Home » Chandu harshavardhan » Made In India

 

    విష్ణు చిరునవ్వుతో వాటిని అందుకుని పరిశీలించాడు.
    "కలెక్టరు గారు తనకు తెలిసింది కొద్దిగా అంటూనే ఎన్నో విషయాలను చెప్పారు. ముందుగా భక్తులు వెలిబుచ్చిన సందేహాలను తీర్చి తరువాత వారికి తప్పనిసరిగా వివరణ ఇస్తాను. భక్తులు అడిగిన ప్రశ్నలను సభాముఖంగా నా శిష్యులు చదివి వినిపిస్తారు." అంటూ విష్ణు తనవెనుకనున్న శిష్యుల వైపు చూశాడు.
    "విష్ణుజీ ..........దేవాత్మశక్తి అంటే ఏమిటి?" భారతి తోలి ప్రశ్నను చదివి వినిపించింది.
    "దేవ అనే పదం మతాలు చెప్పే భగవంతుడికి ప్రాతినిద్యం వహిస్తున్నది. ఆత్మ శబ్దం తత్వశాస్త్రపు పరమాత్మను, శక్తి పదం పదార్ధం శాస్త్రాల శక్తి (ENERGY)ని సూచితున్నవి. శ్యేతశ్వతకోపనిషత్తులో దీని వివరణ వున్నది. దేవశాబ్దానికి స్వయం ప్రవేశ శక్తి అని కూడా అర్ధం. ఈ విధంగా ఈ పదం ప్రతివారిలోనూ వున్న స్వయం ప్రకాశ ఆత్మ శక్తిగా వున్న పరమసత్యాన్ని వక్కాణిస్తున్నది. దేవాత్మ శక్తి అనే పదానికి మనసు యొక్క ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులనే మూడు అవస్థలకు మూలం అని కూడా అర్ధం. దేవశబ్ధం అజ్ఞానాన్ని, ఆత్మ శబ్దం ఇచ్చానూ , శక్తి శబ్దం క్రియనూ సూచిస్తాయి. ఇది మనసుకూ, బాషకూ అతీతమైన పరతత్త్వపు లక్షణాలను చెబుతుంది." అని చెప్పడం ముగించి శిష్యుల వైపు చూశాడు విష్ణు.
    "సంసార జీవితాన్ని సాగించే నేను తపస్సు చేసుకోవడానికి మార్గం చూపగలరు. తపస్సు చేయడమంటే అరణ్యాలకు పోయి ముక్కు మూసుకుని కుర్చోవాలంటే ఇప్పుడు ఆసాధ్యం కదా?" రీటా మరొక భక్తుని ప్రశ్నను చదివి వినిపించింది.
    విష్ణు గొంతు సవరించుకున్నాడు.
    "తపస్సు చేయడానికి అరణ్యాలకు పోనక్కరలేదు. గృహస్తుడిగా వుండి కూడా శారీరక, వాచిక, మానసిక తపస్సులను మూడింటిని చేయవచ్చు. భగవంతుణ్ణి , బ్రాహ్మణులను, గురువులను , జ్ఞానులను పూజించడం పరిశుభ్రంగా వుండడం, కపటం లేకుండా వుండడం, బ్రహ్మ చర్యాన్ని పాటించడం , అహింస ఇవి శరీరంతో చేసే తపస్సులు.
    "మానసిక క్షోభ కలిగించకుండా మాట్లాడడం, సత్య సంభాషణం, హితాన్ని చెప్పడం, వేదాలను , స్త్రోత్రాలను పారాయణం చేయడం వాక్కుతో చేయవలసిన తపస్సులు. ఇక మనసును ప్రసన్నంగా వుంచుకోవడం, మౌనం, మనోనిగ్రహం శుద్దమై సంస్కార పూర్ణమైన భావపరంపర ఇవి మానసిక తపస్సులు. ఈ మూడు రకాలైన తపస్సులు ఉత్తమమైనవి. కాషాయం వేసినందువలన కొంగజపం చేసినందువలన ఏమీ లాభం వుండదు. భగవద్గీతలో ఈ తపస్సులను గురించి మరింత వివరణ వున్నది....."
    ఒక శిష్యుడు అందించిన మంచినీటిని తాగి , తరువాత చదవమన్నట్టు విష్ణు శిష్యుల వైపు చూశాడు.
    "స్వామీజీ ......బ్రహ్మదేవుడు మానవుని సృష్టించేటప్పుడు తలలో రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కు రంద్రములు ఈ విధంగా అన్నీ రెండు రెండుగా పెట్టి నోరు మాత్రం ఒక్కటే పెట్టామిటి?' ఓఅక శిష్యుడు చదివి వినిపించాడు.
    "భేష్.....ఈ ప్రశ్న వేసింది ఎవరో కాని చక్కటి ప్రశ్న వేశారు. బ్రహ్మ ఎంతో ఊహతో చేసిన పని అది. అలా చేయడం వెనుక గొప్ప దేవరహస్యం వున్నది. అనేక జన్మల వాసనా ప్రాబల్యంచే గ్రహపాటు అలవాటుగా మారి మానవుడికి చేడువాగుడు అభ్యాసమైపోయింది. మితభాషణ స్థితిని దాటిపోతుంటాడు. ఒక నోరు వుంటేనే ఎదుటివారికి తలనోప్పిలా పరిణమిస్తే , ఇక రెండు నోళ్ళు పెడితే లోకోపకారం బదులు లోకాపకారం చేస్తాడెమోననే తలంపుతో బ్రహ్మ ఒక నోరే పెట్టి వుండవచ్చు.
    అదీగాక ఒక నోరు వుంటేనే జిహ్వ చంచాల్యంతో నిగ్రహం కోల్పోయి లెక్కలేనన్ని సార్లు భిజిస్తూ సోమరిపోతులా మారిపోతున్నాడు. ఇక రెండు నోర్లు పెడితే వేరే చెప్పాలా/ దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే రెండు చెవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా భాగవత్కాదా శ్రవణం చేస్తూ, ఒక్కనోరు ఉన్నది కాబట్టి మితంగా సంభాషిస్తూ శక్తిని కూడబెట్టుకుని ఆ శక్తిని భగవధ్యానము నందు ఉపయోగించి జన్మ సార్ధకత పొందాలి......"
    "జీవిత కాలం బహు స్వల్పం అంటుంటారు కదా.....దాని అర్ధాన్ని వివరించగలరు?"
    ఇంకొక శిష్యుడు ప్రశ్న చదివి వినిపించాడు.
    "ఈ జీవితం బుడగలాంటిది "ఆయు వల్లవకోణాగరళం బాంబు క్షణ భంగురం' అని యోగ వాసిష్టం అంటున్నది అంటే ఆయుష్షు ఆకు చివర వేలాడే మంచు బిందువువలె క్షణ భంగురమైనది.... అని అది ఎప్పుడయినా పడిపోవచ్చు కాబట్టి మనం జాగరూకులమై వుండాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి. కాలాన్ని వ్యర్ధం చేస్తే జీవితంలో ఏమీ సాధించలేం. సూర్యాస్తమయం అయిందంటే మన జీవితంలో ఒక దినం తరిగిపోయిందన్న మాట. అందుకే పనులు వాయిదా వేసుకుంటూ పోకూడదు.
    "రేపు చేయాలని అనుకున్న పనిని వీలయితే ఈరోజే చేయాలి. సాయంకాలం చేద్దాం అనుకున్న పనిని ఉదయమే చేయాలి. ఎందుకంటే మృత్యువు నీవు పని పూర్తీ చేషావా అని ప్రతిక్షించదు.......వివేకానందుడుకు 39 ఏళ్ళు జీవించాడు. ఆ స్వల్పకాలంలోనే అయన పవిత్రమూర్తిగా రూపొంది మహోన్నత స్థితిని పొందాడు. కాబట్టి పవిత్రత, పట్టుదల వంటి సద్గుణాలను అలవరచుకోవాలి....."
    "విష్ణుజీ ....ఆదిశంకరులు చెప్పిన శివాపరాద క్షమాపణ స్తోత్రాన్ని వివరించి చెప్పండి ' మరొక శిష్యుడు వెలిబుచ్చిన సందేహం ఇది.....
    'ఆదిశంకరుల వారు చెప్పిన ఈ శ్లోకంలోని భావం సృష్టిలోని ప్రతి మానవుడికి జ్ఞానభిక్ష పెడుతుంది. హేశంలో ........నాకు వార్ధక్యం ప్రాప్తించింది. నా ఇంద్రియాములు ఆశక్తములయ్యాయి. శరీరం శిధిలమై యవ్వనం గతించింది. దీనుదనయ్యాను, బలహీనుడయ్యాను. మాయా జగత్తుతో పొత్తు కుదుర్చుకుని వున్న నా మనసు దుర్జటివైన నిన్ను ధ్యానించలేకపోతున్నందుకు క్షమించు......ఇది నేటి మానవుని ఉత్క్రుష్టవస్థ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra