ఫ్యూన్ కి చిరాకేసుకొచ్చింది .
    "వీల్లెదండీ ! ఆయనిప్పుడు ఎవరినీ చూడరు --"
    "అయితే సరే .....నేనే లోపలికెళ్ళి ఆయనను చూస్తాను ..." మొండిగా అన్నాడతను.
    ఫ్యూన్ గాబరాపడ్డాడు.
    "ఉండండి. కనుకొస్తాను. మీ పేరూ, మీరొచ్చినపని అన్నీ కాగితం మీద రాసివ్వండి. అయన సరేనంటే పంపిస్తాను. వీల్లేదంటే మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోవాలి.'
    "సరే" అంటూ అతనందించిన ఓ కాగితం మీద తన పేరూ తన మీద జరిగిన పోలీస్ అత్యాచారం గురించీ రెండు లైన్లు క్లుప్తంగా రాసి పంపించాడు.
    ఫ్యూన్ లోపలికెళ్ళి అయిదు నిమిషాల తర్వాత తిరిగివచ్చాడు.
    "రేపు ఆఫీస్ కొచ్చి కలుసుకోమంటున్నారు దొరగారు" అన్నాడతను.
    సృజన్ కి ఒళ్ళు మండిపోయింది.
    "కాదు, నేనిప్పుడే మాట్లాడాలి."
    "మీరు మర్యాదగా వెళ్తే సరి" లేదంటే పోలీస్ జవాన్ ని పిలుస్తాను" అన్నాడు ఫ్యూన్.
    సృజన్ రక్తం ఉడికిపోయింది. పోలీస్ ని పిలిపిస్తే మళ్ళీ జరిగేదేమిటో తెలుసు. తనూ అతడూ తగాదా పడటం, మళ్ళీ వేరే పోలీస్ రావడం, తనను తీసుకెళ్ళి లాకప్ లో పడేయడం ఇవన్నీ మామూలే!
    ఆవేశం అణచుకుంటూ లేచి బయటకు నడిచాడతను. కాలీజీ గోడల బయట ఇలాంటి దారుణమయిన పరిస్థితులున్నాయని అతనికి మొదటిసారిగా అర్ధమయింది. బస్ స్టాప్ వరకూ నడిచి బస్ కోసం నిలబడ్డాడు. అతనికి వెంటనే భారతిని కలుసుకోవాలనిపించింది. ఈ పట్నంలో తనకు సర్వస్వం ఆ యువతే! ఆమెతోనే జరిగినదంతా చెప్పుకోవాలన్న తపన.
    ఆమె ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిదన్నరయిపోయింది. ఆ సమయంలో వెళ్ళడం అనుచితం కాదని తెలిసినా ఆమెతో మాట్లాడకుండా వుండటం సాధ్యమనిపించడంలేదు. తనేం చేయాలీ? ఎలా ఈ పరిస్థితి ఎడుర్కొవాలీ అన్న విషయం నిర్ణయించుకోటానికీ ఆమె ఆలోచనలు ఎంతో ఉపయోగపడవచ్చు.
    డోర్ బెల్ మొగించగానే తలుపు తెరచింది భారతి. అతనిని చూస్తూనే ఆమె ముఖంలో అనందం కనిపించింది.
    "రండి కూర్చోండి! ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను. ఆఫీస్ కి రాలేదెందుకనా అని" అందామె . సృజన్ లోపలకు నడిచి కూచున్నాడు.
    లోపల కర్టెన్ వెనుక నుంచి ఆమె పిన్ని తల కనబడుతూనే వుంది.
    "కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోయాను అందుకని రావడం కుదరలేదు" అన్నాడతను.
    "ఏమయింది?" ఆత్రుతగా అడిగిందామె.
    జరిగినదంతా చెప్పాడతను.
    "మీరు తొందరపడటం మంచిది కాదు ఎలాంటి కేసులయినా అంత త్వరగా తేలటం ఇంపాజిబుల్. మిగతా విషయాలలో లాగానే మన దేశం ఈ విషయంలో కూడా ఎంతో వెనుకబడి వుంది. హంతకులను వెంటనే పట్టుకోవడం అనేది చాలా రేర్ గా జరిగే విషయం."
    "కానీ అలా మౌనంగా ఈ దారుణాన్ని చూస్తూ కూర్చోవాలంటే నాకు మనస్కరించడంలేదు. మా అన్నయ్య లాంటి మంచి వ్యక్తిని హత్య చేసినవాడు నెలలూ, సంవత్సరాల తరబడి సుఖంగా ఉండటానికి వీల్లేదు. మా అన్నయ్య చెడు ప్రవర్తన కలిగి వుండి, దాని కారణంగా చంపబడితే నాకింత అశాంతి కలిగేది కాదనుకుంటాను" అన్నాడతను దీనంగా.
    "నా మాట వింటానంటే -- ఓ విషయం చెప్తాను" అంది భారతి.
    "ఏమిటో చెప్పండి?"
    "నా మాట విని మీరు మీ ఊరు వెళ్ళిపొండి! మీ వదిననూ, పిల్లలనూ చూసుకోండి జాగ్రత్తగా. కొద్ది రోజుల తర్వాత కూడా పోలీసులు హంతకుడిని పట్టుకోకపోయినట్లయితే అప్పుడు న్యూస్ పేపర్స్ కీ, హోమ్ మినిస్టరు కీ ఉత్తరాలు రాయటమో , పర్సనల్ గా కలుసుకుని మాట్లాడటమో చేద్దురుగాని.'-
    సృజన్ కేం చేయాలో తోచలేదు. ఆమె మాట ప్రకారం తను ఇంటికి వెళితే ఇక్కడ పోలీసులు అసలు ఈ కేసు గురించి పట్టించుకోవటం మానేస్తారేమోనన్న అనుమానం కలుగుతోంది.
    "దయచేసి నా మాట వినండి! ఇక్కడ మీరుండి కూడా చేయగలిగిందేమీ లేదు. అవతల మీ వదినెను చూద్దామంటే చాలా డిప్రెషన్ లో వుంది. కొంతకాలం మీరామెనూ, పిల్లలనూ కనిపెట్టుకుని ఉండటం మంచిది" అందామె నచ్చజేప్తూ.
    "సరే వెళ్ళిపోతాను. కానీ వెళ్ళే ముందు ఓ పని చేయాలనుకుంటున్నాను.'
    "ఏమిటది?"
    "వైజాగ్ సీషోర్" హోటల్లో అన్నయ్య దిగిన గదిని మరోసారి జాగ్రత్తగా చూడాలనుకుంటున్నాను. అక్కడేమయినా వివరాలు దొరుకుతాయోమో ననిపిస్తోంది.'
    "మీ ఇష్టం! మీకంత నమ్మకంగా ఉంటే అదేమంత సమస్య కాదు కదా! హోటల్ వాడి నడిగితే వాడే చూపిస్తాడు ."
    "వాడు వప్పుకోవడం లేదు భారతిగారూ! గదికి తాళం వేసి ఉంచాడు ఎవరికీ యివ్వడం లేదు."
    "ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "పోలీస్ వాళ్ళు ఆదేశాలిచ్చారట అది ఎవ్వరికీ అప్పుడే ఇవ్వటానికి వీల్లేదని"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra