Home » Avasarala ramakrishna rao » Sampengalu Sannajaajulu

 

    ఇలాంటి జవాబు నాకే మాత్రమూ సంతృప్తి యిచ్చేది కాదు. ఆఖరి సరి కదిపి చూస్తె ఆమె అంది.
    'మునుపయితే ఫస్టు తారీఖుకి యిచ్చేసేవారు జీతాలు. ఇప్పుడు కొత్త ఆఫీసరు వచ్చాక తొమ్మిది పదీ తారీఖులకి గాని అందడం లేదు. అదీ గాక ఈ మధ్య ఈయన వంట్లో బాగుండక అస్తమానూ శలవులు పెట్టడం చేత అప్పుడప్పుడు జీతం నష్టం కూడా అవుతోంది. ఇవేం పెద్ద చెప్పుకోదగ్గ ఆర్ధిక యిబ్బందులెం కావు గాని ఏకంగా నెల శెలవు పెట్టమంటాడా డాక్టరు. ఈయన ఏమంటారో --ఆ ఆఫీసరు ఏం ఇబ్బంది పెడతాడో!'
    ఆరోజు నేనే ఆఫీసరు దగ్గిరకు బయలుదేరి వెళ్ళి డాక్టరు అన్నయ్య విషయంలో చెప్పిన వివరాలన్నీ చెప్పి నెలరోజుల పాటు లీవు యిమ్మని ప్రార్ధించాను.
    'మీ నెమ్మది చూస్తె ముచ్చట వేస్తోంది. మీ అన్న కిందులో సగం అణకువ ఉన్నా ఎప్పుడో లీవు యిచ్చి ఉందును. లేనిపోని ఆవేశాలు పడి అనవసర విరోధం తెచ్చుకున్నాడు. పై అధికారుల మీద రిపోర్టు యిచ్చినప్పుడు ఈ జ్ఞానం ఉంటె ఎంత బాగుణ్ను!'
    'క్షమించండి . పాత విషయాలు త్రవ్వడానికిది సమయం కాదు. మీరనుకున్నట్టు సంతకాలు లేకుండా అర్జీలు పెట్టుకునేంత అల్పుడు కాడు వాడు. ఎవరి మాటలో విని మీరు అంత తొందర పడ్డారు....'
    'మీరు కూడా ఒకరి మాటలు విని నిర్ధారణ కొచ్చిన వారే కద, నిజానిజాలు ఎవరికీ తెలుసు!'
    'ఇప్పుడవన్నీ ఎందుకు? నెలరోజులు ఒక అసిస్టెంటు మానేస్తే మీకు చాలా యిబ్బంది అవుతుందని నాకు తెలుసు. కాని, ఏం చేస్తాం, కష్టాలు ఎవరికేనా వస్తాయి. జీతంలో కోత కూడా ఉంటె వాడి మనస్సు మరింత పొడవు తుంది. పదేళ్ళ పైగా పని చేస్తున్నాడు వాడు, అవసరం వచ్చినపుడు ఒక్క నెల రోజులు జీతంతో శలవు మంజూరు చెయ్యడానికి మీరు రికమెండ్ చెయ్యలేరా?'
    'నేనేం చేసేది, ఆఫీసులో పని రద్దీగా ఉంది. అదిగాక అయన శలవంతా యిదివరకే వాదేసుకున్నాడు. 'లాస్ ఆఫ్ పే'. ఇదివరకే అయింది. అందుకని....'
    '.....అందుకని?'
    'జీతం నష్టం మీద శలవు పెట్టుకోమనండి. శాంక్షన్ చేయిస్తాను.'
    'గొప్ప పని చేస్తావు, అది నువ్వు చేసేదేమిటి?' అని మా అన్నయ్యయితే అనేసునేమో, నేను మాత్రం అనలేదు. చికాగ్గా ఇంటి ముఖం పట్టేను. ఇంటికి వచ్చేసరికి అన్నయ్యా, వదినా ఏదో ఘర్షణ పడుతున్నట్టు కనిపించారు. అన్నయ్య మోహంలో ఉద్రిక్తతా, వదిన మొహంలో నిస్సహాయతా స్పష్టంగా కనిపించాయి. నన్ను వెళ్ళనిచ్చి తన జబ్బు సంగతి నాతొ చెప్పే వెందుకని వదినను అన్నయ్య నిలదీశాడేమో అనిపించింది.
    ఏం జరిగిందో నే నడక్కుండానే అన్నయ్య 'ఏమే, ఏం చేసుకోచ్చావ్?' అని నన్నే అడిగాడు. నేను జరిగింది చెప్పెను.
    'నేను ముందే చెప్పలేదా, కాగితం మీద రాసి ఏ బంట్రోతు చేతో పంపించేదానికి నువ్వు పని గట్టుకు వెళ్ళడం దేనికి? నాకేదో పెద్ద ఉపకారం చేద్దామనుకుంటావ్, ఏమిటి నువ్వు చేసేది? నీమొహం , యిదిగో యిలాగే ఉంటుంది! నీకేమైనా తెలివితేటలుంటే నీ పిల్లని బాగుచేసుకో. నీ సంసారం చక్కదిద్దుకో.
    నేను తలవంచుకొని విచారంగా చూస్తున్నాను. అంతేనా, సంసారం చక్కదిద్దుకోడం సరే, అంతకు మించి ఆడదేమీ చేయ్యలేదా? ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటె తనకు తోచిన సహాయం చెయ్యకూడదా? చెయ్యలేదా?
    'ఎందుకే చీటికీ మాటికీ కళ్ళ నీళ్ళేట్టుకుంటావ్ మరేం పనీ పాటా లేదా ఏమిటి? అందుకనే ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ ఏదో పని కల్పించుకొమన్నారు. ఈ రెండేళ్ళు చూడు చక్కగా ఆ చదువు ధ్యాసలో పడి ఎంత ఆరోగ్యంగా ఉన్నావో!'
    'ఓ! చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా సుఖ పడ్డాను!!' అనుకున్నాను.
    'నీతో యిలా కాదు , మంగళా! ఆ అలమారా లో పేక ఉంది. ఇలా అందుకో. నువ్వూ ఇలారా! ఒసే మంజూ ఇలా కూచుని పేక కలుపూ. ఐదు మూడు రెళ్ళు వేయి'
    నేనూ, వదినా అన్నయ్య ఓ పావుగంట సేపు పేక ఆడుతుంటే నాకు పెళ్ళి కాకముందు మేం ముగ్గురం యిలా గంటల తరబడి పేక ఆడిన రోజులు జ్ఞాపకం వచ్చేయి. పెద్ద పెద్ద ముక్కలు పడి కూడా దివాలా తియ్యడం అన్నయ్యకు సరదా. మేమిద్దరం పట్టుపట్టి కట్టుకట్టి వాడికి ఓ పట్టయినా వచ్చేలా చేసి వోడించడం మాకు సరదా. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా అని నేనేకాదు మేం ముగ్గురం ఎవరి మటుకు వాళ్ళం అనుకోని ఉండాలి. ఎవరికీ అట మీద ధ్యాస లేకుండా అలాగే యాంత్రికంగా అడెం. ఇంచుమించు మా బ్రతుకులు కూడా ప్రస్తుతం అలాగే ఉన్నాయేమో!
    ఆ రాత్రి చాలా తలనొప్పిగా ఉండి పక్కింటి నిర్మలని తీసుకుని సినిమాకి వెళ్ళెను. ఆ సినిమా చూడ్డం వల్ల మరింత తలనొప్పి ఎక్కువైంది. కేవలం ఈ తారక ఈ పాత్ర యిద్దామని ముందు నుంచీ మనసులో పెట్టుకుని రాసిన సినిమా కధలు యిలాగే ఉంటాయని పించింది. ఒక గయ్యాళి పాత్ర చాలా సినిమాలకు ఆయువు పట్టయి ఉండడం సిగ్గు చేటనిపించింది. వచ్చేస్తుంటే దారిలో నిర్మలతో అన్నాను.
    'చిన్నప్పుడే అమ్మా, నాన్నా పొతే నన్నింతదాన్ని చేశాడు మా అన్నయ్య. ఇప్పుడు వాళ్ళు అన్ని విధాల యిబ్బంది పడుతుంటే ఏవిధంగా సాయం చేద్దామన్నా ఒప్పుకోవడం లేదు. నేనే మగాడ్నై వాళ్ళ కేమైనా చేస్తే అది సవ్యమని అంగీకరిద్దురేమో! ఏం యిబ్బందిలో ఉన్నారో అదైనా ఉన్నదున్నట్టు చెప్పరు. చేతగానితనంతో నా ఒళ్ళు మండిపోతోంది నిర్మలా!
    'వాళ్ళు పడుతున్న చికాకుల్లో ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు. ఎంచేతంటే ఈ బాధ అంతో యింతో మేమూ అనుభవిస్తున్నాం గనక! అంది చటుక్కున నిర్మల. కుతూహలంతో నా గుండె వేగం ఎక్కువైంది.
    'అదేమిటి నిర్మలా, నాకు వివరంగా చెప్పావ్? అంతకంటే నాకు వేరే ఉపకారమేమీ ఉండదు. చెప్పు, చెప్పు.
    నిర్మల ఆ సంగతి వివరంగా చెప్పింది. పెద్ద బజారులో ఉన్న రంగనాయకులు దగ్గిర నిర్మలా వాళ్ళ నాన్నగారు కూడా అప్పు చేశారట. అందుకని వాళ్ళ కన్నీ విశదంగా తెలుసట. అన్నయ్య రుణం కూడా అతని దగ్గిరేనుట.
    'వచ్చిన ప్రావిడెంటు ఫండ్ మొత్తంలో చాలా వరకు నాన్నగారు ఋణవిముక్తులయ్యారు. పాపం మీ అన్నయ్యా వాళ్ళ అప్పే ఇంకా తీరలే దనుకుంటాను. ఇవాళ మధ్యాహ్నం నువ్వేక్కడికో వెళ్ళావ్, అవునా? అప్పుడా శెట్టి వచ్చి కూచున్నాడు. డబ్బే సర్వస్వం అనుకున్న వాడికి, హృదయమేముంటుంది? ఏ పది హీను రోజులకో ఒకసారి వచ్చి చిందులు తొక్కి వేడుతుంటాడు. ఎప్పటి కప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటారు గాని పాపం వాళ్ళకి మాత్రం ఎక్కణ్ణించి వస్తుంది? అందులో మీఅన్నగారికీ ఈమధ్య తగని జబ్బు పట్టుకుందాయె. మునుపటి రోజుల్లో అసలు మనుషులు ఉన్నారా లేరా అన్నంత చల్లగా సాగిపోయేది వాళ్ళ సంసారం. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా ఘర్షణ పడుతున్నట్టుంది.'
    'అప్పు మొత్తం ఎంతో నీకు తెలుసా నిర్మలా?'
    'ఇన్నాళ్ళూ తెలియదు గాని, ఇవాళ 'ఒకటా, రెండా వడ్డీతో సహా వెయ్యి రూపాయల వరకు యివ్వాలి. ఎన్నాళ్ళ ని ఊరుకుంటాను?' అని శెట్టి గట్టిగా అరుస్తుంటే మాకు స్పష్టంగా వినిపించింది. ఏమిటంత తీవ్రంగా అలోచిస్తున్నారూ?'
    'నిర్మలా! నీనోట భగవంతుడు నాకు సత్యం చెప్పించి కళ్ళు విప్పించాడు.'   
    'మీ రంటున్నదేమో నా కర్ధం కావడం లేదు. పైగా భయంగా ఉంది కూడా. నేనిలా ఈవిషయము మీతో చెప్పెనని ఎవరి తోనూ చెప్పొద్దు. మా నన్నుచంపెస్తాడు.'
    'అదే నీతో చేబుదా మనుకోన్నది. నాతొ యీ విషయం చెప్పెనని కూడా నువ్వెవరితోనూ చెప్పోద్దు. నువ్వు నాకెంత ఉపకారం చేశావో నీకిప్పుడు చెప్పినా తెలీదు.'
    ఆ రాత్రి తీవ్రంగా ఆలోచించాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించడమా అని, నా మెడలోని నాలుగు పేటల చంద్రహారం అమ్మేయ్యడం తప్ప నాకు మరొక మార్గం గోచరించలేదు. 'అయన ఏమీ అనరు కదా?' అని చాలాసేపు తర్కించాను. సరళ కాపురం సరిదిద్దే విషయంలో అయన చేసిన సహాయాన్ని జన్మలో మరిచిపోలేను. 'ఒక మంచిపని చెయ్యడంలో ఒక యిల్లు చక్కదిద్దడం లో నీకు తోడ్పడ్డానంటే అంతకు మించిన ఘనకార్య మేముంది?' అని అయన యిప్పటికీ నా చెవిలో అంటున్నట్టుంది. అలాంటి వారు దీన్ని కాదంటారా? పోనీ, మావూరు వెళ్ళి ఆయనతో చెప్పి, అనుజ్ఞ తీసుకుని వస్తే? అని మళ్ళీ అనిపించింది. ఇవన్నీ జరుగుతూ నా మెడలో వస్తువు అమ్ముతుంటే అన్నయ్య ఊరుకుంటాడా?
    మనసు చాలా అల్లరి చిల్లరిది. మంచిపనులు చేద్దామని బుద్దికి తోచడమే కష్టం. అలా తోచిన తరువాత వీలయిన తొందర్లో కార్యరూపంలోకి మార్చడం మంచిది. మంచి విషయాన్ని మంచివాళ్ళు అన్నవాళ్ళు ఎప్పుడూ అడ్డు పెట్టరు. అడ్డు పడితే? వస్తే వస్తాయి కొన్ని చికాకులు సాహసం ఉన్న వాళ్ళకి దైవ సహాయం ఎలాగా ఉంటుంది.
    కాని, వదిన కూడా ఎంత చిత్రంగా దాచింది! ఎన్నిసార్లు అడిగినా అంత తీర్చుకోలేని అప్పులేవీ లేవని కొట్టి పారేసిందే, యింతగా గుట్టుగా ఉంచడాన్ని ఆమె ఎక్కడ నేర్చుకుందని?
    సార్ధకమైన పేరు సర్వమంగళ! ఆ పద్యం జ్ఞాపకం తెచ్చుకుందామని ప్రయత్నించాను. కాని  ఒక్క ఆఖరి చరణం తప్ప తక్కినవి జ్ఞాపకం రాలేదు. 'మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! ఓహ్, ఈ వాక్యమే ఒక కావ్యం! దీని అర్ధమేమిటి? విషమైన తన భర్త నేమీ చెయ్యలేదని నమ్మకమా? భర్త ఏపని చేసినా అందులో పొరపాటు ఉండదనే వెనుదీయని విశ్వాసమా? దైవశక్తి మీద ఉన్న ప్రగడమైన గౌరవమా? పద్యం పూర్తిగా రానందుకు చాలా బాధపడ్డాను. పెళ్లినాడు అన్నయ్య యిచ్చిన భాగవతం అలాగే ఉంచేశాను. అందులో యిచ్చిన భాగవతం అలాగే ఉంచేశాను. అందులో ఎన్ని స్కంధాలు చదివేననీ? నన్ను నేను తిట్టుకున్నాను. పరీక్షలయి పోయాయి కనుక యిక ముందైనా భారత భాగవత రామాయణాలు చదవాలి. అక్కడక్కడ కాదు. పూర్తిగా, సంపూర్తిగా.
    నిర్మలనే మళ్ళీ రమ్మన్నాను. మర్నాడు ప్రొద్దున. ఆమె ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఎవరితోనూ చెప్పానని ఎన్నో ఒట్లు వేయించుకున్నాక ఒప్పుకుంది.  మధురిమకి ఏవో గౌన్లు కొంటానని వంకపెట్టి బయలు దేరేను.
    'కాశీ వెళ్ళి గాడిదగుడ్డు తెచ్చేనని అక్కణ్నుంచి ఉత్తి చేతుల్తో వచ్చి యిక్కడ పిల్లకి గౌన్లు కొంటున్నావా? ఎంతకైనా తగుదువే!' అన్నాడు అన్నయ్య. 'అవును, ఎంతకైనా తగుడును' అనుకున్నాను మనసులో. 'నేనూ వస్తాను ఒక్క క్షణం అగవమ్మా' అంది వదిన.
    'అలాగలాగే నీ పనులన్నీ అయేసరికి దుకాణాలుండోద్దు? ఇవాళ సాయంకాలానికెనా ఊరికి బయలు డేరాలా వద్దా? మీకేం? ఈపాటికి ఆయనక్కడ 'కధాకళీ ' లో ఉన్నారో! పద నిర్మలా యింకా ఆలశ్యం దేనికీ?'
    మేము వెళ్ళే సరికి అదృష్టవశాత్తు మార్వాడి బంగారు షాపులోనే ఉన్నాడు. అట్టే జనం లేరు కూడా. వచ్చిన పని చెప్పేసరికి సవాలక్ష ప్రశ్నలు వేశాడు. పాత బంగారమనీ , ఇప్పుడు పట్టుకుంటూన్నారని చాలాసేపు రేటు తెలనిచ్చాడు కాడు సేటు. మొత్తం మీద గీటు వేసి తూకం వేసి పదకొండు వందల ఇరవై నాలుగు రూపాయల పావలా ఇచ్చేడు. అంత సొమ్మూ తీసుకుని రుమాలులో వేసి బిగించి కడుతుంటే నా వేళ్ళు వణికాయి. అక్కణ్నుంచి అలా రంగనాయకులు షాపుకి వెళ్ళి వడ్డీతో సహా అప్పు పూర్తిగా తీర్చేసి రసీదు పుచ్చుకున్నాను. తరువాత రెడీమేడ్ షాపుకి వెళ్ళి మధురిమకు నాలుగు గౌన్లు సీతకి రెండు గౌన్లూ ఇద్దరికీ జోళ్ళూ తీసుకున్నాను. వస్తూ మందుల షాపులో సర్పాసిల్ మాత్రలు ఒక నెల సరిపడేవి పుచ్చుకుని ఇంటిదారి పట్టెం.
    'ఎలాగో అలా అప్పు తీర్చేరు. బాగానే ఉంది. ఈ సంగతి మీరిప్పుడు దాస్తే మాత్రం ఎల్లకాలం దాగుతుందిటండి? ఇంతకీ ఇంటికి వెళ్ళగానే ఈ కబురు బావగారికి చెబుతారా చెప్పరా?'
    ఇవే సరిగ్గా నా మనసు నన్నడుగుతున్న ప్రశ్నలు కాని నా అంతరాత్మ జవాబు చెప్పే స్థితిలో లేదు.

 

                    
    ఒక మంచిపని - సాహసించి ఐనా సరే పూర్వాపరాలు ఆలోచించకుండా ఐనా సరే -- చేసినందువల్ల గలిగే మధురమైన భావనతో మది పరవశించి పోతున్నది. 'ఒక్క సత్కార్యం  చేసే సద్భుద్దిని ప్రసాదించావు. దానివల్ల వచ్చే కష్ట నష్టాలకు తట్టుకునే ధైర్యశ్తైర్యాలు కూడా యియ్యి దయామయా!' అని అనుకున్నాను.
    నేను తెచ్చిన రసీదూ, ఒక లేఖా గ్రుచ్చి కవరులో పెట్టి అంటించి అన్నయ్య టేబిలు మీద పెట్టి రైలెక్కేను. ఆ లేఖలో ఇలా రాశాను.
    నీకేరా ఈ ఉత్తరం -- అన్నా! ఇవ్వడమే గాని పుచ్చుకోడం ఎరగావా?
    అలా అవతలి వాళ్ళు కూడా అనుకుంటే అప్పుడేం జరుగుతుందో ఊహించవా?
    మనసిచ్చి పుచ్చుకోవడం లో నీ, నా అని బేధం లేనంత ప్రాణ ప్రదురాలైన సోదరిని నీకు నేనైతే ఇందులో ఉన్న రసీదును సాదరంగా స్వీకరించు.
    చీరలూ నగలూ ఇవేకాక చిన్నప్పట్నుంచీ మంచి బుద్దులు కూడా ఇవ్వడం నువ్వు చేసిన మహా పాపమైతే స్వయం కృతపరాధానికి సద్దుకుని సహించు.
    ఎలాగైనా నన్ను దీవించు.
    అందుకైనా పదికాలాల పాటు జీవించు.
    ఇంకెవరు వ్రాయగలరు నీ కిలాటి ఉత్తరం?
                                                                                       నేనే - నీ మంజుల.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra