Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

           

                       అధ్యాయం -5
   
   
    చిన్న రూమ్ అది!
   
    టెన్ బై టెన్ వుంటుందేమో రెండువైపులా ఒక్కోమంచం పక్కనే టేబుల్, ఒక్కో కుర్చీ వున్నాయి. గోడలకే అలమారాలు బిగించి వున్నాయి. వెనక చిన్న బాల్కనీ లాంటిది కనిపిస్తోంది. కిరణ్మయి సూట్ కేస్ తీసుకుని ఆ గదిలో అడుగుపెట్టింది.
   
    "ఈ అమ్మాయి నా రూంమేట్ వినీల. నీలూ అని పిలుస్తాం. బి.యస్.సి. ఫైనలియర్ చేస్తోంది. ఈమె కిరణ్మయి. మా భాస్కరన్నయ్య స్నేహితుడి చెల్లెలు" పరిచయం చేసింది ఇందుమతి. భాస్కర్ ఇందుమతికి అన్నయ్య లాయరు వెంకటరత్నం ప్రసక్తి కూడా లేకుండా తన స్నేహితుడికి చెల్లెలని పరిచయం చేసి వెళ్ళిపోయాడు భాస్కర్. ఇందుమతి బి.కాం. సెకండియర్ లో వుంది.
   
    "వెల్ కం, మీరేం చదువుకున్నారు?" అడిగింది వినీల.
   
    "కిరణ్మయిగారు ఎమ్.ఏ.సైకాలజీ చేశారట. ఎమ్.ఫిల్ లో చేరబోతున్నారు. మనకు కొద్దిరోజులు గెస్ట్ గా వుంటారు" ఇందుమతి జవాబిచ్చింది.
   
    "మీరు సైకాలజి స్టూడెంటా? అయితే మీకు మా హాస్టల్లో బోలెడు మేథ" నవ్వింది వినీల.
   
    "అంతకంటే నాకు మాత్రం కావలసిందేముంది? నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నాకు తీరని కోరికల్లో ఒకటి. కొద్దిరోజులు లేడీస్ హాస్టల్లో వుండాలన్నది ఈ అవకాశం రావడం సంతోషంగా వుంది. మీ చదువుకి, మీ ప్రైవెసీకి నేను అడ్డు రాకుండా ప్రయత్నిస్తాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలిగినా నాకు తప్పక చెప్పండి" అంది కిరణ్మయి.
   
    "మాకు అసౌకర్యమా?" నవ్వింది వినీల. "ఈ హాస్టల్లో అందరూ ఏదో ఒక రంగా అతిధులను తెచ్చిపెట్టుకుంటుంటారు. అసలు గెస్ట్స్ లేకపోతే తోచని వాళ్ళున్నారు. అలాంటిది పాపం మా ఇద్దరికే ఇంత వరకు ఎలాంటి అతిధీ రాలేదు. మాకూ ఆ విషయంలో చాలా అసంతృప్తిగా వుంది."
   
    కిరణ్మయి చొరవగా తన వస్తువులు ఓ మంచంమీద పడేసి బాసింపట్టు వేసుకుని కూర్చుంది. "మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఈ హాస్టల్లో చాలా వింత కారెక్టర్ లున్నట్లున్నాయి. ఎమ్.ఫిల్ లో మంచి సబ్జెక్టు మాటర్ సంపాదించుకో వచ్చనుకుంటాను. అసలు రావడమే నేనో విషయం గమనించాను. మీ వార్డెన్ నన్ను చూడలేదసలు. కనీసం గేటుదగ్గిర వాచ్ మన్ అయినా నా గురించి గట్టిగా అడగలేదు. ఆ విషయం మహా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఉస్మానియాలో పి.జి. చేసినప్పుడు పి.జి. హాస్టలు స్టూడెంట్సు హాస్టల్ డిసిప్లిన్ గురించి చెప్పి బెదరగొట్టేవారు."
   
    "అయ్యో, ఇంత చిన్నదానికే మీరు ఆశ్చర్యపోతున్నారా? అయితే కొన్ని సంగతులు వింటే, చూస్తే ఇక మీరు కళ్ళు తిరిగి ధామ్మని పడిపోవలసిందే" అంది ఇందుమతి.
   
    "అలాగా, నేనయితే ఇంతవరకు ఏ లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి చూడనేలేదు. చాలా స్ట్రిక్ట్ గా వుంటారని, భోజనం బావుండదని చెప్పుకుంటే వినడమే అందుకే నన్ను గెస్ట్ గా వుండనిస్తారో లేదోనని భయపడ్డాను."
   
    "అలాంటి భయాలు అవసరంలేదు. ఈ హాస్టల్లో అలాంటి స్ట్రిక్ట్ నెస్ గాని, డిసిప్లిన్ గాని ఎంతమాత్రం లేవు. ఉన్నా సాగనివ్వరు. అసలు వార్డెన్ రోజుకోసారి కూడ ఇటు తిరిగి చూడదు. ఈ వాచ్ మెన్ అనేవాడు ఇవ్వాళ మీకు కనిపించి 'ఎవరికోసం?' అని అడగడమే ఒక గొప్ప విషయం ఎవరు, ఏ సమయంలో, ఎందుకు వస్తున్నా అతడు పట్టించుకోడు, అడగడు" అంది నీలూ.
   
    "చాలా హాస్టల్స్ లో జరగనివన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ మధ్యనే ఈ హాస్టల్లో ఓ హత్య కూడా జరిగింది" అంది ఇందుమతి.
   
    "అవునట. పేపర్లో చదివాను. ఎలా జరిగింది?" అడిగింది కిరణ్మయి. వచ్చిన గంటలోనే ఆ ప్రసక్తిరావడం అదృష్టమో, దురదృష్టమో అర్ధంకావడంలేదు.
   
    "అపురూపలక్ష్మి అనే అమ్మాయిని పట్టపగలే గదిలో హత్య చేశారు. హంతకుడు రాయన్న అని క్రికెట్ ప్లేయరట. ఆ నాలుగురోజులు పోలీసులు, అధికారులు అంతా హడావుడి వార్డెన్ సరిగ్గా వుండటంలేదని అప్పుడే తెలిసింది అధికారులకు. అప్పటికప్పుడు ఓ కొత్త లెక్చరర్ ని వార్డెన్ గా నియమించారు. ఆవిడసలే మహాపతివ్రాత. భర్తా ఇద్దరు పిల్లల్ని వదలి వుడటం భావ్యం కాదుగదా. కష్టపడి నాలుగురోజులిక్కడ వుంది. ఆ తర్వాత గోల పెట్టేసింది. తర్వాత షరా మామూలే."
   
    "ఇందూ, వచ్చీరాగానే ఈ హత్యలు, దోపిడీలు సంగతి చెప్పి బెదరగొట్టకు. కిరణ్మయిగారూ, కొద్దిరోజులు మాతో వుండబోతున్నారు కాబట్టి, మా ఇందూకి సిస్టర్ గా పరిచయం చేయబోతున్నాం కాబట్టి మిమ్మల్ని 'అక్కా' అని పిలుస్తాం. కన్వీనియంట్ గా వుంటుంది, ఓ......కే!" అడిగింది నీలూ.
   
    "ఓ.కే" నవ్వింది కిరణ్మయి.
   
    రాత్రి ఏడున్నరకి గంట మోగింది.
   
    "భోజనానికి పిలుపు వచ్చింది. మీకు ఆకలిగా వుంటే పదండి. వెళ్ళి ఆ కార్యక్రమం ముగిద్దాం" అంది ఇందుమతి.
   
    "అబ్బే, నాకు తొందరేం లేదు. మీరు సాధారణంగా ఏ సమయంలో వెళతారో అప్పుడే వెళ్దాం" అంది కిరణ్మయి.
   
    "మాకో టైం అంటూ లేదు. తొమ్మిదిన్నర వరకు భోజనం టైం. కాకపోతే బాగా ఆకలిగా వున్నప్పుడు వెళ్తే మంచిది. ఆకలిమీద వాడు పెట్టే గడ్డి వేడివేడిగా రుచిగా అనిపించవచ్చు."
   
    "భోజనం నిజంగానే అంత అధ్వాన్నంగా వుంటుందా?"
   
    "అధ్వాన్నం కంటే అధ్వాన్నమైన పదం వుంటే చెప్పండి. ఈ రోజు మా భోజనానికి నామకరణం చేయొచ్చు."

    "ఇంత పెద్ద హాస్టల్లో అందులో స్టూడెంట్స్ హాస్టల్లో సరయిన భోజనం పెట్టకపోతే మీ స్టూడెంట్సందరూ ఎం చేస్తున్నారు? ఎందుకు వూరుకుంటున్నారు? అసలు స్టూడెంట్సంటేనే అందరూ భయపడతారు కదా!"
   
    "నిజమే అందరూ స్టూడెంట్సంటే భయపడతారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్సు కొందరు స్టూడెంట్ లీడర్లకి భయపడతారు - అంతా రాజకీయం లెండి. రాజకీయ నాయకులకి అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళు మా లీడర్లని పిలుస్తారు. మా లీడర్ల వెనక వాళ్ళ మద్దతుదారుల గుంపంతా కదుల్తుంది. లాభం జరిగేది ఎవరికి? స్టూడెంటు నాయకులకీ, ఆ రాజకీయ వినాయకులకీ! అలాగే ఇక్కడా గొడవలు జరుగుతుంటాయి. కాని స్టూడెంట్ లీడర్లకీ, వాళ్ళ గెస్ట్ లీ స్పెషల్ గా అర్ధరాత్రి వరకు భోజనాలు, నాన్ వెజ్ స్పెషల్స్ అన్నీ అందుతుంటాయి. కాబట్టి మెస్ వాళ్ళని సమర్ధిస్తారు. వాళ్ళని ఎదిరించి ఈ హాస్టల్లో సుఖంగా బ్రతకలేం. వాళ్ళతో డైరెక్టుగా దెబ్బలాడే ధైర్యం మాలో లేదు. ఇలా సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటాం. ఎవరిన ఇంటికి పిలిచి భోజనం పెడతామంటే చాలు వెంటనే పరిగెత్తుతాం. మొహమాటం లేకుండా ఆవురావురుమంటూ తిండి మొహం ఎరగనివాళ్ళలా తినేస్తాం. ఏమనుకుంటారోననే బాధకూడా కలగదు. బయటకు వెళ్ళటానికి ఎవరైనా కాస్త కంపెనీ దొరుకుతే ఆ రోజు మాకు పండగలా అనిపిస్తుంది."
   
    'ఈ అవకాశాన్ని బోయ్ ఫ్రెండ్స్ చక్కగా ఉపయోగించుకుంటారనుకుంటాను' అనుకుంది కిరణ్మయి.
   
    "మీ గదుల్లో వంట చేసుకోనివ్వరా?" అని అడిగింది.
   
    "డానికి అబ్జెక్షన్ ఏమీ లేదనుకోండి. కాని ప్రతిపూటా చేసుకోవడం టైం వేస్టు. అదీగాక ఈ ఇరుకు గదుల్లో ఎంతని చేసుకుంటాం? అప్పటికీ స్టవ్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాం. ఎప్పుడైనా టీ చేసుకోవడం, బుద్దిపుడితే ఆమ్లెట్లు, చిన్న చిన్న టిఫిన్లు చేసుకుంటుంటాం."
   
    కిరణ్మయికి వాళ్ళని చూస్తే జాలేసింది. అన్నీ వున్నవాళ్ళు, ఇంట్లో అమ్మలు అపురూపంగా అన్నీ చేసిపెడితే తింటూ, కావలసినవి అడిగి చేయించుకునె అలవాట్లున్న వాళ్ళు-ఇలా హాస్టళ్ళకొచ్చి తిండికి మొహం వాచిపోవడం ఎంత బాధాకరం.
   
    నిజంగానే భోజనం అధ్వాన్నంగా వుంది. వంకాయకూర ఉప్పు, కారం వేసి ఉడకబెట్టినట్లుంది. పప్పుచరు కాస్త చిక్కటి రసంలా వుంది. దోసకాయ పచ్చడి, అన్నం వేడివేడిగా వడ్డించారు కాబట్టి కొద్దిగా తినగలిగింది లేకపోతే ముద్ద దిగేది కాదేమో పెరుగు మాత్రం కాస్త ఫర్వాలేదు.
   
    "మల్లీష్ మేము వచ్చేశాం" అరుచుకుంటూ కేరింతలతో వచ్చి కూర్చున్నారో గుంపు. అంతే అంతవరకు నిశ్శబ్దంగా వున్నడైనింగ్ హాల్ గోలగోలగ తయారయింది. వడ్డించేవాళ్ళు నలుగురూ హడావుడిగా తిరుగుతున్నారు. ఆ అమమయిలు వాళ్ళమీద పిచ్చి జోకులు వేస్తూ విరగబడి నవ్వుతున్నారు. వేడివేడిగా ఆమ్లెట్లు వచ్చాయి. వంకాయకూరేగాని దాని రూపే వేరుగా వుంది. పప్పుచారు బాగా చిక్కబడింది.
   
    "ఎవరు వాళ్ళు?" అడిగింది కిరణ్మయి మెల్లిగా.
   
    "ఫైనలియర్ స్టూడెంట్స్ సీనియర్స్."
   
    "ఎవరయినా మెస్ చార్జీలు ఒకటేగా. మరి ఈ రకమైన ట్రీట్ మెంట్ ఏమిటిది?"
   
    "గట్టిగా అనకండి అసలే రౌడీమూక. మెస్ ఛార్జీలు కట్టకుండానే పంచభక్ష్య పరమాన్నాలు తెప్పించుకోగలరు. వాళ్ళంటే అందరికీ హడల్."
   
    "ఈ గోల భరించడం కష్టం. తలనెప్పి వస్తుంది. పదండి వెళ్దాం" లేచింది నీలూ.
   
    గదిలోకి వచ్చాక చెప్పింది నీలూ. "స్టూడెంట్స్ తరపున మెస్ కో-ఆర్డినేటర్స్ వాళ్ళు. ఏ పూట కాపూట ఏం వండాలి అన్నది నిర్ణయించేది వాళ్ళే, భోజనం బాగా లేకపోతే వార్డెన్ కి, హాస్టల్ ఇన్ చార్జికి వాళ్ళే వెళ్ళి కంప్లయింటు యివ్వాలి. కాని వాళ్ళకు మంచి భోజనం దొరుకుతుంది కాబట్టి మాకు గడ్డి పెట్టినా వాళ్ళేం మాట్లాడరు."
   
    "మరి మీరంతా వెళ్ళి కంప్లయింట్ ఇవ్వొచ్చుగా."
   
    "వాళ్ళు సీనియర్స్. వాళ్ళని ఎదిరించి బ్రతకటం చాలా కష్టం హాస్టల్లో నానాయత్నాలు పెడ్తారు. తాళాలు బద్దలుకొట్టి సామాన్లన్నీ పాడు చేస్తారు. బాత్రూంలలోకి టైమ్ కి వెళ్ళకుండా కావాలని అడ్డుపడతారు. ఒకసారి ఎవరో ఎదిరిస్తే మర్నాడు వాళ్ళ బట్టలన్నీ ముక్కలు ముక్కలు చేసిపెట్టారు. అందరూ భయపడతారందుకే."
   
    "అయితే వీళ్ళేనన్నమాట లీడర్లు" అంది కిరణ్మయి.
   
    "ఉహు కాదు. వీళ్ళు కేవలం లీడర్లకి మద్దతుదార్లు అసలు లీడర్లు ఇద్దరు ఇద్దరికీ గ్యాంగులున్నాయి. రమణి అని ఫైనలియర్ స్టూడెంట్ వుంది. ఆమె వెనక ఓ యాభై మంది వరకు వున్నారు. వనజాక్షి అని మరో లీడరు. ఇప్పుడు మనం చూసిన గుంపు ఈ అమ్మాయి తరఫుదే! తరువాత ఛాన్స్ రమణి గ్రూఫుకి  వస్తుందన్నమాట. వంతులవారీగా అధికారం పంచి పెడుతూ రాజభోగాలు అనుభవిస్తారు వాళ్ళు. వాళ్ళ మోచేతి నీళ్ళుతాగే ఇలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందీ వుండదు."
   
    కిరణ్మయి ఆలోచనలో పడింది. ఒక లేడీస్ హాస్టల్లో ఇంతటి రాజకీయమా? వార్డెన్ అజమాయిషీ కూడా లేని హాస్టల్లో స్త్రీలకు రక్షణ ఎలా వుంటుంది?
   
    ఇందుమతి, వినీల కలసి రెండు మంచాలు ఒక దగ్గరకు చేరుస్తున్నారు.
   
    "ఎందుకు గెస్ట్ కోసం ఎక్స్ ట్రా మంచం ఇవ్వరా?" అడిగింది కిరణ్మయి.
   
    "మంచం కాకపోయినా పరుపయినా ఇవ్వాలి. కాని వుంటేగా ఇవ్వడానికి? అన్నీ ఎప్పుడూ ఈ గ్రూపు లీడర్ల అధీనంలో ఉంటాయి. వాళ్ళ కెప్పుడూ గెస్ట్ లుంటారు."
   
    "అతిథులు, బంధువులు వస్తే మిగతా అందరూ ఏం చేస్తారు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra