Home » Polkampalli santhadevi » ప్రేమికారాణి

    "ఇరవై సంవత్సరాలుగా మరిచిపోనిదాన్ని ఇప్పుడు మరిచిపోగలనా? ఉహుఁ. ఇప్పుడసలే మరిచిపో!"

    "ఇరవై సంవత్సరాలుగా మరిచిపోనిదాన్ని ఇప్పుడు మరిచిపోగలనా? ఉహుఁ. ఇప్పుడసలే మరిచిపోలేను!"

    "గీతా! నీకేమైంది? రెండు కుటుంబాల గౌరవం నీతో ముడిపడి ఉందని విస్మరించావా? ఇన్నాళ్ళు నీ గురించి ఎంతో నిశ్చింతగా ఉన్నాను! ఇప్పుడు క్రొత్త ఉపద్రవం తెచ్చిపెట్టేట్టున్నావే!" కలవరపడ్డాడు వామనరావు.

    ఇరవయ్యేళ్ళనాడు,

    గీతను తీసుకొని ట్రెయిన్ ఎక్కాడు వామనరావు.

    ట్రెయిన్ హైదరాబాదు విడిచి తమ ఊరివైపు పరిగెడుతూంది!

    "ఇంత అవమానం ఎవరివల్ల జరిగింది, గీతా?"

    "అతడిపేరు వినడంవల్ల ప్రయోజనమేమీ లేదు, అన్నయ్యా." గొణిగినట్టుగా అంది గీతాభవాని.

    "ఎందుకు లేదూ?"

    "అతడు ఈ దేశంలో లేడు."

    "గీతా! అతడా!" స్తంభించిపోయినట్టుగా అయ్యాడు. అతడిదీ, తమదీ పక్కపక్క ఇళ్లే అతడికీ తనకీ మధ్య ప్రాణస్నేహం లేదు! చదువులో ఇద్దరికీ చెప్పలేనంతపోటీ, ఈర్షా ఇద్దరి తల్లిదండ్రులూ పిల్లలకు గొప్పచదువులు చెప్పించే స్థితిపరులు కాదు! అయినా, చదువులో తమ ఆసక్తి ఆ దారిద్ర్యాన్ని లెక్కచేయలేదు! ఇద్దరూ ట్యూషన్సు చెప్పుకొని పెద్ద చదువులే చదివారు. అతడు ఎమ్.బి.బి.ఎస్. తను బి.ఇ.

    గీతకీ, అతడి చెల్లెలు సుధకీ స్నేహం. అతడితోనూ స్నేహం చేసి మోసపోయిందని గీత చెప్పేదాక తెలియదు.

    "ఇలా ఎప్పుడు జరిగింది? అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు. అతడు చావడమో, నీ మెళ్ళో తాళి కట్టడమో ఏదో ఒకటి జరిగేట్టు చేసేవాడిని!"

    "అతడు కేవలం నన్ను వాడుకొన్నాడని తెలిశాక అతడంటే చెప్పలేని అసహ్యం వేసింది!"

    "అప్పుడే ఏ డాక్టరునైనా కలిస్తే ఇంత అసహ్యమైన చరిత్ర సృష్టించుకొనేదానివి కాదుగా?"

    "ఎవరి దగ్గరి కెళ్ళాలన్నా సిగ్గూ, భయం! కనీసం నీతో చెప్పడానికైనా ధైర్యం చాలిందికాదు!"

    "ఇప్పుడు చూడు ఎంత అవమానం జరిగిందో? అవమానం అలా ఉంచు. ఇది ప్రచారమైతే నీ జీవితానికి ఎంత దెబ్బ!"

    ఇంటికి వస్తూనే పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టాడు వామనరావు. చెల్లెలు చేసిన పని మామూలుది కాదు! కాలుజారి దానికి సాక్ష్యంగా బిడ్డను కూడా కన్నది! ఆ సంగతి ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానం? ముందు ఆమె జీవితం బుగ్గి అవుతుంది. తరువాత కుటుంబం కుటుంబమంతా ఆ అవమానంతో ఉరిపెట్టుకు చావాలి! తన చేతిలో ఏదైనా అద్భుతశక్తివుంటే ఈ జరిగిందంతా ఆనవాలు లేకుండా తుడిచివేసేవాడు. కాని, తన చేతిలో అలాంటి శక్తిలేదు! ఇహ చేయాల్సింది జరిగిందానిమీద సాధ్యమైనంత త్వరగా సమాధి కట్టడం!

    పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకొన్నాడు.

    "ఇదిగో, ఈ శివపురం సంబంధం లక్ష. ఈ సిరిసవాడ సంబంధం డెబ్బై అయిదువేలు. ఈ రాజాపురం సంబంధం అరలక్ష...." పుస్తకం తిరగేసి చెబుతున్నాడు పేరయ్య.

    వామనరావు అసహనంగా అన్నాడు: "లక్షలులేని సంబంధం చెప్పండి! పది వేలకంటే ఎక్కువిచ్చుకోలేం! పిల్లవాడు కాస్త చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తున్నాసరే!"

    "ప్చ్! చిన్న ఉద్యోగమంటే మామూలు విషయమా? పాతికకు తక్కువుండదు! మీరు కట్నం ఇవ్వలేని పక్షంలో చక్కటి సంబంధం చెబుతాను."

    ఆశగా చూశాడు వామనరావు. కట్నం తీసుకోని ఆదర్శయువకుడేమో! పిల్ల అందం, గుణం చాలుననేవాడేమో!

    "కళత్రం పోయింది! నలభయ్యేళ్ళున్నా ముప్పైఏళ్ళవాడిలా ఉంటాడు! పత్తికొండ జమీందార్లు! ఈజిల్లాకే శ్రీమంతులు! ఇద్దరు పిల్లలున్నారు. ఆడపిల్లలు! పెళ్ళిళ్ళు అయితే అత్తారింటికి వెళ్ళిపోతారు. మన అమ్మాయి తలదువ్వి బొట్లు, కాటుకలు పెట్టే అవసరంలేదు. ఆయాలుంటారు..."

    "ఎంత శ్రీమంతులైనా వద్దండీ ఈ సంబంధం! ఇంకో సంబంధం చెప్పండి."

    "నేను ఎన్ని సంబంధాలైనా చెబుతానండీ! నా వృత్తే అది కాబట్టి! మీరివ్వగలదాన్ని బట్టి కదా నేను చెప్పేది?"

    "మళ్ళీ వచ్చి కలుస్తాను!"

    వామనరావు పట్టుదలగా వారం పది రోజులు తిరిగాడు మంచి సంబంధం కోసం. ఎక్కడ పోయినా కట్నం సమస్యే ఎదురైంది. అప్పటి కప్పుడు వేలకువేలు డబ్బు ఎక్కడనుండి పుట్టించాలి? చివరికి మనసు రాయి చేసుకొని తిరిగి పేరయ్య దగ్గరికి వచ్చాడు. పత్తికొండ జమీందార్ల సంబందం ఖాయం చేయమన్నాడు.

    వధువు ఫోటో తీసికెళ్ళిన పేరయ్య "మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. గిరిధరంగారు ఒప్పుకొన్నారు" అని చెప్పాడు తిరిగివచ్చి.

    "అమ్మాయిని చూడదే!"

    "ఫోటోలో ఉన్నట్టుగానే ఉంటుందా అని అడిగారు! ఫోటో సరిగా రానట్టుగా ఉంది! అమ్మాయి అందం అద్భుతం! అని చెప్పాను. ఆయనకీ నామాటమీద చాలా నమ్మకం? ఇహ పెళ్ళిచూపులతో పనిలేదు. ఒప్పుకొన్నానని చెప్పండి. పెళ్ళి ఏకొండమీద దేవుడిదగ్గరో ముక్తసరిగా దాటించమని చెప్పండి అన్నారు. మీరు నాతో ఒకసారి వస్తే లగ్నపత్రిక పెట్టుకురావచ్చు!"

    వామనరావు వెళ్ళి లగ్నపత్రిక పెట్టుకు వచ్చాడు.

    వరుడి వివరాలు తెలిసి తల్లీ తండ్రీ తెల్లబోయారు.

    "చదువు మానిపించి తెచ్చి ఇంత అర్జెంటుగా దానిపెళ్ళి ఎందుకు తలపెట్టావు? ఇప్పుడేం తప్పిపోయిందని దాన్ని ఆలి చచ్చినవాడికిచ్చి చేయడం? దానికి డబ్బొద్దు! కార్లూ మేడలూ వద్దు! ఈడూ జోడయిన మగడు కావాలి! మేం చచ్చినా ఈ సంబంధం జరగనీయం."
 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra