Home » Mainanpati bhaskar » Agnisakshi

 

    "హలో ! అమ్మా?" అంటున్నాడు చిన్నీ, ఆ టెలిఫోన్ లో.

 

    "హలో! చిన్నీ! అన్నాడు గోపి.

 

    "అమ్మా! నేను నీతో కటిఫ్!" అన్నాడు బుంగమూతి పెట్టి అలకగా.

 

    :"ఎందుకురా! చిన్నీ, ఎందుకంత కోపం?"

 

    "మరెంటమ్మా! నిన్న ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పావ్! ఇవాళ వస్తానని చెప్పలెదూ?"

 

    "చెప్పాననుకో!"-

 

    నాకు కోతిబొమ్మ తెస్తాననలెదూ? ఫో అమ్మా అన్ని అబద్దాలే!"

 

    "ఇదిగో! చిన్నీ! నా మాట విను!" అన్నాడు గోపి నచ్చచెబుతూ. "అమ్మకి ఎన్ని పనులుంటాయో నీకేం తెలుసు. ప్రొద్దున్నే లేవాలి. అన్నం వండాలి. నాన్నని ఆఫీసుకి పంపాలి. వీటన్నిటితో తీరిక ఉండొద్దు? అవునా?

 

    "అవును పాపం!" అన్నాడు చిన్నీ సానుభూతిగా. పోనిలే అమ్మా రేపన్నా వస్తావా మరి?"

 

    "వస్తాను చిన్నీ!"

 

    తప్పకుండా వస్తావా? ఒట్టు?

 

    "ఒట్టు"

 

    "అమ్మా!" అన్నాడు చిన్నీ కంగారుగా. ఫోన్ పెట్టేయ్యకు. ఇంకో మాట చెప్పాలి.

 

    "ఏమిటి బాబూ!"

 

    "నాకు కోతిబొమ్మ వద్దులే! గుడ్లు పెట్టె బాతు బొమ్మ కావాలి. మొన్న ఎవరో టోపీ పెట్టుకున్న పెద్దాయన వచ్చి మా కోసం బొమ్మలు ఇస్తే వరదరాజులు ఇంటికి పట్టుకెళ్ళి పోయాడే వాటిల్లో వుంది గుడ్లు పెట్టె బాతు బొమ్మ. అలాంటిది కావాలి" అని ఇంకేదో గుర్తువచ్చినట్లు అన్నాడు చిన్నీ. అమ్మా! వచ్చేటప్పుడు ఒక బెత్తం కూడా తీసుకురా.

 

    "ఎందుకు నాయనా!"

 

    "వరదరజులుని కొట్టడానికి!" అన్నాడు చిన్నీ.

 

    అది విని విరగబడి నవ్వాడు గోపి. నవ్వి నవ్వి కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి. తుడుచుకుంటూ అన్నాడు గోపి.

 

    "ఒరే చిన్నీ! ఇక కాసేపు నువ్వు అమ్మవట. నేను గోపిని సరేనా? హలో! అమ్మా!"

 

    హలో ! గోపి!" అంటున్నాడు చిన్నీ. "నాన్న ఆఫీసునుంచి వచ్చేశారు. చాలా పనులలో ఉన్నాను. తరువాత ఫోన్ చెయ్! ఏం! ఇప్పుడు పెట్టేయ్!"

 

    చటుక్కున వాళ్ళిద్దరిని దగ్గరికి లాక్కున్నాడు తను.

 

    ఆటలో దొరికి పోయినందుకు సిగ్గుపడ్డారు చిన్నీ గోపి.

 

    తరువాత వాళ్ళకి తను తెచ్చిన స్వీట్స్, ఇచ్చాడు. కొంతసేపు వాళ్ళతో కాలక్షేపం చేసి తిరిగి వచ్చేశాడు.

 

    తను కూడా చిన్నప్పుడు అలాగే కలవరించిపోయాడు అమ్మ కోసం. అనాధశరణాలయంలో తను రాత్రిళ్ళు గోడకి ఆనించి గొంగళి వేసుకుని పడుకునేవాడు. సరిగ్గా తన మొహానికి ఎదురుగా వుండేటట్లు గోడమీద పెన్సిల్ తో అమ్మ బొమ్మ వేశాడు తను. రాత్రంతా మౌనంగా ఆ అమ్మతో మాట్లాడుతూనే గడిపెసేవాడు.

 

    ఒకదాని తరువాత ఒకటిగా చేదు జ్ఞాపకాలు!

 

    ఒళ్ళు జలదరించే అనుభూతులు.

 

    అన్ని గుర్తు వచ్చాయి తేజస్వికి.

 

    కలత నిద్రలోనే కాలం గడిచిపోయింది. తెల్లవారుతుండగా కర్ణ కఠోరంగా అలారం మోగింది.

 

    ఉలికిపడి లేచి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తయారవడం మొదలెట్టాడు అతను.

 

                                              13

 

    నిద్రలేమి వాళ్ళ ఎర్రబడిన కళ్ళతో ఆఫీసుకి వచ్చాడు శశికాంత్. రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు అతను. నిద్రపోనివ్వలేదు ఉజ్వల. స్వర్గానికి అంచులు చూపించింది తను. సుఖం లోతుల్లోకి తీసుకెళ్ళిపోయింది. తను ఏం చేస్తే దానికి రెట్టింపుగా ముట్టచెబుతూ.

 

    మైగాడ్!

 

    షీ మేడ్ ఇట్ ఇన్ టూ ఏ డెలిషియస్ వార్!

 

    "మే ఐ కమిన్?" అని వినపడింది కంఠస్వరం.

 

    తలెత్తి చూశాడు శశికాంత్.

 

    ఎదురుగా నిలబడి ఉంది ఉజ్వల.

 

    తనతో బాటు రాత్రంతా మేలుకునే ఉన్నా, ఆమె మొహంలో అలసట అసలు కనబడటం లేదు.

 

    చాలా ఎనేర్జిటిక్ గర్ల్ ఈ అమ్మాయి.

 

    చిగురుటాకు రంగులో ఉన్న చీర కట్టుకుని ఉంది ఉజ్వల. లేత ఆకుపచ్చలో కలనేతలాగా పల్చటి ఎరుపు కలిసిపోయి ఉంది.

 

    ఆ చీర లేకపోతే ఉజ్వల ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకోవడానికి కళ్ళు మూసుకున్నాడు శశికాంత్.

 

    "యూ నాటీ?" అంది ఉజ్వల నవ్వుతూ.

 

    "ప్లెజర్ ఈజ్ ప్లెజర్! బిజినెస్ ఈజ్ బిజినెస్! ఐ నెవర్ మిక్స్ ప్లెజర్ విత్ బిజినెస్! రాత్రంతా సుఖాలు జుర్రుకున్నాం. అది చాలు. ఇప్పుడిక బిజినెస్ లోకి వద్దాం."

 

    "నీతో బిజినెస్సే నాకు ప్లెజర్" అన్నాడు శశికాంత్.

 

    సగం చిరునవ్వు నవ్వింది ఉజ్వల. ఆమె చిరునవ్వు నవ్వుతున్నప్పుడు పై పెదిమ మాత్రమే కుడివైపుకి కొద్దిగా లేస్తుంది. తెల్లగా పలువరుస కొద్దిగా కనబడుతుంది. చాలా ఆకర్షనియంగా ఉంటుంది అది.

 

    కళ్ళార్పకుండా చూశాడు శశికాంత్.

 

    "విత్ యువర్ పర్మిషన్- " అని, అక్కడ ఉన్న పైల్సు తిరగెయ్యడం మొదలెట్టింది ఉజ్వల.

 

    ఆమె చాలా చనువు తీసుకుంటుందని అతనికి తెలుసు. అయినా అది అతనికి ఎబ్బెట్టుగా కనబడలేదు.

 

    నిన్నరాత్రి కూడా తనకంటే ఆమె ఎక్కువ చనువు తీసుకుంది.

 

    అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండాలి తనకి?

 

    సరిగ్గా అరగంట తరువాత ఫైళ్ళలో నుంచి తలెత్తి చూసింది ఉజ్వల.

 

    "సత్యా ఫార్మా ఇంతవరకూ, అంటే పరమహంస హయంలో చేసినవి మామూలు తప్పులు కావు. బ్లండర్స్!" అంది చిరాగ్గా.

 

    "లైక్ వాట్?" అన్నాడు శశికాంత్.

 

    నిన్న కాన్ఫెరెన్స్ లో తేజస్వి మొత్తుకున్నాడు చూడు. ఆ ఫార్మాన్యూటికల్స్ ప్రొడక్షన్ లో ఘోరాలు జరుగుతున్నాయని, ఆ సోకాల్డ్ ఘోరాల్లో ఏ ఒక్కటి కూడా ఈ పరమహంస చెయ్యలేదు. అదే అతను చేసిన తప్పు. అందుకే మునిగిపోయాడు.

 

    "అంటే!" అన్నాడు శశికాంత్ ప్రశ్నార్ధకంగా చూస్తూ.

 

    "అవసరమైన మందులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి సల్ఫా డ్రగ్స్! కుష్టురోగానికి మందులు. చాలా అవసరం? కానీ చాలా చవక. అమ్మితే పావలా లాభం రాదు. అలాంటివి చేస్తే మనకి ప్రయోజనం ఏమిటి? ఫాన్సీ డ్రగ్స్ మార్కెట్ ఎక్కువ. లాభం ఎక్కువ టానిక్స్, విటమిన్ పిల్స్, ఎట్ సెటేరా, ......ఎట్ సేటారా......మనం మన కంపెని పాలసీ తక్షణం మార్చెయ్యాలి . శశీ! బ్లంట్ గా అడుగుతున్నందుకు ఏమి అనుకోకు? ఈ కంపెని కంట్రోలింగ్ షేర్స్ అన్ని మీ ఆవిడ పేరుతొ వున్నాయని విన్నాను నిజమేనా?"

 

    "నేనే అలా అరేంజ్ చేశాను కొన్ని కారణాల వల్ల. కానీ అదొక ప్రాబ్లం కాదు. అఫ్టరాల్ షీ ఈజ్ మై వైఫ్......."నేనెలా చెబితే అలా చేస్తుంది" అన్నాడు శశికాంత్ తేలిగ్గా.

 

    అదోలా నవ్వి "ఆర్ యూ ష్యూర్" అంది ఉజ్వల.

 

    "ఎస్! ఐ యామ్ వెరి ష్యూర్ ! వై నాట్?" అన్నాడు శశికాంత్ ఆత్మ విశ్వాసంతో.

 

    "అబ్బ! నీమీద నీకు ఎంత కాన్ఫిడేన్సో!" అంది ఉజ్వల "అయితే మీ ఆవిడ నీ మాట జవదాటదంటావా?"

 

    సౌమ్య చిన్నప్పటికీ నుంచి తెలుసు నాకు. ఎవరికి ఎదురుతిరిగే స్వభావం కాదు తనది. ఒకవేళ ఎప్పుడన్నా ఎదురు తిరగబోతున్నట్లు కనబడినా, కాస్త అదిలించి బెదిరిస్తే చాలు, వెంటనే మాములుగా అయిపోతుంది." అన్నాడు శశికాంత్.

 

    ఈర్ష్యని దాచుకుంటూ, కవ్వింపుగా అంది ఉజ్వల. "నేను కూడా నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా? మరి నేనెలాంటిదాన్ని?"

 

    "నువ్వా!" అని నవ్వాడు శశికాంత్. "నువ్వు ఉత్త మొగరాయుడివి ."

 

    చురుగ్గా చూసింది ఉజ్వల. "అంటే?"

 

    అంటే, నీకు స్త్రీ శరీరం, మగ మనసు ఉన్నాయన్నమాట! అందమైన అమ్మాయి వంట్లో మగవాడి మెదడు! అందుకే నువ్వు వెరి స్పెషల్. మగవాడు ఆడదాని సాన్నిహిత్యం ఎప్పుడూ కొరతాడు ఉజ్వలా? శారీరకమైన అవసరం వున్నప్పుడు, లైట్ రిలాక్శేషన్ కావలసి వచ్చినప్పుడు ఆడదాని కంపెని కోరతాడు . అవునా? కానీ మగవాడు రోజు మొత్తం మీద ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడేది ఎవరితో? ఆడవాళ్ళతో కాదు. సాటి మగవాళ్ళతోనే ఉజ్వలా! అతని బిజినెస్, అతని ఫ్రెండ్ షిప్, అతని వ్యవహారాలూ - అన్ని మగాళ్ళతోనే ఉంటాయి. ఎందుకంటావ్? ఎందుకంటె , మగవాడు ఆడదాని కంటే ఇంటలేక్చుయల్లి సుపిరియర్. తెలివితేటల్లో గానీ, శారీరక బలంలోగాని, ప్రాక్టికల్ గా అలోచించి పనులు చెయ్యడంలో గానీ, మగాడు మగాడే! ఇంక ఈ ఆడవాళ్ళు - పూర్ ఫూలిష్ థింక్స్ - ఇంటికి అలంకారంగా ఉండడానికీ, ఇంటిపని వంటపని చెయ్యడానికి , రాత్రిళ్ళు కాస్త కాలాక్షేపం ఇవ్వడానికి మాత్రం పనికి వస్తారు అంతే!

 

    "కానీ నువ్వు వేరు ! మగవాడి అవసరాలు తీర్చే ఆ రెండు లక్షణాలు కూడా నీలో వున్నాయి ఉజ్వలా! ఫిజికల్ గా చూస్తే నువ్వు అతి సున్నితమైన పింగాణి బొమ్మలా అందంగా ఉంటావు. మెంటల్ లెవల్ చూస్తే నీది ఐరన్ వీల్! చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తావు నువ్వు. టు ఇన్ వన్ లాంటిదానివి ఉజ్వలా! అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం!"

 

    "అందుకే, నాలుగేళ్ళ క్రితమే నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని ప్రపోజ్ చేశాను ఉజ్వలా!"

 

    "కానీ ఐడోన్ ట్ నో వై ............దానికి నీ దగ్గర నుంచి సమాధానం రాలేదు.

 

    "నన్నా! పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేశావా? ఎప్పుడూ?" అంది ఉజ్వల ఆశ్చర్యం నటిస్తూ.

 

    పైకి అలా అన్నది గానీ ఆమెకి బాగా గుర్తుంది.

 

    నాలుగేళ్ళ క్రితం, తను స్టేట్స్ కి వెళ్ళబోయేముందు వకుళ పిన్ని వచ్చి చెప్పింది.  ఈ శశికాంత్ సంబంధం గురించి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra