడు. 'అది అంత నేరమా?' అని ఆయన తీవ్రంగా స్పందించి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ ఏడుకొండలుగారు సహజంగా మంచి కళావిలువలు తెలిసిన మనిషి! కళావిలువలే కాదు, మానవతా విలువలు కూడా మూర్తీభావించిన మహామనీషి!"
   
    జనం ఆపకుండా చప్పట్లతో మోతెక్కించారు. ధరణి వారి మధ్యలోంచి దారి చేసుకుంటూ ముందుకు నడిచింది.
   
    "ఆగండి.... ఎక్కడికి?" ఓ బ్యాడ్జీ పెట్టుకున్న వాలంటీర్ ఆపబోయాడు.
   
    "నే నెవరో మీకు తెహ్లియదు. అందుకే ఆపుతున్నారు" జంకు లేకుండా అంది ధరణి.
   
    "ఎవరూ!" అతను కాస్త తగ్గి అడిగాడు.
   
    ధరణి స్టేజీ మీదకి చూపిస్తూ "ఆ ఏడుకొండలుగారు మా మామయ్యగారు. మమ్మల్ని ఆపకండి. ఆయనకి తెలిస్తే బాగోదు!" అంది. అతను అనుమానంగా ఆమెని చూస్తూనే పక్కకి తప్పుకున్నాడు. ధరణి చొరవగా ఆడియన్స్ మధ్యలోంచి స్టేజ్ వైపుగా నడిచింది.
   
    "యువతకు స్ఫూర్తి ఈ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రజలు ఆదరించిన తీరునిబట్టే ఇది ఓ ప్రయోజనాత్మక చిత్రం అని తెలుస్తోంది. ఈ విషయంలో మనం మరొక్కసారి ఈ చిత్ర నిర్మాత శ్రీ ఏడుకొండలుగార్ని మనసారా అభినందించాలి!"
   
    మళ్ళీ జనం చప్పట్లు కొట్టారు. ఏడుకొండలు లేచి రెండు చేతులూ ఎత్తి ప్రజల్ని ఉద్దేశించినమస్కరించాడు. ఆయన ముఖం విజయగర్వంతో వెలిగిపోతోంది.
   
    "నా ఆటో చక్రం తిరుగుతూ వుంటే ప్రపంచం అంతా నాకు గులాములూ! వంగి వంగి సలాములూ!" అనే పాట బ్యాక్ డ్రాప్ లొ వినిపిస్తోంది. ఏడుకొండలు మైక్ ముందుకి వచ్చి వినయంగా వంగి నమస్కరించాడు. "ప్రేక్షక మహాశయులారా! మీ అందరికీ నా వందనాలు. ఈ విజయం నాదికాదు, మీ అందరిదీ ముఖ్యంగా ఆటో నడిపే సోదరులది!" అన్నాడు.
   
    ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకుడు ఒకరు పెద్ద గులాబీ పూలమాలతో స్టేజీ ఎక్కగానే "ఆటోడ్రైవర్ల యూనియన్ జిందాబాద్.... ఏడుకొండలూ జిందాబాద్!" అని ఆటోడ్రైవర్లు అనందాతిశయంతో జయజయ ధ్వానాలు చేశారు.
   
    వారి హడావుడి సద్దుమణిగిన తర్వాత ఏడుకొండలు మళ్ళీ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. "ఈ చిత్రంలొ హీరో మీ అందరి మన్ననలకీ పాత్రుడైనది, అతని నటన వల్లకాదు! మీ అందరి మనసుల్లోని కోరికలకీ అతను రూపం అవడం వలన! మా హీరో మీకు స్ఫూర్తి కావాలి! మీ అందరూ మీ జీవితాల్లో అతన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి సాధించాలి. ఇంకా నేను నా విజయం గురించి పదే పదే చెప్పనవసరం లేదు. అది మీరే నాకంటే బాగా చెప్పగలరు కనుక సెలవు తీసుకుంటూన్నాను! జైహింద్!" ఏడుకొండలు వెళ్ళి కూర్చున్నాడు.
   
    "ఇప్పుడు ఈ చిత్ర విజయం పట్ల ప్రేక్షకుల స్పందన. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ప్రముఖ జర్నలిస్ట్ శౌరిగారు ప్రసంగిస్తారు...." అని వ్యాఖ్యాత చెబుతూ వుండగా ధరణి స్టేజ్ మీదకి వచ్చేసింది.
   
    అందరూ తెల్లబోయి చూశారు!
   
    "నమస్తే! నేనొక సామాన్య ప్రేక్షకురాల్ని ఈ విజయోత్సాహాన్నీ, వీరి ప్రసంగాల్నీ వింటూ మీరెంత ఆనందోద్వేగాలకి లోనవుతున్నారో చూస్తున్నాను. నేనూ అంతే ఉద్వేగానికి లోనయి ఇలా స్టేజీమీదకు వచ్చినందుకు క్షమించాలి!"
   
    స్టేజీమీదున్న పెద్దలు స్థిమితపడ్డారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ లో ఒకరు ఆమెని వారించడానికి సమీపిస్తూ ఉంటే దర్శకుడు వారించాడు. ప్రెస్ వాళ్ళు ఆసక్తిగా ఈ విషయం రాసుకుంటున్నారు. "ఆటో డ్రైవర్ పట్ల స్త్రీల ఆనందహేల!" అని రాసుకోవచ్చని వాళ్ళ ఆలోచన.
   
    "నేను ఇక్కడికొచ్చిన ప్రతివారినీ ఉద్దేశించి మూడు ప్రశ్నలు వేస్తాను. జవాబులు దొరికితే తృప్తిపడి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు మూడు నిమిషాలు మాత్రం కేటాయిస్తే చాలు!" అంది ధరణి.
   
    అందరూ ఆమె అడగబోయే ప్రశ్నల కోసం చెవులు రిక్కించి కూర్చున్నారు.
   
    "శ్రీ ఏడుకొండలుగారు ఆశించిన సామాజిక ప్రయోజనం ఏమిటి? ఆటోడ్రైవర్లు అందరూ కోటీశ్వరుల కూతుళ్ళని ప్రేమించడమా?...." ఇది మొదటి ప్రశ్న.
   
    జనంలో కలకలం చెలరేగింది. ఏడుకొండలి భ్రుకుటి ముడిపడింది. చిరాగ్గా చూశాడు.
   
    "ఆటోడ్రైవరైతేనేం.....మంచి మనసుంటే చాలని ఆయన మనస్ఫూర్తిగా నమ్మి తన కూతుర్నైతే ఓ ఆటోడ్రైవర్ కిచ్చి పెళ్ళిచేస్తాడా?"
   
    "ఔను.... అడగాల్సిన ప్రశ్నే!"
   
    "కాదు.....ఎందుకిస్తాడూ?"
   
    జనం తమలో తాము గుసగుసలు మొదలెట్టారు. ధరణిని ఎవరో ఫోర్సబుల్ గా ప్రక్కకి లాగాలని చూశారు. ధరణి మైక్ వదలకుండా "మూడో ప్రశ్న.... ఇంత సామాజిక ప్రయోజనాల్ని ఆశించే సంఘ సంస్కర్త తన కూతురు ప్రేమించిన ఆటోడ్రైవర్ని ఎందుకు చితగ్గొట్టించాడు? నాకు జవాబులు కావాలి!" అంది.
   
    ఒక క్షణం సభలో సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం. అంతలో ఎవరూ వూహించనటువంతి సంఘటన జరిగింది. అప్పటికే దర్శకుడు-ఈ షాక్ నుంచి తేరుకుని, ఆమెకు సరిఅయిన సమాధానం ఇవ్వాలనుకున్నాడు.
   
    సాధారణంగా ఇటువంటి సంఘటనల్లో అభిమానులు బాసటగా నిలుస్తారు. అడిగినదాన్ని ఏదైనా పక్కదారి పట్టించి, రెండు జోకులు వేస్తే- సమస్య తీవ్రత తగ్గుతుంది. ప్రశ్నించిన వారు సిగ్గుతో తలవంచుకుని వెళ్ళిపోతారు.
   
    అలా చెయ్యటం కోసం ఉద్యుక్తుడవుతూండగా, ఒక మూల నుంచి A.D.U. ప్రెసిడెంట్ లేచాడు. చందూ విషయం అతడికి తెలుసు.
   
    ప్రెసిడెంట్ లేవటాన్ని స్టేజీమీద వున్న దర్శకుడూ నిర్మాతా చూశారు. వాళ్ళ టెన్షన్ తగ్గింది. ఆ అమ్మాయికి సరి అయిన సమాధానం చెప్పగలిగేది కార్మిక నాయకులే అనుకున్నారు.
   
    అయితే వారి అభిప్రాయాన్ని వమ్ముచేస్తూ అతడు "అవును....సమాధానం కావాలి" అన్నాడు.
   
    దర్శక నిర్మాతలు షాక్ తిన్నారు. తమ మనిషి ఇలా మాట్లాడతాడని వారు అనుకోలేదు. అక్కడున్న వాళ్ళలో చాలామంది ఆటోడ్రైవర్లే. చాలామందికి చందూ పట్ల సానుభూతి వుంది. మరో రకంగా హీరో వర్షిప్ కూడా వుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra