Home » Kommanapalli ganapathi rao » Nestham Neepere Nishshabdham

   
    "యస్ ! ఎవరూ ?" అన్నాడు.

 

    ఆ తరువాత ధన్వి జవాబు చెప్పలేదు. వింటున్నాడు మౌనంగా.

 

    రెండు నిముషాలు స్థాణువులా నిలబడిపోయిన ధన్వి యాంత్రికంగా రిసివర్ని హుక్ పై వుంచాడు.

 

    రాకేష్ ఏమనుకున్నాడో స్వేదం పేరుకున్న ధన్వి ముఖాన్ని చూస్తూ "ఏమైంది మిస్టర్ ధన్వి!" అన్నాడు నెమ్మదిగా ఏనిధింగ్ రాంగ్?"

 

    అలా అడగాల్సిరావడం రాకేష్ కి బాధాకరంగా అనిపించింది. కానీ ధన్విలో హటాత్తుగా వచ్చిన మార్పుకి రాకేష్ అలా రియాక్ట్ అయ్యాడు.

 

    పరిచయం అతి స్వల్పమయితేనేం రాకేష్ ని ధన్వి కూడా అంతగా ఆకట్టుకున్నాడు.

 

    మాటల్లో క్లుప్తత.......తుఫాను గాలిలో సైతం అల్ల సల్లన కదిలే పైన కెరటం లాంటి ప్రత్యేకత.....కళ్ళలో పేరుకున్న ఆశావాదుల విద్యుల్లతలు కాలిపోయిన బృందావనంలో కూడా ఆశల దివ్వెల్ని వెలిగిస్తానన్న ధీమా...

 

    "చెప్పండి మాస్టారు......."అలజడిని  దాచుకోలేని రాకేష్ ఆర్తిగా పిలిచాడు ధన్విని. "ఉన్నట్టుండి మీలో ఈ మార్పేమిటి? అసలు ఫోన్ వచ్చింది ఎక్కడనుంచి?"

 

    చెప్పాలని లేదు ధన్వికి. అయినా రాకేష్ వదిలి పెట్టడం లేదు...."హైదరాబాదు నుంచి....." అన్నాడు తప్ప చేసింది సామ్రాజ్యం అని చెప్పలేదు. " మా నాన్నగారికి....."

 

    రాకేష్ దిగ్భ్రాంతిగా చూశాడు. "మీ నాన్నగారికి ఒంట్లో....."

 

    "లేదు...." సన్నని ప్రకంపన ధన్వి గొంతులో. "ఒంట్లో బాగోలేకపోవడం కాదు. హార్ట్ అటాక్ తో ఓ గంట క్రితం చనిపోయారట."

 

    పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డ రాకేష్ ధన్వికి ఆసరా ఇవ్వాలనుకున్నాడు. కానీ ధన్విని చూస్తుంటే అవసరమనిపించడంలేదు.

 

    ఎదలోని రక్త నాడులు ధన్వి కళ్ళలో రుదిరాన్ని నింపి, ఓడించే ప్రయత్నం చేస్తున్నా మొండిగా నిలదొక్కుకుంటున్నాడు.

 

    "నేను ఒక్కనోక్క కొడుకుని రాకాష్. అయన ప్రతిక్షణం  దిగులు పడింది నా కోసమే. నేనేమౌతానో అన్న బెంగతోనే ఎక్కువగా కలవరపడేవారు మా నాన్న" చెబుతున్నట్టు లేదు, స్వగతంలో మాట్లాడుతున్నట్లుగా వుంది.

 

    అది మాట్లాడ్డం కూడా కాదు. మనసు బొబ్బలమంటతో మండిపోతుంటే ఇలా అనుభవానికి భాష్యం చెప్పడం చేతకాని స్థితిలో పదాల్ని కుడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చురకత్తుల్లా కోస్తున్న ఆలోచనలకి సాధ్యం కాని నిబ్బరంతో జవాబు చెప్పే ప్రయత్నంలో ఖండవవనంలా మండుతూ కూడా యింకా మనిషిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు ధన్వి.

 

    "ఎక్స్ ట్రిమ్లి సారీ మిస్టర్ ధన్వి" అన్నాడు రాకేష్.

 

    "వెంటనే బయలుదేరడం మంచిది. కావాలంటే నేను నీకు తోడుగా వస్తాను."

 

ధన్వి జవాబు చెప్పలేదు వెంటనే.

 

అతని కళ్ళకి కన్నీరు కార్చడం చేతకావడం లేదు. కానీ అంతా అస్పష్టంగా వుంది. ప్రతి దృశ్యము మసకగా కనిపిస్తుంది.

 

    కన్నీళ్ళు ఉబకడం లేదు. కానీ కనుపాపల్ని నీళ్ళు తడుపుతున్నాయి.

 

    "చెప్పండి ధన్వి, బి బ్రేవ్!"

 

    రాకేష్ మాటలు పూర్తీ కాలేదు. ధన్వి జవాబు చెప్పాడు నిశ్చలంగా.

 

    "లేదు రాకేష్....నేను బయలుదేరను. బయలుదేరాలని లేదు. ముందు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. నాకేమి జరగనంత నిబ్బరంగా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. మా నాన్నగారికి నా మీద నిన్నటిదాకా వున్న అపనమ్మకాన్ని చెరిపేయాలి. మీకు తెలీదు రాకేష్....." గొంతు గాద్గదికంగా మారడం ధన్వికి అనుభావమౌతుంది.

 

    "అసలు తన సహాయం లేకుండా తన ప్రమేయంతో పని లేకుండా నీకు జాబ్ రాదనే వారు. నాకు అవసరం లేదు అని నేనంటే నీకేంత పొగర్రా! అంటూ ప్రతిక్షణమూ నన్ను తిడుతూ, తులనాడుతూ తన కోపాన్ని చల్లర్చుకునేవారు. ఇప్పుడు వెంటపడటానికి గానీ సాయపడటానికి గానీ అయన బ్రతికిలేరుగా. అందుకే ఉద్యోగం సాధిస్తాను. నా నమ్మకాని నిజమని నిరుపిస్తాను. నిదంతా తప్పు నాన్నా అంటూ నా గెలుపు ఆయనకి అర్ధమయ్యేట్టు చేస్తాను." తూలబోతూ తనను తాను నిలదొక్కుకునేప్రయత్నం చేసిన ధన్వి "నన్ను కాస్త వంటరిగా వదిలి పెట్టండి రాకేష్. మా నాన్నగారికి కొంతసేపు శ్రద్దాంజలి ఘటించి నాకు నేనుగా శక్తిని కుడగట్టుకునే అవకాశం యివ్వండి.....ప్లీజ్" అంటూ సోఫాలో ఓ మూల కూర్చుండిపోయాడు ధన్వి.

 

    అప్పుడు రాలిపడింది రాకేష్ కంటినుంచి ఓ నీటిబొట్టు.

 

    వరదగోదారిలాంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కూడా నిశ్శబ్దంలా కరుగుతూ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్న మిత్రుడా.....నువ్వు నిప్పుని మింగి బ్రతికే చాకోరానివో లేక సృష్టి ఉగ్రనేత్రం నుంచి జారిపడ్డ భాస్వరస్వప్నానివో నాకు తెలీదు కానీ.....నీ గుండె ఏడ్చినా ఆ బాధని కంటిదాకా రానివ్వని నీ శక్తిని అభినందిస్తున్నాను. కురవని భాష్పాలతో నువ్వు చెప్పిన భాస్పానికి పులకించి నువ్వు గెలవాలని కోరుకుంటూ వెళ్ళిపోతున్నాను.

 

    అప్పుడు సమయం సాయంకాలం నాలుగు గంటలు కావస్తుంది.

 

    

                                  *    *    *    *

 

    "మిస్టర్ ధన్వి....."ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ సిన్హా ధన్వి సర్టిఫికెట్స్ చూస్తూ అన్నాడు.

 

    "మీరు మీ డిగ్రీలో సంపాదించిన మార్కులతో బాటు మేం నిర్వహించిన ధియరీ పేపర్ స్కోర్ కూడా ఇంప్రె సివ్ గా వుంది, సో......సంకేతిక ప్రశ్నలతో మిమ్మల్ని యిబ్బంది పెట్టడం మా అభిమతం కాదు."

 

    స్వచ్చమైన ఇంగ్లీషులో మాట్లాడుతున్న యాభయేళ్ళ సిన్హా ప్రారంభం నుంచే ధన్వి మీద ఇష్టాన్ని, నమ్మకాన్ని ప్రదర్శించాడు. మీకు ఇష్టమైన యితర సబ్జెక్ట్సు లో హ్యూమన్ సైకలాజీ ఒకటి అని మీరు అప్లికేషన్ లో మేన్షన్ చేశారు.....అవునా?"

 

    "యస్సర్" అన్నాడు ధన్వి భావరహితంగా.

 

    ఎక్కడో వున్న తండ్రి శవమే గుర్తుకొచ్చిందో, తిరిగిరాని భర్త కోసం, అమ్మ చేస్తున్న అరణ్యరోదనే అతడి స్ప్రుతి వదంలో మెదిలిందోమాములుగా మాట్లాడటం కష్టంగా వుంది. అయినా శక్తిని కుడగట్టుకుంటున్నాడు ధన్వి.

 

    "మిస్టర్ ధన్వీ! ఈ కంప్యూటర్ యుగంలో స్పేస్ ఏజ్ లో 'కలిమి లేదు' అన్న తేడా లేకుండా ప్రతి మనిషి అశాంతితో బ్రతుకుతున్నాడు. దానికి కారణం పరిసరాలా లేక అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితులా? అది కానివాడు మనిషి పరిణామ దశలో సాధించిన సాంకేతిక ప్రగతా? మనిషిలోని యిప్పటి అశాంతికి కారణం ఏది?"

 

    పది లిప్తల విరామం.....ధన్వికిది ఇంటర్వ్యూలా కాక తన ప్రస్తుత పరిస్థితి గురించి తెలిసి అడుగుతున్నట్టుగా వుంది. గుండె గవాక్షాల నుంచి జారిపోతున్న నిబ్బరాన్ని నియంత్రించుకోవడం ఎంత కష్టమో యిప్పుడు అనుభవపూర్వకంగా తెలుస్తోంది.

 

    "సర్! ట్రూ  సీసాఫ్ మైండ్ కమ్స్ ఫ్రమ్ ఎక్సిస్టింగ్ వరస్ట్" అన్నాడు ధన్వి.

 

    "యస్! మిస్టర్ సిన్హా......మనిషికి పుట్టుకుతోనే ఖర్చు లేకుండా నేర్చుకునే అంశం కలలు కనడం. ఆ కళలు నిజం చేసుకోవడం కోసమే ప్రతి క్షణమూ తపించిపోతుంటాడు. సాధ్యాసాధ్యాల విషయం గురించి ఆలోచించకపోవడంలో అసలు సమస్య మొదలవుతుంది. తన శక్తికి మించిన ఆరాటంతో పోరాడి ముందుగా తనకు తానే శత్రువుగా మారిపోతాడు. తన యింటి కిటికీ పక్కన వున్న గులాబీ అందాన్ని పొందడం కాక ఆకాశంలో పాలపుంతని చేరుకోవాలనో లేక సొంతం చేసుకోవాలనో కాలాన్ని వేచ్చిస్తి తనదైనా జీవితం నుంచి తాను దూరం జరిగిపోతాడు."

 

    ఇంటర్వ్యూ బోర్డులోని ముగ్గురు సభ్యులూ ఆసక్తిగా గమనిస్తుంటే చాలా ఏకాగ్రతగా తన అభిప్రాయం చెప్పుకుంటూపోయాడు ధన్వి.

 

    "కాలం గడిచే కొద్ది అనుకున్నది సాధించలేకపోతున్నానన్న అందోళనకి లోనవుతాడు. అందోళననుండి అభద్రతకి గురవుతాడు. తనకన్నా మరెవరో ముందుకు దూసుకుపోతూన్నారన్న ఆత్మన్యూనత భావానికి లోనవుతాడు. అక్కడ మొదలైన అశాంతి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవటమే కాక తన కుటుంబానికి, తానున్న సంఘానికి సమస్యగా మారతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడు అశాంతి అనే పదానికి నిర్వచనమైపోయాడు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra